Sunday, 19 April 2015

ఆస్తికోసం బాలుడుని హత్య చేసిన సవితి తల్లి

ఆస్తికోసం బాలుడుని  హత్య చేసిన సవితి తల్లి  

 


రెబ్బెన మండల కేంద్రంలో అబం శుభం తెలియని బాలుడును  సవితి తల్లి గొంతు, ముక్కు ముసి హత్య చేసి ఘటన దుమారం లేపింది, రెబ్బెన లో నివాసం ఉంటున్న పిట్టల ప్రభాకర్ యొక్క మెదట కీర్తన తో వివాహం జరిగింది వీరికి జయసూర్య (6) జన్మిచాడు, అనరోగ్యాకారానంగా కీర్తన 5 సంవత్సరాల క్రితం చనిపోగా వేములపల్లి కి చెందిన   సునీత ను ఆరు నేలల  క్రితం రెండవ వివాహం చేసుకున్నాడు, కానీ సునీత తనకు పుట్టబోయే పిల్లకు ఆస్తి చెందకుండా అడ్డుపడుతాడు అని ఈ  నెల 16న ఇంట్లో ఎవరులేని సమయంలో జయసూర్య ను  హత్య చేసి, తనకు ఏమి తెలియనట్లు బాబు బాత్రుం లో కాలుజారి తలకు గాయం అయి చనిపోయినట్లు అందరిని నమ్మించింది, సునీత మాటలు నమ్మి బాబుకు అంతక్రియలు చేసారు, మరుసటి రోజునుండి సునీత ప్రవర్తనలో మార్పురావడం గమనించిన కుటుంబసభ్యులు అనుమానం తో అడగగా తనే జయసూర్యను గొంతు, ముక్కు ముసి ఉపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు ఒప్పుకుందని తాండూరు సి.ఐ. రమేష్ బాబు తెలిపారు, మృతుడి తండ్రి ప్రభాకర్ పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎ.ఎస్.ఐ.మీరాజొద్దిన్ తెలిపారు, బెల్లంపల్లి డి.ఎస్.పి. రమణారెడ్డి, రెబ్బెన మండల తహసిల్దార్ జగదిశ్వరి, తాండూరు సి.ఐ. రమేష్ బాబు సమక్ష్యంలో ఆదివారం బాలుడి  మృతదేహంకు  పోస్ట్-మార్టం నిర్వహించారు. 

No comments:

Post a Comment