Monday, 2 November 2026

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలి

అదనపు గదులు, స్నానపు గదులు, మరుగుదొడ్లు నిర్మించాలి: కేవీపీఎస్‌

ఆసిఫాబాద్‌,  నవంబర్‌ 2 :వాంకిడి మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాలైన వెలిగి, చౌపనగూడ, బంబారతో పాటు బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలు, శాటిలైట్‌ పాఠశాలల్లో తక్షణమే కనీస మౌలిక వసతులు కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి జాదవ్‌ అంభాజీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్‌ మాట్లాడుతూ.. మారుమూల గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలల్లో నిర్వహణ, కనీస వసతుల కల్పనను అధికారులు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అదనపు గదులు నిర్మించాలని, స్నానపు గదులు, మరుగుదొడ్ల సంఖ్య పెంచి మౌలిక వసతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా నాయకుడు వల్లూరి మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment