రెబ్బెన ఏప్రిల్ 30: ఆసిఫాబాద్ సబ్-కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గురువారం నాడు రెబ్బెన మండలం లోని రాజారం, కిస్టాపూర్, నారాయణపూర్ గ్రామాలలో తిరిగి పలు భూములను పరిశీలించినారు, కిస్టాపూర్ లో 16 ఎకరాలు, రాజారం లో 6 ఎకరాలు, నారాయణపూర్ లో 10 ఎకరాలు సుమారు మొత్తం 32 ఎకరాలు పట్టెధారుల భూములను పరిశీలించినారు, పట్టేధారులు ఇస్తాపడినట్లైతే వారికీ మార్కెట్ ధర చెల్లించి ఆ భూములను భూమి లేని దళిత కుటుంబాలకు 3 ఎకరాలు చొప్పున పంపిణి చేయనునట్లు తహసిల్దార్ జగదిశ్వరి తెలిపారు, ఈ సందర్భంగా సబ్-కలెక్టర్ వెంట రెబ్బెన తహసిల్దార్ జగదిశ్వరి మరియు పలువురు గ్రామస్తులు పాలుగోన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Thursday, 30 April 2015
భారీ ఈదురు గాలులు వలన నష్టపోయిన రైతులు
రెబ్బెన, ఏప్రిల్ 27 (వుదయం ప్రతినిధి):రెబ్బెన మండలంలో ఆదివారం రాత్రి భారీ ఈదురు గాలులతో
పాటువడగళ్ల వర్షం కురిసింది. భారీ ఈదురు గాలుల వలన మండల కేంద్రంలో ఇండ్లపై ఉన్న రేకులు గాలికి లేచిపోయి తీవ్రనష్టాన్ని కలిగించాయి. మండల కేంద్రంలోని వైన్ షాప్ ప్రక్కన గోడ కూలి షాప్ మీద పాడడం తో షాప్ లో పనిచేస్తునా ఒక వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి, అకాల వర్షం వల్ల మామిడి రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి. ఈదురుగాలుల వల్ల విద్యత్ స్తంబాలు నెలకొరగడంతో విద్యత్ అంతరాయం ఏర్పడి మండలంలోని గ్రామాలు ఆదివారం రాత్రాంత ప్రజలు అంధాకారంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
భారీ బహిరంగ సభకు తరలివేల్లిన తెరాస నాయకులూ
.
రెబ్బెన, ఏప్రిల్ 27 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలోని సోమవారం నాడు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు మండలం నుండి భారీ ఎత్తు నాయకులు తరిలారు. తరలిన వారిలోజడ్పీటీసీ బాబురావ్, ఎంపీపీ సంజీవ్‌కుమార్, రెబ్బెన సర్పంచ్ వెంకటమ్మ, పార్టీ ఇతర నాయకులూ రెబ్బెన గ్రామా పార్టీ అధ్యక్షుడు రాపర్తి, అశోక్,సత్తన్న, బొమ్మినేని సత్యనారాయణ, మోడెం చిరంజీవి గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ మదనయ్య కార్యకర్తలు తదితరులున్నారు.
ఎన్ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గా రెండవ సారి ఎన్నికైనా దుర్గం భరద్వాజ్
ఎన్ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గా రెండవ సారి ఎన్నికైనా దుర్గం భరద్వాజ్
రెబ్బెన,ఏప్రిల్23(వుదయం ప్రతినిధి):రెబ్బెన మండల కేంద్రానికి చెందినా దుర్గం భరద్వాజ్ కాంగ్రెస్ పార్టి అనుబంధ విద్యార్ధి విభగమైన ఎన్ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గా రెండవ సారి ఎన్నికయ్యారు కరీంనగర్ లోని కాంగ్రెస్స్ పార్టి కార్యాలయం లో ఈ నెల 13 న జరిగిన ఎన్ఎస్ యు ఐ ఎన్నికల్లో దుర్గం భరద్వాజ్ రెండవ సారి ఎన్నికయ్యారని రాష్ట్ర అద్య క్షుడు బాలమురి వెంకట్ ప్రకటించారు రెబ్బెన లో దుర్గం భరద్వాజ్ విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులు సమస్యల పరిష్కరం కోసం ముందుండి పోరాటాలు సాగిస్తామన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి దక్కటనికి కృషిచేసిన రాష్ట్ర అద్య క్షుడు బాలమురి వెంకట్ , మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు , ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి సంతోష్ , జిల్లా అద్య క్షుడు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు .
తెలుగుదేశం యువజన సంఘం కమిటి ఏర్పాటు
రెబ్బెన,ఏప్రిల్23(వుదయం ప్రతినిధి): తెలుగుదేశం యువజన సంఘం కమిటిని గురువారం ఏర్పాటు చేశారు. పట్టణ యూత్ అధ్యక్షులుగా భార్గవ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి శ్రావణ్, కార్యదర్శి సంతోష్, కోశాధికారి మెడ రాఖేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తాళ్లపెల్లి కార్తీక్, విహార కార్యదర్శి శ్రీకాంత్ లు ఎన్నికయ్యారు అని మోడం సుదర్శన్ గౌడ్ ప్రెస్ మీట్లో చెప్పారు.
రైతులకు నీటి వసతి కొరకై
రెబ్బెన : మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో రైతులకు నీటి వసతి కొరకై స్పింక్లర్ల పైపులు ఎంపీ డీవో అలీం శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు స్పింకర్లను ద్వారా మొక్కలకు, పంటలకు అవసరమయ్యే నీరు సక్రమంగా అందుతుందన్నారు. నీటి వృధాను అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్ కుమార్, జెడ్పీటీసీ బాబురావ్, రెబ్బెన సర్పంచ్ వెంకటమ్మ, సర్పంచ్ సుశీల, నాయకులు వెంకటేష్, చిరంజీవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు
రెబ్బెన : హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల కు మండలంలోని టీఆర్‌ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి , మండల అధ్యక్షుడు సంజీవ్‌కుమార్, జడ్పీటీసీ బాభూరావు, పార్టీ నాయకులు దుర్గం పోచయ్య, చిరంజివీ గౌడ్, మదనయ్య, శంకరమ్మ పాల్గొన్నారు.
రేషన్ షాపు కొరకు వినతి
రెబ్బెన,ఏప్రిల్23(వుదయం ప్రతినిధి): - మండల కేంద్రంలో గురువారం రోజున తహసిల్దార్ కార్యాలయంలో కైర్గాం ప్రజలు , ప్రతినిధులు కైర్గాం గ్రామ పంచాయతీలో ఉన్న రేషన్ షాపు తీసివేసి పక్క ఎడవేల్లిలో రేషన్ షాపు నిర్వహించడంతో కైర్గాం నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉండటంతో ప్రధాన రహదారి గుండా నడుస్తూ వెళ్లాలంటే ఇబ్బందులకు గురవుతున్నామని గతంలో కూడ సబ్‌కలెక్టర్‌కి వినతిపత్రం అందించామని సింగిల్ విండో డైరెక్టర్ మారం సంతోష్, వార్డు సభ్యులు గౌరక్క తహసిల్దార్ జగదీశ్వరికి విన్నవించారు. తహశీల్దార్ గారు మాట్లాడుతూ సమస్యకు పరిష్కారాన్ని అధికారులతో మాట్లాడుతానన్నారు. ఈ కార్యక్రమంలో బండి శకుంతల, పోషక్క, రాజన్న, సంతోష్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాలుగోన్నారు
ప్రాధమిక పాఠశాలలో నూతన భవన నిర్మాణాని భూమి పూజ
రెబ్బెన,ఏప్రిల్23(వుదయం ప్రతినిధి):రెబ్బెన మండలంలోని సబ్‌స్టేషన్ వద్ద ఉన్న ప్రాధమిక పాఠశాలలో నూతన భవన నిర్మాణానిక ఎంపీపీ సంజీవ్‌కుమార్ భూమి పూజ నిర్వహించారు. రూ. 6 లక్షల వ్యయంతో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాబురావ్, రెబ్బెన గ్రామసర్పంచ్, ఉపసర్పంచ్, పాఠశాల చెర్మన్, సింగిల్ విండో డైరెక్టర్, మాజీ ఎంపీపీ, ఏఈ, కాంట్రాక్టర్ వెంకట స్వామి,సంజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నూతన సైడ్ డ్రైన్ పనులు ప్రారంభోత్సవం
రెబ్బెన,ఏప్రిల్22(వుదయం ప్రతినిధి):రెబ్బెన - మండలంలోని వార్డ్ నెంబర్ 6 నూతన సైడ్ డ్రైన్ ను గ్రామసర్పంచ్ పెసరు వెంకటమ్మ చేతుల మీదుగా ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో వైస్ యం.పి.పి. రేణుక, ఉప సర్పంచ్ శ్రీధర్ కుమార్, వార్డ్ మెంబెర్లు చిరంజీవి గౌడ్, తిరుపతి, దుర్గం బరద్వాజ్ ఇతర నాయకులూ నవీన్ కుమార్ జైస్వాల్, తెదేపా నాయకులు సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన బోరు ప్రారంభోత్సవం
నిధుల దుర్వినియోగం పై సర్పంచ్ ను నిలదిసిన ప్రజలు
రెబ్బెన మండలం లోని నారాయణపుర్ గ్రామాపంచాయితికి వచ్చిన నిధుల దుర్వినియోగం గురించి నారాయణపూర్ ఉప సర్పంచ్ఎరువోతుల పద్మ సర్పంచ్ ను మరియు సెక్రటరి ని గ్రామా సభలో అడగగా, తన వద్ద ఎటువంటి లెక్కలు లేవని, గత సెక్రెటరి తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అని నిర్లక్ష్యంగా సమాదానం చెప్పారని ప్రజలు నిరసన తెలిపారు, దీనికి స్పందించి సెక్రెటరి మే 5న గ్రామా సభ పెట్టి నిధుల విషయం చెప్పుతానని హామీ ఇవ్వడంతో సభ్యలు, ప్రజలు నిరసన విరమించారు, గ్రామం లో గత 2 సంవత్సరాలనుండి ప్రజలకు త్రాగడానికి సురక్షిత మంచినీరు లేదు అని దీని పై జిల్లా స్థాయి అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.
టీఆర్‌ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షునిగా మూడవసారి ఎన్నిక
రెబ్బెన, ఏప్రిల్ 17 (వుదయం ప్రతినిధి): టీఆర్‌ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షునిగా మూడవసారి ఎన్నికైన పురాణం సతీష్‌ను శుక్రవారం రెబ్బెన లో టీఆర్‌ఎస్ నాయకులు , కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవలక్ష్మీ, మాట్లాడుతూ తూర్పు జిల్లా లో పురాణం సతీష్ గారి అద్వర్యంలో పార్టీ ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు, తూర్పు జిల్లా ఉప అధ్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్, పురాణం సతీష్‌ను పూలమాలతో సత్కరించారు, ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాబురావ్, ఎంపీపీ సంజీవ్‌కుమార్, రెబ్బెన సర్పంచ్ వెంకటమ్మ, పార్టీ ఇతర నాయకులూ రెబ్బెన గ్రామా పార్టీ అధ్యక్షుడు రాపర్తి అశోక్, బొమ్మినేని సత్యనారాయణ, మోడెం చిరంజీవి గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ మదనయ్య కార్యకర్తలు తదితరులున్నారు.
కొత్తగా నిర్మిస్తున్న బి.టి.రోడ్డు
రెబ్బెన, ఏప్రిల్ 17 (వుదయం ప్రతినిధి):రెబ్బెన మండలంలోని నంబాల గ్రామపంచాయితీలో కొత్తగా నిర్మిస్తున్న బిటి రోడ్డు పనులను శుక్రవారం వ్యవసాయ సహాయక మంత్రి, స్తానిక ఎమ్మెల్యే కోవలక్ష్మీ గారు శుక్రవారం రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీటీరోడ్డు 2.9 కి.మీ. నిర్మాణానికి రూ. 1.80కోట్ల మంజూరయ్యాయన్నారు. హనుమాన్ మందిరం నుంచి శివాలయం ముందుగా తక్కలపల్లి వరకు ఈ బీటీరోడ్డు నిర్మాణం చేపడుతారన్నారు. నంబాల గ్రామంలో మరిన్ని అభివృద్ది పనులుచేపడుతామని, మిషన్ కాకతీయ కింద ఏడు చెరువుల్లో పూడికతీత, గ్రామంలో సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో తూర్పుజిల్లా అధ్యక్షులు పురాణం సతీష్, టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ సుశీల, సత్తన్న, జడ్పీటీసీ బాబురావ్, ఎంపీపీ సంజీవ్‌కుమార్, పార్టీ ఇతర నాయకులూ పాల్గొన్నారు.
భర్త వేదింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
రెబ్బెన,ఏప్రిల్17(వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలం లోని గోలేటి గ్రామపంచాయతి లో భగత్ సింగ్ నగర్ లో భర్త వేదింపులు భరించలేక శుక్రవారం భార్య రామడుగుల సుశీల (29) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని రెబ్బెన ఎస్.ఐ. హనుక్ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం గోలేటి లోని భగత్ సింగ్ నగర్ కు చెందిన రామడుగుల లక్ష్మణ్ కు సుశీల తో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది, కొన్ని సంవత్సరాలు బాగానేవున్నా, లక్ష్మణ్ తాగుడుకు బానిసై బార్య ను వేదించసగెను, కొన్ని రోజులుగా ఈ వేదింపులు ఎక్కువ కావడం తో శుక్రవారం సుశీల ఇంట్లో ఎవరులేని సమయంలో,దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్టు ఎస్.ఐ.హనుక్ తెలిపారు.
మధ్యన భోజన పథకం కింద నూతన వంటశాల ప్రారంభం
రెబ్బెన,ఏప్రిల్21(వుదయం ప్రతినిధి):రెబ్బెన మండలంలోని గంగాపూర్ ప్రభుత్వ పాటశాల లో మధ్యన భోజన పథకం కింద నూతన వంటశాలను మంగళవారం రోజున రెబ్బెన యం.పి.పి. సంజీవ్ కుమార్, జెడ్.టి.సి. బాబురావు, గంగాపూర్ సర్పంచ్ రవీందర్ గార్లు ప్రారంబించారు ఈ కార్యక్రమంలోయం.ఇ .ఒ . మహేశ్వర్ రెడ్డి, హెచ్.ఎమ్. వసంత, నాయకులూ మదనయ్య, చిరంజీవి గౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు
నూతన బోరు ప్రారంభోత్సవం
Sunday, 19 April 2015
ఆస్తికోసం బాలుడుని హత్య చేసిన సవితి తల్లి
ఆస్తికోసం బాలుడుని హత్య చేసిన సవితి తల్లి
రెబ్బెన మండల కేంద్రంలో అబం శుభం తెలియని బాలుడును సవితి తల్లి గొంతు, ముక్కు ముసి హత్య చేసి ఘటన దుమారం లేపింది, రెబ్బెన లో నివాసం ఉంటున్న పిట్టల ప్రభాకర్ యొక్క మెదట కీర్తన తో వివాహం జరిగింది వీరికి జయసూర్య (6) జన్మిచాడు, అనరోగ్యాకారానంగా కీర్తన 5 సంవత్సరాల క్రితం చనిపోగా వేములపల్లి కి చెందిన సునీత ను ఆరు నేలల క్రితం రెండవ వివాహం చేసుకున్నాడు, కానీ సునీత తనకు పుట్టబోయే పిల్లకు ఆస్తి చెందకుండా అడ్డుపడుతాడు అని ఈ నెల 16న ఇంట్లో ఎవరులేని సమయంలో జయసూర్య ను హత్య చేసి, తనకు ఏమి తెలియనట్లు బాబు బాత్రుం లో కాలుజారి తలకు గాయం అయి చనిపోయినట్లు అందరిని నమ్మించింది, సునీత మాటలు నమ్మి బాబుకు అంతక్రియలు చేసారు, మరుసటి రోజునుండి సునీత ప్రవర్తనలో మార్పురావడం గమనించిన కుటుంబసభ్యులు అనుమానం తో అడగగా తనే జయసూర్యను గొంతు, ముక్కు ముసి ఉపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు ఒప్పుకుందని తాండూరు సి.ఐ. రమేష్ బాబు తెలిపారు, మృతుడి తండ్రి ప్రభాకర్ పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎ.ఎస్.ఐ.మీరాజొద్దిన్ తెలిపారు, బెల్లంపల్లి డి.ఎస్.పి. రమణారెడ్డి, రెబ్బెన మండల తహసిల్దార్ జగదిశ్వరి, తాండూరు సి.ఐ. రమేష్ బాబు సమక్ష్యంలో ఆదివారం బాలుడి మృతదేహంకు పోస్ట్-మార్టం నిర్వహించారు.
Thursday, 16 April 2015
బెల్లంపల్లి ఏరియా జనరల్ మానేజర్ గా రవి శంకర్
రెబ్బెన, ఏప్రిల్ 16 (వుదయం ప్రతినిధి): రెబ్బెన: సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియా జనరల్ మానేజర్ గా కె. రవి శంకర్ బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాకు నిర్దెశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాదించి, అందరి సహకారంతో సంస్థ అభివ్రుదికి తోడ్పడుతను అని తెలిపారు.
Wednesday, 15 April 2015
మధ్యహ్న భోజన పథకం నూతన వంటశాల
మధ్యహ్న భోజన పథకం నూతన వంటశాల
రెబ్బెన: ఏప్రిల్ 15 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలకేంద్రంలోయూ.పి.యస్. పాటశాల లో మధ్యహ్న
భోజన పథకం కింద నూతన వంటశాల ను ఈ రోజు రెబ్బెన సర్పంచ్ పెసరు వెంకటమ్మ ప్రారంబించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ వైస్ యం.పి.పి.గోదిసేలా రేణుక, చైర్మన్ బొంగు లక్ష్మి, సోమషేకర్ ,శ్రీనివాస్, మాజీ యం.పి.టి.సి. బొంగు నర్సింగరావు,వెంకటేశ్వర్ గౌడ్,దీకొండ సంజీవ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.
సంచలనం రేపిన యువతి దారుణ హత్య
సంచలనం రేపిన యువతి దారుణ హత్య ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
రెబ్బెన మండలం లోని పాసిగాం గ్రామానికి చెందిన వసాక శ్యామల (18) ఊరి చివర ఆటవీప్రాంతంలో దారుణ హత్యకు గురైయిందని తాండూర్ సి.ఐ రమేష్ బాబు సోమవారం తెలిపారు. పాసిగామకు చెందిన శ్యామల గత నెల 28న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళింది, తిరిగి ఇంటికి రాకపోయేసరికి ఆమె తండ్రి విజ్జు మేర ఇరుగు పొరుగు ఇళ్ళలో ఆరాతీసిన తన జాడ తెలియకపోయేసరికి 31 న కుటుoబ సభ్యులు రెబ్బెన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు. సోమవారం పాసిగంకి రెండు కిలోమీటర్ల దూరంలోగల సుద్ద క్వారీ గుంతల సమీపంలో మేకల కాపర్లు దుర్వాసనని గమనించి స్థానిక సర్పంచ్ కి సమాచారమిచ్చారు. సర్పంచ్ గ్రామస్థులతో చూడగా యువతి మృతదేహం కనిపించింది. మృతదేహం ఫై ఉన్న దుస్తులతో విజ్జుమేర తన కూతురుదేనని గుర్తించారు. వెంటనే సర్పంచ్ పోలీసులకు సమాచారమందిచారు. దీంతో బెల్లంపల్లి డి ఎస్ ఫై రమణా రెడ్డి, తాండూర్ సి ఐ రమేష్ బాబు, రెబ్బెన ఎస్ ఐ హనోక్ సంఘటనా స్థలికి చేరుకొని యువతి తండ్రిని,స్థానికులను అడిగి తెలుసుకున్నారు. శ్యామలను ఓణి తో ఉరేసి చంపి ముఖం ఏర్పడకుండా పెద్ద రాయితో కొట్టి ఉంటారనే ఆనవాళ్ళు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని డాగ్ స్క్వాడ్ బృందం, క్లూస్ టీంలు వచ్చాయి. కేసు దర్యాప్తు చేస్తునాట్లు తాండూర్ సి ఐ రమేష్ బాబు తెలిపారు .
ఘనంగా డా. బి. ఆర్. అంబేడ్కర్ 124వ జయంతి వేడుకలు
ఘనంగా డా. బి. ఆర్. అంబేడ్కర్ 124వ జయంతి వేడుకలు
కేంద్రంలోని తహసీల్ధార్ కార్యాలయంలో మంగళవారం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.
అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తహసీల్ధార్ జగదీశ్వరి ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
నారాయణపూర్ యువజన సంఘం అధ్వర్యంలో ఘనంగా ర్యాలీ
రెబ్బెన గ్రామ పంచాయితీడా. బిఆర్ అంబేడ్కర్ 124వ జయంతి వేడుక
రెబ్బెన గ్రామ పంచాయితీలో జరిగిన కార్యక్రమంలో రెబ్బెన గ్రామ సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, బొంగు శ్రీనివాస్, శ్రీధర్, శంకర్, శారద, తిరుపతమ్మమరియు గ్రామస్తులు పాల్గొన్నారు.నారాయణపూర్ యువజన సంఘం అధ్వర్యంలో ఘనంగా ర్యాలీ
డా. బిఆర్ అంబేడ్కర్ 124వ జయంతి వేడుకల సందర్భంగా నారాయణపూర్ యువజన సంఘం సభ్యులు నారాయణపూర్ నుండి రెబ్బెన మండల కేంద్రం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసారు. ఈ కార్యక్రమంలో నారాయణపూర్ యువజన సంఘం అద్యక్షులు దుర్గం మొండయ్య,రెబ్బెన మాజీ సర్పంచ్ దుర్గం హన్మంతు,దుర్గం లింగయ్య, పెరుగు తిరుపతి, శివ, రాజేశ్వర్, రవి, వెంకటేష్, మల్లేష్,సాయి కుమార్, సతీష్, మహేందర్,రామ్ చందర్,లక్ష్మన్,జడి శంకర్,జడి నారాయణ,మల్లక్క, శాలక్క, ప్రశాంత్, తుకారం, శ్యాం రావు, బాల కృష్ణ, మరియు సంఘం సభ్యులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అభయహస్తం పించన్ల పంపిణి
అభయహస్తం పించన్ల పంపిణి
రెబ్బెన మండలంలోని అభయహస్తం పించన్ల 17 మందికి రెబ్బెన జి పి కార్యాలయంలోని యం పి పి సంజీవ్ కుమార్ జెడ్ పి టి సి అజ్మీర బాబురావు సర్పంచ్ పెసరు వెంకటమ్మ ఆధ్వర్యంలో నెలకు 500/- చొప్పున మొత్తం 3000/- రూ 17 మందికి అభయహస్తం పించన్ల పంపిణి చేసారు ఈ కార్యక్రమంలో యం.పి.డి.ఓ. యం. ఏ. హలీమ్ వైస్ యం.పి. పి. గోడిసేలా రేణుక ఉప సర్పంచ్ శ్రీధర్ ఏ.పి.యం. రాజ్ కుమార్ సింగిల్ విండో డైరెక్టర్ మదునయ్య సెక్రటరీ రవి లు పాల్గొన్నారు.
మాదిగల నిరసన పోరు పోస్టర్ ఆవిష్కరణ
మాదిగల నిరసన పోరు పోస్టర్ ఆవిష్కరణ
రెబ్బెన : ఏప్రిల్ 12 (వుదయం ప్రతినిధి) రెబ్బన మండలంలోని మాదిగల నిరసన పోరు ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 14 వరకు జరుగు నిరసన ప్రదర్శన - ధర్నాలు-రాస్తారోకోలు సంభందించిన పోస్టర్ను యం అర్ పి స్ మండల అద్యక్షుడు బొంగు నరసింగ రావు, మండల కార్యదర్శి నర్సింహులు, మండల అధికార ప్రతినిధి గోగార్ల రాజేష్, గ్రామా అధ్యక్షులు రొడ్డ శంకర్ వారి పోస్టర్ ను ఆవిష్కరించారు.
దళితున్ని ముఖ్యమంత్రి చేయాలి, మాదిగలకు, మాలలకు మంత్రి వర్గంలో ప్రాతినిద్యం కల్పించాలి, దళితుల సంక్షేమాన్ని చూసే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి
దళితులకు భూ పంపిణి చేయాలి, అంబేద్కార్,జగ్జీవన్ రామ్ ల జయంతి ఉత్సవాల కమిటి చైర్మన్ గా దళితున్ని నియమించాలి డిమాండ్ చేశారు. కార్యక్రమం లో యం అర్ పి స్ కార్యకర్తలు పి . వినెయ్, పి ఆయిలు, జి నగేష్, రమేష్ , గణేష, తుఖరం రాజిఖ సంఘ అద్యక్షుడు శంకర్, తే ధ పా నాయకులూ మోడం రాజ గౌడ్ నాగరాజు నాయాకులు మద్దత్తు తెలిపారు
నంబల శివాలాయం లో హైకోర్ట్ న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు
నంబల శివాలాయం లో హైకోర్ట్ న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు
రెబ్బెన: ఏప్రిల్ 11 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల నంబల గ్రామం లోని ప్రసన్న పరమేశ్వర శివాలయంను శనివారం రోజు హైకోర్ట్ న్యాయమూర్తులు జస్టిస్ జి. చంద్రయ్య , జస్టిస్ ఎమ్. సీతారామ మూర్తి, జిల్లాన్యాయమూర్తి జస్టిస్ గ్రంది గోపాలకృష్ణ మూర్తి గార్లు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆస్సిసులు అందుకొన్నారు . ఈ సందర్భంగా ఆలయ కమిటి సభ్యులు నంబల గ్రామా సర్పంచ్ శ్రీమతి జి.సుశీల పూలమాల తో వారికి ఘన స్వాగతం పలికారు, దేవాలయ అభివృద్ధి కొరకు ఒక వినతి పత్రం అందజేసారు, ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ సబ్-కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, బెల్లంపల్లి డి.ఎస్.పి. రమణా రెడ్డి రెబ్బెన సబ్ ఇనస్పెక్టర్ హనుక్ మరియు మండల నాయకులూ మోడెమ్ సుదర్శన్ గౌడ్, బొమ్మినేని శ్రీధర్ కుమార్, కొవ్వూరి శ్రీనివాస్ ,పాలుగోన్నారు
ట్రాక్టర్ బోల్తాపడి ఒకరి మృతి
రెబ్బెన: ఏప్రిల్ 11 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లోని జూనియర్ కళాశాల దగ్గర శనివారం ఉదయం ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఇటుక బట్టిలో పని చేస్తున కూలి బట్టి మహేందర్ (30) పెగడపల్లి వాసి అక్కడిక్కడే మృతి చెందాడు మరియు ట్రాక్టర్ డ్రైవర్ రాజు కు తీవ్రగాయాలు అయ్యాయి, ట్రాక్టర్ డ్రైవర్ ఎదురుగా వస్తున్నా లారీని తప్పియ్య బోయి అనుకోకుండా ట్రాలీ లిఫ్ట్ జాక్ పైకి లేవడం తో ప్రమాదం జరిగినట్టు రెబ్బెన ఎస్.ఐ. హనుక్ తెలిపారు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్.ఐ. హనుక్ తెలిపారు.
మహాత్మా జ్యోతి రావు పులే 189వ జయంతి
రెబ్బెన: ఏప్రిల్ 11 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లో ని మండల పరిషద్ కార్యాలయములో మహాత్మా జ్యోతి రావు పులే 189వ జయంతి ని ఘనంగా జరిపారు, ఈ కార్యక్రమం లో జెడ్.పి.టి.సి. బాబురావు ఎమ్.పి.పి. సంజీవ్ కుమార్ సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఎమ్.పి.టి.సి.లు గోడిసేలా రేణుక, కొవ్వూరి శ్రీనివాస్, వనజ మరియు ఇతర నాయకులూ మదనయ్య, చిరంజీవి పాలుగోన్నారు.
రాష్ట్ర మేదరి మహాసభలను గోడా పత్రిక విడుదల
రాష్ట్ర మేదరి మహాసభలను గోడా పత్రిక విడుదల
రెబ్బెన : ఏప్రిల్ 9 (వుదయం ప్రతినిధి) తెలంగాణా రాష్ట్ర మేదరి సంఘం రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా నిర్వహిస్తున మహాసభ కు సంబదించిన గోడా పత్రిక ను రెబ్బెన మండలం లోని మేదరి కుల సంఘం నాయకులూ గురువారం రోజు విడుదల చేసారు, ఈ నెల 19వ తేది ఆదివారం నాడు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగు భారీ మహాసభను విజయవంతం చేయాలనీ, మరియు అనేక సవత్సరముల నుండి గత ప్రభుత్వాలకు తమ సమస్యలను విన్నవించుకొవడమైనదని, కానీ స్వల్ప సంఖ్యాకులమైన తమని ఏ ప్రభుత్వము కూడా గుర్తించలేదు తమ డిమాండ్ల పరిష్కారానికి ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్టు మండల మేదరి కుల సంఘం అధ్యక్షుడు అలిపిరెడ్డి రాజమల్లు చెప్పారు, వారితో పాటు రాజ కనకయ్య, సత్తయ్య, శ్రీనివాస్, తిరుపతి, లక్ష్మినరయన, చంద్రమోహన్ మరియు తదితర నాయకులూ ఈ కార్యక్రమం లో పాలుగోన్నారు,
తెలంగాణా అమరావీరునునికి ఘానా నివాళి
తెలంగాణా అమరావీరునునికి ఘానా నివాళి
రెబ్బెన మండల కేంద్రం లోని తల్లపెల్లి వేణుకుమార్ గౌడ్ తెలంగాణా కోసం ఆత్మ బలిదానం చేసుకొని మూడు సంవత్సరాలు గడిచిన సందర్బంగా, ఆ అమరావీరుని 3వ వర్ధంతిని రెబ్బెన తెలంగాణా ఐ.కా.స. సంఘం వారు గణంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులకు పండ్లూ పంపిణి చేశారు, పాలువురు నాయకులూ వేణుకుమార్ గౌడ్ తెలంగాణా కోసం ప్రాణ త్యాగం చేసుకోవడాన్ని గుర్తుచేసుకొని కంట తడిపెట్టుకున్నారు, ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల తహసిల్దార్ జగదీశ్వరి, రెబ్బెన మండల అధ్యకుడు సంజీవ్ కుమార్, రెబ్బెన సర్పంచ్ వెంకటమ్మ, ఉప-సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్, తె.రా.స. నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ జైస్వాల్ కుమార్, వెంకటేశ్వర్ గౌడ్, చిరంజీవి గౌడ్, శంకరమ్మ,వేకన్నగౌడ్, తే.ద.పా. నాయకులూ మోడెమ్ సుదర్శన్ గౌడ్, రాజగౌడ్ , నరసింగరావు, కాంగ్రెస్ నాయకుడు దుర్గం హన్మంతు మరియు వేణు కుమార్ గౌడ్ తండ్రి ప్రభాకర్ గౌడ్ పాలుగోన్నారు.
మిషన్ కాకతీయ లో ఎల్లమ్మ చెరువు ముంపు భాదితుల ఆవేదన
మిషన్ కాకతీయ లో ఎల్లమ్మ చెరువు ముంపు భాదితుల ఆవేదన
రెబ్బెన : ఏప్రిల్ 7 (వుదయం ప్రతినిధి) మిషన్ కాకతీయ లో భాగంగా రెబ్బెన మండలంలోని ఎల్లమ్మ చెరువు పునరుద్ధరణ కార్యక్రమం వలన ముంపునకు దాదాపు 15 కుటుంబాల చిన్నకారు రైతులు తమ పట్టా భూములను కోల్పోతున్నారు. ఈ కుటుంబాలకు వ్యవసాయమే ప్రధానధారం. ఈ రోజు ఈ రైతు కుటుంబాల వారందరూ తమ భాదను రెబ్బెన మండల తహసిల్దారుకి వినతి పత్రం రూపంలో సమర్పించారు. తమకు ఈ భూమే జీవనాధారమని రెబ్బెన లో భూముల ధరలు చాల ఎక్కువ ఉన్నాయని అందువల్ల తమకు మార్కెట్ ధరల ప్రకారం నష్ట పరిహారం ఇప్పించాలని వారు ఈ వినతి పత్రంలో తెలియచేసారు. వినతి పత్రం సమర్పించిన వారిలో మోడెం సుదర్శన్ గౌడ్, మోడెం సర్వేశ్వర్ గౌడ్, మోడెం వెంకటేశ్వర గౌడ్, మోడెం తిరుపతి గౌడ్ తదితరులు ఉన్నారు.
ఉపాదీ హామీ చట్ట రక్షణకోసం జీపు యాత్ర
ఉపాదీ హామీ చట్ట రక్షణకోసం జీపు యాత్ర
రెబ్బెన : ఏప్రిల్ 5 (వుదయం ప్రతినిధి): ఉపాధి హామీ పతకాన్ని పకడ్బందిగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాత ఆదివారం రెబ్బెన కు చేరుకుంది స్థానిక రెబ్బెన ఆర్&బి భవనం వద్ద వ్యవసాయ శాక జిల్లా కార్యదర్శి ఎస్. సత్యనారాయణ ఉపన్యాసం ఇచ్చారు ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు పని దినాలు 200 రోజులకు ప్రతి రోజు రూ. 300 ఇవ్వాలని, ఉపాధి మెట్లకు పారితోషికం రూ . 6 ఇవ్వాలి ఉపాధి సిబ్బందికి వేతనాలు పెంచాలి ఉద్యోగ భద్రత కల్పించాలి పోడు భూములకు పట్టలివ్వాలి ఈ భూముల అభివృద్ధి ఉపాధి నిధులు కేటాయించాలి ఉపాధిలో అవినీతి చర్యలు అరికట్టాలి ఉపాధి చట్టాన్ని బలహీనపరిచే కేంద్ర బి.జే.పి.ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాలి ఉపాధి కొందరికే కాదు అందరికి ఇవ్వాలి. అని డిమాండ్ చేసారు ఈ యాత్ర ఏప్రిల్ 4 నుంచి 11 వరకు కొనసాగుతుంది ఈ నెల 11 న హైదరాబాద్ లో భారి ధర్నా కొనసాగుతుంది.అని వ్యవసాయ శాక జిల్లా కార్యదర్శి ఎస్. సత్యనారాయణ తెలిపారు.ఆయనతో పాటు ఆసిఫాబాద్ డివిసన్ కార్యదర్శి బి.ప్రకాష్,వినోద్,ప్రణయి,తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బాబు జగజ్జీవన్ జయంతి
ఘనంగా బాబు జగజ్జీవన్ జయంతి
2, తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.
ఘనంగా బాబు జగజ్జీవన్ జయంతి
మాజి ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 108 వ జయంతి నీ పునస్కరించుకుని ఆదివారం రోజు యం.పి.డి.ఓ మరియు తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు అవి పేదరిక దళిత కుటుంబాలలో పుట్టి భారత ఉప ప్రధాని స్థాయి వరకు ఎదిగి దళితులకు ఎన్నో సేవలు అందించిన ఆయన చిరస్మరనియుడు కొనియాడారు ముందుగా యం.పి. డి. ఓ. కార్యాలయంలో యం.పి.పి. సంజీవ్ కుమార్ బాబు జగజ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జగదీశ్వరి, యం.పి.డి.ఓ. యం ఏ హలీమ్, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, ఉప సర్పంచ్ శ్రీధర్, సింగిల్ విండో డైరెక్టర్ మదునయ్య, ఏ.పి.యం. రాజకుమార్, సయ్యద్ జాకీర్, టీ.డి.పి. మండల అధ్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్, టి.అర్.ఏస్,తూర్పు జిల్లా అధ్యక్షుడు నవీన్ జైస్వాల్, మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, వెంకటేశ్వర్ గౌడ్, యం.ఆర్.పి.యస్. మండల అధ్యక్షుడు బొంగు నర్సింగరావు,వెంకటరాజం, ఏ. ఐ. స్.ఫ్ డివిజన్ ప్రెసిడెంట్ గోగార్ల రాజేష్ , దుర్గందేవాజి, చిరంజీవి, పట్టణ అధ్యక్షుడు రాపర్తి అశోక్, సాక్షర భారత్ మండల కో ఆర్డినేటర్ సాయి బాబా లతో పాటు పలువురు పాల్గొన్నారు
హనుమాన్ జయంతి సందర్బంగా స్వీట్స్ పండ్ల పంపిణి
హనుమాన్ జయంతి సందర్బంగా స్వీట్స్ పండ్ల పంపిణి
రెబ్బెన : ఏప్రిల్ 4 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లోగంగాపూర్ యందు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం లో బాలికలకి స్వీట్లు పండ్లు పంపిణి హనుమాన్ జయంతి స్సందర్బంగా గంగాపూర్ యందు స్వీట్లు పండ్లు పంపిణి చేయడం జరిగింది హనుమాన్ యూత్ అద్వర్యం లో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తహసిల్దార్ జగదీశ్వర ఎమ్.పి.డి. ఓ. ఎమ్.ఎ. హలీమ యం.ఇ.ఒ మహేశ్వర్ రెడ్డి ,మోడెమ్ సుదర్శన్ గౌడ్, జాకీర్ ఉస్మని, తోట రమేష్, ఏ. ఐ. స్.ఫ్ డివిజన్ ప్రెసిడెంట్ గోగార్ల రాజేష్ , ప్రిన్సిపాల్ సుమలత విద్యర్దినిలు పాల్గొన్నారు
9959713971 శివ కుమార్
రెబ్బెన : ఏప్రిల్ 4 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లోగంగాపూర్ యందు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం లో బాలికలకి స్వీట్లు పండ్లు పంపిణి హనుమాన్ జయంతి స్సందర్బంగా గంగాపూర్ యందు స్వీట్లు పండ్లు పంపిణి చేయడం జరిగింది హనుమాన్ యూత్ అద్వర్యం లో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తహసిల్దార్ జగదీశ్వర ఎమ్.పి.డి. ఓ. ఎమ్.ఎ. హలీమ యం.ఇ.ఒ మహేశ్వర్ రెడ్డి ,మోడెమ్ సుదర్శన్ గౌడ్, జాకీర్ ఉస్మని, తోట రమేష్, ఏ. ఐ. స్.ఫ్ డివిజన్ ప్రెసిడెంట్ గోగార్ల రాజేష్ , ప్రిన్సిపాల్ సుమలత విద్యర్దినిలు పాల్గొన్నారు
9959713971 శివ కుమార్
Subscribe to:
Posts (Atom)