Saturday, 15 October 2016

రెబ్బెన ఆటో డ్రైవర్ మృతి - అనాథలైన పిల్లలు

రెబ్బెన ఆటో డ్రైవర్ మృతి - అనాథలైన పిల్లలు    
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ )                      రెబ్బెన: (వుదయం ప్రతినిధి)   రెబ్బెన మండల కేంద్రానికి చెందిన గోగర్ల రమణయ్య  (46 )ఆటో డ్రైవర్ విష జ్వరముతో శనివారం మృతి చెండాడు . మృతుడు రమణయ్య కు గత  2 రోజులుగా విష జ్వరముతో కాగజ్ నగర్ ఆసుపత్రికి , అనంతరం శనివారం కరీంనగర్ కు తరలిస్తూ ఉండగా మృతి చెందినట్లు బంధువులు  తెలిపారు . మృతుడి అన్న వదిన మృతి చెందడముతో వారి పిల్లలను , కుటుంబాన్ని పోషించాడు . రమణయ్య మృతి చెందడముతో పిల్లలు అనాథలయ్యారు . మృతుడి కుటుంబాన్ని జెడ్ పి  టి సి బాబు రావు తో పాటు ఆటో యూనియన్ నాయకులు పరామర్శించారు .  రమణయ్య మృతికి సంతాప ము తెలుపుతూ ఆది వారం నాడు ఆటోలు బంద్  పెడుతున్నట్లు ఆటో నాయకులు తెలిపారు.

Thursday, 13 October 2016

రైలు ఢీకొని యువకుడి మృతి


రైలు ఢీకొని  యువకుడి మృతి 


కొమురం భీం జిల్లా (ఆసిఫాబాద్)
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల ములోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషను సమీపములో గుర్తు తెలియని రైలు ఢీకొని చింత గుడాకు చెందిన వి వెంకటేష్ (20) మృతి చెంది నాట్లు జి ఆర్ పి  హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రావు తెలిపారు . మృతి డు మంచిర్యాల లో డిగ్రీ మొదటి సంవత్సరము చదువుతున్నట్లు పేర్కొన్నారు .

శివమల్లన్న యూత్ కమిటీ ఎన్నిక

శివమల్లన్న  యూత్  కమిటీ ఎన్నిక 
కొమురం భీం జిల్లా (ఆసిఫాబాద్)

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలంలోని కొమురవెల్లి గ్రామంలో శివమల్లన్న  యూత్  కమిటీ ఎన్నుకున్నట్టు  గ్రామ పెద్దలు మానేం సత్తయ్య , జక్కుల తీగ గౌడ్, మల్ల గౌడ్, దాసరి భగవంత్ గౌడ్ తెలిపారు  .  యూత్ కమిటీ అధ్యక్షుడిగా ఓడ్నల దుర్గ ప్రసాద్ , ఉప అధ్యక్షుడిగా కాటేపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా  గోలెం సాయికృష్ణ, ప్రచార కార్యదర్శిగా  ఓడ్నల సందీప్, సలహాదారుడిగా పరకాల సాగర్ గౌడ్, కోశాధికారిగా కాటేపల్లి సాయి కిరణ్ , కార్యదర్శులుగా  ఓడ్నల మోహన్ , కొట్లారి సాయి కిరణ్ , పెద్దింటి శ్రీకాంత్ , చంద విజయ్, గజ్జెల సురేష్ మరియు కమిటీ సభ్యులు, యువకులు తెలిపారు.

Wednesday, 12 October 2016

మొహరం పర్వదినాన షర్బత్ పంపిణి

మొహరం పర్వదినాన షర్బత్ పంపిణి 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మొహరం పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ప్రజలకు షర్బత్ పంపిణి చేసారు. హిందూ ముస్లిం అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి జరుపుకున్నారు. 

రెబ్బెనలో ఘనంగా మొహరం పండగ


రెబ్బెనలో ఘనంగా మొహరం పండగ 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మొహరం పండగను ప్రజలు ఘనంగా జారుకున్నారు .. మంగళ వారం పీరీలు వాడ వాడల లో ఊరేగింపు చేశారు భక్తులు పీరీలను భక్తి శ్రద్దలతోపూజించి మొక్కులు తీర్చుకున్నావారు .  నైవేద్యాలు సమర్పించారు . హిందువులు , ముస్లింలు కలిసి పండగను సంతోషాలతో జరుపుకొన్నారు . 


ఘనంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవం



ఘనంగా  సర్కిల్ ఇన్స్పెక్టర్  కార్యాలయ ప్రారంభోత్సవం 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని విజయ దశమి పర్వదినాన ఎం ఎల్ సి  పురాణం సతీష్ కుమార్ ప్రారంభోత్సవం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా పరిపాలన సౌలభ్యం కోసం రెబ్బెన లో నూతనంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండల అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు అందేలా కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన సి ఐ  మదన్ లాల్ , వైస్ చైర్ మెన్ కుందారపు శంకరమ్మ, జెడ్ పి టి సి సభ్యులు అజ్మిరా బాబురావు, ఎం పి పి సంజీవ్ కుమార్ మరియు  అధికారులు , నాయకులు పాల్గొన్నారు

ఘనంగా విజయ దశమి సంబురాలు

ఘనంగా విజయ దశమి సంబురాలు 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  రెబ్బెన మండలంలో విజయ దశమిని ఘనంగా జరుపుకున్నారు. రావణసుర దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఏర్పడిన కొమురం భీం జిల్లాలో రెబ్బెన మండల ప్రజలు,నాయకులు, అధికారులు  మంగళ వారం తెలంగాణ సంప్రదాయాలకనుగుణంగా విజయ దశమి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. 

పరిపాలన సౌలభ్యం కొరకే చిన్న జిల్లాలు -జోగు రామన్న

పరిపాలన సౌలభ్యం కొరకే చిన్న జిల్లాలు -జోగు రామన్న
కొమురం భీం జిల్లా (ఆసిఫాబాద్)




రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రజల సౌకర్యార్థo , పరిపాలన సౌలభ్యం కొరకే ముఖ్యమంత్రి కె సి ఆర్ చిన్న జిల్లాలను  ఏర్పాటు చేసినట్లు అటవీ  శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు .  దసరా పండగ  రోజు ఆసిఫాబాద్ ను కొమురం భీం జిల్లాగా నామకరణం చేస్తూ  జిల్లాను ప్రారంభించారు .  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఎన్నికల సందర్బంగా కె సి ఆర్ ఇఛ్చిన మాట ప్రకారం ఆసిఫాబాద్ ను కొమురం భీం జిల్లాగా ఏర్పాటు చేయడం ఆయన నిజాయతీకి నిదర్శనం అన్నారు . పేద , బడుగు  వర్గాల అభివృద్ధి కోసం ఆహార్నిశలు శ్రమిస్తూ , అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని  తెలిపారు . షాదీ ముబారక్ , కల్యాణ లక్ష్మి , పేదలకు 3 ఎకరాల భూమి ,  మిషన్ కాకతీయ , భగీరథ  పథకం తదితర సంక్షేమ పథకాలను  అమలు   పరిచారని అన్నారు . చిన్న జిల్లాలు త్వరిత  గతిన అభివృద్ధి చెందుతాయాని  , దీనితో రాష్ట్రాన్నే బంగారు తెలంగాణ గా మార్చేయాలనే ఆలోచనతో ముఖమంత్రి ముందుకు వెళ్తున్నారని , రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల బాగస్వామ్యం ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ , ఎం ఎల్ ఏ లు కోవా లక్ష్మి , కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్  గంధం  శ్రీనివాస్ , వైస్ చైర్మన్  కుందారపు శంకరమ్మ లతో పాటు అధికారులు , నాయకులు పాల్గొన్నారు . 

Sunday, 9 October 2016

కాంట్రాకు కార్మికులు తెలంగాణ బిడ్డలు కాదా .... ?

కాంట్రాకు కార్మికులు తెలంగాణ బిడ్డలు కాదా .... ?

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి సంస్థలో కాంట్రకు కార్మికులుగా పని చేస్తున్న వారు తెలంగాణా బిడ్డలు కాదా  అని ఏ ఐ టి  యు సి మండల అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు . గోలేటి లో విలేఖర్ల సమావేశములో ఆయన మాట్లాడారు . గత కొంత కాలంగా సింగరేణి సంస్థలో కాంట్రాకు కార్మికులుగా తక్కువ జీతాలకు పని చేస్తూ , ఎక్కువగా లాభాల వాటా రావడానికి ప్రధాన పాత్ర వహిస్తున్న కాంట్రాక్కు కార్మికుల ను మర్చి పోవడం ముఖ్య మంత్రి కె సి ఆర్ కు ఎంత వరకు న్యాయమనిఆయన అన్నారు . సింగరేణి కార్మికులతో పాటు సామాంగా పని చేస్తున్న కాంట్రాకు కార్మికులకు దీపావళి బోనస్ , లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు . అశోక్ , రవి మహిపాల్ లు ఉన్నారు .


చేగువేరా 49 వ వర్ధంతి

చేగువేరా 49 వ వర్ధంతి

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఒక దేశ భూభాగం ప్తె మరోదేశం చేసే పెత్తనం సరైనది కాదని సూటిగా ధాటిగా వ్యతిరేకిస్తూ  సామ్రాజ్యవాద ప్రమాదాలను సాయుధం గా ప్రతిఘటించిన సాహసవీరుడు పీడీత దేశాలకు ప్రియమైన మిత్రుడు  బడుగు జీవుల బంధువు చే గువేరా అని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవిందర్ AIYF జిల్లా నాయకుడు బోగే ఉపేందర్ అన్నారు.. దేశ భక్తి అంటే భూమి మిద మాత్రమే కాదని ప్రజాల స్వేచ్చ స్వతంత్రాలు అనే భావన తో క్యూబా అర్జెంటి నా అన్ని దేశాల పేదల కోసం సాయుధ భాట పట్టి న వీరుడు మన చేగువేరా అని అన్నారు చేగువేరా  స్ఫూర్తితో ప్రపంచ దేశాల ప్రజలు సార్వభౌమాధికారము క్తీ అలోచించాలని అయన ఆశయాలను ఆచరించాలని యువత కు పిలుపు నిచ్చారు నేడు దేశం లో మహిళలకు విద్యార్థి నిలకు రక్షణ. కరువ్తెందని అశ్లీల చిత్రాలను వ్యతిరేకించాలని అన్నారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పంచాలని విద్య ఉపాధి వ్తెద్యం అందరికి అందినపుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు విద్యార్థులు యువకులు చేగువేరా అశయాలతో ముందుకు పోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో AITUC మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య AISF డివిజన్ కార్యదర్శి పూదరి సాయి కిరణ్ నాయకులు మహిపాల్ రహీం కమలకర్ అశోక్ సాయి పోషమల్ల చల్లూరి అశోక్ సందీప్ రమేష్ లు పాల్గొన్నారు.

Saturday, 8 October 2016

రెబ్బెన లో ఘనముగా సద్దుల బతుకమ్మ

రెబ్బెన లో ఘనముగా  సద్దుల బతుకమ్మ

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన  మండలంలో మహిళలు పిల్లలు అట పాటలతో ఘనముగా సద్దుల బతుకమ్మ పండగ   నిర్వహించారు ఈ సందర్బముగా  ఇంటి ఇంటికో బతుకమ్మలను రంగు రంగు పూలతో బతుకమ్మను అలంకరించారు మహిళలు పిల్లలు నూతన వస్రాలతో  బతుకమ్మలను ఉరే గుంపుగా రావడంతో ఎంతో కనువిందుగా కనిపించింది బతుకమ్మ పాఠాలతో పాటు కోలాటం దాండియా ఆటలతో ఆడుతూ ఎంతో ఉత్సాహముగా గడిపారు రకరకాల తియ్యటి పదార్థలతో పంచుకొని శుభాకంక్షాలు తెలుపుకున్నారు అదేవిధముగా గోలేటి సింగరేణి పాఠశాల మైదానంలో సద్దుల  బతుకమ్మ  ఘనముగా నిర్వహించారు ఈ సందర్భముగా సేవ సమితి అధ్యక్షురాలు అనురాధ తో పాటు మహిళా అధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, కార్మికుల కుటుంబమాలతో కలిసి ఘనముగా నిర్వహించారు 

రైలు కింద పడి వ్యక్తి మృతి

రైలు కింద పడి వ్యక్తి మృతి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో రైల్వే గేట్ సమీపంలో రైలు కింద పడి వ్యక్తి మృతి చెందాడు మృతుడు గుర్లె బిక్కు 46 పుంజమేరా గూడ నివాసి అని రైలు నుంచి జారీ పడి మృతి చెంది ఉంటాడు అని రైల్వే పోలీస్ తెలిపారు మృతుడు ఆసిఫాబాద్ రోడ్ నుంచి మంచిరియాల్ వైపు ఉదయం వెళ్లే ప్యాసింజర్ రైలు నుంచి పడి ఉంటాడు అని ఇతను ఖైరుగూడ ప్రైవేట్ డ్రైవర్ గా పని చేస్తూ ఉన్నట్టు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Friday, 7 October 2016

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోఘనముగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోఘనముగా  బతుకమ్మ సంబరాలు

(రెబ్బెన వుదయం ప్రతినిధి);  తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ వేడుకలు రెబ్బెన మండలంలోని అతిధి గృహములో  మహిళాలు శుక్రవారం  రోజున తెలంగాణ జాగృతి  యూత్ కో కన్వీనర్ రంగు మహేష్  ఆధ్వర్యంలో  బతుకమ్మ సంబరాలలో మహిళలు  ఘనముగా బతుకమ్మ పాటలు పడుతూ ఆటలు ఆడారు . తెలంగాణ సంప్రదాయక పద్దతిలో  పలువురిని ఆకట్టుకున్నరు  ఇందులో భాగంగా  బతుకమ్మ సంబరాలు జరుపుకోడానికి మహిళలు ప్రత్యేక  పూలతో బతుకమ్మలను అలంకరించారు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే  జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మను జరుపుకున్నారు. అనంతరం  ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందచేశారు  ఈ బతుకమ్మ వేడుకల్లో  ఏ ఎం సి వైస్ చైర్ మెన్ కుందారపు శంకరమ్మ, సర్పంచ్ పెసరు వెంకటమ్మ ,వైస్ ఎం పి పి గుడిసెల రేణుక, బాలమ్మ, జడ్పిటిసి బాబురావు,  ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్  ,తహసీల్దార్ రమేష్ గౌడ్, ఎం ఈ ఓ వెంకటేశ్వర స్వామి, ఏ పి ఎం వెంకటరమణ, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, సింగిల్ విండో డైరెక్టర్ మదనయ్య, సుదర్శన్ గౌడ్, చిరంజీవి గౌడ్, సోమశేఖర్,  నవీన్ జైస్వాల్, దుర్గం సోమయ్య, తెలంగాణ జాగృతి నాయకులు  ప్రవీణ్,  ఆవడపు గోపి, వెంకన్న, వినయ్,భీమేష్, నవీన్, శ్రీకాంత్ ,రాజకుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నరు.