కొమరంభీం ఆసిఫాబాద్ (రేబ్బెన) ఫిబ్రవరి 3 ; ప్రజా సంక్షేమం ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకంలో ప్రతి ఒక్కరూ సద్వినియో ని మారదని స్నేహితులను వర్గ ఎమ్మెల్సీ పురాణం సతీష్ అన్నారు. ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహములో పాశిగం గ్రామానికి చెందిన జిమిడి మహేష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన ఒక లక్ష చెక్కును బాధిత తండ్రి శంకర్ కి అందజేశారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో పాటు రైతు బందు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, వృద్ధులకు వికలాంగులకు, ఒంటరి మహిళల పెన్షన్లు పెంచి ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కె చెంద్రయ్య, ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment