కొమరంభీం ఆసిఫాబాద్ (రేబ్బెన) ఫిబ్రవరి 2 ; గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ ను రెబ్బెన మండలం తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ ఎస్సై గా పదవీబాధ్యతలు చేపట్టి నప్పటి నుంచి పోలీసులు మీకోసం లో భాగంగా మండలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని వారి సేవలను కొనియాడారు. అంతర్రాష్ట్రీయ రహదారి వర్షాల కారణంగా గుంతలమయంగా మారడంతో స్థానికుల సహకారంతో వాటిని సరిచేశారన్నారు. గ్రామాలకు వెళ్లే రహదారికిరువైపులా పెరిగిన చెట్లపొదలను తొలగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ అరుణ, కలవేణి లక్ష్మి, చంద్రకళ, పిల్లి లతా,బొడ్డు యశోద,కల్పన తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment