కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 31: రెబ్బెన నుండి నంబాల గ్రామానికి వెళ్లే దారి కిరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది రెబ్బెన నుంచి నంబాల వెళ్లే మార్గంలో రైల్వే గేట్ దగ్గరనుండి నంబాల గ్రామంవరకు రోడ్ కు ఇరువైపులా అడ్డదిడ్డంగా పెరిగిన పిచ్చి చెట్లను రెండు ప్రొక్లయిన్ లు, రెండు ట్రాక్టర్లు, , ఆటో డ్రైవర్ల సహాయంతో శుభ్రం చేశారు. ఈ విధంగా చేయడంవలన రహదారి మూల మలుపులలో ఎదురుగా వచ్చే వాహనాలు మరింత స్పష్టంగా కనపడే వీలుందని పలువురు హర్షం వ్యక్తం చేశారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Monday, 31 December 2018
పోలీసుల ఆధ్వర్యం లో శ్రమదానం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 31: రెబ్బెన నుండి నంబాల గ్రామానికి వెళ్లే దారి కిరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది రెబ్బెన నుంచి నంబాల వెళ్లే మార్గంలో రైల్వే గేట్ దగ్గరనుండి నంబాల గ్రామంవరకు రోడ్ కు ఇరువైపులా అడ్డదిడ్డంగా పెరిగిన పిచ్చి చెట్లను రెండు ప్రొక్లయిన్ లు, రెండు ట్రాక్టర్లు, , ఆటో డ్రైవర్ల సహాయంతో శుభ్రం చేశారు. ఈ విధంగా చేయడంవలన రహదారి మూల మలుపులలో ఎదురుగా వచ్చే వాహనాలు మరింత స్పష్టంగా కనపడే వీలుందని పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Sunday, 30 December 2018
ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర సంబరాలు జరుపుకోవాలి :: ఎస్సై దికొండ రమేష్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 30: రెబ్బెన మండలంలోని ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రెబ్బెనఎస్సై దీకొండ రమేష్ సూచించారు. ఆదివారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 31 న మద్యం దుకాణాలను దుకాణం దారులు నిర్ణీత సమయంలో లోపం మూసివేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజల కు అసౌకర్యం కలిగించినా, కాలిబాటల్లో మద్యం సీసాలను పగలగొట్టిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలు నడిపి హంగామా సృష్టించినా చర్యలు తప్పవని అన్నారు. అన్ని గ్రామాల్లో డ్రంకన్ డ్రైవ్ పరీక్షలను చేపడతామని మద్యం సేవించి పట్టుబడితే కేసులు తప్పవని వేడుకలను పురస్కరించుకుని బైక్ కార్ రేసింగ్లు వంటి చేయరాదని అన్నారు. ఇతరుల స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా సంబరాలను జరుపుకోవాలని సూచించారు వేడుకల్లో భాగంగా ఎలాంటి అల్లర్లు అవాంఛనీయ సంఘటిత సంఘటన చోటు చోటు చేసుకోకుండా పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు నడుపుతామన్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ సైతం అమల్లో ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రశాంత వాతావరణలో సంబరాలు జరుపుకొనేలా పోలీసులకు సహకరించాలని తెలిపారు
స్థానిక సంస్థ ఎన్నికలో యువతకు పెద్దపీట వేస్తాం ; సీపీఐ మండల కార్యదర్శి రాయిల్లా నర్సయ్య
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 30: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో రెబ్బన మండలంలోని అన్ని గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యమిచ్చి పార్టీ అభ్యర్థులను పెడతామని సీపీఐ మండల కార్యదర్శి రాయిల్లా నర్సయ్య అన్నారు..ముఖ్యంగా గోలేటిలో పార్టీ తరుపున ఈ సారి అభ్యర్థి బరిలో ఉంటాడని అన్నారు, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే తాయిలాలు ప్రకటిస్తున్నాయని అన్నారు. ప్రజలు ఈ తాయిలాలు ఆశపడి అభ్యర్థులను ఎన్నుకోవద్దని, నిజంగా ప్రజలపక్షాన నిలబడి, ఊరికి మంచి చేసే అభ్యర్థులనే గెలిపించాలని అన్నారు. .రాబోయే ఎన్నికలలో సీపీఐ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే, గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు.
Friday, 28 December 2018
కాంగ్రెస్ పార్టీ 134 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై నాలుగు వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం రెబ్బెన మండల పార్టీ కార్యాలయం ఎదుట మండల అధ్యక్షుడు ముంజం రవీందర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ముంజం రవీందర్, డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు పల్లె ప్రకాశరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత క్లార్యకర్తలందరిపై ఉందని రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అందరూ పార్టీ గెలుపు కోసం శ్రమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు దుర్గం రాజేష్, పీఎస్సీ వైస్ చైర్మన్ వెంకటేశంచారి, టౌన్ అధ్యక్షులు మురళి, ప్రధాన కార్యదర్శి దేవాజీ, మల్లారెడ్డి, పల్లాస్, బానయ్య, రమేష్, కిషన్ గౌడ్, మన్యం పద్మ, విజయలక్ష్మి, తదితర నాయకులు పాల్గొన్నారు.
శ్రీ భీమన్న దేవుని వార్షిక మహోత్సవం సందర్భంగా వాలీ బాల్ పోటీలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 28 : కైరిగూడ ఓపెన్ కాస్ట్ పక్కనగల గోవెర్ గూడా లో శ్రీ భీమన్న దేవుని వార్షిక మహోత్సవం ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై తారీఖు వరకు రెండు రోజులు నిర్వహిస్తున్న సందర్భంగా వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని, . ఈ ఆటల పోటీల నిమిత్తమై సింగరేణి బెల్లంపల్లి ఏరియా జీఎం రవిశంకర్ మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నారని తెలిపారు. శుక్రవారం డీజీఎం పర్సనల్ జె కిరణ్ దేవస్థాన కమిటీ సభ్యులకు వాలీబాల్ కిట్ అందచేశారు. ఈ కార్యక్రమంలో డిజిఎం డి యోహన్ స్పోర్ట్ సూపర్వైజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జుమ్మిడి అరుణ్ కుమార్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 28 : ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రెబ్బెన మండలం గోలేటికి చెందిన జుమ్మిడి అరుణ్ కుమార్ నుఎంపిక చేసినట్లు ఏబీవీపీ రాష్ట్రాధ్యక్షులు మీసాల ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జుమ్మిడి అరుణ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు మీసాల ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాగే రంజిత్ కు కృతఙ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన భాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలిపారు. ఈ నెల 29, 30 తేదీలలో గుజరాత్ లో జరిగే మహాసభలలో పాల్గొని మరింత అవగాహనతో తన పై ఉంచిన భాధ్యతను నిర్వర్తిస్తానని అన్నారు.
Thursday, 27 December 2018
కార్మిక వ్యతిరేక విధానాలను సమ్మెతో తిప్పి కొడదాం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 27: దేశవ్యాప్తంగా పన్నెండు కేంద్ర కార్మిక సంఘాలు మరియు ఇతర ట్రేడ్ యూనియన్ లు జనవరి 8, 9 తేదీల్లో సమ్మె పిలుపు మేరకు సింగరేణి వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు బోగే ఉపేందర్, సింగరేణి కాలోరిస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు బండారి తిరుపతి లు గురువారం బెల్లంపల్లి ఏరియా గోలేటి ఇంచార్జి జీఎం శ్రీనివాస్ కు సమ్మె నోటీసు అందచేశారు. అనంతరం మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను సమ్మెతో తిప్పి కొడదామని అన్నారు. దేశవ్యాప్తంగా పన్నెండు కేంద్ర కార్మిక సంఘాలు మరియు ఇతర ట్రేడ్ యూనియన్ లు కలిపి కార్మిక సమస్యలపై జనవరి 8, 9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేయాలని పిలుపునివ్వడం జరిగిందని, . ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 18000 రూపాయలుగా నిర్ణయించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం , కోల్ ఇండియా లో ఒప్పందాలను అమలు చేయాలని, కనీసం 8 పని గంటలు ఉండాలని, నిత్యావసర ధరలు తగ్గించాలని మరియు ఇతర డిమాండ్లతో కలిసి సమ్మె చేయడం జరుగుతుందని కార్మికులు పెద్దసంఖ్యలో ఈ సమ్మెలో పాల్గొని తమహక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. . ఈ కార్యక్రమంలో సాగర్ గౌడ్, తిరుపతి, శంకర్, భీమేష్, తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 26 December 2018
ఘననఁగా సి పి ఐ 94 వ ఆవిర్భావ వేడుకలు
కోమురం భీంమ్ రెబ్బెన డిసెంబర్ 26 : సిపిఐ పార్టీ 94 వ ఆవిర్భావదినోత్సవాన్ని రెబ్బెన మండలంలోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పార్టీ జెండాను సిపిఐ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య ఎగరవేశారు ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బోగే ఉపేందర్, మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్ లు మాట్లాడారు. పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోవాలని , పేద ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పార్టీ సిపిఐ అని, పార్టీ ఆవిర్భవించి 94 సంవత్సరాలు కావస్తున్నది ఆనాటి నుంచి ఈ నాటి వరకు కేవలం ప్రజల సంక్షేమం కోసం ప్రజల సమస్యల పరిష్కారం ప్రజల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నదని అన్నారు. ఎన్నికలహామీలుఅమలులోప్రభుత్వాలుఘోరంగావిఫలమయ్యాయని, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సిపిఐ అన్ని గ్రామాల్లో పోటీ చేస్తున్నదని కావున ప్రజలు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి కుమార్, జి పి వర్కర్ యూనియన్ మండల కార్యదర్శి దుర్గం వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ లాల్ సింగ్, నాయకులు బెల్లూరి రాజేష్, ఆర్ శంకర్, గుర్రపు గంగయ్య, గౌస్ ఖాన్, మహేష్ తదితరులు ఉన్నారు.
స్వచ్ఛ ఆసిఫాబాద్ కార్యక్రమానికి పోలీసుల సహకారం
కోమురం భీంమ్ రెబ్బెన డిసెంబర్ 26 : పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తున్నామని రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ రమణ మూర్తి అన్నారు. బుధవారం గంగాపూర్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. స్వచ్ఛ ఆసిఫాబాద్ కార్యక్రమంలో భాగంగా గంగాపూర్ , తుంగడ గ్రామాలను దత్తత తీసుకోని పోలీస్ శాఖ తగిన సహకారం అందిస్తుందని అన్నారు. స్వచ్ భారత్ మిషన్ లో భాగంగా గ్రామాల్లోని అందరు వ్యక్తిగత మరుగు దొడ్లను నిర్మించుకోవాలని కోరారు. ఆసిఫాబాద్ జిల్లాను 100 శాతం మరుగు దొడ్లు నిర్మించుకున్న జిల్లాగా చేయాలని ఈ విషయంలో ప్రజలు అవగాహన పెంచుకోని సహకరించాలని కోరారు, వ్యక్తిగత మరుగుదొడ్ల వలన పరిసరాల పరిశుభ్రత కాపాడుకోవచ్చని, తద్వారా అనేక వ్యాధులకు కారణమైన బాక్టీరియా అభివృద్ధి చెందకుండా గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్, మాజీ సర్పంచ్ ముంజం రవీందర్, ఎంపీటీసీ లు శ్రీనివాస్ ,స్వచ్ఛభారత్ ఫణి కుమార్, అంజనా, గ్రామస్తులు పాల్గొన్నారు.
Tuesday, 25 December 2018
ఎమ్మెల్యే ఆత్రం సక్కు ను కలిసిన కొమరవెల్లి యువకులు
కోమురం భీంమ్ రెబ్బెన డిసెంబర్ 25 : ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆత్రం సక్కు ను జిల్లా కేంద్రంలో మంగళవారం రెబ్బెన మండల కొమురవెల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు కలిసి పుష్పగుచ్ఛము అందజేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మామిడి తిరుమల్ నరేష్ గౌడ్ కమలాకర్ మధుకర్ అశోక్ మల్లేష్ సూర్యకాంత్ సత్తన్నలు పాల్గొన్నారు.
ప్రపంచ వాటర్ రాప్లింగ్ పోటీలకు రెబ్బెన విద్యార్థులు
కోమురం భీంమ్ రెబ్బెన డిసెంబర్ 25 : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలోకటిక జలపాతం వేదికగా జనవరిలో జరగబోయే ప్రపంచ స్థాయి వాటర్ రాప్లింగ్ సాహస క్రీడా పోటీల్లో రెబెనా మండలానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు పాల్గొనే అవకాశం లభించినట్లు ఉమ్మడి జిల్లా అడ్వెంచర్ క్లబ్ ఇంచార్జి అభినవ సంతోష్కుమార్ తెలిపారు మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్ సైన్స్ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న జరుపుల రవీందర్తో పాటు మంచిర్యాల ఎవిఎన్ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న రాజుల రాజ్కుమార్ రెబ్బన ప్రభుత్వకళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న రాజుల శ్రీకాంత్లు జనవరి పదకొండు నుండి పధ్నాలుగు వరకు కటికి జలపాతం వద్ద నిర్వహించే అడ్వెంచర్ పోటీలలో పాల్గొన బోతున్నట్లు తెలిపారు. ఉవ్వెత్తున క్రిందకు దూకుతున్న జలధారలలో తడుస్తూ తాడు సహాయంతో పైనుండి పైనుండి (స్టేట్ పాయింట్) వరకు జలధారలతో పోటీ పడుతూ కిందుకు చేరాల్సి ఉంటుందన్నారు. స్త్రీ పురుషుల్లో 18 ముంది 50 సంవత్సరాల వయసు వారు వెటరన్ విభాగంలో , స్త్రీ పురుషుల విభాగంలో 50 నుండి 70 సంవత్సరాల వరకు పన్నెండు రకాల సాహస క్రీడా పోటీల్లో పాల్గొనవచ్చని తెలియ తెలిపారు. మొదటిసారిగా జరుగుతున్న ప్రపంచ రాప్లింగ్ పోటీలకు రెబ్బెన మండలంలోని ముగ్గురు యువకులు ఎంపికవటం పట్ల మండల వాసులు హర్షం వ్యక్తం చేశారు పోటీలకు ఎంపికైన విద్యార్థులను ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.
జవాన్ మృతికి సంతాపంకంగా కొవ్వొత్తుల ర్యాలీ
కోమురం భీంమ్ రెబ్బెన డిసెంబర్ 25 : దేశ మాత రక్షణ కోసం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఆర్మీ జవాన్ దక్వా రాజేష్ మృతికి సంతాపకంగా మంగళవారం రాత్రి రెబ్బెన మండల కేంద్రంలో రెబ్బెన సీఐ రమణ మూర్తి ,ఎస్సై దీకొండ రమేష్ తో పాటు వివిద రాజకీయ పార్టీల నాయకులు ,వ్యాపారస్తులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు . స్థానిక పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ మీదుగా ప్రధాన రహదారి వెంట గంగాపూర్ కామన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ సంతాపం ప్రకటించారు. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం జిల్లా వాసి దక్వా రాజేష్ శత్రు దేశం చేతిలో అసువులు బసటం బాధాకరమన్నారు. మాతృభూమి సేవలో ఎంతో మంది సైనికులు నిద్రాహారాలు మాని దేశానికి రక్షణగా నిలుస్తున్నారని అలాంటి సైనికులను శత్రు దేశాలా తీవ్రవాదులు పొట్టన పేట్టుకోవటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చెర్మైన్ కుందారపు శంకరమ్మ, నవీన్ జైస్వాల్, వినోద్ జైస్వాల్ , బొమ్మినేని శ్రీధర్, వస్రం నాయక్, నవీన్, పెసర మధునయ్య ,అశోక్, రమేష్, శాంతిగౌడ్, సర్వేశ్ గౌడ్, చెన్నసోమశేఖర్ , భార్గవ్ గౌడ్, గోపి, సుదర్శన్ గౌడ్ , మద్ది శ్రీనివాస్, ప్రవీణ్ , ఫణి కుమార్, కీర్తి మహేందర్, రాజు,సతీష్,కృష్ణ, వ్యాపారస్తులు శంకర్, తుషార్ కొడియర్, ఘన్ శ్యామ్, వేణు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
గోలెటిటౌన్ షిప్ లో కొవ్వొత్తుల ర్యాలీ
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో భారతదేశం రక్షణ కొరకు తన ప్రాణాలను అర్పించిన కొమురం భీం జిల్లా కు చెందిన జవాన్ రాజేష్ ఆత్మకు శాంతి కలగాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గోలేటి లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి BYBS, బిజెపి నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో AISF జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు సాయి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిల్ల నర్సయ్య, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్, బిజెపి నాయకులు ఆంజనేయులు గౌడ్, BYBS నాయకులు రంజిత్, రవీందర్, మహేందర్ ,సాయి ,తిరుపతి ,రాజేష్ ,సమీర్ పాల్గొన్నారు..
ఘనంగా క్రిస్మస్ వేడుకలు ; పేదలకు దుప్పట్లు పంపిణీ
కోమురం భీంమ్ రెబ్బెన డిసెంబర్ 25 : రెబ్బెన మండలంలోని అన్ని గ్రామాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రెబ్బెన మండల కేంద్రంలోని అగాపే షాలోమ్ చర్చి, గోలేటి గ్లోరియస్ చర్చ్ , నంబాల, గంగాపూర్ చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విశ్వ మానవాళికి తన ప్రేమ తత్వం తో వెలుగులు నింపిన కరుణమయుడు ప్రేమ మూర్తి క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా రెబ్బెన మండలం లో గోలేటి లోని గ్లోరియస్ చర్చ్ లో బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్చంధ సేవా సంస్థ ఆద్వర్యంలో కుల మతాలకు అతితంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరిపినట్లు సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్ తెలిపారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా చలి కాలం దృష్టిలో పెట్టుకొని పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ తిమోతి మరియు సంస్థ ప్రధాన కార్యదర్శి గజ్జెల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రవీందర్,రాజశేఖర్ సభ్యులు బలుగురి తిరుపతి, రాజశేఖర్,పెంటపర్తి తిరుపతి,కృష్ణ, ఏగ్గె తిరుపతి, అఖిల్ , పస్తం పోశం తదితరులు పాల్గొన్నారు.
Sunday, 23 December 2018
సమ్మెను విజయవంతం చేయాలి
కోమురం భీంమ్ రెబ్బెన డిసెంబర్ 23 : దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు పాలుగోని విజయవంతం చేయాలి
జనవరి 8,9 తేదీలలో దేశ వ్యాపిత సమ్మెలో సింగరేణి కార్మికులు పాలుగోని విజయవంతం చేయలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)గోలేటి బ్రాంచ్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్,సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంగం (ఇఫ్ట్)గోలేటి బ్రాంచ్ ప్రెసిడెంట్ బండారి తిరుపతి అన్నారు..
ఈ వారు మాట్లాడుతూ సింగరేణిలో ని కాంట్రాక్టు కార్మికులను సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,అలాగే కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని,కాంట్రాక్టు కార్మికులను అందరిని పర్మనెంట్ చేయాలని అన్నారు,
కొలిండియా జరిగిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని అన్నారు,2013 నుంచి కాంట్రాక్టు కార్మికులను హై పవర్ కమిటి (HPC) అమలు చేయాలని అన్నారు,కార్మిక కుటుంబ సభ్యులందరికి కార్పొరేట్ వైద్యం అందించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కార్మిక చట్టాలను సింగరేణి యాజమాన్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు..
ఈ సమావేశంలో కాంట్రాక్టు కార్మికులు రాజుకుమారు,శ్రీనివాస్,ప్రవీణ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు
ఘనంగా సింగరేణి 130 వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు


కోమురం భీంమ్ రెబ్బెన డిసెంబర్ 23 :సింగరేణి 130 వ ఆవిర్భావ వేడుకలు బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి టౌన్ షిప్ లో గల భీమన్న మైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బెల్లంపల్లి ఏరియ జనరల్ మేనేజర్ కె.రవిశంకర్ సింగరేణి పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. సింగరేణి చరిత్రను, ప్రగతి, విజయాలను చాటిచెప్పే విధంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కర్మికులుపైనే కాకుండా కార్మికుల కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద వహిస్తోంది అని అన్నారు. కార్మికుడు ఇంటి వద్ద ప్రశంతగా ఉన్నపుడే ఉత్పతి పై దృష్టి సాదిస్తారని ఆయన అన్నారు కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకోని ఆరోగ్యం కోసం ఆయుర్వేద వైద్య సదుపాయములు కల్పించామని నిరుద్యోగ యువతీయువకులు స్వయం కృషితో పారిశ్రామికవేత్తలు స్వయం సంపాదకులుగా ఏదిగే అవకాశం కల్పిస్తాము అన్నారు. అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో కలసి పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని అన్నారు. సింగరేణి సంస్థలో సభ్యుడైనందుకు తానూ గర్విస్తున్నానని, అలాగే ప్రతి సింగరేణీయుడు అనుకొంటున్నాడని అన్నారు. దక్షిణాదిలో సింగరేణి సమాజ హిత కార్యక్రమాలలో ముందుంటుందన్నదని అన్నారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ పథకంలో సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాలలో అనేక గ్రామాల అభివృద్ధికి తనవంతు సాయంగా వేలకోట్ల రూపాయలతో అభివృద్ధిని చేపట్టిందని అన్నారు. సింగరేణి తల్లికి మనమందరం శ్రద్ధతో సేవచేస్తే ఆ తల్లి మనలను మరింత అభివృద్ధి వైపు తీసుకోని వెళుతుందని కావున మనందరం మన పనిలో పునరంకితమౌదామని పిలుపునిచ్చారు. అనంతరం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలతో కళాకారులు ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమాలలో ఎస్ ఓ టు జి యం సాయిబాబా, సేవాసమితి అధ్యక్షురాలు అనురాధ రవి శంకర్ డి జి యం ప్రర్సనల్ జె కిరణ్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస రావు, డి జి యం సివిల్ ప్రసాద్, యూనియన్ నాయకులూ తిరుపతి , సేవాసభ్యులు కుందారపు శంకరమ్మ, సొల్లు లక్ష్మి, తదితర సభ్యులు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Friday, 21 December 2018
సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ పర్యటన
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 21 ; సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ బలరామ్ నాయక్ బెల్లంపల్లి ఏరియా ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా అన్నిరంగాలలో పురోగతిని ప్రదర్శిస్తున్నదని అన్నారు. సింగరేణి కుటుంబంలో ఒక సభ్యుడినైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందని మనం అందరం కలిసి నూతన ప్రాజెక్టుకై కృషి చేసి సింగరేణి పూర్వ అభివృద్ధికి పాటుపడదామని అన్నారు. బెల్లంపల్లి ఏరియాను అన్నివిధాలా అభివృద్ధి చేయడంలో కృషి చేస్తున్న జీఎం శ్రీ కే రవిశంకర్ ను, ఉద్యోగులను, కార్మికులను అభినందించారు ఈ సందర్భంగా డైరెక్టర్ ను శాలువా పుష్పగుచ్ఛాలతో జిఎం రవిశంకర్ సన్మానించారు అనంతరం డోర్లి మరియు కైరిగూడ ప్రాజెక్టులను సందర్శించి నారు ఈ సందర్భంలో సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ మరియు సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ బోడ భద్రు, లైజన్ ఆఫీసర్ ఏ రాజేశ్వర్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులందరూ డైరెక్టర్ సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎస్వోటు జిఎం శ్రీ కే సాయిబాబా, ఇంజనీర్ శ్రీ బసిరెడ్డి , ఎస్వోటూ డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ప్రసాదరాజు ,డిజిఎం పర్సనల్ జె కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.
Thursday, 20 December 2018
బతుకమ్మ చీరలు పంపిణీ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 20 ; రెబ్బెన మండల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ పురాణం సతీష్ పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు సమ నయాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ ఇంతియాజ్ అహ్మద్, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ జడ్పీటీసీ బాబురావు, ఎంపిపి సంజీవ్ కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, వైస్ఎంపిపి గుడిసెల రేణుక తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మానవ హక్కుల సమితి జిల్లా అధ్యక్షుడుగా రాపాల రాజశేఖర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 20 ; కొమురం భీమ్ జిల్లా కు అంతర్జాతీయ మానవ హక్కుల సమితి జిల్లా అధ్యక్షుడుగా రెబ్బెన మండలం కు చెందిన రాపాల రాజశేఖర్ ను, ఎన్నుకున్నట్టు గా అంతర్జాతీయ మానవ హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు పి. కుమార్ మహేంద్ర గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు. అలాగే తొరలో రాజకీయంగా బడుగు బలహీనా మరియు ఆదివాసి వర్గలా హక్కులకై పోరాటం చేస్తామని, భారతీయ మనవధీకార్ ఫెడరల్ పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో 496 స్థానలలో పోటీ చెయుటకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం అని అన్నారు. మరియు జనవరిలో తెలంగాణలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనవధీకార్ ఫెడరల్ పార్టీ పోటీ చేస్తుందని తెలియజేసారు. సామాజిక వేత్తలకు, పౌరహక్కులపై, పోరాటం చేసే నాయకులతో కలిసి పని చేయుటకై ఆహ్వానము పలుకుతున్నామన్నారు.
Wednesday, 19 December 2018
రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 19 ; వరంగల్ లో జనవరి 5 నుండి 7 వరకు జరిగే రాష్ట్ర స్థాయి చెక్ ముఖి టాలెంట్ టెస్ట్ లో మంచి ప్రతిభా పాటవాలను కనపరచి మండలానికి పేరు తేవాలని రె బ్బెన ఎస్ ఐ దీకొండ రమేశ్ అన్నారు. బుధవారం రెబ్బెన మండల కేంద్రంలోని సాయి విద్యాలయంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్దగా చదివి మంచి భవిస్యత్త్తు నిర్మించుకోవాలని అన్నారు. మండలం లోని విద్యార్థులు వర్ష, కనకలక్ష్మి, హర్షవర్ధన్, శిరీషాలకు రాష్ట్రస్థాయియిలో బహుమతులు గెలవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండంట్ విజయ కుమారి, ప్రధానోపాధ్యాయులు సంజీవకుమార్, ఉపాధ్యాయులు సుజాత, రేష్మ, ఆనంద్ రావు , తిరుపతి, మహేందర్ , మౌనిక, భాగ్య , స్వప్న, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
పదవీవిరమణ చేస్తున్న అధికారికి సన్మానం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 19 ; బెల్లంపల్లి ఏరియా గోలేటి జీఎం కార్యాలయంలో జనరల్ మేనేజర్ సేఫ్టీ గా పనిచేస్తున్న వసంత్ కుమార్ ఈ నెల ముప్పై ఒకటి న పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా వారిని బుధవారం జిటిసీఓఏ క్లబ్ లో జీఎం కే రవిశంకర్ ఏరియా ఉన్నతాధికారులతో కలిసి ఘనంగా సన్మానించారు . ఈసందర్భంగా జీఎం కె రవిశంకర్ మాట్లాడుతూ వసంత్ కుమార్ సింగరేణిలో పలు ఏరియాల్లో పనిచేసే సింగరేణికి తమ సేవలు అందించారని తెలిపారు వసంత్ కుమార్ ను శాలువ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జిఎం సాయిబాబా సిఎంఓఎఐ ప్రెసిడెంట్ సిట్ శ్రీనివాస్, ప్రాజెక్టు ఆఫీసర్ పురుషోత్తం రెడ్డి, డిజిఎం పర్చేస్ రావుజీ, డిజిఎం పర్సనల్ జె కిరణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 19 ; శీతాకాలంలో పశువులకు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్త్వం ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ శంకర్ రాథోడ్ అన్నారు. బుధవారం రెబ్బెన మండలంలోని నవేగం లో ఏర్పాటుచేసిన పశువైద్యశిబిరాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ . కృషికళ్యాణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లలో 100 గ్రామాలు ఎంపికైనట్లు అందులో రెబ్బెన మండలంలోని రెబ్బెన, తుంగేడ , గంగాపూర్, ఖైర్గం, నవేగం, వంకులం గ్రామాలు ఉన్నట్లు తెలిపారు. ఈ గ్రామాలలో ఈనెల 27 వరకు శిబిరాలు కొనసాగుతాయని అన్నారు. ఈ శిబిరాలలో పశువులకు కృత్రిమ ఘరహదారణ సంచులను పంపిణి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Tuesday, 18 December 2018
నిరుద్యోగ యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 18 ; తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని విద్యావంతులైన నిరుద్యోగ యువతకు వివిధ శిక్షణ సంస్థలు ద్వారా నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉద్యోగ ఉపాధి కల్పించును ఎస్సీ కార్పొరేషన్ నేర్పాటు చేయబోతుందని ఏరియా డీజీఎం పర్సనల్ జె కిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ కోర్సులలో శిక్షణ పొందా గలరు వారు పద్ధెనిమిది సంవత్సరాల నుండి ముప్పయి సంవత్సరాల లోపు వయస్సు ఉండవలెను శిక్షణా సంస్థలు జాతీయ నిర్మాణ రంగ సంస్థ హైదరాబాద్ జాతీయ ఏర్పాటు మరియు అపోలో మెడ్ స్కిల్స్ కెల్ట్రాన్ ఇన్స్టిట్యూట్ ఇన్సిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నిమ్స్ జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ టీఎంఐ ఈ టూ ఈ క్రింద శిక్షణ సంస్థల్లో పలు కోర్సులలో పూర్తి ఉచిత వసతి భోజన సదుపాయాలతో శిక్షణ కార్యక్రమాల ఈ అకాడమీ ఆప్టిమల్ స్కిల్స్ నాలుగు ట్యూషన్స్ షెడ్యూల్ ఇన్సిట్యూట్ ఆఫ్ పర్ఫెక్ట్ స్టేట్ ఫోర్ నీకు పూర్తి వివరములకు గోరేటి జిమ్ ఆఫీసులోని పర్సనల్ డిపార్టుమెంట్లో సంప్రదించలన్నారు.
Sunday, 16 December 2018
చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి ; ఎస్పీ మల్లారెడ్డి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 16 ; చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ప్రజలు దూరంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని, వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను నివారించలని ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. ఆదివారం రెబ్బెన మండలం లోని సింగిల్ గూడ గ్రామంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించరూ. ఈ సందర్బంగా ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడుతూ గుడుంబా ప్రభావిత గ్రామాల్లో,నాటు సార నిషేధిత, గుట్కా,తంబాక్, వినియోగించడంతో మానవాళి ఆరోగ్య సమస్యలతో కుటుంబాలు చిన్నబిన్నమౌతున్నాయని వారికి తెలిపారు. మరియు బడి ఈడు పిల్లల్ని బడిలో చేర్పించి విద్య బుద్దులకు అలవాటు చేయాలని అన్నారు,బాల్య వివాహాలు చేయరాదని గ్రామంలోని ప్రజలకు సూచించారు. కార్టన్ సెర్చ్ లో 5 లీటర్ల గుడుంబా మరియు సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు అలాగే మద్యం తాగి వాహనాలు నడిపేవారికి తగిన చట్టరీత్య చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి మండల,గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించి ప్రజలకు భద్రతను,భరోసాను కల్పించనున్నట్లు ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు.డీఎస్పీ సత్యనారాయణ,సిఐ రమణమూర్తి,ఆరుగురు ఎస్ ఐ లు, డికొండ రమేష్. 56 మంది పోలీస్ సిబ్బంది తో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
Saturday, 15 December 2018
పాఠశాల మేనేజ్ మేంట్ కమిటీ సమావేశం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 15 ; రెబ్బెన మండలం ఇందిరా నగర్ గ్రామంలోని ప్రాధమిక పాఠశాల మేనేజ్ మేంట్ కమిటీ సమావేశం కన్వీనర్ దొడ్డిపట్ల రవికుమార్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల మౌలిక వసతులు , మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ , విద్యార్థుల హాజరు శాతం, చదువులో వెనుక బడిన విద్యార్థుల ప్రగతి కై తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎం సి సభ్యులు అనిత,అమ్మక్క , తార, ఇందిరా, లక్ష్మి, సరోజ, రజిత , సుజాత, సునీతా, రాందాస్, శంకర్, వెంకటేష్, సి అర్ పి దేవేందర్, అంగన్వాడీ టీచర్ తిరుపతమ్మ, ఉపాధ్యాయులు కవిత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ 10 వ తరగతి పరీక్షలకు అవకాశం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 15 ; తెలంగాణా ప్రభుత్వం 2018 -19 సంవత్సరానికి గాను ఓపెన్ 10 వ తరగతి పరీక్షలకు అవకాశం కల్పించిందని ఆసక్తి గలవారు ఈ నెల 15 నుండి 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రెబ్బెన మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
బ్యాంకింగ్ వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలి
Friday, 14 December 2018
కేటీర్ పదోన్నతిపై తెరాస శ్రేణుల సంబరాలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 14 ; కల్వకుంట్ల తారక రామా రావు తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని చేపట్టిన సందర్బంగా రెబ్బెన మండలం గోలేటి లో టి ఆర్ ఎస్ వి కొమురంభీం జిల్లా అధ్యక్షులు మస్కు రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పదవికి కేటీర్ ను ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తెరాస పార్టీ కేటీర్ నాయకత్వంలో మరింత ప్రజాదరణ పొందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతి అశోక్, సోంశెట్టి శశి, లాక్సేటి రవీందర్, పోతురాజుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్ సీ వర్గీకరణ బిల్లు ప్రెవేశ పెట్టాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 14 ; వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో ఎస్ సీ వర్గీకరణ బిల్లు ప్రెవేశ పెట్టాలని కొమురంభీం జిల్లా మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు వేమునూరి భాస్కర్ మాదిగ అన్నారు. గత 25 సంవత్సరాలుగా ఎస్ సీ ల అబీహుయున్నతి కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తున్న మందకృష్ణ మాదిగను విమర్శించడం తగదని అన్నారు.మాదిగ జాతి అభ్యున్నతి కోసం పాటు పడుతున్న మహనీయుడు మందకృష్ణ మాదిగ అని అన్నారు.
గుడుంబా స్థావరాలపై దాడులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 14 ; రెబ్బెన మండలం దేవులగుడ గ్రామంలోని పత్తి చేలలో శుక్రవారం ఖచితమైన సమాచారం మేరకు ఎస్సై విజయలక్ష్మి ఆధ్వర్యంలో మద్యపాన నిషేధ శాఖ అధికారులు దాడి చేసి గుడుంబా తయారీ స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఆబ్కారీ ఎస్సై విజయలక్ష్మి తెలిపారు. తయారీ కంద్రాలలో 50 లీటర్ల బెల్లం పానకం, 5 లీటర్ల గుడుంబా నుస్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి నిషేదిత మద్యాలను తయారీ చేయకూడదని అన్నారు. చట్టాన్ని అధిగమించిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. నిషేదిత మద్యం తరిపై సమాచారం ఇవ్వదలచినవారు 08735 277017 నెంబర్ పై సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం గా ఉంచబబడతాయని తెలిపారు. ఈ దాడులలో కానిస్టేబుల్ తిరుపతి, సురేష్, తిరుమల,మమత, తదితర సిబ్బంది ఉన్నారు.
సబ్సిడీ పై గడ్డి విత్తనాలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 14 ; రెబ్బెన మండలంలో సబ్సిడీ పై గడ్డి విత్తనాలను సరఫరా చేయనున్నట్లు స్థానిక పశు వైద్యాధికారి సాగర్ శుక్రవారంతెలిపారు. మండలం లోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడ్డి విత్తనాలు 75 శాతం సబ్సిడీ పై అందచేయనున్నట్లు తెలిపారు. 5 కిలోల విత్తనాల బాగ్ 50 ధర రూపాయలని రైతులు తమ పట్టా పాసు పుస్తకాల నకళ్ళతో రెబ్బెన పశు వైద్యశాలలో సంప్రదించాలని కోరారు.
Wednesday, 5 December 2018
గుడుంబా స్థావరాలపై దాడులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 5 ; రెబ్బెన మండలం దేవులగుడ పరిసర ప్రాంతాలలో గ్రామంలోబుధవారం ఖచితమైన సమాచారం మేరకు జిల్లా ఆబ్కారీ అధికారి రాజ్యలక్ష్మి ఆదేశానుసారం మొహిసిన్ అలీ ఆధ్వర్యంలో మద్యపాన నిషేధ శాఖ అధికారులు దాడి చేసి గుడుంబా తయారీ స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఆబ్కారీ ఎస్సై విజయలక్ష్మి తెలిపారు. గ్రామంలో నాగు వెంబడి ఉన్న తయారీ కంద్రాలలో 50 లీటర్ల బెల్లం పానకం, 25 లీటర్ల గుడుంబా నుస్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి నిషేదిత మద్యాలను తయారీ చేయకూడదని అన్నారు. చట్టాన్ని అధిగమించిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. నిషేదిత మద్యం తరిపై సమాచారం ఇవ్వదలచినవారు 08735 277017 నెంబర్ పై సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం గా ఉంచబబడతాయని తెలిపారు. ఈ దాడులలో కానిస్టేబుల్ తిరుపతి, సురేష్, తిరుమల,మమత, తదితర సిబ్బంది ఉన్నారు.
Monday, 3 December 2018
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ; జీఎం కే రవిశంకర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, ; అంగవైకల్యం ఉందని కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జీఎం కే రవిశంకర్ అన్నారు. ప్రపంచ దివ్యంగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్ షిప్లోని సింగరేణి పాఠశాల మైదానంలో సోమవారం దివ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనురాధ రవి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున దివ్యాంగుల దినోత్సవాన్ని సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తుందని దివ్యాంగులు అంగవైకల్యం ఉందని కుంగిపోకుండా పట్టుదలతో కృషి చేసి ఆయా రంగాల్లో ఉన్నత స్థాయిల్లో వున్నారని అన్నారు ఈ సందర్భంగా దివ్యాంగులకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. అందరికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న వారికి పాటలు పాడి డ్యాన్సులు చేసిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి డిజిఎం పర్సనల్ సుదర్శనం, డిజి డివైపిఎం ఎల్ రామశాస్త్రి డబ్ల్యూపీఎస్ స్పోర్ట్స్ సూపర్ వైజర్ రమేష్ , చంద్రకుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Saturday, 1 December 2018
ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, ; రెబ్బెన మండలం నారాయణ పూర్ గ్రామంలో పతంజలి యోగ పీఠం హరిద్వార్ వారి ఆధ్వర్యంలో శనివారం ఐదురోజుల ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని కొమరం భీమ్ జిల్లా ప్రచారక్ దాసరి వినోద్ గౌడ్ ప్రారంభించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగాను రోజు చేయాలని చేసినట్లయితే వ్యాధులు దరిచేరవని ఆయన తెలిపారు. తదనంతరం నారాయణపూర్ ప్రభుత్వ పాఠశాలలో యోగ పైన అవగాహన కల్పించారు మరియు గ్రామంలో యోగ, స్వచ్ఛత, పచ్చదనం, గోమాత గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ వాసులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయిని మరియు ఉపాధ్యాయుని లు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, ; ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమని పి అర్ టి యు కొమురం భీమ్ జిల్లా అధ్యక్షులు ఎటుకురి. శ్రీనివాస్ అన్నారు. శనివారం రెబ్బెన మండలం తక్కలపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలోపనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీమతి హనుమాండ్ల విజయ లక్మి పదవి విరమణ సన్మాన సభకి ముఖ్య అతిధి గా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఆమె పాఠశాలలో చేసిన సేవలను కొనియాడుతూ శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని అన్నారు . పదవి విరమణ చేసిన ఉపాధ్యాయురాలును పి అర్ టి యు టి ఎస్ రెబ్బెన మండల శాఖ పక్షాన ఘనబగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలోమండల విద్యాధి కారి వెంకటేశ్వర స్వామి, జిల్లా మాజీ అధ్యక్షులు డి.నారాయణ రావు,జిల్లా ఉపాధ్యక్షులు సదానందం,ఖాదర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్వల శంకర్,మండల అధ్యక్షులు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి యస్.అనిల్ కుమార్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)