ప్రజలకు ప్రింటింగ్, స్కానింగ్ సేవలూ అందుబాటులోకి తేవాలి
ఆసిఫాబాద్, నవంబర్ 2:
జిల్లా కలెక్టరేట్‌కు వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు వస్తుంటారు. ప్రభుత్వ పథకాల దరఖాస్తులు, ధ్రువపత్రాలు, వినతిపత్రాలకు జిరాక్స్ కాపీలు అవసరమైనప్పటికీ, కలెక్టరేట్ ప్రాంగణంలో జిరాక్స్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు బయటకు వెళ్లాల్సి వస్తోందని సీపీఎం నాయకులు సోమవారంపేర్కొన్నారు. దీనివల్ల సమయం వృథా అవుతూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కలెక్టరేట్ ప్రాంగణంలో అందుబాటు ధరలకు జిరాక్స్, ప్రింటింగ్, స్కానింగ్ సేవలు అందించే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జె. రాజేందర్, మల్లేష్ ఉన్నారు.

No comments:
Post a Comment