Wednesday, 15 April 2015

సంచలనం రేపిన యువతి దారుణ హత్య


సంచలనం రేపిన యువతి దారుణ హత్య ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన 


రెబ్బెన మండలం లోని  పాసిగాం  గ్రామానికి చెందిన వసాక శ్యామల (18) ఊరి చివర ఆటవీప్రాంతంలో దారుణ హత్యకు గురైయిందని తాండూర్  సి.ఐ రమేష్ బాబు సోమవారం తెలిపారు.  పాసిగామకు చెందిన శ్యామల గత నెల 28న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళింది, తిరిగి ఇంటికి రాకపోయేసరికి ఆమె తండ్రి విజ్జు మేర ఇరుగు పొరుగు ఇళ్ళలో ఆరాతీసిన  తన జాడ తెలియకపోయేసరికి  31 న కుటుoబ సభ్యులు రెబ్బెన  పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారని  తెలిపారు. సోమవారం పాసిగంకి రెండు కిలోమీటర్ల దూరంలోగల సుద్ద క్వారీ గుంతల సమీపంలో మేకల కాపర్లు దుర్వాసనని గమనించి స్థానిక సర్పంచ్ కి సమాచారమిచ్చారు. సర్పంచ్ గ్రామస్థులతో చూడగా యువతి మృతదేహం కనిపించింది. మృతదేహం ఫై ఉన్న దుస్తులతో విజ్జుమేర తన కూతురుదేనని గుర్తించారు. వెంటనే సర్పంచ్ పోలీసులకు సమాచారమందిచారు. దీంతో బెల్లంపల్లి డి ఎస్ ఫై  రమణా రెడ్డి, తాండూర్ సి ఐ రమేష్ బాబు, రెబ్బెన ఎస్ ఐ హనోక్ సంఘటనా స్థలికి చేరుకొని యువతి తండ్రిని,స్థానికులను అడిగి తెలుసుకున్నారు.  శ్యామలను ఓణి తో ఉరేసి చంపి ముఖం ఏర్పడకుండా పెద్ద రాయితో కొట్టి ఉంటారనే ఆనవాళ్ళు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని డాగ్ స్క్వాడ్ బృందం, క్లూస్ టీంలు వచ్చాయి. కేసు దర్యాప్తు చేస్తునాట్లు  తాండూర్ సి ఐ రమేష్ బాబు తెలిపారు .

No comments:

Post a Comment