ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా సర్పంచ్ చర్యలు
ఆసిఫాబాద్, నవంబర్ 1: గ్రామ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా గుండి గ్రామ సర్పంచ్ జాబరి రవీందర్ ఆధ్వర్యంలో ఆదివారం తాత్కాలిక వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పనులు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చందన కడ సంతోష్, వార్డు సభ్యులు జాబోరే రాజు, రాస్పల్లి మోహన్, దోకె మరోతి, శ్రీకాంత్, రమేష్, కళ్యాణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment