రెబ్బెన : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాతూరి సుధాకర్ రెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఒప్పంద అధ్యాపకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాయిని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించడంలో పాతూరి సుధాకరరెడ్డి పాత్ర మరువలేనిది అని అన్నారు. అధ్యాపకుల వేతనాలు పెరగడంతో పాటు, 12 నెలలు వేతనం రావడం లాంటి అనేక సమస్యలు పరిష్కరించబడినవి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జెడి సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఒప్పంద అధ్యాపకులు ప్రవీణ్, రామారావు, వెంకటేశ్వర్, ప్రకాష్, మహేష్, అమరేందర్, మంజుల, పద్మ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment