Thursday, 30 April 2015

రేషన్‌ షాపు కొరకు వినతి







 రెబ్బెన,ఏప్రిల్23(వుదయం ప్రతినిధి): - మండల కేంద్రంలో గురువారం రోజున తహసిల్దార్‌ కార్యాలయంలో కైర్గాం  ప్రజలు , ప్రతినిధులు కైర్గాం గ్రామ పంచాయతీలో ఉన్న రేషన్‌ షాపు తీసివేసి పక్క ఎడవేల్లిలో రేషన్‌ షాపు నిర్వహించడంతో కైర్గాం నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉండటంతో ప్రధాన రహదారి గుండా నడుస్తూ వెళ్లాలంటే ఇబ్బందులకు గురవుతున్నామని గతంలో కూడ సబ్‌కలెక్టర్‌కి వినతిపత్రం అందించామని సింగిల్‌ విండో డైరెక్టర్‌ మారం సంతోష్‌, వార్డు సభ్యులు గౌరక్క తహసిల్దార్‌ జగదీశ్వరికి విన్నవించారు. తహశీల్దార్‌ గారు మాట్లాడుతూ సమస్యకు పరిష్కారాన్ని అధికారులతో మాట్లాడుతానన్నారు. ఈ కార్యక్రమంలో బండి శకుంతల, పోషక్క, రాజన్న, సంతోష్‌ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాలుగోన్నారు

No comments:

Post a Comment