Thursday, 30 April 2015

రైతులకు నీటి వసతి కొరకై

రెబ్బెన : మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో రైతులకు నీటి వసతి కొరకై స్పింక్లర్ల పైపులు ఎంపీ డీవో అలీం శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు స్పింకర్లను ద్వారా మొక్కలకు, పంటలకు అవసరమయ్యే నీరు సక్రమంగా అందుతుందన్నారు. నీటి వృధాను అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్‌ కుమార్‌, జెడ్పీటీసీ బాబురావ్‌, రెబ్బెన సర్పంచ్‌ వెంకటమ్మ, సర్పంచ్‌ సుశీల, నాయకులు వెంకటేష్‌, చిరంజీవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment