రెబ్బెన : 18వ ఆత్మగౌరవ భీమ దేవర జెండా పండుగను రెబ్బెెన మండలంలోని పులికుంటలొ ఆదివారం ఘనంగా నిర్వహించారు. జెండా పండుగ లో భాగంగా ఆదివాసి మహిళలు బోనాలతో మరియు యువకులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ జెండా జెండాను ఎగరవేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఆదివాసి కోలవర్ మన్నె వార్ జెండా పండుగను భీమదేవర పడగను పాత సాంప్రదాయాల ప్రకారం కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో, కొమురం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర గట్టి సుధాకర్ సర్పంచ్ బురుస పోచ మల్లు ,మండల గౌరవ అధ్యక్షులు భీమయ్య, యువకులు గోపాల్ భీమే ష్ మహేష్ కొండయ్య మల్లయ్య హనుమంతు తదితరులు పాల్గొన్నారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Wednesday, 26 February 2020
పల్లె ప్రగతి పై గ్రామసభలు
రెబ్బెన : మండలంలోని పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పదిరోజుల పనుల ప్రణాళికలపై గ్రామపంచాయతీలో గ్రామా ప్రణాళిక ముగింపు సభలు సర్పంచుల అధ్యక్షతన నిర్వహించారు అభివృద్ధి చేసిన అంశాల గురించి చర్చించారు. చేయాల్సిన పనులు గురించి చర్చించి గ్రామ ప్రణాళిక విజయవంతం చేయుటకు పాల్గొనిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ లు బొమ్మినేని అహల్యాదేవ, చెన్న సోమశేఖర్, పోటు సుమలత వినోద రాజ్యలక్ష్మి పోచ మల్లు మిగతా గ్రామపంచాయతీ సర్పంచ్లలు ఉప సర్పంచులు, సోమశేఖర్ వైస్ ఎం పి పి గజ్జల సత్యనారాయణ, రూప సర్పంచులు నేని శ్రీధర్,పంచాయితీ సెక్రటరీ,స్పెషల్ ఆఫీసర్, వార్డ్ మెంబెర్ లు తదితరులు. పాల్గొన్నారు
బిజెపి మండల కార్యవర్గం ఎన్నిక
రెబ్బెన : బిజెపి మండల కార్యవర్గ ఎన్నికను శనివారం మండల అధ్యక్షుడు గోళం తిరుపతి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు మండల ఉపాధ్యక్షుడిగా పందిళ్ల కనకయ్య, బానోత్ సుబ్బారావు, ప్రకాష్, ను ప్రధాన కార్యదర్శులుగా మల్లేష్, కార్యదర్శిగా ఓదేలు, భారత్, వెంకటేష్, కోశాధికారిగా దుర్గాప్రసాద్ కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జెసిబి పడెల్, ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ ఆత్మ ప్రధాన ధాన కార్యదర్శి ఆత్మ రామ్ నాయక్, ఆంజనేయులు గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ చక్రపాణి జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్ జిల్లా ఎన్నికల ఇంచార్జ్ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధిల ప్రజల పాలు పంచుకోవాలి
రెబ్బెన : గ్రామాల అభివృద్ధి కోసం గ్రామంలో ఉన్న ప్రజలు కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ప్రతిఫలం లో పంచాయతీ ఉంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పిడి వెంకట్ సైలస్ అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం లోని వన్ కులం రాంపూర్ తక్కలపెల్లి రోళ్ళపాడు గ్రామ పంచాయతీలో ఆయన పర్యటించారు. నర్సరీ డంపింగ్ యార్డ్ తదితర అంశాల నో నో నో అడిగి తెలుసుకున్నారు. మాట్లాడుతూ పల్లె పల్లె పల్లె ప్రగతి లో గ్రామాలు పరిశుభ్రంగా పచ్చదనంతో ఉండాలన్నారు. కార్యక్రమంలో సి పి ఓ కృష్ణయ్య ఎం పి పి సౌందర్య జెడ్ పి టి సి సంతోష్ సర్పంచ్ హనుమక్క ఎం పి డి ఓ సత్యన్నారాయణ సింగ్ ఎం పి టీ సి సంగం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
అంతర్ జిల్లాల ఆటల పోటీలు
రెబ్బెన : 65వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్టిక్ బాల్బాడ్మింటన్ పోటీలను శుక్రవారం గోలేటి సింగరేణి పాఠశాలలో నిర్వహించారు. ఈ పోటీలకు 10 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు తరలివచ్చారు. ముందుగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏరియా జిఎం కొండయ్య హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి సంక్షేమ అభివృద్ధి తో పాటు క్రీడాకారులకు అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు జాతీయస్థాయిలో పేరు గడించి జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు గ్రామం క్రీడలలో మంచి పేరు గడించింది అన్నారు.
ఉన్ని దుస్తులు పంపిణీ
రెబ్బెన : మండలం లోని పులి కుంట గ్రామ పంచాయతీ లో గల మూడు ప్రభుత్వ ప్రాధిమిక పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర నీటి పారుదల శాఖ వారి ఉద్యోగుల ఆధ్వర్యంలో ఉచితం గా ఉన్ని దుప్పట్లు రాత పుస్తకాలు మరియి పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నకు గ్రామ సర్పంచ్ బుర్స పోషమల్లు సూ పరెండెంట్ అఫ్ ఇంజనీర్ శ్రీ విష్ణు ప్రసాద్, వారి ఉద్యోగ సిబ్బంది పగిడి అరుణ, పగిడి జనార్దన్ రమణా రెడ్డి, ఆన్వేష్, గ్రామ పంచాయత్ సెక్రటరీ సరిత ఆయా పాఠశాల ల ప్రధానోపాద్యాయలు ఉపాధ్యాయలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు..
ఇందిరానగర్ గ్రామం లో మద్యపానం నిషేధం
రెబ్బెన : రెబ్బెన మండలం లోని ఇందిరానగర్ గ్రామం లో సర్పంచ్ రాజ్యలక్ష్మి తిరుపతి అధ్యక్షతన గురువారం గ్రామంలో పూర్తిగా మద్యపానం నిషేధం చేయాలని తీర్మానిచారు గ్రామస్తు యువకులు మద్యానికి బానిస కావడం వలన తరుచు గొడవలకు కారాణాలు అవుతున్నావి పూర్తిగా మద్యపానాన్ని నిషేదించాలని బెల్ట్ షాపులు మరియు గుడుంబా అమ్మకాలు నిషేధించాలని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు మీసాల శ్యాంరావ్.ఆదివాసి కొలావార్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్గటి సుధాకర్ కొలావార్ ఆదివాసి మండల అధ్యక్షుడు మైలారపు శ్రీనివాస్, గ్రామస్థులు దుర్గం జానయ్య, కమ్మరి మల్లేష్, దుర్గం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు
విద్యార్థులకు ఆట వస్తువులు పంపిణీ
రెబ్బెన ; రెబ్బెన మండలం లోని ఖైరిగూడా గ్రామపంచాయతీ లో గురువారం మండల ప్రాథమిక పాఠశాల నందు పిల్లలకు కు ఆట వస్తువులను బిజెపి ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీరా ఆత్మారాం నాయక్ పంపిణీ చేశారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ పల్లెల్లో ఉన్న పిల్లలు ప్రభుత్వ పాఠశాలలొ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారి మానసిక ఎదుగుదలకు ఆటలు ఎంతో సాయపడతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్ పంచాయతీ సెక్రెటరీ వినోద్ గ్రామ పెద్దలు వస్త్రం నాయక్ హరి నాయక్ గణేష్ చిలుముల శంకరి వసంతరావు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
రెబ్బెన : అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మండల ఎంపిపి సౌందర్య ఆనంద్ జడ్పిటిసి సంతోష్ లు అన్నారు బుధవారం రెబ్బెన మండలం లోని రాజారం గ్రామంలో రోడ్లపై ఏర్పడిన గుంతలను మట్టితో పుడిపించారు. అలాగే వెల్కమ్ బోర్డులను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన పనులను వేగవంతంగా చేసి రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలను పల్లెలో పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. మండలం కోమరవేల్లి గ్రామ పంచాయతీలో మామిడి తిరుమాల్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పరిధిలో నర్సారి మరియు రోడ్డు కి ఇరువైపుల పిచ్చిమొక్కలను మరియు సైడ్ డ్రైన్ పనులను అలాగే రెబ్బెన నంబరు ఇంద్రానగర్, గూడెం మాధవా గూడెం, నవగం తదితర గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తదితర నాయకులు అధికారులు పాల్గొన్నారు
ప్రజల సహకారంతోనే గ్రామాల అభివృద్ధి
రెబ్బెన ; పల్లె ప్రగతి లో ప్రజల సహకారంతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు బుధవారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న పల్లె ప్రగతి ఈ కార్యక్రమానికి విచ్చేసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి లో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని ఈ ప్రజల సహకారంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రతి ఒక్కరూ పాలుపంచుకొని బంగారు తెలంగాణ కి శ్రీకారం చుట్టాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం కాపాడుకోవచ్చని మన ఏరియాలో మనం మనం పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు అలాగే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక బ్రో ఏర్పాటు చేసుకుని పరిశుభ్రంగా ఉంచాలి అన్నారు. ముందుగా కిష్టాపూర్ లోని నర్సరీలను పరిశీలించిన పరిశీలించి ఆ ఏరియాలో డంపింగ్ యార్డ్ స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో సి పి ఓ కృష్ణయ్య ఎం పి పి సౌందర్య జెడ్ పి టి సి సంతోష్ సర్పంచ్ జమున, చెన్న సోమశేఖర్, ఎం ఆర్ ఓ రియాజ్ అలీ ఎం పి డి ఓ సత్యన్నారాయణ సింగ్ ఎం పి టీ సి సంగం శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు
విద్యార్థి నాయకురాలి పైన దాడి పాశవికం
రెబ్బెన : ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటి అధ్యక్షురాలిగా ఎన్నికైన అయేషా గోష్ వామపక్ష విద్యార్థి నాయకురాలి పైన యూనివర్సిటీ ప్రొఫెసర్ మీద,సామాన్య విద్యార్థుల మీద నిన్న రాత్రి జరిగిన పాశవిక దాడిని ఖండిస్తున్నామని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు.JNU లో పాగా వేసేందుకు మతోన్మాద సంఘాలు ఇలాంటి దాడులు చేస్తూ విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే వారిపైన దాడులు చేయడం సిగ్గుచేటని అన్నారు.ఇలాంటి దాడులు పునరావృత్తం అవుతే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
పల్లె ప్రగతి లో అభివృద్ధికి శంకుస్థాపనలు
రెబ్బెన : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం నంబాల గ్రామ పంచాయతీ లో స్మశానవాటిక , డప్పింగ్ యార్డు మరియు స్మశానవాటికకు వెళ్ళడానికి రోడ్డు జె సి బీ మరియు బ్లెడ్ ట్రాక్టర్ సహాయం తో సర్పంచ్ చెన్న సోమశేఖర్ ఎం పి పి జుమీడి సౌందర్య జెడ్ పి టీ సి వేముర్ల సంతోష్ భూమి పూజ రోడ్లకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి చదును చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ ఎం పి పి గజ్జల సత్యనారాయణ, ఉప సర్పంచ్ అశోక్, పి ఆర్ డి ఈ రాజన్న, ఏ ఈ జెగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం
రెబ్బెన : క్రీడలు మానసిక వికాసానికి కాకుండా శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపకరిస్తాయి అని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కొండయ్య అన్నారు. శనివారం గోలేటి భీమన్న స్టేడియంలో సింగరేణి 9 పాఠశాల విద్యార్థులు కు అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను క్రీడల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. ఈ క్రీడల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఎటువంటి డిఎం సాయిబాబాగా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రావు పర్సనల్ మేనేజర్ లక్ష్మణ్ రావు రామశాస్త్రి సీనియర్ పీవో కార్యదర్శి కృష్ణ కుమార్ సూపర్వైజర్ లు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)