కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 8 ; రోడ్డు ప్రమాదాల నివారణకు అందరు సహకరించాలని రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ లు కోరారు. శుక్రవారం రెబ్బెన మండల కేంద్రంలో రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ముప్పై వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా రోడ్డు నిబంధనలపై కళాజాత ప్రదర్శనలు నిర్వహించారు. మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు. అనంతరం రెబ్బెన ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో రెబ్బెన సర్పంచ్ అహల్యా దేవి, సహాయక మోటార్ ఇన్సపెక్టర్ కవిత, రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ లు మాట్లాడుతూ వాహనాలను అతి వేగంగా నడపరాదని అన్నారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పక హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహన చోదకులు సీట్ బెల్ట్లు పెట్టుకోవాలని పేర్కొన్నారు. ఈ విధంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను రక్షించుకోవచ్చన్నారు. . రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకే రోడ్డు భద్రతా వారోత్సవాలను ఏర్పాటు చేస్తున్నట్లు, ప్రమాదాలు నివారించేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. విద్యార్థులు తల్లిదండ్రులను జాగ్రత్త పరిచే విధంగా అవగాహన కల్పించాలని తెలియజేశారు . ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన కాలేజీ ప్రిన్సిపాల్ జాకిర్ ఉస్మాని, రెబ్బెన జిల్లా పరిషత్ పాఠశాల ఇంచార్గ్రే ప్రధానోపాధ్యాయులుస్వర్ణ లత , సాయి విద్యాలయం హై స్కూల్ ప్రిన్సిపాల్ సంజీవ్ కుమార్., సాయి విద్యాలయం విద్యార్థులు, జిల్లా పరిషత్ విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment