Thursday, 30 April 2015

కొత్తగా నిర్మిస్తున్న బి.టి.రోడ్డు



రెబ్బెన, ఏప్రిల్ 17 (వుదయం ప్రతినిధి):రెబ్బెన మండలంలోని నంబాల గ్రామపంచాయితీలో కొత్తగా నిర్మిస్తున్న బిటి రోడ్డు పనులను శుక్రవారం వ్యవసాయ సహాయక మంత్రి, స్తానిక ఎమ్మెల్యే కోవలక్ష్మీ గారు శుక్రవారం రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీటీరోడ్డు 2.9 కి.మీ.   నిర్మాణానికి రూ. 1.80కోట్ల మంజూరయ్యాయన్నారు. హనుమాన్‌ మందిరం నుంచి శివాలయం ముందుగా తక్కలపల్లి వరకు ఈ బీటీరోడ్డు నిర్మాణం చేపడుతారన్నారు. నంబాల గ్రామంలో మరిన్ని అభివృద్ది పనులుచేపడుతామని,  మిషన్‌ కాకతీయ కింద ఏడు చెరువుల్లో పూడికతీత, గ్రామంలో సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో తూర్పుజిల్లా అధ్యక్షులు పురాణం సతీష్‌, టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షులు శ్రీధర్‌ రెడ్డి, సర్పంచ్‌ సుశీల, సత్తన్న, జడ్పీటీసీ బాబురావ్‌, ఎంపీపీ సంజీవ్‌కుమార్‌, పార్టీ ఇతర నాయకులూ పాల్గొన్నారు.

No comments:

Post a Comment