కోల్ ఇండియా స్థాయి పతకాలే లక్ష్యంగా సాధన చేయాలి: డీజీఎం కిరణ్‌బాబు
రెబ్బెన, నవంబర్ 2
బొగ్గు ఉత్పత్తిలో ప్రతిభ చూపుతున్న సింగరేణి ఉద్యోగులు క్రీడల్లోనూ తమ నైపుణ్యాన్ని చాటాలని బెల్లంపల్లి ఏరియా డీజీఎం (పర్సనల్) దేవరకొండ కిరణ్‌బాబు అన్నారు. డబ్ల్యూపీఎస్, జీఏ 93వ వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా సోమవారం గోలేటిలోని శ్రీ భీమన్న మైదానంలో నిర్వహించే నైబర్‌హుడ్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల ఉద్యోగ క్రీడాకారులు సమిష్టిగా సాధన చేసి కోల్ ఇండియా స్థాయిలో రాణించాలని సూచించారు. మందమర్రిలో జరగనున్న కంపెనీ స్థాయి క్రికెట్ పోటీలకు మరింత సన్నద్ధం కావాలని, కోల్ ఇండియా స్థాయి పతకాలే లక్ష్యంగా ఆడాలని పిలుపునిచ్చారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు మారం శ్రీనివాస్, వర్క్‌షాప్ హెచ్‌ఓడీ జ్ఞానేశ్వర్, డబ్ల్యూపీఎస్, జీఏ గౌరవ కార్యదర్శి డి. ప్రశాంత్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ అశోక్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కిరణ్‌బాబు, జనరల్ కెప్టెన్ ఎస్‌కే అబ్బాస్, క్రీడాకారులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment