Thursday, 27 December 2018

కార్మిక వ్యతిరేక విధానాలను సమ్మెతో తిప్పి కొడదాం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 27: దేశవ్యాప్తంగా పన్నెండు కేంద్ర  కార్మిక సంఘాలు మరియు ఇతర ట్రేడ్ యూనియన్ లు జనవరి 8, 9   తేదీల్లో సమ్మె పిలుపు మేరకు  సింగరేణి వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ  అధ్యక్షులు బోగే ఉపేందర్,  సింగరేణి కాలోరిస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు బండారి తిరుపతి లు గురువారం బెల్లంపల్లి ఏరియా గోలేటి  ఇంచార్జి జీఎం శ్రీనివాస్ కు సమ్మె నోటీసు  అందచేశారు. అనంతరం మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను సమ్మెతో తిప్పి కొడదామని అన్నారు.  దేశవ్యాప్తంగా పన్నెండు కేంద్ర కార్మిక సంఘాలు మరియు ఇతర ట్రేడ్ యూనియన్ లు  కలిపి కార్మిక సమస్యలపై జనవరి 8, 9   తేదీల్లో దేశవ్యాప్త  సమ్మె చేయాలని పిలుపునివ్వడం జరిగిందని, . ప్రధానంగా    కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని,  కనీస వేతనం 18000 రూపాయలుగా నిర్ణయించాలని,  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం , కోల్   ఇండియా లో  ఒప్పందాలను అమలు చేయాలని, కనీసం  8  పని గంటలు  ఉండాలని,  నిత్యావసర ధరలు తగ్గించాలని మరియు ఇతర డిమాండ్లతో కలిసి  సమ్మె చేయడం జరుగుతుందని కార్మికులు పెద్దసంఖ్యలో ఈ సమ్మెలో పాల్గొని తమహక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.  . ఈ కార్యక్రమంలో సాగర్ గౌడ్, తిరుపతి, శంకర్, భీమేష్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment