రెబ్బెన : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సమగ్ర సర్వే తర్వాత కొత్త పట్టాధార్ పాస్ పుస్తకాలు చాల మంది రైతులకు అందలేదని రెబ్బన మండలంలోని గంగాపూర్ గ్రామా రైతులు సోమవారం జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హన్మంతుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ పట్టా పుస్తకాలు అందక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన రైతు బంధు, ప్రధాన మంత్రి కిసాన్ నిధి పథకాలు కోల్పోయామని అన్నారు. కొత్త పాస్ పుస్తకాలను రైతులకు అందజేసి ప్రభుత్వాల నుండి వచ్చే పెట్టుబడి పథకాలను అందించాలని రైతులు కోరారు. నిత్యం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి కాలయాపన జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు వొలువోజు వెంకటేశం, శ్యామ్రావు, గందె సంతోష్, లావుడ్య బిక్కు, కిషన్, రమేష్, లక్ష్మిభాయ్,తార భాయ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment