Wednesday, 27 February 2019

స్వాతంత్ర పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ కు ఘన నివాళి

 చంద్రశేఖర్ ఆజాద్ కు ఘన నివాళి 
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 27 ;  ప్రముఖ స్వాతంత్ర పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతిని పురస్కరించుకొని  రెబ్బెన మండలం నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు  కల్వల శంకర్, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు   చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు  మాట్లాడుతూ స్వతంత్రం కోసం పోరాడిన మన నాయకులను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత రంగంలో స్థిరపడాలనే తెలియజేశారు    25 సంవత్సరాల చిరు ప్రాయంలోనే భారతదేశ    స్వతంత్రం కోసం పోరాడుతూ తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని అన్నారు .  1919 లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం చంద్రశేఖర్ ఆజాద్ మనసును బాగా కలచివేయడంతో 19 28 సెప్టెంబర్ లో భగత్ సింగ్ సుఖదేవ్ లతో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారన్నారు.    భారతదేశానికి ఏ విధంగానైనా స్వాతంత్రం తీసుకురావాలనేది చంద్రశేఖర్ ఆజాద్ దృఢ సంకల్పం స్వాతంత్ర ఉద్యమ కారులను అణగదొక్కే బ్రిటిష్ అధికారుల పై చంద్రశేఖర్ ఆజాద్ తన సహచరులతో కలిసి దాడి చేసేవారన్నారు.  ఫిబ్రవరి 27 1931వ సంవత్సరంలో బ్రిటిష్ వారు బందీగా పట్టుకోవడంతో  బ్రిటీష్ అధికారుల చేతుల్లో చావకూడదు అన్న ఆలోచనతో తనను తాను కాల్చుకుని మరణించాడన్నారు.    ఈ కార్యక్రమానికి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు రాజకమలాకర్ రెడ్డి , చైతన్య,  దుర్గం శ్రీనివాస్,  లకావత్ శంకర్,  దురిశెట్టిరాజశేఖర్, కుమార్, నాగరాజు మరియు వార్డు మెంబర్ శ్యామ్ రావు విద్యా కమిటీ చైర్మన్ మీసాల పోష మల్లు ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్  విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment