Wednesday, 11 December 2019

దేశ వ్యాపిత సమ్మెను విజయవంతం చేయాలి ; బోగే ఉపేందర్

రెబ్బన ;  దేశవ్యాప్త సమ్మె కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి  బోగే ఉపేందర్  పిలుపునిచ్చారు. రెబ్బన  మండలం లోని ఆర్.& బి గెస్ట్ హౌస్ లో  ఏఐటీయూసీ మండల కమిటీ సమావేశని మండల  అధ్యక్షుడు ఎం.శేషశయన రావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి  బోగే ఉపేందర్ మాట్లాడుతూ 2020 జనవరి 8వ తేదీన జరిగే ,కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను కార్పొరేట్లకు, యాజమాన్యాలకు అనుకూలంగా తయారు చేసిందని అన్నారు, దీనివలన కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు అలాగే కనీస వేతనం 21 వెయ్యి రూపాయలు ఇవ్వాలని,కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని,గ్రామ పంచాయతీ కార్మికులకు 8500 వేతనాలు ఇవ్వాలని డిమండ్ చేశారు,కార్మిక చట్టాల సవరణ ఆపాలని, స్కీమ్ వర్కర్ల అందర్నీ ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని డిమాండ్ చేశారు.అందరికి ఉపాధి కల్పించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 200రోజులు పెంచాలని,నిధులు  పెంచి వేతనాలు ఇవ్వాలని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ధరలను, దేశంలో పని చేస్తున్న అసంఘటిత కార్మికుల అందరికీ సమగ్ర సంక్షేమ చట్టం వర్తింపజేయాలని అలాగే కనీస పెన్షన్ పది వేల రూపాయల  ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాడి గణేష్ ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు ఎం.శేషశయన రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్,మండల కార్యదర్శి దుర్గం వెంకటేష్,ఉపాధ్యక్షుడు ప్రకాష్,సహాయ కార్యదర్శి అనుముల రమేష్,ప్రచార కార్యదర్శి శంకర్,కోశాధికారి ఆర్.దేవాజీ తో పాటు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment