Thursday, 30 April 2015

దళితుల భూ పంపిణి పథకం కొరకు భూములను పరిశీలించిన సబ్-కలెక్టర్


రెబ్బెన ఏప్రిల్ 30: ఆసిఫాబాద్ సబ్-కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గురువారం నాడు రెబ్బెన మండలం లోని రాజారం, కిస్టాపూర్, నారాయణపూర్ గ్రామాలలో తిరిగి పలు భూములను పరిశీలించినారు, కిస్టాపూర్ లో 16 ఎకరాలు, రాజారం లో 6 ఎకరాలు, నారాయణపూర్ లో 10 ఎకరాలు సుమారు మొత్తం 32 ఎకరాలు పట్టెధారుల భూములను పరిశీలించినారు, పట్టేధారులు ఇస్తాపడినట్లైతే వారికీ మార్కెట్ ధర చెల్లించి ఆ భూములను భూమి లేని దళిత కుటుంబాలకు 3 ఎకరాలు చొప్పున పంపిణి చేయనునట్లు తహసిల్దార్ జగదిశ్వరి తెలిపారు, ఈ సందర్భంగా  సబ్-కలెక్టర్ వెంట రెబ్బెన తహసిల్దార్ జగదిశ్వరి మరియు పలువురు గ్రామస్తులు పాలుగోన్నారు.  

No comments:

Post a Comment