కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 14 ; చిన్నతనంనుంచే మూఢనమ్మకాలపై అవగాహన కలిగి ఉండి సమాజంలో మెలిగితే బంగారు భవిష్యత్తు నిర్మించుకోవచ్చని ప్రముఖ ఇంద్రజాలికుడు మంతెన రాజశేఖర్ అన్నారు. గురువారం రెబ్బెన మండలం నక్కల గూడ గ్రామంలోని ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు చిన్న చిన్న లాజిక్స్ ని మ్యాజిక్ ని నమ్మి వేల రూపాయలు డబ్బులు పోగొట్టుకొని మోసపోతున్నారన్నారు. దేవుడు, దయ్యం రెండు మానవ కల్పితాలేనని అన్నారు. దేవుడు పేరుతొ మోసం చేసే వాళ్ళను , దయ్యం అని చెప్పి భయపెట్టేవాళ్లను నమ్మ రాదన్నారు, కొంతమంది స్వార్థపరులు ప్రజల సొమ్మును కాజేసి వారి ఆస్తిపాస్తులు పెంచుకుంటున్నారని అన్నారు. విద్యార్థులు మూఢనమ్మకాలను నమ్మకుండా వారి భవిష్యత్తును మరింత అందంగా ఉజ్వలంగా తయారు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్, ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్ గ్రామస్తులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
No comments:
Post a Comment