కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 6 ; రెబ్బెన పంచాయతీ కార్యదర్శి మురళీధర్ పై కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా డి ఆర్ డి ఓ వెంకట్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రెబ్బెన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విధినిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం చూపిన కార్యదర్శిని తీవ్రం గా మందలించారు. కార్యదర్శిపై వెల్లువెత్తిన ఫిర్యాదులను చూసి విస్తుపోయిన ఆయన శాఖాపరమైన చర్యలకు వెనుకాడేది లేదని మందలించారు. కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్న ప్రజలు డి అర్ డి ఓ కు మౌఖికంగా మరియు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. బాధితులందరు ముక్తకంఠంతో తమను సంవత్సరాలతరబడి మరుగు దొడ్ల నిర్మాణ బిల్లుల చెల్లింపులు చేయడం లేదని, బిల్లు చెల్లింపులకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ముందస్తుగా సంతకాలు చేయించుకొని నేరుగా నగదు పంపిణి చేస్తామని చెప్పి నెలల తరబడి తిప్పుకుంటున్నారని వాపోయారు. పధకాల లబ్దిదారులకు విధిగా చెక్కులు ఇవ్వవలసింది పోయి చెక్కులు లేవని డబ్బులు డ్రా చేసుకొని నగదు లో పెద్దమొత్తాన్ని మినహాయించుకొంటున్నాడని ఫిర్యాదు చేశారు. గ్రామపంచాయితీలో సమయపాలన పాటించకుండా తన ఇష్ట రీతిన వ్యవహరిస్తు లబ్దిదారులను నోటికచ్చినట్లు తిడుతున్న విషయం డీఆర్డీవో దృష్టికి రావడం తో మరోసారి ఇలాంటి పనులకు పాల్పడితే తగు చర్యలు తీసుకుంటామని గ్రామ కార్యదర్శిని హెచ్చరించారు. ఈ సందర్భంగా డి ఆర్ డి ఓ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ మొదలైన పధకాల ప్రయోజనం ఇలాంటి అధికారుల వల్ల నీరుగారిపోతుందని అన్నారు. పంచాయతీ కార్యాలయ ము లో సర్పంచే సర్పంచ్ అహల్యా దేవికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అహల్యా దేవి, డి ఎల్ పి ఓ వెంకటయ్య, ఏ పి ఓ కల్పనా , హెచ్ అర్ డి ఓ ఫణి కుమార్, తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment