Wednesday, 15 April 2015

నంబల శివాలాయం లో హైకోర్ట్ న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు

నంబల  శివాలాయం లో హైకోర్ట్ న్యాయమూర్తుల  ప్రత్యేక పూజలు


రెబ్బెన: ఏప్రిల్ 11 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల నంబల గ్రామం లోని ప్రసన్న పరమేశ్వర శివాలయంను శనివారం రోజు హైకోర్ట్ న్యాయమూర్తులు  జస్టిస్ జి. చంద్రయ్య , జస్టిస్ ఎమ్. సీతారామ మూర్తి, జిల్లాన్యాయమూర్తి జస్టిస్ గ్రంది గోపాలకృష్ణ మూర్తి గార్లు  దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆస్సిసులు అందుకొన్నారు .   ఈ సందర్భంగా ఆలయ కమిటి సభ్యులు  నంబల గ్రామా సర్పంచ్ శ్రీమతి జి.సుశీల పూలమాల తో  వారికి ఘన స్వాగతం పలికారు, దేవాలయ అభివృద్ధి కొరకు ఒక వినతి పత్రం అందజేసారు, ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ సబ్-కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, బెల్లంపల్లి డి.ఎస్.పి. రమణా రెడ్డి రెబ్బెన సబ్ ఇనస్పెక్టర్ హనుక్ మరియు మండల నాయకులూ మోడెమ్ సుదర్శన్ గౌడ్, బొమ్మినేని శ్రీధర్ కుమార్, కొవ్వూరి శ్రీనివాస్ ,పాలుగోన్నారు  



ట్రాక్టర్ బోల్తాపడి ఒకరి  మృతి 

రెబ్బెన: ఏప్రిల్ 11 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లోని జూనియర్ కళాశాల దగ్గర శనివారం ఉదయం ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఇటుక బట్టిలో పని చేస్తున కూలి బట్టి మహేందర్ (30) పెగడపల్లి వాసి అక్కడిక్కడే మృతి చెందాడు మరియు ట్రాక్టర్ డ్రైవర్ రాజు కు తీవ్రగాయాలు అయ్యాయి,  ట్రాక్టర్ డ్రైవర్ ఎదురుగా వస్తున్నా లారీని  తప్పియ్య బోయి అనుకోకుండా ట్రాలీ లిఫ్ట్ జాక్ పైకి లేవడం తో ప్రమాదం జరిగినట్టు రెబ్బెన ఎస్.ఐ. హనుక్ తెలిపారు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్.ఐ. హనుక్ తెలిపారు.  

మహాత్మా జ్యోతి రావు పులే 189వ  జయంతి 
రెబ్బెన: ఏప్రిల్ 11 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లో ని మండల పరిషద్ కార్యాలయములో  మహాత్మా జ్యోతి రావు పులే 189వ  జయంతి ని ఘనంగా జరిపారు, ఈ కార్యక్రమం లో జెడ్.పి.టి.సి. బాబురావు ఎమ్.పి.పి. సంజీవ్ కుమార్  సర్పంచ్ పెసర వెంకటమ్మ,  ఎమ్.పి.టి.సి.లు గోడిసేలా రేణుక, కొవ్వూరి శ్రీనివాస్, వనజ మరియు ఇతర నాయకులూ మదనయ్య, చిరంజీవి పాలుగోన్నారు.     


No comments:

Post a Comment