కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 11 ; ఈ నెల 21 తేదీన సివిల్ సప్లయీస్ హమ్మలి వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) తెలంగాణ రాష్ట్ర మొదటి మహాసబలు హైదరాబాద్ లో జరుగుతాయని ఏఐటీయూసీ కుమురంభీం జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీలకు కనిసవేతనం 18వేలు ఇవ్వాలని, ఈ ఎస్ ఐ , పి ఎఫ్ సౌకర్యం కల్పించాలని, హమాలీల సమగ్ర సంక్షేమ చట్టం తీసుకు రావాలని,హమాలీల రేట్లు రూపాయలు 25 పెంచాలని,అలాగే 14 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని,అన్నారు,హమాలీలను ప్రభుత్య ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారూ,50 సంవత్సరాలు నిండిన హమాలీలకు 3000 పెన్షన్ ఇవ్వాలని అన్నారు..హమాలీలకు డబులు బెడ్ రూము ఇండ్లు ఇవ్వాలని అన్నారు. ఈ సభలను జిల్లాలోని హమాలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
No comments:
Post a Comment