Wednesday, 15 April 2015

మిషన్ కాకతీయ లో ఎల్లమ్మ చెరువు ముంపు భాదితుల ఆవేదన

మిషన్ కాకతీయ లో ఎల్లమ్మ చెరువు ముంపు భాదితుల ఆవేదన 

 రెబ్బెన : ఏప్రిల్ 7 (వుదయం ప్రతినిధి) మిషన్ కాకతీయ లో భాగంగా రెబ్బెన మండలంలోని ఎల్లమ్మ చెరువు పునరుద్ధరణ కార్యక్రమం వలన ముంపునకు దాదాపు 15 కుటుంబాల చిన్నకారు రైతులు తమ పట్టా భూములను కోల్పోతున్నారు. ఈ కుటుంబాలకు వ్యవసాయమే ప్రధానధారం. ఈ రోజు ఈ రైతు కుటుంబాల వారందరూ తమ భాదను రెబ్బెన మండల తహసిల్దారుకి వినతి పత్రం రూపంలో సమర్పించారు. తమకు ఈ భూమే జీవనాధారమని రెబ్బెన లో భూముల ధరలు చాల ఎక్కువ ఉన్నాయని అందువల్ల తమకు మార్కెట్ ధరల ప్రకారం నష్ట పరిహారం ఇప్పించాలని వారు ఈ వినతి పత్రంలో తెలియచేసారు. వినతి పత్రం సమర్పించిన వారిలో మోడెం సుదర్శన్ గౌడ్, మోడెం  సర్వేశ్వర్ గౌడ్, మోడెం వెంకటేశ్వర గౌడ్, మోడెం తిరుపతి గౌడ్ తదితరులు ఉన్నారు. 

No comments:

Post a Comment