జిల్లా కలెక్టర్‌కు పీడీఎస్‌యూ నాయకుల వినతి
ఆసిఫాబాద్, నవంబర్ 2 :
ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానానికి అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి, మైదానానికి ఇబ్బంది కలగకుండా పక్కకు మార్చాలని పీడీఎస్‌యూ కొమురం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి (ఐఏఎస్)కు విద్యార్థి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడలు ఆడేందుకు, సాధన చేసేందుకు మైదానంలో ఉన్న విద్యుత్ స్తంభాలు అడ్డంకిగా మారుతున్నాయని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాటిని వెంటనే పక్కకు మార్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఆసిఫాబాద్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.కె. సమీర్, జగజంపుల తరుణ్, మండల ఉపాధ్యక్షుడు శివశంకర్, మండల నాయకులు శివప్రసాద్, అరవింద్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment