Monday, 2 November 2026

బెల్లంపల్లి ఏరియాలో అక్టోబర్‌లో 89 శాతం బొగ్గు ఉత్పత్తి

వార్షిక లక్ష్యంలో 107 శాతం సాధన: జీఎం ఎం. శ్రీరమేష్‌


రెబ్బెన: నవంబర్‌ 2 ; బెల్లంపల్లి ఏరియాలో అక్టోబర్‌ నెలలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యంలో 89 శాతం సాధించినట్లు ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఎం. శ్రీరమేష్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెలవారీ లక్ష్యం 3 లక్షల టన్నులు కాగా, 2.68 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు వెల్లడించారు. వార్షిక లక్ష్యం 35 లక్షల టన్నులు కాగా, అక్టోబర్‌ నెలాఖరు వరకు 19.86 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు. వార్షిక ఉత్పత్తి ప్రగతి 107 శాతంగా ఉందని, ఓవర్‌బర్డెన్‌ తొలగింపులో అక్టోబర్‌ నెలలో 128 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేసి బెల్లంపల్లి ఏరియాను సింగరేణిలో ఉత్పత్తిలో అగ్రగామిగా నిలపాలని జీఎం కోరారు.


No comments:

Post a Comment