కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 11 ; రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య పై కత్తి తో దాడి చేసిన లింగన్నపై కేసు నమోదు చేసినట్టు రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ సోమవారం తెలిపారు. ఆయన తెలిపీన వివరాల ప్రకారం గంగాపూర్ గ్రామానికి చెందిన జాగిరి చంద్రయ్య తన కూతురు కృష్ణవేణిని పది సంవత్సరాల క్రితం రెబ్బెనకు చెందిన లింగన్నకు ఇచ్చి వివాహం చేశాడని . అయితే తాగుడుకు బానిసగా మారిన లింగన్న భార్యను శారీరకంగా మానసికంగా హింసించేవాడని ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా లింగన్న ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని . గతంలో లింగన్న అతని అన్నదమ్ములతో గొడవపడి ఇంట్లో నుండి బయటకు వెళ్లగా చంద్రయ్య చేరదీశాడు. . అయినా అతని అతనిలో ఎలాంటి మార్పు రాకపోగా మళ్ళీ భార్యను తిట్టి కొట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయినట్లు . తిరిగి కొద్దిరోజులకు గ్రామానికి వచ్చి మేనత్త పట్ల అసభ్యకరంగా ప్రవర్తించగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు ఎస్సై తెలిపారు. మామ బెయిల్ ఇవ్వలేదని కక్ష పెంచుకున్నాడు. ఇటీవల జైలు నుండి బయటకు వచ్చిన లింగన్న మామపై కక్షతో దాడి చేసేందుకు అదనుకోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గంగాపూర్ నుండి రెబ్బెనకు వస్తున్న చంద్రన్న మండల కేంద్రంలోపోస్ట్ ఆఫీస్ ఎదుట అడ్డగించి తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన . చంద్రయ్య తపించుకునే ప్రయత్నం చేయగా అతని కంటి బొమ్మ పై తీవ్రగాయమైంది. దాంతో చంద్రయ్య ఇచ్చిన మేరకు లింగన్న పై కేసు నమోదు చేసిన చేసినట్లు తెలిపారు.
No comments:
Post a Comment