కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 5 ; కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ సభ రెబ్బెన మండలకేంద్రంలో మంగళవారం ఏర్పాటుచేశారు. సభకు విచ్చేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రంసక్కు ను అంబెడ్కర్ విగ్రహం నుండి భారీ ర్యాలీగా బాణా సంచా కాలుస్తూ ఘనంగా సభాస్థలి కి చేరుకున్నారు. మండలం లోని తెరాస సీనియర్ నాయకులు నవీన్ జైస్వాల్, మోడెమ్ చిరంజీవి గౌడ్, వైస్ ఎంపీపీ గుడిసెల రేణుక , గుడిసెల వెంకటేశ్వర్ గౌడ్, తెరాస నాయకులూ, కార్యకర్తలు ,ఇతర అభిమానులు వంటి ప్రముఖులు భారీగా కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచ్ లను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించారు.రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులూ ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పూర్వ వైభవం పొందనున్నట్లు తెలిపారు . కాంగ్రెస్ పార్టీ లో కార్యకర్తలకు సముచిత గౌరవం దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులూ పల్లె ప్రకాష్ రావ్ , కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బాలేశ్వర్ గౌడ్ ,డీసీసీ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముంజం రవీందర్, ఉపాధ్యక్షులు దుర్గం రాజేష్ ఎంపీటీసీలు కె శ్రీనివాస్, సురెందర్ రాజు, టౌన్ అధ్యక్షులు వనమాల మురళి, ఎస్ టి సెల్ అధ్యక్షులు లావుడ్య రమేష్, మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment