Wednesday, 11 December 2019

దేశ వ్యాపిత సమ్మెను విజయవంతం చేయాలి ; బోగే ఉపేందర్

రెబ్బన ;  దేశవ్యాప్త సమ్మె కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి  బోగే ఉపేందర్  పిలుపునిచ్చారు. రెబ్బన  మండలం లోని ఆర్.& బి గెస్ట్ హౌస్ లో  ఏఐటీయూసీ మండల కమిటీ సమావేశని మండల  అధ్యక్షుడు ఎం.శేషశయన రావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి  బోగే ఉపేందర్ మాట్లాడుతూ 2020 జనవరి 8వ తేదీన జరిగే ,కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను కార్పొరేట్లకు, యాజమాన్యాలకు అనుకూలంగా తయారు చేసిందని అన్నారు, దీనివలన కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు అలాగే కనీస వేతనం 21 వెయ్యి రూపాయలు ఇవ్వాలని,కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని,గ్రామ పంచాయతీ కార్మికులకు 8500 వేతనాలు ఇవ్వాలని డిమండ్ చేశారు,కార్మిక చట్టాల సవరణ ఆపాలని, స్కీమ్ వర్కర్ల అందర్నీ ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని డిమాండ్ చేశారు.అందరికి ఉపాధి కల్పించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 200రోజులు పెంచాలని,నిధులు  పెంచి వేతనాలు ఇవ్వాలని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ధరలను, దేశంలో పని చేస్తున్న అసంఘటిత కార్మికుల అందరికీ సమగ్ర సంక్షేమ చట్టం వర్తింపజేయాలని అలాగే కనీస పెన్షన్ పది వేల రూపాయల  ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాడి గణేష్ ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు ఎం.శేషశయన రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్,మండల కార్యదర్శి దుర్గం వెంకటేష్,ఉపాధ్యక్షుడు ప్రకాష్,సహాయ కార్యదర్శి అనుముల రమేష్,ప్రచార కార్యదర్శి శంకర్,కోశాధికారి ఆర్.దేవాజీ తో పాటు తదితరులు పాల్గొన్నారు. 

Monday, 9 December 2019

అంత్యోదయ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి

 రెబ్బెన ; రెబ్బెన మండలంలోని అంత్యోదయ కార్డులు లేని వికలాంగులు కార్డు కోసం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు కోవాలని తహశీల్దార్ రియాజ్ అలీ తెలిపారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న వికలాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  వికలాంగ ద్రువీకరణ పత్రం తెల్లరేషన్ కార్డు జిరాక్స్ పత్రాలతో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తును అందజేయాలన్నారు. 

కోమరవేల్లి లొ మెడికల్ క్యాంప్


రెబ్బెన : మండలంలోని  కోమరవేల్లి గ్రామ పంచాయతీ లో సర్పంచ్ మామిడి తిరుమల్ అద్వర్యం లో సోమవారం  మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మామిడి తిరుమల్  మాట్లాడుతూ  ప్రజలు అనారోగ్యంతో బాధపడటం చూసి మెడికల్ క్యాంప్ పెట్టాలలని జడ్పీటీసీ వేముర్ల సంతోష్ ని కోరగా  స్పందించిన    జడ్పీటిసి డాక్టర్ల  డాక్టర్ రాకేష్ బృందంతో ఏర్పాటు చేశారని అన్నారు.   మలేరియా,   టఫైడ్ చికెన్ గుణ్య  గుర్తించి మందులు పంపిణీ చేశారని తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో   hs ప్రవీణ్ కుమార్ గారు మెడికల్ సిబ్బంది మరియు 104 సిబ్బంది మరియు ఆశ వర్కర్ సునీత మరియు వర్డ్ సభ్యులు  పాల్గొన్నారు

డిఎంఎఫ్ టి నిధులతో సిసి రోడ్లు ఏర్పాటు

రెబ్బెన ; రెబ్బెన మండలంలోని  గోలేటి గ్రామపంచాయతీ  దేవులగూడా గ్రామంలో సోమవారం  డిఎంఎఫ్ టి   నిధుల నుండి 10లక్షల సీసీ రోడ్డు కు సర్పంచ్ పోటు సుమలత శ్రీధర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు వెంకట్రావు, గ్రామస్తులు కిరణ్ సింగ్,స్వర్ణ,దాసన బాయ్,నర్సాగౌడ్ పాల్గొన్నారు

సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

రెబ్బెన : మండల కేంద్రంలో  ప్రభుత్వ  హాస్పిటల్ లో  సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రదాత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియమ్మ  జన్మదిన వేడుకలు  ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి,గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఎంపీటీసీ సభ్యులు పెసరి మధునయ్య,కాంగ్రెస్ మండల ప్రధానకార్యదర్శి దుర్గం దేవాజీ,నాయకుడు పస్తం పొశం,యూత్ కాంగ్రెస్ నాయకులు మసాడి జగన్ ,మహిళ నాయకురాలు పద్మ తదితరులు పాల్గోన్నారు.

30 రోజుల ప్రణాళికతో గ్రామాల అభివృద్ధి


రెబ్బెన : తెలంగాణ ప్రభుత్వం  చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాలు అభివృద్ధి జరుగుతున్నాయని రెబ్బెన  మండల ఎంపీపీ సౌందర్య ఆనంద్ అన్నారు. సోమవారం మండలంలోని తుంగెడ లో గ్రామ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 30 రోజుల ప్రణాళిక లో భాగంగా పల్లెలు పరిశుభ్రంగా ఉన్నాయిాని, స్మశానవాటిక మరియు డంపింగ్ యార్డ్ త్వరగా పూర్తి చేయాలని,మరియు పలు అభివృద్ధి పనులకు  తీర్మానించారు. ఈ కార్యక్రమంలో    సర్పంచ్ పెంటయ్య,sec వంశీకృష్ణ, వార్డ్ నంబర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు,

చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

రెబ్బెన : చలో ఢిల్లీ మాదిగ లొల్లి  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ సంఘ రాష్ట్ర కార్యదర్శి శనిగారపు మల్లేష్ అన్నారు. సోమవారం మండలంలోని  అతిథి గృహ ఆవరణలో సంబంధిత కర పత్రాలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ తో ఈ నెల పన్నెండు పదమూడు తేదీలలో చలో ఢిల్లీ మాదిగల లొల్లి జంతర్మంతర్ వద్ద జరిగే  కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధికార ప్రతినిధి ఇప్ప భీమయ్య మాదిగ జిల్లా కో ఆర్డర్ బొమ్మన శ్రీనివాస్ మాదిగ మన లైన్ చార్జ్ ఆత్మకూరి సతీష్మాదిగ తదితర నాయకులు పాల్గొన్నారు.

ప్రజాక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రెబ్బెన :   తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే  ప్రభుత్వ ధ్యేయమని గోలేటి సర్పంచ్ పొటు సుమలత శ్రీధర్ రెడ్డి  అన్నారు. సోమవారం రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీలో    సీఎం రిలీఫ్ ఫండ్   15000  చెక్ ను నంచర్ల ఉమ కు అందజేసరు.   అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ముందుంటుందని పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు చేయూత నుంచి ఆసరాగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  అజ్మేర బాబురావు, పోటు శ్రీధర్ రెడ్డి, కరొబార్ సుధాకర్ పాల్గొన్నారు.


Thursday, 31 October 2019

వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి


 రెబ్బెన ; భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని పీ ఆరె టి యూ  రాష్ట్ర కార్యదర్శి దొడ్డిపట్ల రవికుమార్ అన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా గురువారం  రెబ్బెన మండలం నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో  144 వ   జన్మదినోత్సవాన్ని   ఘనంగా   నిర్వహించారు. ఈ కార్యక్రమాలో  దొడ్డిపట్ల రవికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే శంకర్ మాట్లాడతు  జాతీయ నాయకుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు మంచి క్రమశిక్షణ తో ఉన్నతంగా ఎదగాలని కోరారు.  ఈ కార్యక్రమం లొ   పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పోషం మల్లునాయుడు దేవరకొండ రమేష్ తదితరులు  పాల్గొన్నారు.

ఏఐటీయూసీ తోనే హక్కులు సాధ్యం : బోగే ఉపేందర్


రెబ్బెన  : కార్మిక హక్కులు ఎర్ర జెండా ఏఐటీయూసీ తోనే సాధ్యమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు,ఏఐటీయూసీ ఆవిర్భవించి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెబ్బన మండలంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటీయూసీ జెండాను గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు రమేష్ ఆవిష్కరించారు అనంతపురం ఏఐటీయూసీ  జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ  కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అసంఘటిత కార్మిక వర్గంలో ఉన్న వారందరికీ కనీస వేతనం 18000 ఇవ్వాలని డిమాండ్, అలాగే కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ  ఈ.ఎస్.ఐ,పి.ఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు, రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి  వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వెంకటేష్, మార్కెట్ హమాలీ సంఘం మండల అధ్యక్షుడు అరికిల్ల వెంకటేష్, కార్యదర్శి స్వామి,నాయకులు శంకర్,వసంత్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి

రెబ్బెన : వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని  ఎంపిపి జుమ్ముడి సౌందర్య ఆనంద్,  zptc  వేముర్ల  సంతోష్ లు అన్నారు.  గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి   144వ జయంతి ఉత్సవాలను  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ సీనియర్ స్టెంట్ వేణు , కాప్షన్ సభ్యులు జహురుద్దిన్ ఏపీవో కల్పనా, మదునయ్య, రవీందర్, ఆనంద్, ఫాదర్లు పాల్గొన్నారు

Friday, 5 April 2019

నేటి యువత డాక్టర్ బాబు జగ్జిమం రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

రెబ్బెన ; నేటి యువత డాక్టర్ బాబు జగ్జిమం రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని  పి ఆర్ టి యు టి ఎస్ కొమురం భీం జిల్లా అధ్యక్షులు ఏటుకూరి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం  రెబ్బెన మండలం   నక్కల గూడా ప్రాథమిక పాఠశాలలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి 112వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్  పటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి మిఠాయిలను  పంచిపెట్టారు. అనంతరం    విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక దళిత కుటుంబంలో పుట్టి తన సేవలతో పోరాటాలతో దళితుల అభివృద్ధికి  పాటుపడడం తో పాటు భారత దేశ ఉప ప్రధానిగా పనిచేసిన గొప్పవారని పొగిడారు.  పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు  తోట వినోద్ కుమార్  మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఒక దళిత నాయకుడే కాక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవానికి నాంది పలికారని,  రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు 1971 వ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో పాకిస్తాను ఓడించారని తెలియజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్  మాట్లాడుతూ బాబు  జగ్జీవన్ రామ్  గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయమని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు  తోట వినోద్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఖాదర్, సదానందం, జిల్లా కార్యదర్శి తిరుపతయ్య మండల ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, సోమశేఖర్, శ్రీధర్, రవి, లింగయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. 

Monday, 11 March 2019

బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలి


రెబ్బెన :   బిజెపి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం సాయంత్రం 4. గంటలకు గోలేటి సెయింట్ ఆగ్నెస్ స్కూల్  నిర్వహించబడునని సోమవారం ఓ ప్రకటనలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ తెలిపారు.    ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ జిల్లా ఇన్చార్జి చాడా శ్రీనివాసరెడ్డి హాజరవుతారు ఈ సమావేశానికి జిల్లా పది అధికారులు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరు హాజరు కాగలరలని కోరారు.

నూతన పట్టాధార్ పాస్ పుస్తకాలను అందించాలని జిల్లా పాలానాధికారికి రైతుల వినతి.

రెబ్బెన :  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సమగ్ర సర్వే తర్వాత కొత్త పట్టాధార్  పాస్ పుస్తకాలు చాల మంది రైతులకు అందలేదని రెబ్బన మండలంలోని గంగాపూర్ గ్రామా రైతులు సోమవారం జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హన్మంతుకు వినతి పత్రం అందజేశారు.  అనంతరం రైతులు మాట్లాడుతూ పట్టా పుస్తకాలు అందక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన రైతు బంధు, ప్రధాన మంత్రి కిసాన్ నిధి పథకాలు కోల్పోయామని అన్నారు. కొత్త పాస్ పుస్తకాలను రైతులకు అందజేసి ప్రభుత్వాల నుండి వచ్చే పెట్టుబడి పథకాలను అందించాలని రైతులు కోరారు. నిత్యం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి కాలయాపన జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు వొలువోజు వెంకటేశం, శ్యామ్రావు, గందె సంతోష్, లావుడ్య బిక్కు, కిషన్, రమేష్, లక్ష్మిభాయ్,తార భాయ్, రైతులు  తదితరులు పాల్గొన్నారు.     

పాతూరి సుధాకర్ రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించాలి

రెబ్బెన : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ  ఎన్నికల్లో పాతూరి సుధాకర్ రెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఒప్పంద అధ్యాపకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాయిని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రెబ్బెన మండల కేంద్రంలోని  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించడంలో పాతూరి సుధాకరరెడ్డి పాత్ర మరువలేనిది అని అన్నారు. అధ్యాపకుల వేతనాలు పెరగడంతో పాటు, 12 నెలలు వేతనం రావడం లాంటి అనేక సమస్యలు పరిష్కరించబడినవి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జెడి సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఒప్పంద అధ్యాపకులు ప్రవీణ్, రామారావు, వెంకటేశ్వర్, ప్రకాష్, మహేష్, అమరేందర్, మంజుల, పద్మ, ఝాన్సీ తదితరులు  పాల్గొన్నారు.

Wednesday, 6 March 2019

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఉన్నత శ్రేణులకు ఎదగాలి ; జిల్లా ఎస్పీ మల్లారెడ్డి



 

రెబ్బెన ;   విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని మహనీయుల జీవిత చరిత్రలు చదివి ఉన్నత శ్రేణులకు ఎదగాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి అన్నారు.  బుధవారం రెబ్బెన మండలంలోని రెబ్బెన ఆర్ట్ & సైన్స్  కళాశాలలోబుధవారం  ఏర్పాటు చేసిన ఎనిమిదవ  వార్సకోశావ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు డిగ్రీ కళాశాలకు వచ్చాక ఒక గోల్ ఏర్పాటు చేసుకుని ఆసక్తి గల రంగాల్లో రాణించాలన్నారు.  విద్యార్థులు యువకులు చెడు వ్యసనాలు పట్టకుండా సెల్ఫోన్లతో కాలయాపన చేయకుండా విద్యపై ఆసక్తి చూపించి పై రంగాల్లో రాణించాలన్నారు విద్యార్థులు కళాశాలలో పాఠాలు చెప్పేటప్పుడు ముఖ్యమైన సందేశాలను నోటు పుస్తకంపై రాసుకుని చదువుకోవాలన్నారు. మహనీయుల జీవిత చరిత్ర పుస్తకాలతో జ్ఞానం పెంపొందుతుందని ఆసక్తిగల రంగాల్లో విద్యార్థులు ముందుకు వెళ్లి మంచి  స్థానాల్లో ఉండాలన్నారు ప్రతి రోజూ వచ్చే వార్తా పత్రికలోని ఎడిటోరియల్ కాలమ్స్ చదవాలని సూచించారు అలాగే సమాజం మనకు చాలా నేర్పుతుంది దాని ముందు మంచిని స్వీకరించి కాలానికి అనుగుణంగా మారుతూ ప్రత్యేక స్థానాన్ని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ అహల్యాదేవి, ఎంపీపీ సంజీవ్ కుమార్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, కళాశాల కరస్పా టీ శ్రీనివాస్ రాజు, ప్రిన్సిపాల్  జాకీర్ ఉస్మాని, విమ్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్రెడ్డి, ఎస్డీ రమేష్, డైరెక్టర్లు దేవేందర్రావు శ్రీధర్రావు మరియు కళాశాల సిబ్బంది వాచర్లు పాల్గొన్నారు

Monday, 4 March 2019

శివనామ స్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు






రెబ్బెన ;    మహా శివరాత్రి సందర్భంగా బుధవారం శైవ క్షేత్రాలలో  శివ నామ  స్మరణ మరు మ్రోగాయి. రెబ్బెన  మండలము లోని నంబాల గ్రామము  లో గల ప్రసన్న పరమేశ్వర ఆలయ జాతర రంగ రంగ వైభవంగా సాగింది. ఉదయము పూట నుండే భక్తులు తండోప తండాలుగా మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఎడ్ల బండ్లపై, , మోటారు సైకిళ్లపై తరలి  వచ్చారు భక్తులు . కోరిన కోరికలను తీర్చాలని మొక్కుకున్నారు. ముందుగా శివ పార్వతుల కళ్యాణం ఆలయ కమిటి ఆధ్వర్యములో నిర్వహించారు. కళ్యాణం ఎంతో కనుల పండుగగా సాగింది .ఈ కళ్యాణములో భక్తులు కుంకుమ పూజలు భక్తి శ్రద్దలతో చేశారు. ఈ పూజలలో  దంపతులు  స్వామి వారి  కళ్యాణం లో పాల్గొన్నారు.  . స్వామివారికి ప్రత్యక పూజలు నిర్వహించారు. ఈ జాతర లో వచ్చిన భక్తులకు  కొంతమంది  దాతలు  అన్నప్రసాద  వితరణ  గావించారు.  . భక్తుల కు ఎలాంటి అసౌ కర్యాలు  కలగకుండా ఆలయ కమిటి అన్ని చర్యలు చేపట్టారు . అర్ టి సి సంస్థ భక్తుల రవాణా  కొరకు  ప్రత్యక బస్సులు నడిపారు .ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగ కుండ  పోలీసుశాఖవారు  భారీ బందోబస్తు  ఏర్పాటు చేశారు.
కన్నుల పండుగగా  రధోత్సవం ;- 

రెబ్బెన ;  శివ పర్వతుల రధోత్సవం  ఎంతో కనుల పండగగా జరిగింది . ఈ కార్యక్రమంలో  లో భక్తులు తండోప  తండాలుగా పాల్గొన్నారు . ఆలయము చుట్టూ స్వామి వారి రథాన్ని భక్తులు శంభో శంకర అంటూ రధోత్సవం లో పాల్గొన్నారు. శివాలయ ప్రాంగణము శివ నాదము తో మరు మ్రోగింది. అనతరము భక్తులు శివ పార్వతుల కు నైవేద్యము సమర్పించారు. సాయంత్రము శివాలయము లో భక్తులు భజనలు , కీర్తనలు పాడుతూ భక్తి పారవశ్యములో మునిగారు. రాత్రి ఏర్పాటు చేసిన స్వామి వారి దీపాలంకరణ భక్తులను  మంత్ర ముగ్దులను చేసింది. అనంతరము భక్తులు శివాలయం వద్ద జాగారణ చేస్తూ శివ స్మరణతో జాగరం చేస్తూ  గడిపారు.

Thursday, 28 February 2019

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 28 ; రెబ్బెన మండలం నక్కల గూడ  ప్రాథమిక పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెబ్బెన  ప్రభుత్వ పాఠశాల   ప్రధానోపాధ్యాయురాలు సిహెచ స్వర్ణ లత  హాజరయ్యారు.  ముందుగా సర్ సి వి రామన్ గారి  చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించారు. అనంతరం   విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుండే ప్రకృతిని పరిశీలించడం తెలుసుకోవడం చేయాలని తద్వారానే జ్ఞానం పెరుగుతుందని తెలియజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్  మాట్లాడుతూ సర్ సి వి రామన్ గారి జీవితం ఎంతో మంది విద్యార్థులకు ప్రేరణ ఇస్తుందని తెలియజేశారు.  1928లో రామన్ ఎఫెక్ట్ అనబడే కాంతి కిరణాల గురించి పరిశోధనలో విజయం సాధించి  రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు గాను ఆయనకు 1930లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నోబెల్ బహుమతి లభించిందన్నారు.    ఈ కార్యక్రమానికి  అతిధులుగా రెబ్బెన హైస్కూల్ జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు  శ్రీదేవి,   ఆంగ్ల ఉపాధ్యాయులు అనీస్ అహ్మద్   హాజరయ్యారు.  కార్యక్రమంలో పాఠశాల  ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్  మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర మహాసభలను విజయవంతం చేయలి ; బోగే ఉపేందర్

 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 28 సింగరేణి కాంట్రాక్టు కార్మికుల కేంద్ర 2వ మహాసభలు కొత్తగూడెంలోని మార్చి 3వ తేదీ రుద్రంపూర్ లో జరుగుతాయని ఏరియా లోని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని scwu గోలేటి బ్రాంచి అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు.గురువారం రోజున గోలేటి లోని కె ఎల్ మహేంద్ర భవన్  కార్మికుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి లో 25వేల మంది కాంట్రాక్టు కార్మికులు చాలి చాలని వేతనాలు తీసుకుంటూ,సంస్థ లాభలోకి రావడానికి,అభివృద్ధి చెందడానికి కార్మికుల కీలక పాత్ర పోసిస్తున్నారని,అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం కార్మికులను శ్రమదోపిడికి గురిచేస్తూ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు,01.01.2013 నుంచి హై పవర్ కమిటీ వేతనాలు చెలించాలని ఉన్నా యాజమాన్యం చెలించడం లేదని,కోల్ ఇండియా లో చేసిన ఒప్పందాలను అమలు చేయాలని అన్నారు,కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు,కార్మికులకు లాభాల వాటా చెలించాలని, కాంట్రాక్టర్ మరీనా కార్మికులను మార్చదని డిమాండ్ చేశారు,కార్మికుల CMPF వివరాలు తప్పుల ఉన్నాయని,అ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం చేయడంలో విఫలం అయ్యారని అన్నారు,అలాగే కార్మికుల కుటుంబాలకు వైద్య సదుపాయం కల్పించాలనిఅన్నారు,ప్రతి నెల 10 తేదీ లోపు వేతనాలు ఇవ్వాలని,అలాగే కార్మికులకు జీతం చిట్టీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు,సి.హెచ్.పి ,బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు స్కిల్ల్డ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు,కార్మికులు ఎదుర్కొంటున్నా సమస్యలను కేంద్ర మహాసభ లో చర్చించి తీర్మానాలు చేయడం జరిగుతున్నదని అన్నారు. కావున ఏరియా లోని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.. ఈ సమావేశంలో గోలేటి బ్రాంచ్ కార్యదర్శి చల్లురి అశోక్,సహాయ కార్యదర్శి సాగర్,నాయకులు ఆశలు,తిరుపతి, శంకర్,నాగేశ్వర్ రావులతో పాటు తదితరులు ఉన్నారు.

జాతీయ సైన్స్ దినోత్సవా వేడుకలు

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 28 ; జాతీయ సైన్స్ దినోత్సవాన్ని  రెబ్బెన మండలం నారాయణపూర్ ప్రాథమికొన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా గురువారం  నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నారాయణపూర్ గ్రామ సర్పంచ్ వేమునూరి అమృత హాజరయ్యారు.  విద్యార్థులు తాయారు చేసిన ప్రయోగాలని,బోదనోపకరణాలని తిలికించారు ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననటి నుండే ప్రకృతిని పరిశీలించడం తెలుసుకోవడం చేయాలని తద్వారానే జ్ఞానం పెరుగుతుందని అన్నారు.ఈ  కార్యక్రమంలో గ్రామ పెద్దలు పల్లె శ్రీనివాస్ ,సుగుణకార్,కిరణ్ ,జగదీశ్, తిరుపతి,పాఠశాల  ఉపాధ్యాయులు శారద, కవిత  రాణి, సరోజ, సిఆర్పీ యం.రాజేష్, యువకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Wednesday, 27 February 2019

పిచ్చికుక్కల స్వైరవిహారం ; పలువురికి తీవ్ర గాయలు

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 27  రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గత కొద్దిరోజులుగా  పిచ్చికుక్కలు గ్రామంలో విచ్చల విడిగా తిరిగితున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం   లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  . బుధ వారం గంగాపూర్ గ్రామంలో వాడే లక్ష్మి 4 సం పాపను, లక్ష్మీపూర్ గ్రామంలో మరొకరిని  పెప్రి వెంకటేష్ 5 సం బాబు , పాసిగం గ్రామంలో దాగం మల్లయ్య 60 సం, తాళ్లపల్లి జ్యోతి 35 సంవత్సరాలు ఇద్దరి ని గాయపరచడంతో పాటు మూడు మేకలపై దాడిచేసి తీవ్రంగా గాయపరచినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా సంభందిత అధికారులు స్పందించి పిచ్చికుక్కలను  అరికట్టాలని కోరుతున్నారు. లేనిపక్షంలో చిన్నపిల్లలు గాని వృద్దులు గాని ఆయా గ్రామాలలో ఇండ్లనుండి బయటకు వెళ్లే పరిస్థితి  లేదన్నారు.

స్వాతంత్ర పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ కు ఘన నివాళి

 చంద్రశేఖర్ ఆజాద్ కు ఘన నివాళి 
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 27 ;  ప్రముఖ స్వాతంత్ర పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతిని పురస్కరించుకొని  రెబ్బెన మండలం నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు  కల్వల శంకర్, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు   చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు  మాట్లాడుతూ స్వతంత్రం కోసం పోరాడిన మన నాయకులను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత రంగంలో స్థిరపడాలనే తెలియజేశారు    25 సంవత్సరాల చిరు ప్రాయంలోనే భారతదేశ    స్వతంత్రం కోసం పోరాడుతూ తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని అన్నారు .  1919 లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం చంద్రశేఖర్ ఆజాద్ మనసును బాగా కలచివేయడంతో 19 28 సెప్టెంబర్ లో భగత్ సింగ్ సుఖదేవ్ లతో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారన్నారు.    భారతదేశానికి ఏ విధంగానైనా స్వాతంత్రం తీసుకురావాలనేది చంద్రశేఖర్ ఆజాద్ దృఢ సంకల్పం స్వాతంత్ర ఉద్యమ కారులను అణగదొక్కే బ్రిటిష్ అధికారుల పై చంద్రశేఖర్ ఆజాద్ తన సహచరులతో కలిసి దాడి చేసేవారన్నారు.  ఫిబ్రవరి 27 1931వ సంవత్సరంలో బ్రిటిష్ వారు బందీగా పట్టుకోవడంతో  బ్రిటీష్ అధికారుల చేతుల్లో చావకూడదు అన్న ఆలోచనతో తనను తాను కాల్చుకుని మరణించాడన్నారు.    ఈ కార్యక్రమానికి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు రాజకమలాకర్ రెడ్డి , చైతన్య,  దుర్గం శ్రీనివాస్,  లకావత్ శంకర్,  దురిశెట్టిరాజశేఖర్, కుమార్, నాగరాజు మరియు వార్డు మెంబర్ శ్యామ్ రావు విద్యా కమిటీ చైర్మన్ మీసాల పోష మల్లు ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్  విద్యార్థులు పాల్గొన్నారు.

Saturday, 23 February 2019

కోల్ ఇండియా లెవెల్ షటిల్ బ్యాట్మెంటిన్ టోర్నమెంట్


 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 23 ; జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచి ఖేల్ గావ్  సిసిఎల్ ఠాగూర్  విశ్వనాథ్ ఇండోర్ స్టేడియంలో 23 నుండి 26 వరకు కోల్ ఇండియా లెవెల్ షటిల్  బ్యాట్మెంటిన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని బెల్లంపల్లి ఏరియా ఇంచార్జ్ డిజియం పర్సనల్ బి సుదర్శన్ శనివారం తెలిపారు. ఈ కోల్ ఇండియా పోటీలలో సింగరేణి జట్టు పాల్గొననున్నదని  ఈ జట్టుకు మేనేజర్ గ ఏ రాజేశ్వర్ పర్సనల్ మేనేజర్,   జట్టు కోచ్ గా  హెచ్ రమేష్ స్పోర్ట్స్ సూపర్వైజర్ లు  వ్యవహరిస్తారని అన్నారు. జట్టు క్రీడాకారులు ఆర్జీ గ్రూప్ నుండి డి విజయ్ కుమార్, కుసుమ, స్వరూప, భూపాలపల్లి గ్రూప్ నుండి సారంగపాణి, శంకరయ్య ఎన్ సురేష్, హెడ్ ఆఫీస్ నుండి పి వివేక్, వర్ధన్, కార్పొరేట్ నుండి కె శైలజ, బెల్లంపల్లి ఏరియా నుండిఎస్ కే అంకుష్  పాల్గొంటున్నట్లు  తెలిపారు. 

ఓటర్లు ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొవాలి

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 23 ; ఓటర్లు  ఎన్నికలలో ఉపయోగించే   ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొని ఓటు హక్కు ను వినియోగించుకోవాలని రెబ్బెన మండల రెవిన్యూ ఇనస్పెక్టర్  ఊర్మిళ అన్నారు.  శనివారం  రెబ్బెన మండలం  వం కులం    గ్రామం పోలింగ్ స్టేషన్ 269 లో  ప్రజలకు     ఎన్నికలలో ఉపయోగించే  ఈవిఎం , వి వి ఫాట్ యంత్రాల వినియోగ విధానం  పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారం పదోన్నతులు వేతన స్థిరీకరణ చేపట్టాలి

 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 23 ; ఉమ్మడి సీనియారిటీ మరియు ప్రస్తుత నిబంధనల ప్రకారం పదోన్నతులు , వేతన స్థిరీకరణ చేపట్టాలని స్పెషల్ గ్రేడ్ టీచర్స్ ఢిమాండ్ చేశారు. శనివారం రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహ ఆవరణలో జరిగిన సమావేశంలో ఎస్  జి టి   సమావేశంలో  ఉపాధ్యాయులు రాజకమలాకర్ రెడ్డి, కల్వల శంకర్ ,తదితరులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వేతన స్థిరీకరణ చేపడితే  తదనంతర పర్యవసానాల కు  జిల్లా విద్యాశాఖాధికారి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించ వలసి ఉంటుందని అన్నారు. ఈ  సమావేశంలో లోకేష్, రవికుమార్, సోమశేఖర్, శ్రీను, నాగరాజు, మనోహర్, శ్రీనివాస్, జనార్దన్, శ్రీధర్, అశోక్, వినోద్, సంతోష్ లు పాల్గొన్నారు. 

Thursday, 21 February 2019

సమస్యలను పరిష్కరించే వారినే గెలిపించాలి

 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 21  సమస్యలను పరిష్కరించే వారినే  శాసన  మండలి ఎన్నికలలో  ఉపాధ్యాయ ప్రతినిధిగా  గెలిపించాలని  .ఎస్టీయూ జిల్లా అధ్యక్షలు తాటి రవీందర్ అన్నారు. గురువారం  రెబ్బెన మండలంలోని  వివిధ పాఠశాలలలో ఎస్టీయూ అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ   ప్రధానంగా   ఉఫాద్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సి పి ఎస్  అని .దానిని అంతం చేసే వరకు శాసన మండలిలో పోరాడుతామని,   శాసన మండలిలో ప్రశ్నిచే వారు ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు పరిష్కరించబడుతాయని,  ఉపాధ్యాయుల సమస్యల సాధనలో ఎస్టీయూ ముందుంటుందని, గతంలో ధర్మగ్రహాసభ,పొరుదీక్ష,మహాధర్నా,లాంటి కార్యక్రమాలను  ప్రభుత్వ ఒత్తిడిలకు లొంగకుండా విజయవంతం చేయడం జరిగిందన్నారు.  ఈ దిశగా ఉపాధ్యాయులు ఆలోచించి ఎస్ టి యు  అభ్యర్థి ని గెలిపించ వల్సిందిగా కో రారు.  ఈప్రచారంలో జిల్లా  ప్రధాన కార్యదర్శి పుర్క మానిక్ రావు,రెబ్బెన మండలాధ్యక్షులు చునార్కర్ తుకారామ్ రెబ్బెన మండల .ఎస్టీయూ కార్యదర్శి వసీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొవాలి

 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 21 ; విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని  సాధించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని  రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శంకర్ అన్నారు.  గురువారం   రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మొదటి సంవత్సరం విద్యార్థులు వీడ్కోలు దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ గీతాలాపనతో మొదలైన ఈ కార్యక్రమం అనంతరం ఇటీవల జమ్మూ  కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు ఒక నిముషం మౌనంపాటించి నివాళులర్పించారు. అనంతరం కాళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకొంటున్నప్పుడే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాధన దిశగా అడుగు వేసి సాధిస్తే  జీవితం సుఖమయం అవుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. పరీక్షలలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు మెమెంటో లు అందచేశారు.  ఈ కార్యక్రమంలో సిర్పూర్ కాలేజీ ఇంచార్జి  ప్రిన్సిపాల్ అతియా ఖానం,  లెక్చరర్ శాంత,  రెబ్బెన కళాశాల  అధ్యాపకులు   ప్రకాష్, గంగాధర్, సతీష్, శ్రీనివాస్, అమరేందర్, ప్రవీణ్, మంజుల, వెంకటేశ్వర, మల్లేశ్వరి, వరలక్ష్మి, దీప్తి, నిర్మ్యాల, సంధ్య, ఝాన్సీ, మహేష్, కృష్ణ మూర్తి, సరళ, సిబ్బంది ప్రకాష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 

Monday, 18 February 2019

కన్నులపండుగా గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వరస్వామి కళ్యాణం

స్వామి వారి కల్యాణం ; ప్రారంభమైన గంగాపూర్ జాతర 
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 18 ;  రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామా శివారులో వెలిసిన బాలాజీ వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణం సోమవారం  కన్నులపండుగగా కడురమణీయంగా  వైభవంగా వేదమంత్రాల నడుమ వెలది  భక్తుల   మద్య   జరిగింది.  భక్తులు స్వామి వారి మండపంలో వేదపండితులచే  వేదమంత్రోచ్చారణలతో స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. రెబ్బెనమండలంలోని వివిధ గ్రామాలనుంచి భక్తులు తరలి వచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించి పరవశించారు.  కళ్యాణం అనంతరంకొందరుభక్తులుఅన్నదానకార్యక్రమం నిర్వహించారు.మండలంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో భక్తులకు భద్రతా, త్రాగునీటి సదుపాయం, కల్పించారు. ఈ కార్యక్రమంలో వ లంటీర్లు సేవలు అందించారు.  రేపు జరిగే రధోత్సవమునకు వే లాది  భక్తులు  తరలి  వస్తారని నిర్వాహకులు తెలిపారు.

Sunday, 17 February 2019

కెసిఆర్ జన్మదినం సందర్భంగా హరిత హారం

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 17 ;  ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రెబ్బెన సర్పంచ్ బొమ్మినేని  అహల్యాదేవి అన్నారు. ఆదివారం కెసిఆర్ జన్మదినం సందర్భంగా రెబ్బెన   గ్రామ పంచాయతీ ఆవరణలో  మొక్కలు  నాటారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పర్యావరణ కాపాడటంలో భాగస్వాములు కావాలని  తెలంగాణ హరిత రాష్ట్రానికి అందరూ కృషి చేయాలన్నారు.  ప్రతి ఒక్కరి  పుట్టిన రోజు చెట్టు నాటాలని  ఈ సందర్భంగా సూచించారు..   ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మెన్ కుందారపు శంకరమ్మ,   ఉపసర్పంచు మడ్డి శ్రీనివాస్,  మాజీ ఉప సర్పంచ్ బొమ్మిన శ్రీధర్,   నాయకులు జాకీ ఉస్మాని సుదర్శన్ గౌడ్ శాంతి  కుమార్ గౌడ్,  శంకర్,  అశోక్, జహీర్ బాబా, వినోద్ జైస్వాల్, తిరుపతి, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.


ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు

 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 17 ;   రెబ్బెన మండలం పులికుంట  గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధి గా హాజరైన నాబార్డ్ అధికారి అంజన్న మాట్లాడుతూ  ప్రజలు  నగదు  రహిత లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు.ఈ విధానం ద్వారా బహుళ ప్రయోజనాలున్నందున వాటిని వాడడం అలవాటు చేసుకోవాలని అన్నారు. సంపాదించిన ప్రతి పైసాను దుబారా చేయకుండా పొదుపు పాటిస్తే భవిష్యత్తులో ఉపయోగపడతాయన్నారు.   ఈ కార్యక్రమంలో పులికుంట గ్రామ సర్పంచ్ పోచమల్లు, వ్యవసాయ పరపతి సంఘం సి ఈ ఓ సంతోష్ ,  రైతులు , గ్రామస్తులు పాల్గొన్నారు.

గంగాపూర్ జాతర భద్రతా ఏర్పాట్ల పరిశీలన

రెబ్బెన ; గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో  ఆదివారం నుండి  మూడు రోజులు జరగబోయేకళ్యాణం, రధోత్సవం, జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఎస్పీ మల్లారెడ్డి సూచించారు. శనివారం  రెబ్బెన మండలం గంగాపూర్  బాలాజీ వెంకటేశ్వర స్వామివారి  దర్శనం చేసుకున్నారు.  ఈ  సందర్భంగా జిల్లా పోలీస్ సూపెరింటెండ్ కు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి బాపి రెడ్డి, అర్చకులు గణేష్ పంతులు, , గ్రామ సర్పంచ్  లు  ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన మాట్లాడుతూ కొమురంభీం ఆసిఫాబ్ జిల్లాలో ఎంతో   ప్రఖ్యాతి వహించిన  స్వామివారి కళ్యాణానికి, భారి సంఖ్యలో భక్తులు విచ్చేయు సందర్భంగా  వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇతర ప్రభుత్వ , స్వచ్చంద సంస్థలతో సమన్వయము చేసుకొని పోలీస్ శాఖ  భద్రత మరియు దర్శనం చేయించాలని సూచించారు. ఆయన వెంట ఆసిఫాబాద్ డి ఎస్ పి  సత్యనారాయణ, సర్కిల్ ఇన్సపెక్టర్  రమణ మూర్తి,, ఎస్సై దీకొండ  రమేష్, ఉన్నారు. ఈ కార్యక్రమంలో పందిర్ల మాదనయ్య,  రమేష్, వెంకటేష్, సర్వేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.