కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 19 ; బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ఆవరణలోకమ్యూనికేషన్ సెల్ ఆధ్వర్యంలో ఆణిముత్యాలు అనే టెలిఫిలిం ను సోమవారం జి ఎం కె రవిశంకర్ క్లాప్ కొట్టి ప్రారంభించారని ఏరియా డీజీఎం పర్సనల్ జె కిరణ్ తెలిపారు.భూ నిర్వాసితులకు సింగరేణి యాజమాన్యం కల్పిస్తున్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు, సౌకర్యాల గురించి మరియు వృత్తి విద్యా కోర్సులు ఉద్యోగ అవకాశాలు కల్పించే చోట ఈ ఫిలిం నిర్మించడం జరుగుతుంది అని అన్నారు. ఆణిముత్యాలు టెలిఫిలిం కు జయశంకర్ స్విచ్ ఆన్ చేసారు. ఈ టెలిఫిలిం కి డైరెక్టర్ మరియు సినిమాటోగ్రఫీ డిటి వెంకటస్వామి నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎఫ్ఎం శ్రీధర్, డీవైపీఎంలు సుదర్శన్ , రామశాస్త్రులు, జిఎం పిఎ పాపన్న, కమ్యూనికేషన్ సెల్ కో ఆర్డినేటర్ డి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Monday, 19 March 2018
Sunday, 18 March 2018
తెలంగాణ ప్రభుత్వ పథకాల నిధులన్నీ కేంద్ర ప్రభుత్వనిధులే
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 18 ; తెలంగాణా ప్రజలకి అందుతున్న సంక్షేమ పథకాల నిధులన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ద్వారానే అందుతున్నాయని బీజేపీ రెబ్బెన మండల అధ్యక్షులు కుందరపు బాలకృష్ణ అన్నారు. ఆదివారం రెబ్బెన మండలం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. మొన్న నిర్వహించిన కొమురం భీం జిల్లా బీజేవైఎం కొర్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా బీజేవైఎం కార్యదర్శి గా వాడయి గొండయ్య ను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ సందర్బంగా గొండయ్య మాట్లాడుతూ జిల్లాలో ని బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు . ఈ కార్యక్రమం లో బీజేవైఎం రెబ్బెన మండల అధ్యక్షులు ఇగురపు సంజీవ్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వలో ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు మరియు రాష్ట్రాల అభివృద్ధిని చూసి ప్రజలు బీజేపీ ని తెలంగాణాలో 2019 ఎన్నికలలో గెలిపిస్తారని అన్నారు ఈ కార్యక్రమం లో బీజేపీ రెబ్బెన టౌన్ ప్రధానకార్యదర్శి పసుపులేటి మల్లేష్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు పందిర్ల కనకయ్య, బీజేవైఎం రెబ్బెన మండల ప్రధానకార్యదర్శి వాడయి కాంతారావు లు పాల్గొన్నారు. బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 18 ; రెబ్బెన మండలం గోలేటి బస్టాండ్ లో ఉగాది సందర్బముగా బెటర్ యూత్ బెటర్ సొసైటీ అధ్యక్షులు ఒరగంటి రంజిత్ ఆద్వర్యం లో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అలాగె బస్టాండ్ లో దుకాణాలలోకి వెళ్లి పంపిణీ చేసారు. అధ్యక్షులు రంజిత్ మాట్లాడుతూ నూతన సం.. ఐన ఉగాది హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన పండగ ఆరు రకాల కలయిక ఉగాది పచ్చడి వేసవి వ్యాధుల నుండి రక్షణ అందిస్తుంది. అందరూ సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జె.బి పౌడెల్ , పోటు శ్రీధర్ రెడ్డి, సంస్థ గౌరవ అధ్యక్షులు లక్ష్మణ చారి , ఉపాధ్యక్షులు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి, రవీందర్ ,అజయ్ , సహాయ కార్యదర్శి, విజయ్ , తిరుపతి , సత్తిష్, రవి, అఖిల్, సంజు, శ్రీరాం, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
బెటర్ యూత్ బెటర్ సొసైటీ సహాయ కార్యదర్శిగా జనగామ విజయ్ కుమార్
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 18 ; బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్చంద సేవా సంస్థ సహాయ కార్యదర్శిగా జనగామ విజయ్ కుమార్ ని ఎనుకున్నట్లు సంస్థ అధ్యక్షులు ఒరగంటి రంజిత్ తెలిపారు. ఈ సంధర్భంగా నూతనంగా ఎన్నికైన విజయ్ మాట్లాడుతూ సమాజానికి సేవా చేయాలని ఉద్దేశ్యం తో సంస్థలో చేరినట్లు తెలిపారు. సమాజానికి సేవాలందిస్తూ సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.అవకాశమిచ్చిన అధ్యక్షులు రంజిత్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. గడ్డం వంశీ, విష్ణు, అఖిల్, అజయ్, సంజయ్ తదితరులు సభ్యులుగా చేరినట్లు తెలిపారు.
బీజేవైఎం ఆధ్వీర్యంలో ఉగాది పచ్చడి పంపిణి
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 18 ; శ్రీ విలంబినామ ఉగాది సందర్భంగా కొమురంభీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ లో బీజేవైఎం ఆధ్వీర్యంలో ఉగాది పచ్చడిని ప్రజలకు పంపిణి చేసారు. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ బాలాజీ వర ప్రసాద్ హాజరై పచ్చడి పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు విశాల్ ఖాండ్రే మాట్లాడుతూ తేలుగు సంవత్సరాది ఐన విళంబినామ ఉగాది ప్రజలకు మేలు చేయాలనీ ఆకాక్షించారు. పంటలు బాగా పండాలని ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు విజయ్ కుమార్, రాజ్ కుమార్, , రాజు, రాకేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
గోలేటి ఏఐటీయూసీ నూతన కమిటీ ఎన్నిక
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 18 ; కొమురంభీం జిల్లా గోలేటి బ్రాంచ్ ఏఐటీయూసీ కమిటీ ని ఎన్నుకున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వై గట్టయ్య తెలిపారు. గెలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ బయ్యమొగిళి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ జగ్గయ్య, సారయ్య, శివరావు, శేషశయన రావు, కిరణ్ బాబు, చంద్ర శేఖర్ , ఓసీపీ ఇంచార్జి ఎం లక్ష్మి నారాయణ, ట్రెజరర్ సత్యనారాయణ, 45 కౌన్సిల్ , మరియు 21 ఎగ్జిక్యూటివ్ పిట్ సెక్రెటరీలుగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
Saturday, 17 March 2018
సమగ్ర గిరిజన భూ అభివృద్ధి పథకం అమలు తీరుపై సమీక్షా సమావేశం
సమగ్ర గిరిజన భూ అభివృద్ధి పథకం అమలు తీరుపై సమీక్షా సమావేశం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 17 ; కొమురంభీం జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవం పాటిల్ శనివారం తన కార్యాలయంలో సమగ్ర గిరిజన భూ అభివృద్ధి పథకం అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు . ఈ సమావేశానికి మండల మరియు జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా . పాలనాధికారి మాట్లాడుతూ క్రిందటి సమావేశం తర్వాత అమలైన పనుల గురించి , మరియు పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేసి జిల్లాలో ఉన్న గిరిజనుల అభ్యున్నతికి పాటుపడాలని అన్నారు. లబ్ది దారులను మూడు కేటగిరీ లుగా విభజించి ఒకటవ కేటగిరీలో భూమి మరియు బోరెవెల్ ఉండి విద్యుత్ సరఫరా లేనివాటిని ,రెండవ కట్రరీలో బోర్ ఉండి విద్యుత్ సరఫరా లేనివాటిని, గుర్తించి నివేదికలు పంపించాలన్నారు. జిల్లాలోని 851 బ్లాక్ లలో ఎస్ టి లబ్ధిదారులు 5794 , ఏరియా వారీగా 22509గా ఉన్నట్లు తెలిపారు. స్థానిక ఎంపీడీఓ , ఏపీఎం లు సంబంధిత అధికారులు సకాలంలో సర్వే నిర్వహించి వచ్చే నెల నాలుగు లోపు నివేదికలు పంపాలన్నారు. . ఈ సమావేశం లో డి ఆర్ డి ఏ వెంకట్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి లో కాంట్రాక్టు పద్ధతిపై వాహనాలకై టెండర్లు
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 17 ; బెల్లంపల్లి ఏరియాలోని గనులు మరియూ డిపార్టుమెంట్ నందు 16 గంటలు మరియూ 12 గంటలు వాహనాలు నడుపుటకు మల్టి యూటిలిటి వాహనాలు టూ వీల్ మరియూ ఫోర్ వీల్ డ్రైవ్ జిపులు కొత్తవాటి కొరకై టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు డిజియం పర్సనల్ జె కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. టెండరు ఫారం కొరకై గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయం లోని పర్చేస్ డిపార్టుమెంట్ నందు సంప్రదించవల్సధీింగా కోరారు. ఈ నెల ఇరవైమూడవ తేదీ 4 గంటల వరకు టెండరు ఫారాలు తీసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన టెండరు ఫారములను ఈ నెల ఇరవైనాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గం"ల లోపల అందజేయాల్సింది గా కోరారు. అదే రోజున సా"మూడు గం"లకు టెండరు ఫారములను తెరవనున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలకై గోలేటి జియం కార్యాలయం లోని పర్చేస్ డిపార్టుమెంట్ నందు సంప్రదించాల్సిందిగా తెలియజేసారు.
ముఖ్యమంత్రి హామీలలో విఫలం - వై గట్టయ్య
గోలేటి బ్రాంచి రెండవ మహాసభ
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 17 ; ముఖ్యమంత్రి కేసీర్ ఇచ్చిన హామీలలో పూర్తిగా విఫలమయ్యారని ఐటీయూసీ అధ్యక్షులు వై గట్టయ్య అన్నారు . సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ 2వ మహాసభలు గోలేటి లోని కెఎల్ మహేంద్ర భవన్ లో శనివారం జరిగింది. ఈ మహాసభలకు ముఖ్య అతిధిలు గా సింగరేణి సెంట్రల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కా. వై.గట్టయ్య, కేంద్ర కార్యదర్శి కె.సమ్మయ్యలు హాజరు అయ్యారు. అంతకు ముందు పార్టీ కార్యాలయ ఆవరణలోని అమరవీరుల స్థూపానికి నాయకులు నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని గట్టయ్య మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన హామిలను అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంగా వాటి అమలు కై పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కార్మికుల హక్కుల సాధనలో నిరంతరం పోరాడే సంఘం ఏఐటీయూసీ ఒక్కటేనని, సింగరేణి కార్మికులకు టీబీజీకేఎస్ చేసింది ఏమి లేక పోగా కార్మికులకు టీబీజీకేఎస్ నాయకులు మొఖం చూపించే పరిస్థితి లేదని అన్నారు. ప్రస్తుతం కార్మికులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారని, ఓడిపోయిన యూనియన్ గా ఉన్నప్పటికీ ఏఐటీయూసీ ఎప్పుడు కార్మికుల పక్షమేనని ఆయన కార్మికులకు భరోసానిచ్చారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరణ చేస్తానని, ఇప్పుడు మాయమాటలు చెపుతున్నాడని గట్టయ్య అన్నారు. సింగరేణి లో కారుణ్య నియామకం ఎప్పటి నుండో ఉందని కొత్తగా వీళ్లు అమలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, ఏఐటీయూసీ సీపీఐ ఏఐఎస్ఎఫ్ నాయకులు జగ్గయ్య, బయ్య మోగిలి, బోగే ఉపేందర్, జూపక రాజేష్, దుర్గం రవీందర్, రాయుల్లా నర్సయ్య, పూదరి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవ వాల్ పోస్టర్ విడుదల
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 17 ; కొమురంభీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ లో శనివారం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ జిల్లా కార్యాలయంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవ వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగిందని అంబేడ్కర్ సంఘం నాయకులు జాడి.రాందాస్ తెలిపారు. బహుజన తెలంగాణ బహుజనులకే రాజ్యాదికారం అనే నినాదంతో మహాత్మా జ్యోతిరావు పూలే డా.,బి.ఆర్. అంబేడ్కర్, కారల్ మార్క్స్ మహనీయుల ఆశాయల సాధనకోసం తెలంగాణ రాష్ట్రంలోని అంబేడ్కర్ సంఘంతో పాటు 19 వామపక్ష పార్టీలతో ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నదని అన్నారు.బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయాన్ని 2018 మార్చి 19న సాయంత్రం 5గం.లకు, గోల్కొండ క్రాస్ రోడ్స్,ముషీరాబాద్ లో ప్రముఖ సామాజిక ఉద్యమకారులు గుజరాత్ ఎం ఎల్ ఏ జిగ్నేష్ మెవాని ప్రారంభిస్తారన్నారు. . ఈకార్యక్రమంలో కూశన.రాజన్న సి పి ఎం జిల్లా కార్యదర్శి, కోట.వెంకన్న బి సి సంఘం రాష్ట్ర కార్యదర్శి, నికోడే.రవీందర్ మాలి సంఘం రాష్త్ర నాయకులు, కోట.శ్రీనివాస్ టి మాస్ జిల్లా కో కన్వీనర్, దుర్గం.దినకర్ టి మాస్ జిల్లా నాయకులు, అల్లూరి.లోకేష్, జిల్లా నాయకులు, గొడిసెల.కార్తీక్ ఎస్ ఎఫ్ ఐ రాష్త్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామపంచాయితీ కార్యాలయం నందు రైతుల భూమి వివరాలు
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 17 ; కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రమైనరెబ్బెన గ్రామానికి సంబందించి ఇటీవల నిర్వహించిన రైతుల భూ సర్వేకి సంబందించిన పట్టేదారు యొక్క వివరాలపట్టికను గ్రామపంచాయితీ కార్యాలయం నందు గ్రామంలోని పట్టాదారుల సౌకర్యం కోసం అందుబాటులో ఉంచినట్లు రెబ్బెన గ్రామ పట్వారి ఉమ్లాల్ తెలియజేసారు.రెబ్బెన మండల తహశీల్దార్ సాయన్న ఆదేశాల మేరకు రైతుల యొక్క భూ వివరాలను పట్టాదారుల వివరాలను అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. ఈ వివరాలలో ఏదైనా కారణాలవల్ల వల్ల మార్పులు ఉన్నచో తహశీల్దార్ కార్యాలయం నందు.సంప్రదించవల్సినదిగా తెలిపారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ పేసరి వెంకటమ్మ,సింగిల్ విండో డైరెక్టర్ పేసరి మధునయ్య తదితరులు పాల్గొన్నారు.Friday, 16 March 2018
కంప్యూటర్ పరిజ్ఞానాన్ని విద్యార్ధి దశ నుంచే నేర్చుకోవాలి : జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగేనవార్
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 16 ; కంప్యూటర్ యొక్క ప్రాధమిక పరిజ్ఞానాన్ని విద్యార్ధి దశ నుంచే నేర్చుకోవాలని భావి పౌరులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో ముఖ్య మని జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగేనవార్ అన్నారు. శుక్రవారం జిల్లా లోని స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ నందు జెడ్ .పీ.ఎస్.ఎస్ బాయ్స్ కు జిల్లా పోలీస్ ల అద్వర్యం లో కంప్యూటర్ ప్రాథమిక అంశాలు మరియు ట్రాఫిక్ నిర్వహణ, సూచనల పైన అవగాహన తరగతులను నిర్వహించారు.
ఇందులో కంప్యూటర్ పైన అవగాహన తరగతులను డి సి ఆర్ బి ఎస్సై సురేందర్ కల్పిస్తూ విద్యార్థులకు కంప్యూటర్ యొక్క ఆవశ్యకత ను నేర్చుకునే విధానం ను కంప్యూటర్ వాడకం వల్ల పొందే లాభాలను గురిoచి తెలిపారు. విద్యార్ధి దశ నుంచే కంప్యూటర్ అవగాహన కలిగి వుండటం వల్ల లాభాలను పొందిన విద్యార్థులను గురిoచి ప్రొజెక్షన్ పైన విద్యార్థులకు చూపి వారికి ఆసక్తిని కల్పించారు. అనంతరం ట్రాఫిక్ సమస్యలు , ట్రాఫిక్ నిర్వహణ లో పౌరుల బాద్యతలను గురించి మరియు మన యొక్క అవగాహన లేమి వల్ల కలిగే నష్టాలను గురించి విద్యార్థులకు ఐటి కోర్ ఇంచార్జ్ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమము లో డిఎస్పి సత్యనారాయణ , ఐటి కోర్ ఇంచార్జ్ స్వామి, దిసిఅర్బి ఎస్సై సురేందర్, ఆర్ ఐ శేఖర్ బాబు , మరియు ఐటి కోర్ సభ్యులు శ్రినివాస్ , రమేష్, విజయ్ లాల్ ,పీ డి లు సదానందం , స్కూల్ అసిస్టెంట్ సదాశివ్ లు పాల్గొన్నారు.
ఇందులో కంప్యూటర్ పైన అవగాహన తరగతులను డి సి ఆర్ బి ఎస్సై సురేందర్ కల్పిస్తూ విద్యార్థులకు కంప్యూటర్ యొక్క ఆవశ్యకత ను నేర్చుకునే విధానం ను కంప్యూటర్ వాడకం వల్ల పొందే లాభాలను గురిoచి తెలిపారు. విద్యార్ధి దశ నుంచే కంప్యూటర్ అవగాహన కలిగి వుండటం వల్ల లాభాలను పొందిన విద్యార్థులను గురిoచి ప్రొజెక్షన్ పైన విద్యార్థులకు చూపి వారికి ఆసక్తిని కల్పించారు. అనంతరం ట్రాఫిక్ సమస్యలు , ట్రాఫిక్ నిర్వహణ లో పౌరుల బాద్యతలను గురించి మరియు మన యొక్క అవగాహన లేమి వల్ల కలిగే నష్టాలను గురించి విద్యార్థులకు ఐటి కోర్ ఇంచార్జ్ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమము లో డిఎస్పి సత్యనారాయణ , ఐటి కోర్ ఇంచార్జ్ స్వామి, దిసిఅర్బి ఎస్సై సురేందర్, ఆర్ ఐ శేఖర్ బాబు , మరియు ఐటి కోర్ సభ్యులు శ్రినివాస్ , రమేష్, విజయ్ లాల్ ,పీ డి లు సదానందం , స్కూల్ అసిస్టెంట్ సదాశివ్ లు పాల్గొన్నారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దుకై వినతి పత్రం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 16 ; కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు సబబు కాదని టిఎస్ సిపిఎస్ఈయూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దింటి క్రాంతి అన్నారు. శుక్రవారం కొమురంభీం జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ని అధికారులు మరియు కొన్ని సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. సిపిస్ రద్దు రాష్ట్ర పరిధిలోని అంశమని సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్రం స్పష్టం చేసినట్లు తెలిపారు. ఆర్ టిఐ కాపీని జిల్లా సంయుక్త పాలనధికారి వై సురేందర్ రావు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కి పంపిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్రం మీరు సి పి ఎస్ విధానంలో కొనసాగుతారా లేదా తెలియజేయలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. మేము సి పి ఎస్ విధానంలో నే కొనసాగుతామని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తెలుయజేసిందన్నారు. ఇప్పటికి పక్షిమబెంగాల్, త్రిపుర రాష్టలలో పాత పెన్షన్ విధానం కొనగుతుందని అన్నారు. కావున సి పి ఎస్ విధానంలో కొనసాగాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం అని అన్నారు. కావున సి ఐ ఎస్ విధానాన్ని రద్దు చేసి దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శం కావాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముడిమడుగుల తిరుపతి,జిల్లా ముఖ్య సలహాదారు రఫతుల్లా హుస్సేన్ , జిల్లా ఉపాధ్యక్షులు అరిగెల మోహన్ ,వాంకిడి అధ్యక్షులు చందా విట్ఠల్ ,ప్రధాన కార్యదర్శి జాడే రాహుల్,కాగజ్ నగర్ కార్యదర్శి వసంత్,తదితర సభ్యులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)










