రెబ్బెన : కార్మిక హక్కులు ఎర్ర జెండా ఏఐటీయూసీ తోనే సాధ్యమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు,ఏఐటీయూసీ ఆవిర్భవించి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెబ్బన మండలంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటీయూసీ జెండాను గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు రమేష్ ఆవిష్కరించారు అనంతపురం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అసంఘటిత కార్మిక వర్గంలో ఉన్న వారందరికీ కనీస వేతనం 18000 ఇవ్వాలని డిమాండ్, అలాగే కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ ఈ.ఎస్.ఐ,పి.ఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు, రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వెంకటేష్, మార్కెట్ హమాలీ సంఘం మండల అధ్యక్షుడు అరికిల్ల వెంకటేష్, కార్యదర్శి స్వామి,నాయకులు శంకర్,వసంత్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment