Wednesday, 13 February 2019

విద్యార్థులు ప్రణాళికతో చదవాలి : జిల్లా ఎస్పీ మల్లారెడ్డి



 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 13 ; విద్యార్థులు ప్రణాళికతో  చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. బుధవారం రెబ్బెన  మండల కేంద్రంలోని అతిధి గృహ ఆవరణలో  పోలీసులు మీ కోసంలో భాగంగా రెబ్బెన ఎస్సై ఢీకొండ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి విద్యార్థులకు అవగహన సదస్సు మరియు పరీక్షా సామాగ్రి పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్  మల్లారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా  వారు మాట్లాడుతూ  విద్యార్థులు పరీక్షలకు ప్రణాళిక బద్దంగా చదివి ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ఒత్తిడి లేకుండా  పరీక్షలు రాయాలని అన్నారు.విద్యార్థిని విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకొని పరీక్షలకు సిద్ధం కావాలని  అన్నారు.చదువును ఇష్టం తో అవగహన తో చదవడం వల్ల అది ఎప్పటికి మనకు ఉపయోగ పడుతుందని అన్నారు.తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి చేయకుండ చదువుపై మక్కువతో వారిని పరీక్షలకు సంసిద్ధం చేయాలనీ ఎస్పీ మల్లారెడ్డి అన్నారు.ప్రతి ఒక్క విద్యార్థికి తెలివితేటలు ఉంటాయని వందకు వంద మార్కులు ముఖ్యం కాదని వారిలో ఉన్న నైపుణ్యం ముఖ్యమని అన్నారు.మన దేశంలోని పౌరులు  దేశ విదేశాల్లో ఆయా దేశాల  అభివృద్ధిలో పాటుపడుతున్నారని ఈ సందర్బంగా విద్యార్థులకు గుర్తు చేసారు.విద్యార్థులు ఇప్పటి నుండే దేశం గర్వపడేలా గొప్ప వ్యక్తులుగా ఎదగాలని నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని ఆయన ఆన్నారు.అనంతరం మండలంలోని పదవతరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన సీఐ రమణమూర్తి,ఏసై దీకొండ రమేష్,ఎంవివో వెంకటేశ్వర స్వామి,సర్పంచులు అహల్యాదేవి,చెన్న సోమశేఖర్ ,ఎంపిపి సంజీవ్ కుమార్ ,పాఠశాలల ప్రధాన  ఉపాధ్యాయులు,   మండలంలోని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment