Thursday, 28 February 2019

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 28 ; రెబ్బెన మండలం నక్కల గూడ  ప్రాథమిక పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెబ్బెన  ప్రభుత్వ పాఠశాల   ప్రధానోపాధ్యాయురాలు సిహెచ స్వర్ణ లత  హాజరయ్యారు.  ముందుగా సర్ సి వి రామన్ గారి  చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించారు. అనంతరం   విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుండే ప్రకృతిని పరిశీలించడం తెలుసుకోవడం చేయాలని తద్వారానే జ్ఞానం పెరుగుతుందని తెలియజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్  మాట్లాడుతూ సర్ సి వి రామన్ గారి జీవితం ఎంతో మంది విద్యార్థులకు ప్రేరణ ఇస్తుందని తెలియజేశారు.  1928లో రామన్ ఎఫెక్ట్ అనబడే కాంతి కిరణాల గురించి పరిశోధనలో విజయం సాధించి  రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు గాను ఆయనకు 1930లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నోబెల్ బహుమతి లభించిందన్నారు.    ఈ కార్యక్రమానికి  అతిధులుగా రెబ్బెన హైస్కూల్ జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు  శ్రీదేవి,   ఆంగ్ల ఉపాధ్యాయులు అనీస్ అహ్మద్   హాజరయ్యారు.  కార్యక్రమంలో పాఠశాల  ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్  మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర మహాసభలను విజయవంతం చేయలి ; బోగే ఉపేందర్

 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 28 సింగరేణి కాంట్రాక్టు కార్మికుల కేంద్ర 2వ మహాసభలు కొత్తగూడెంలోని మార్చి 3వ తేదీ రుద్రంపూర్ లో జరుగుతాయని ఏరియా లోని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని scwu గోలేటి బ్రాంచి అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు.గురువారం రోజున గోలేటి లోని కె ఎల్ మహేంద్ర భవన్  కార్మికుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి లో 25వేల మంది కాంట్రాక్టు కార్మికులు చాలి చాలని వేతనాలు తీసుకుంటూ,సంస్థ లాభలోకి రావడానికి,అభివృద్ధి చెందడానికి కార్మికుల కీలక పాత్ర పోసిస్తున్నారని,అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం కార్మికులను శ్రమదోపిడికి గురిచేస్తూ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు,01.01.2013 నుంచి హై పవర్ కమిటీ వేతనాలు చెలించాలని ఉన్నా యాజమాన్యం చెలించడం లేదని,కోల్ ఇండియా లో చేసిన ఒప్పందాలను అమలు చేయాలని అన్నారు,కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు,కార్మికులకు లాభాల వాటా చెలించాలని, కాంట్రాక్టర్ మరీనా కార్మికులను మార్చదని డిమాండ్ చేశారు,కార్మికుల CMPF వివరాలు తప్పుల ఉన్నాయని,అ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం చేయడంలో విఫలం అయ్యారని అన్నారు,అలాగే కార్మికుల కుటుంబాలకు వైద్య సదుపాయం కల్పించాలనిఅన్నారు,ప్రతి నెల 10 తేదీ లోపు వేతనాలు ఇవ్వాలని,అలాగే కార్మికులకు జీతం చిట్టీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు,సి.హెచ్.పి ,బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు స్కిల్ల్డ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు,కార్మికులు ఎదుర్కొంటున్నా సమస్యలను కేంద్ర మహాసభ లో చర్చించి తీర్మానాలు చేయడం జరిగుతున్నదని అన్నారు. కావున ఏరియా లోని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.. ఈ సమావేశంలో గోలేటి బ్రాంచ్ కార్యదర్శి చల్లురి అశోక్,సహాయ కార్యదర్శి సాగర్,నాయకులు ఆశలు,తిరుపతి, శంకర్,నాగేశ్వర్ రావులతో పాటు తదితరులు ఉన్నారు.

జాతీయ సైన్స్ దినోత్సవా వేడుకలు

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 28 ; జాతీయ సైన్స్ దినోత్సవాన్ని  రెబ్బెన మండలం నారాయణపూర్ ప్రాథమికొన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా గురువారం  నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నారాయణపూర్ గ్రామ సర్పంచ్ వేమునూరి అమృత హాజరయ్యారు.  విద్యార్థులు తాయారు చేసిన ప్రయోగాలని,బోదనోపకరణాలని తిలికించారు ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననటి నుండే ప్రకృతిని పరిశీలించడం తెలుసుకోవడం చేయాలని తద్వారానే జ్ఞానం పెరుగుతుందని అన్నారు.ఈ  కార్యక్రమంలో గ్రామ పెద్దలు పల్లె శ్రీనివాస్ ,సుగుణకార్,కిరణ్ ,జగదీశ్, తిరుపతి,పాఠశాల  ఉపాధ్యాయులు శారద, కవిత  రాణి, సరోజ, సిఆర్పీ యం.రాజేష్, యువకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Wednesday, 27 February 2019

పిచ్చికుక్కల స్వైరవిహారం ; పలువురికి తీవ్ర గాయలు

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 27  రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గత కొద్దిరోజులుగా  పిచ్చికుక్కలు గ్రామంలో విచ్చల విడిగా తిరిగితున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం   లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  . బుధ వారం గంగాపూర్ గ్రామంలో వాడే లక్ష్మి 4 సం పాపను, లక్ష్మీపూర్ గ్రామంలో మరొకరిని  పెప్రి వెంకటేష్ 5 సం బాబు , పాసిగం గ్రామంలో దాగం మల్లయ్య 60 సం, తాళ్లపల్లి జ్యోతి 35 సంవత్సరాలు ఇద్దరి ని గాయపరచడంతో పాటు మూడు మేకలపై దాడిచేసి తీవ్రంగా గాయపరచినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా సంభందిత అధికారులు స్పందించి పిచ్చికుక్కలను  అరికట్టాలని కోరుతున్నారు. లేనిపక్షంలో చిన్నపిల్లలు గాని వృద్దులు గాని ఆయా గ్రామాలలో ఇండ్లనుండి బయటకు వెళ్లే పరిస్థితి  లేదన్నారు.

స్వాతంత్ర పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ కు ఘన నివాళి

 చంద్రశేఖర్ ఆజాద్ కు ఘన నివాళి 
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 27 ;  ప్రముఖ స్వాతంత్ర పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతిని పురస్కరించుకొని  రెబ్బెన మండలం నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు  కల్వల శంకర్, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు   చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు  మాట్లాడుతూ స్వతంత్రం కోసం పోరాడిన మన నాయకులను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత రంగంలో స్థిరపడాలనే తెలియజేశారు    25 సంవత్సరాల చిరు ప్రాయంలోనే భారతదేశ    స్వతంత్రం కోసం పోరాడుతూ తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని అన్నారు .  1919 లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం చంద్రశేఖర్ ఆజాద్ మనసును బాగా కలచివేయడంతో 19 28 సెప్టెంబర్ లో భగత్ సింగ్ సుఖదేవ్ లతో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారన్నారు.    భారతదేశానికి ఏ విధంగానైనా స్వాతంత్రం తీసుకురావాలనేది చంద్రశేఖర్ ఆజాద్ దృఢ సంకల్పం స్వాతంత్ర ఉద్యమ కారులను అణగదొక్కే బ్రిటిష్ అధికారుల పై చంద్రశేఖర్ ఆజాద్ తన సహచరులతో కలిసి దాడి చేసేవారన్నారు.  ఫిబ్రవరి 27 1931వ సంవత్సరంలో బ్రిటిష్ వారు బందీగా పట్టుకోవడంతో  బ్రిటీష్ అధికారుల చేతుల్లో చావకూడదు అన్న ఆలోచనతో తనను తాను కాల్చుకుని మరణించాడన్నారు.    ఈ కార్యక్రమానికి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు రాజకమలాకర్ రెడ్డి , చైతన్య,  దుర్గం శ్రీనివాస్,  లకావత్ శంకర్,  దురిశెట్టిరాజశేఖర్, కుమార్, నాగరాజు మరియు వార్డు మెంబర్ శ్యామ్ రావు విద్యా కమిటీ చైర్మన్ మీసాల పోష మల్లు ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్  విద్యార్థులు పాల్గొన్నారు.

Saturday, 23 February 2019

కోల్ ఇండియా లెవెల్ షటిల్ బ్యాట్మెంటిన్ టోర్నమెంట్


 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 23 ; జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచి ఖేల్ గావ్  సిసిఎల్ ఠాగూర్  విశ్వనాథ్ ఇండోర్ స్టేడియంలో 23 నుండి 26 వరకు కోల్ ఇండియా లెవెల్ షటిల్  బ్యాట్మెంటిన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని బెల్లంపల్లి ఏరియా ఇంచార్జ్ డిజియం పర్సనల్ బి సుదర్శన్ శనివారం తెలిపారు. ఈ కోల్ ఇండియా పోటీలలో సింగరేణి జట్టు పాల్గొననున్నదని  ఈ జట్టుకు మేనేజర్ గ ఏ రాజేశ్వర్ పర్సనల్ మేనేజర్,   జట్టు కోచ్ గా  హెచ్ రమేష్ స్పోర్ట్స్ సూపర్వైజర్ లు  వ్యవహరిస్తారని అన్నారు. జట్టు క్రీడాకారులు ఆర్జీ గ్రూప్ నుండి డి విజయ్ కుమార్, కుసుమ, స్వరూప, భూపాలపల్లి గ్రూప్ నుండి సారంగపాణి, శంకరయ్య ఎన్ సురేష్, హెడ్ ఆఫీస్ నుండి పి వివేక్, వర్ధన్, కార్పొరేట్ నుండి కె శైలజ, బెల్లంపల్లి ఏరియా నుండిఎస్ కే అంకుష్  పాల్గొంటున్నట్లు  తెలిపారు. 

ఓటర్లు ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొవాలి

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 23 ; ఓటర్లు  ఎన్నికలలో ఉపయోగించే   ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొని ఓటు హక్కు ను వినియోగించుకోవాలని రెబ్బెన మండల రెవిన్యూ ఇనస్పెక్టర్  ఊర్మిళ అన్నారు.  శనివారం  రెబ్బెన మండలం  వం కులం    గ్రామం పోలింగ్ స్టేషన్ 269 లో  ప్రజలకు     ఎన్నికలలో ఉపయోగించే  ఈవిఎం , వి వి ఫాట్ యంత్రాల వినియోగ విధానం  పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారం పదోన్నతులు వేతన స్థిరీకరణ చేపట్టాలి

 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 23 ; ఉమ్మడి సీనియారిటీ మరియు ప్రస్తుత నిబంధనల ప్రకారం పదోన్నతులు , వేతన స్థిరీకరణ చేపట్టాలని స్పెషల్ గ్రేడ్ టీచర్స్ ఢిమాండ్ చేశారు. శనివారం రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహ ఆవరణలో జరిగిన సమావేశంలో ఎస్  జి టి   సమావేశంలో  ఉపాధ్యాయులు రాజకమలాకర్ రెడ్డి, కల్వల శంకర్ ,తదితరులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వేతన స్థిరీకరణ చేపడితే  తదనంతర పర్యవసానాల కు  జిల్లా విద్యాశాఖాధికారి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించ వలసి ఉంటుందని అన్నారు. ఈ  సమావేశంలో లోకేష్, రవికుమార్, సోమశేఖర్, శ్రీను, నాగరాజు, మనోహర్, శ్రీనివాస్, జనార్దన్, శ్రీధర్, అశోక్, వినోద్, సంతోష్ లు పాల్గొన్నారు. 

Thursday, 21 February 2019

సమస్యలను పరిష్కరించే వారినే గెలిపించాలి

 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 21  సమస్యలను పరిష్కరించే వారినే  శాసన  మండలి ఎన్నికలలో  ఉపాధ్యాయ ప్రతినిధిగా  గెలిపించాలని  .ఎస్టీయూ జిల్లా అధ్యక్షలు తాటి రవీందర్ అన్నారు. గురువారం  రెబ్బెన మండలంలోని  వివిధ పాఠశాలలలో ఎస్టీయూ అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ   ప్రధానంగా   ఉఫాద్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సి పి ఎస్  అని .దానిని అంతం చేసే వరకు శాసన మండలిలో పోరాడుతామని,   శాసన మండలిలో ప్రశ్నిచే వారు ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు పరిష్కరించబడుతాయని,  ఉపాధ్యాయుల సమస్యల సాధనలో ఎస్టీయూ ముందుంటుందని, గతంలో ధర్మగ్రహాసభ,పొరుదీక్ష,మహాధర్నా,లాంటి కార్యక్రమాలను  ప్రభుత్వ ఒత్తిడిలకు లొంగకుండా విజయవంతం చేయడం జరిగిందన్నారు.  ఈ దిశగా ఉపాధ్యాయులు ఆలోచించి ఎస్ టి యు  అభ్యర్థి ని గెలిపించ వల్సిందిగా కో రారు.  ఈప్రచారంలో జిల్లా  ప్రధాన కార్యదర్శి పుర్క మానిక్ రావు,రెబ్బెన మండలాధ్యక్షులు చునార్కర్ తుకారామ్ రెబ్బెన మండల .ఎస్టీయూ కార్యదర్శి వసీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొవాలి

 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 21 ; విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని  సాధించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని  రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శంకర్ అన్నారు.  గురువారం   రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మొదటి సంవత్సరం విద్యార్థులు వీడ్కోలు దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ గీతాలాపనతో మొదలైన ఈ కార్యక్రమం అనంతరం ఇటీవల జమ్మూ  కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు ఒక నిముషం మౌనంపాటించి నివాళులర్పించారు. అనంతరం కాళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకొంటున్నప్పుడే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాధన దిశగా అడుగు వేసి సాధిస్తే  జీవితం సుఖమయం అవుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. పరీక్షలలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు మెమెంటో లు అందచేశారు.  ఈ కార్యక్రమంలో సిర్పూర్ కాలేజీ ఇంచార్జి  ప్రిన్సిపాల్ అతియా ఖానం,  లెక్చరర్ శాంత,  రెబ్బెన కళాశాల  అధ్యాపకులు   ప్రకాష్, గంగాధర్, సతీష్, శ్రీనివాస్, అమరేందర్, ప్రవీణ్, మంజుల, వెంకటేశ్వర, మల్లేశ్వరి, వరలక్ష్మి, దీప్తి, నిర్మ్యాల, సంధ్య, ఝాన్సీ, మహేష్, కృష్ణ మూర్తి, సరళ, సిబ్బంది ప్రకాష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 

Monday, 18 February 2019

కన్నులపండుగా గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వరస్వామి కళ్యాణం

స్వామి వారి కల్యాణం ; ప్రారంభమైన గంగాపూర్ జాతర 
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 18 ;  రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామా శివారులో వెలిసిన బాలాజీ వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణం సోమవారం  కన్నులపండుగగా కడురమణీయంగా  వైభవంగా వేదమంత్రాల నడుమ వెలది  భక్తుల   మద్య   జరిగింది.  భక్తులు స్వామి వారి మండపంలో వేదపండితులచే  వేదమంత్రోచ్చారణలతో స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. రెబ్బెనమండలంలోని వివిధ గ్రామాలనుంచి భక్తులు తరలి వచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించి పరవశించారు.  కళ్యాణం అనంతరంకొందరుభక్తులుఅన్నదానకార్యక్రమం నిర్వహించారు.మండలంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో భక్తులకు భద్రతా, త్రాగునీటి సదుపాయం, కల్పించారు. ఈ కార్యక్రమంలో వ లంటీర్లు సేవలు అందించారు.  రేపు జరిగే రధోత్సవమునకు వే లాది  భక్తులు  తరలి  వస్తారని నిర్వాహకులు తెలిపారు.

Sunday, 17 February 2019

కెసిఆర్ జన్మదినం సందర్భంగా హరిత హారం

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 17 ;  ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రెబ్బెన సర్పంచ్ బొమ్మినేని  అహల్యాదేవి అన్నారు. ఆదివారం కెసిఆర్ జన్మదినం సందర్భంగా రెబ్బెన   గ్రామ పంచాయతీ ఆవరణలో  మొక్కలు  నాటారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పర్యావరణ కాపాడటంలో భాగస్వాములు కావాలని  తెలంగాణ హరిత రాష్ట్రానికి అందరూ కృషి చేయాలన్నారు.  ప్రతి ఒక్కరి  పుట్టిన రోజు చెట్టు నాటాలని  ఈ సందర్భంగా సూచించారు..   ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మెన్ కుందారపు శంకరమ్మ,   ఉపసర్పంచు మడ్డి శ్రీనివాస్,  మాజీ ఉప సర్పంచ్ బొమ్మిన శ్రీధర్,   నాయకులు జాకీ ఉస్మాని సుదర్శన్ గౌడ్ శాంతి  కుమార్ గౌడ్,  శంకర్,  అశోక్, జహీర్ బాబా, వినోద్ జైస్వాల్, తిరుపతి, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.


ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు

 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 17 ;   రెబ్బెన మండలం పులికుంట  గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధి గా హాజరైన నాబార్డ్ అధికారి అంజన్న మాట్లాడుతూ  ప్రజలు  నగదు  రహిత లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు.ఈ విధానం ద్వారా బహుళ ప్రయోజనాలున్నందున వాటిని వాడడం అలవాటు చేసుకోవాలని అన్నారు. సంపాదించిన ప్రతి పైసాను దుబారా చేయకుండా పొదుపు పాటిస్తే భవిష్యత్తులో ఉపయోగపడతాయన్నారు.   ఈ కార్యక్రమంలో పులికుంట గ్రామ సర్పంచ్ పోచమల్లు, వ్యవసాయ పరపతి సంఘం సి ఈ ఓ సంతోష్ ,  రైతులు , గ్రామస్తులు పాల్గొన్నారు.

గంగాపూర్ జాతర భద్రతా ఏర్పాట్ల పరిశీలన

రెబ్బెన ; గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో  ఆదివారం నుండి  మూడు రోజులు జరగబోయేకళ్యాణం, రధోత్సవం, జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఎస్పీ మల్లారెడ్డి సూచించారు. శనివారం  రెబ్బెన మండలం గంగాపూర్  బాలాజీ వెంకటేశ్వర స్వామివారి  దర్శనం చేసుకున్నారు.  ఈ  సందర్భంగా జిల్లా పోలీస్ సూపెరింటెండ్ కు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి బాపి రెడ్డి, అర్చకులు గణేష్ పంతులు, , గ్రామ సర్పంచ్  లు  ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన మాట్లాడుతూ కొమురంభీం ఆసిఫాబ్ జిల్లాలో ఎంతో   ప్రఖ్యాతి వహించిన  స్వామివారి కళ్యాణానికి, భారి సంఖ్యలో భక్తులు విచ్చేయు సందర్భంగా  వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇతర ప్రభుత్వ , స్వచ్చంద సంస్థలతో సమన్వయము చేసుకొని పోలీస్ శాఖ  భద్రత మరియు దర్శనం చేయించాలని సూచించారు. ఆయన వెంట ఆసిఫాబాద్ డి ఎస్ పి  సత్యనారాయణ, సర్కిల్ ఇన్సపెక్టర్  రమణ మూర్తి,, ఎస్సై దీకొండ  రమేష్, ఉన్నారు. ఈ కార్యక్రమంలో పందిర్ల మాదనయ్య,  రమేష్, వెంకటేష్, సర్వేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Thursday, 14 February 2019

మూఢనమ్మకాలపై అవగాహన కలిగి ఉండాలి

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 14 ;  చిన్నతనంనుంచే  మూఢనమ్మకాలపై  అవగాహన కలిగి ఉండి సమాజంలో మెలిగితే బంగారు భవిష్యత్తు నిర్మించుకోవచ్చని ప్రముఖ ఇంద్రజాలికుడు మంతెన రాజశేఖర్ అన్నారు.  గురువారం రెబ్బెన మండలం  నక్కల గూడ  గ్రామంలోని  ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు చిన్న చిన్న లాజిక్స్ ని మ్యాజిక్ ని నమ్మి వేల రూపాయలు డబ్బులు పోగొట్టుకొని మోసపోతున్నారన్నారు.   దేవుడు, దయ్యం రెండు మానవ  కల్పితాలేనని అన్నారు.  దేవుడు  పేరుతొ  మోసం చేసే వాళ్ళను , దయ్యం అని చెప్పి భయపెట్టేవాళ్లను    నమ్మ రాదన్నారు, కొంతమంది స్వార్థపరులు ప్రజల సొమ్మును కాజేసి వారి  ఆస్తిపాస్తులు పెంచుకుంటున్నారని అన్నారు.  విద్యార్థులు మూఢనమ్మకాలను నమ్మకుండా వారి భవిష్యత్తును మరింత అందంగా  ఉజ్వలంగా తయారు చేసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్, ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్ గ్రామస్తులు  మరియు విద్యార్థులు పాల్గొన్నారు

Wednesday, 13 February 2019

విద్యార్థులు ప్రణాళికతో చదవాలి : జిల్లా ఎస్పీ మల్లారెడ్డి



 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 13 ; విద్యార్థులు ప్రణాళికతో  చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. బుధవారం రెబ్బెన  మండల కేంద్రంలోని అతిధి గృహ ఆవరణలో  పోలీసులు మీ కోసంలో భాగంగా రెబ్బెన ఎస్సై ఢీకొండ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి విద్యార్థులకు అవగహన సదస్సు మరియు పరీక్షా సామాగ్రి పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్  మల్లారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా  వారు మాట్లాడుతూ  విద్యార్థులు పరీక్షలకు ప్రణాళిక బద్దంగా చదివి ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ఒత్తిడి లేకుండా  పరీక్షలు రాయాలని అన్నారు.విద్యార్థిని విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకొని పరీక్షలకు సిద్ధం కావాలని  అన్నారు.చదువును ఇష్టం తో అవగహన తో చదవడం వల్ల అది ఎప్పటికి మనకు ఉపయోగ పడుతుందని అన్నారు.తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి చేయకుండ చదువుపై మక్కువతో వారిని పరీక్షలకు సంసిద్ధం చేయాలనీ ఎస్పీ మల్లారెడ్డి అన్నారు.ప్రతి ఒక్క విద్యార్థికి తెలివితేటలు ఉంటాయని వందకు వంద మార్కులు ముఖ్యం కాదని వారిలో ఉన్న నైపుణ్యం ముఖ్యమని అన్నారు.మన దేశంలోని పౌరులు  దేశ విదేశాల్లో ఆయా దేశాల  అభివృద్ధిలో పాటుపడుతున్నారని ఈ సందర్బంగా విద్యార్థులకు గుర్తు చేసారు.విద్యార్థులు ఇప్పటి నుండే దేశం గర్వపడేలా గొప్ప వ్యక్తులుగా ఎదగాలని నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని ఆయన ఆన్నారు.అనంతరం మండలంలోని పదవతరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన సీఐ రమణమూర్తి,ఏసై దీకొండ రమేష్,ఎంవివో వెంకటేశ్వర స్వామి,సర్పంచులు అహల్యాదేవి,చెన్న సోమశేఖర్ ,ఎంపిపి సంజీవ్ కుమార్ ,పాఠశాలల ప్రధాన  ఉపాధ్యాయులు,   మండలంలోని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Monday, 11 February 2019

కత్తితో దాడి చేసిన వ్యక్తి పై కేసు నమోదు

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 11 ; రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య పై కత్తి తో దాడి చేసిన  లింగన్నపై కేసు నమోదు చేసినట్టు రెబ్బెన ఎస్సై దీకొండ  రమేష్ సోమవారం తెలిపారు. ఆయన తెలిపీన వివరాల ప్రకారం   గంగాపూర్ గ్రామానికి చెందిన జాగిరి చంద్రయ్య తన కూతురు కృష్ణవేణిని  పది సంవత్సరాల క్రితం రెబ్బెనకు చెందిన  లింగన్నకు ఇచ్చి వివాహం చేశాడని  . అయితే తాగుడుకు బానిసగా మారిన లింగన్న భార్యను శారీరకంగా మానసికంగా హింసించేవాడని   ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా  లింగన్న ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని .  గతంలో  లింగన్న  అతని అన్నదమ్ములతో గొడవపడి ఇంట్లో నుండి బయటకు వెళ్లగా చంద్రయ్య చేరదీశాడు. .  అయినా  అతని అతనిలో ఎలాంటి మార్పు రాకపోగా మళ్ళీ భార్యను తిట్టి కొట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయినట్లు . తిరిగి కొద్దిరోజులకు  గ్రామానికి వచ్చి  మేనత్త పట్ల అసభ్యకరంగా ప్రవర్తించగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జైలుకు  పంపినట్లు  ఎస్సై తెలిపారు.   మామ బెయిల్ ఇవ్వలేదని కక్ష పెంచుకున్నాడు.  ఇటీవల జైలు నుండి బయటకు వచ్చిన లింగన్న మామపై కక్షతో దాడి చేసేందుకు అదనుకోసం ఎదురుచూస్తున్నాడు.  ఈ క్రమంలో ఆదివారం రాత్రి గంగాపూర్ నుండి రెబ్బెనకు వస్తున్న చంద్రన్న మండల కేంద్రంలోపోస్ట్ ఆఫీస్ ఎదుట  అడ్డగించి తన వెంట తెచ్చుకున్న  కత్తితో దాడికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన .   చంద్రయ్య తపించుకునే ప్రయత్నం చేయగా అతని కంటి బొమ్మ పై తీవ్రగాయమైంది. దాంతో చంద్రయ్య ఇచ్చిన మేరకు  లింగన్న పై  కేసు నమోదు చేసిన చేసినట్లు తెలిపారు.

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యలో సర్పంచులకు సన్మానం

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 11 ; రెబ్బెన మండల కేంద్రంలోని   సీతారామాంజనేయ ఆలయంలో  మున్నూరుకావు   సంఘం ఆధ్వర్యంలో     ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నంబాల సర్పంచ్ సోమశేఖర్ ఖైర్ గామ్ సర్పంచ్ మాన్యం కార్తిక్,  రాజారాం  ఓరుగంటి మల్లేష్ తో పాటు పలువురు సర్పంచ్ లను   సోమవారం ఘనంగా సన్మానించారు.   ఈ సందర్భంగా ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ  వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ లు    మాట్లాడుతూ మున్నూరుకాపు కులస్థులు రాజకీయంగా మరింత ఎదగాలని కోరారు.  అందరూ ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలన్నారు..   గ్రామాల్లో  ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత  స్థితికి చేరుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో నాయకులుపూదరి  సాయికిరణ్,  రవీందర్ సృజన్ వెంకటి అశోక్ తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్ర మహాసబలు విజయవంతం చేయాలి

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 11 ; ఈ నెల 21 తేదీన సివిల్  సప్లయీస్ హమ్మలి వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) తెలంగాణ రాష్ట్ర మొదటి మహాసబలు హైదరాబాద్ లో జరుగుతాయని ఏఐటీయూసీ కుమురంభీం జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్  సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీలకు కనిసవేతనం 18వేలు ఇవ్వాలని, ఈ  ఎస్ ఐ , పి  ఎఫ్   సౌకర్యం కల్పించాలని, హమాలీల సమగ్ర  సంక్షేమ చట్టం తీసుకు రావాలని,హమాలీల రేట్లు రూపాయలు 25 పెంచాలని,అలాగే 14 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని,అన్నారు,హమాలీలను ప్రభుత్య ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారూ,50 సంవత్సరాలు నిండిన   హమాలీలకు 3000 పెన్షన్ ఇవ్వాలని అన్నారు..హమాలీలకు డబులు బెడ్ రూము ఇండ్లు ఇవ్వాలని అన్నారు.  ఈ సభలను జిల్లాలోని హమాలీలు  అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Friday, 8 February 2019

రోడ్డు ప్రమాదాల నివారణకు అందరు సహకరించాలి


కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 8 ; రోడ్డు ప్రమాదాల నివారణకు అందరు సహకరించాలని  రెబ్బెన ఎస్సై దీకొండ   రమేష్  లు కోరారు.  శుక్రవారం  రెబ్బెన  మండల కేంద్రంలో  రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ముప్పై వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా రోడ్డు నిబంధనలపై కళాజాత ప్రదర్శనలు నిర్వహించారు. మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై   విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు.  అనంతరం రెబ్బెన ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో రెబ్బెన సర్పంచ్ అహల్యా దేవి,  సహాయక మోటార్  ఇన్సపెక్టర్  కవిత, రెబ్బెన ఎస్సై దీకొండ   రమేష్  లు  మాట్లాడుతూ వాహనాలను అతి వేగంగా నడపరాదని అన్నారు.    ద్విచక్ర వాహన చోదకులు  తప్పక  హెల్మెట్ ధరించాలని,   నాలుగు చక్రాల వాహన  చోదకులు  సీట్ బెల్ట్లు పెట్టుకోవాలని  పేర్కొన్నారు. ఈ విధంగా   రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను రక్షించుకోవచ్చన్నారు.  . రోడ్డు  ప్రమాదాలు  అరికట్టేందుకే రోడ్డు భద్రతా వారోత్సవాలను   ఏర్పాటు చేస్తున్నట్లు,  ప్రమాదాలు నివారించేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.  విద్యార్థులు తల్లిదండ్రులను జాగ్రత్త పరిచే విధంగా అవగాహన కల్పించాలని తెలియజేశారు . ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన  కాలేజీ ప్రిన్సిపాల్ జాకిర్ ఉస్మాని, రెబ్బెన జిల్లా పరిషత్ పాఠశాల ఇంచార్గ్రే ప్రధానోపాధ్యాయులుస్వర్ణ లత  ,  సాయి విద్యాలయం హై స్కూల్ ప్రిన్సిపాల్ సంజీవ్ కుమార్., సాయి విద్యాలయం విద్యార్థులు, జిల్లా పరిషత్  విద్యార్థులు పాల్గొన్నారు.  

వన నర్సరీ ప్రారంభం

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 8  ; హరితహారం పథకంలో నాటిన మొక్కలను జాగ్రత్తగా కాపాడాలని రెబ్బెన సర్పంచ్ అహల్యాదేవి అన్నారు. శుక్రవారం రెబ్బెనలో వన నర్సరీని ప్రారంభించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొందించేందుకు హరితహారం పథకాన్ని శ్రీకారం చుట్టి అమలు చేస్తుందన్నారు. . హరితహారంలో నాటిన నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. 3లక్షల 50వేలు వేయంతో ఏర్పాటు చేస్తున నర్సరీలో  50000  మొక్కలు  వచ్చే జూన్ నాటికి పంచాయతీ పరిధిలో నాటేందుకు అవసరం పడే మొక్కలు సిద్ధమవుతాయని తెలిపారు. పంచాయతీలో నాటగా మిగిలిన మొక్కలు ఇతర పంచాయతీలకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచి మడ్డీ శ్రీనివాస్ ,  టి ఏ  వై  జయ,  ఫీల్డ్ అసిస్టెంటు ఏ .తుకారం లు  పాల్గొన్నారు.  

Wednesday, 6 February 2019

పంచాయతీ కార్యదర్శి మురళీధర్ పై డి ఆర్ డి ఓ వెంకట్ తీవ్ర ఆగ్రహం ; వెల్లువెత్తిన ఫిర్యాదులు

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 6 ;  రెబ్బెన  పంచాయతీ కార్యదర్శి మురళీధర్  పై కొమురంభీం  ఆసిఫాబాద్ జిల్లా డి ఆర్ డి ఓ వెంకట్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రెబ్బెన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విధినిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం చూపిన కార్యదర్శిని తీవ్రం గా మందలించారు.  కార్యదర్శిపై వెల్లువెత్తిన ఫిర్యాదులను చూసి  విస్తుపోయిన ఆయన శాఖాపరమైన చర్యలకు వెనుకాడేది లేదని మందలించారు. కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్న ప్రజలు డి అర్  డి ఓ కు మౌఖికంగా మరియు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు.  బాధితులందరు ముక్తకంఠంతో తమను సంవత్సరాలతరబడి మరుగు దొడ్ల నిర్మాణ బిల్లుల  చెల్లింపులు చేయడం లేదని, బిల్లు చెల్లింపులకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ముందస్తుగా సంతకాలు చేయించుకొని నేరుగా నగదు పంపిణి చేస్తామని చెప్పి  నెలల తరబడి తిప్పుకుంటున్నారని వాపోయారు. పధకాల లబ్దిదారులకు విధిగా చెక్కులు ఇవ్వవలసింది పోయి చెక్కులు లేవని డబ్బులు డ్రా చేసుకొని నగదు లో పెద్దమొత్తాన్ని మినహాయించుకొంటున్నాడని ఫిర్యాదు చేశారు. గ్రామపంచాయితీలో సమయపాలన పాటించకుండా  తన ఇష్ట రీతిన వ్యవహరిస్తు లబ్దిదారులను నోటికచ్చినట్లు తిడుతున్న విషయం డీఆర్డీవో దృష్టికి రావడం తో మరోసారి ఇలాంటి పనులకు  పాల్పడితే తగు చర్యలు తీసుకుంటామని గ్రామ కార్యదర్శిని  హెచ్చరించారు.   ఈ సందర్భంగా డి ఆర్ డి ఓ  మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ మొదలైన పధకాల ప్రయోజనం ఇలాంటి అధికారుల వల్ల  నీరుగారిపోతుందని అన్నారు. పంచాయతీ కార్యాలయ ము లో  సర్పంచే   సర్పంచ్ అహల్యా దేవికి  సన్మానం చేశారు.  ఈ కార్యక్రమంలో  సర్పంచ్ అహల్యా దేవి, డి ఎల్ పి  ఓ వెంకటయ్య, ఏ  పి  ఓ కల్పనా , హెచ్ అర్  డి ఓ ఫణి కుమార్, తదితరులు ఉన్నారు.

Tuesday, 5 February 2019

కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు


కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 5  ; కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ సభ రెబ్బెన  మండలకేంద్రంలో మంగళవారం  ఏర్పాటుచేశారు. సభకు విచ్చేసిన  ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రంసక్కు ను  అంబెడ్కర్ విగ్రహం  నుండి భారీ ర్యాలీగా బాణా సంచా కాలుస్తూ ఘనంగా   సభాస్థలి కి చేరుకున్నారు. మండలం లోని తెరాస సీనియర్ నాయకులు  నవీన్ జైస్వాల్, మోడెమ్ చిరంజీవి గౌడ్, వైస్  ఎంపీపీ  గుడిసెల రేణుక , గుడిసెల వెంకటేశ్వర్ గౌడ్,  తెరాస నాయకులూ,   కార్యకర్తలు ,ఇతర అభిమానులు వంటి ప్రముఖులు భారీగా కాంగ్రెస్ పార్టీ లో చేరారు.   ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచ్ లను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించారు.రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులూ ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా    ఎమ్మెల్యే   ఆత్రం సక్కు మాట్లాడుతూ  తిరిగి కాంగ్రెస్ పూర్వ వైభవం పొందనున్నట్లు తెలిపారు . కాంగ్రెస్ పార్టీ లో  కార్యకర్తలకు   సముచిత గౌరవం దక్కుతుందన్నారు.    ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులూ పల్లె ప్రకాష్ రావ్  ,  కిసాన్ సెల్ జిల్లా  అధ్యక్షులు బాలేశ్వర్ గౌడ్ ,డీసీసీ జిల్లా  అధ్యక్షులు విశ్వప్రసాద్,  మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముంజం రవీందర్, ఉపాధ్యక్షులు దుర్గం రాజేష్ ఎంపీటీసీలు కె శ్రీనివాస్, సురెందర్ రాజు, టౌన్ అధ్యక్షులు వనమాల  మురళి,  ఎస్ టి  సెల్ అధ్యక్షులు లావుడ్య రమేష్,  మరియు కాంగ్రెస్ కార్యకర్తలు  పాల్గొన్నారు. 

Monday, 4 February 2019

తెలంగాణ అమరుడికి ఘన నివాళి

 
కొమరంభీం ఆసిఫాబాద్ (రేబ్బెన) ఫిబ్రవరి 4  ; తెలంగాణ అమరవీరుడు తాళ్లపెల్లి వేణుకుమార్ గౌడ్ జయంతి సందర్భంగా సోమవారం రెబ్బన  యూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు తల్లిదండ్రులు  ప్రభాకర్ గౌడ్, నాగలక్ష్మిలు  భోజనం  ప్లేట్లు మరియు స్వీట్లు పంపిణీ చేశారు  రెబ్బెన  గ్రామ సర్పంచ్ బొమ్మినేని  అహల్యాదేవి,  ఎంపిపి కర్నాధం సంజీవ్కుమార్,  ఎస్సై దికొండ రమేష్ లు  ముఖ్య అతడులుగా పాల్గొని  విద్యార్థులకు అమరవీరుని అల్లిదండ్రులు సమకూర్చిన వస్తువులను అందచేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్దగా చదువుకొని జీవితంలో అభివృద్ధిలోకి రావాలని అన్నారు. తెలంగాణ అమరవీరుడు తాళ్లపెల్లి వేణుకుమార్ గౌడ్ ఆత్మశాంతికి  2 నిమిషాలపాటు  మౌనం పాటించారు.  ఈ కార్యక్రమంలో   ఉపసర్పంచ్ మద్ది శ్రీనివాస్ గౌడ్,  మండల తెరాస  పార్టీ అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి,  నాయకులు సుదర్శన్ గౌడ్ , పెసర మదునయ్య,  బొమ్మినేని శ్రీధర్ కుమార్,   జాకీర్ ఉస్మాని,  కృష్ణ,  అఫ్రోజ్, నాసిర్ ఉస్మాని ,     పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఖాదర్ , సీఆర్పీ దేవేందర్,  ఈశ్వర్  తదితరులు పాల్గొన్నారు. 



దూర విద్య పి.జి. ప్రవేశాలకు ఈనెల15 తుది గడువు

కొమరంభీం ఆసిఫాబాద్ (రేబ్బెన) ఫిబ్రవరి 4  ; కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య విధానం లో పి.జి. పలు కోర్సుల ప్రవేశాలకు ఈనెల  15  ఆఖరు  తేదీ   కావున  ఆసక్తి గల అభ్యర్థులు గడువు లోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా రెబ్బన ఆర్ట్స్ & సైన్స్ డిగ్రీ కళాశాల దూర విద్య కేంద్రంలో సంప్రదించి ప్రవేశాలు పొందగలరని కళాశాల ప్రిన్సిపాల్ జాకిర్ ఉస్మాని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  పూర్తి వివరాలకు కో ఆర్డినేటర్లు పూదరిమల్లేష్ (8919118206), దేవాజి 7730021811, (గణేష్ 8639232120),  చరవాణిలో సంప్రదించగలరని కోరారు. 

వాలీబాల్ టోర్నమెంట్ మోటర్ డ్రైవింగ్ ట్రైనింగ్ కోర్సుల ప్రారంభం

కొమరంభీం ఆసిఫాబాద్ (రేబ్బెన) ఫిబ్రవరి 4  ; బెల్లంపల్లి ఏరియాలోని  9 ఆర్ అండ్ ఆర్  సెంటర్ యువకుల  కోసం మంగళవారం రెబ్బెన మండలం  గోలేటి   శ్రీ భీమన్న గ్రౌండ్ నందు  వాలీబాల్ టోర్నమెంట్  నిర్వహిస్తున్నామని  ఏరియా డీజీఎం పర్సనల్ జె కిరణ్  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వాలీబాల్ పోటీలను మంగళవారం ఉదయం పది గంటలకు జనరల్ మేనేజర్ రవిశంకర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. తదుపరి   సింగరేణి సేవా సమితి వారి ఆధ్వర్యంలో గోలే టౌన్షిప్ మరియు మాధారం టౌన్షిప్లలో నివసించే  కార్మికుల  వారి పిల్లలకు మోటర్ డ్రైవింగ్ ట్రైనింగ్ కోర్సులను సింగరేణి సేవ సంస్థ అధ్యక్షులు శ్రీమతి అనురాధ రవిశంకర్ జండా ఊపి   ప్రారంభిస్తారని తెలిపారు. 

Sunday, 3 February 2019

ఓటు హక్కు నమోదు చేసుకోవాలి


కొమరంభీం ఆసిఫాబాద్ (రేబ్బెన) ఫిబ్రవరి 3  ; యువతి యువకులందరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రెబ్బెన ఆర్ ఐ ఊర్మిళ అన్నారు. ఆదివారం బూత్ లెవల్ అధికారులకు వారికీ కేటయిచిన బూత్ లలో నియమించి నమోదు కార్యక్రమన్ని నిర్వహచరు. జనవరి 2019  నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరు తప్పని సరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు.  ఓటరుగా నమోదు చేసుకోవడానికి కావలసిన అన్ని ఫారాలు అందుబాటులో ఉంచామన్నారు. బూత్ లెవల్ అధికారులకు లేదా కార్యాలయంలో అందజేయాలన్నారు. ఓటరు జాబితాలో వివరాల  మార్పులు చేర్పులకు  కూడా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు

ప్రభుత్వ పథకాలు సద్వినయోగం చేసుకోవాలి


కొమరంభీం ఆసిఫాబాద్ (రేబ్బెన) ఫిబ్రవరి 3  ;   ప్రజా సంక్షేమం ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకంలో ప్రతి ఒక్కరూ సద్వినియో ని మారదని స్నేహితులను వర్గ ఎమ్మెల్సీ పురాణం సతీష్ అన్నారు. ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహములో  పాశిగం  గ్రామానికి చెందిన జిమిడి మహేష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన ఒక లక్ష చెక్కును బాధిత తండ్రి శంకర్ కి అందజేశారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు.  ముఖ్యంగా  మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో పాటు రైతు బందు,  కళ్యాణ లక్ష్మీ,  షాదీ ముబారక్,  గొర్రెల పంపిణీ,   చేప పిల్లల పంపిణీ,  వృద్ధులకు వికలాంగులకు, ఒంటరి మహిళల పెన్షన్లు పెంచి ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కె చెంద్రయ్య, ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.

తెరాసతో అభివృద్ధి ; సర్పంచ్ లకు అభినందన సభ ; పార్టీ శ్రేణులు బాణాసంచాలతో సందడి


  కొమరంభీం ఆసిఫాబాద్ (రేబ్బెన) ఫిబ్రవరి 3  ; రెబ్బెన  మండలంలో తెరాస పార్టీ తరపున సర్పంచ్ లుగా గెలిచిన వారికి ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్, మాజీ ఎం ఎల్ ఏ  కోవలక్ష్మి ల   ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఈ సభకు విచ్చేసిన ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్, ఎం ఎల్ ఏ  కోవలక్ష్మిల కు  రెబ్బెన మరియు నంబాలలో   ఘన స్వగతం లభించింది. రెబ్బెనలోని పార్టీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ  ఊరేగింపుగా అభినందన సభకు తోడ్కొని వెళ్లారు.  మొదటగా పదవి భాద్యతలు స్వీకరించిన మండల సర్పంచ్ లను శాలువాలతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ గత కాంగ్రెస్ హయాంలో రెబ్బెన మండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తెరాస పార్టీ అధికారంలోకి చ్చిన తర్వాత 85 శాతం గ్రామాలకు అంతర్గత రోడ్ ల నిర్మాణం జరిగిందని అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో.

అభివృద్ధి
సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు.  ముఖ్యంగా  మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో పాటు రైతు బందు,  కళ్యాణ లక్ష్మీ,
షాదీ ముబారక్,  గొర్రెల పంపిణీ,   చేప పిల్లల పంపిణీ,  వృద్ధులకు వికలాంగులకు, ఒంటరి మహిళల పెన్షన్లు పెంచి ఇవ్వడం జరుగుతోందని  అన్నారు. గత శాసనసభ ఎన్నికల మండలంలోని తెరాస పార్టీలోని కొంతమంది వెన్నుపోటుదారుల వలన ఎం ఎల్ ఏ  కోవలక్ష్మి ఓడిపోయారని , వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, అన్నారు. కొద్దీకాలంలో ఇంచార్జి మంత్రిని నియమించిన తర్వాత మండలాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. సర్పంచ్ ఎన్నికలలో తెరాస అభ్యర్థులను గెలిపించినందుకు మండల ప్రజలకు కృతజఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎంపిపి సంజీవకుమార్, జడ్పీటీసీ బాబురావు, రెబ్బెన సర్పంచ్ అహల్యాదేవి,  నంబాల సర్పంచ్ చెన్న సోమశేఖర్, ఉపసర్పంచ్  మడ్డి  శ్రీనివాస్,  ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, తెరాస మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి,  మాజీ
సర్పంచ్ పెసర వెంకటమ్మ, రెబ్బెన మాజీ ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస్ రావు, సుదర్శన్ గౌడ్, సింగల్ విండో డైరెక్టర్ మధునయ్య, మాజీ జడ్పీటీసీ కె చెంద్రయ్య, పల్లె రాజేశ్వర్, మాణిక్య రావు తదితరులు పాల్గొన్నారు.

Saturday, 2 February 2019

ఉత్తమ సేవా అవార్డు గ్రహీతకు సన్మానం

  కొమరంభీం ఆసిఫాబాద్ (రేబ్బెన) ఫిబ్రవరి 2  ; గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న రెబ్బెన ఎస్సై దీకొండ  రమేష్  ను రెబ్బెన మండలం తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో  ఘనంగా శనివారం  సన్మానించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ  వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ ఎస్సై గా పదవీబాధ్యతలు చేపట్టి నప్పటి నుంచి పోలీసులు మీకోసం లో భాగంగా మండలంలో పలు సేవా  కార్యక్రమాలు నిర్వహించారని వారి సేవలను కొనియాడారు. అంతర్రాష్ట్రీయ రహదారి వర్షాల కారణంగా గుంతలమయంగా మారడంతో స్థానికుల సహకారంతో వాటిని సరిచేశారన్నారు. గ్రామాలకు వెళ్లే రహదారికిరువైపులా పెరిగిన చెట్లపొదలను తొలగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ అరుణ, కలవేణి లక్ష్మి, చంద్రకళ, పిల్లి లతా,బొడ్డు  యశోద,కల్పన తదితరులు ఉన్నారు. 

సర్పంచ్ ల ప్రమాణస్వీకారం

కొమరంభీం ఆసిఫాబాద్ (రేబ్బెన) ఫిబ్రవరి 2  ; తెలంగాణా రాష్ట్ర   పంచాయితీ శాఖ ఆదేశాల మేరకు రెబ్బెన మండలంలోని 24 గ్రామాలలో   కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు వార్డ్ మెంబర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.   పంచాయి తి ప్రత్యేక అధికారులు నూతనంగా  ఎన్నికైన  మరియు కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయితీలలో సర్పంచులకు ప్రమాణ స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. రెబ్బెన గ్రామా పంచాయతీ సర్పంచ్ గ శ్రీమతి బొమ్మినేని అహల్యా దేవి, గోలేటి సర్పంచ్ గా శ్రీమతి పోటు  సుమలత శ్రీధర్ రెడ్డి, పులికుంట బుర్సా  పోచమల్లు, ఇందిరా నగర్ దుర్గం రాజ్యలక్ష్మి, నంబాల చెన్న  సోమశేఖర్,  లు, అలాగే మిగిలిన గ్రామ పంచాయతీలలో ఎన్నికైన సర్పంచ్ లు    ప్రమాణం   స్వీకారం చేశారు.  . మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో తొలి రోజున కొత్తగా ఏర్పాటైన పాలకవర్గంలో సభ్యులు పాలనలో గ్రామ అభివృద్ధికి సేవ చేసేందుకై ప్రతిజ్ఞ చేసారు.అనంతరం కొత్తగా గెలుపొంది బాధ్యతలు చేపట్టిన  సర్పంచులకు పలువురు అభినందలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిడివో సత్యనారాయణ సింగ్,   గ్రామ పంచాయితీ కార్యదర్శులు గ్రామంలోని ప్రజలు తదితరులు పాల్గొన్నారు.