Wednesday, 8 November 2017

పి ఆర్ టి యూ టిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కల్వల శంకర్

పి ఆర్ టి యూ టిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కల్వల శంకర్
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 08 :  పి ఆర్ టి యూ టిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా  రెబ్బెన మండలం నక్కలగూడ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న కల్వల శంకర్ ను  ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తం రెడ్డి, ప్రధాన  కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి నియమించారు. తనపై నమ్మకంతో ఈ పదవి అప్ప చెప్పినందుకు  సంఘ పటిష్టతకు తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని ఆయన అన్నారు ఆయన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా కార్యవర్గలకు ధన్యవాదాలు తెలియజేశారు. శంకర్ ఎన్నిక పట్ల రెబ్బెన  మండల అధ్యక్షులు ఆర్.సత్తన్న, ప్రధాన కార్యదర్శి అనిల్  కుమార్, జిల్లా  ఉపాధ్యక్షులు ఖాదర్ హర్షం వ్యక్తం చేశారు.

గిట్టుబాటు ధర రాక రైతుల ఇబ్బందులు ; తెదేపా జిల్లా అధ్యక్షులు ఆనంద్

గిట్టుబాటు ధర రాక  రైతుల ఇబ్బందులు ; తెదేపా జిల్లా అధ్యక్షులు ఆనంద్


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 08 :   తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సంవత్సరం పంటలకు గిట్టుబాటు ధరలేక రైతాంగం అల్లాడిపోతుందని వారిని రాష్ట్ర ప్రభుత్వం  ఆదుకోవాలని పత్తికి సోయాకు గిట్టుబాటు ధర కల్పించాలని తెదేపా  కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు పత్తికి మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పత్తికి గిట్టుబాటు ధర ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు రైతుల సమస్యలు పరిష్కరించడంలో తెరాస సర్కారు పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు ఆరుగాలం కష్టపడి పండించే రైతు కంటతడి పెట్టుకోవడం రాష్ట్రానికి మంచిది కాదని ఆయన అన్నారు పత్తితో పాటుగా సోయాకు వారికి మంచి ధరలు కల్పించాలని దీన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన కోరారు. టిడిపి రైతుల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తుందని అన్నారు పత్తితో పాటుగా సోయాకు వరికి గిట్టుబాటు  ధరలు కల్పించి రైతులు పండించిన పంటలను  ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  ఈ సమావేశంలో తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు భువనగిరి మురళి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్మారాం, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి సిఎచ్ గణపతి పట్టణ అధ్యక్షులు తాజ్ బాబా , టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి సాయిరాం తెలి యువత జిల్లా నాయకుడు వి వేణు నాయకులు పి.మల్లేష్ ధర్మ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులకు వ్యతిరేకముగా ధర్నా

అక్రమ అరెస్టులకు వ్యతిరేకముగా ధర్నా 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 08 :   అధికారంలోకి రావడానికి ఇచ్చిన లక్ష  ఉద్యోగాల హామీని నెరవేర్చాలని  చలో  అసెంబ్లీ నినాదంతో అసెంబ్లీకి తరలి వెళ్తున్న బీజేపీ నాయకులను ఎక్కడికక్కడే అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూబుధవారంనాడు బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్  ఆధ్వర్యంలో రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి గత నులభై నెలలుగా కేవలం  తన ఇంట్లో నాలుగు ఉద్యోగాలు కల్పించి తెలంగాణ ప్రజలను ముఖ్యంగా తెలంగాణయువతను  మభ్య  పెడుతున్న కెసిఆర్ కు రానున్న ఎన్నికలలో  గద్దెదించి బుద్ధి చెప్పాలని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించకపోతే రాబోయే రోజులలో  బీజేపీ, బీజేవైఎం ఆధ్య్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రెబ్బెన మండల అధ్యక్షులు ఇగురాపు సంజీవ్, మండల బీజేపీ అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ, ఉపాధ్యక్షులు పూదరి రమేష్, బీజేవైఎం కార్యదర్శి అజ్మీరా ప్రశాంత్, జిల్లా కిసంమోర్చా అధ్యక్షులు సునీల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. 

Tuesday, 7 November 2017

కుష్ఠు వ్యాధి ఫై అవగాహనా సదస్సు

కుష్ఠు వ్యాధి ఫై  అవగాహనా సదస్సు 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 07 :  జాతీయ కుష్ఠు నిర్ములన కార్యక్రమంలో  కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం 2017 భాగంగా రెబ్బెన మండలంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంగళ వారంనాడు జరిగిన కార్యక్రమంలో వైద్యాధికారిని  నాగమణి కుష్టి వ్యాధి ఫై  అవగాహనా కల్పించారు అనంతరం మాట్లాడుతూ ఎవరి ఒంటిమీదనైనా తెల్లని,ఎరుపు రంగు   , మచ్చలు  ఉంది స్పర్శ లేనట్లయితే కుష్ఠు అని అనుమానించాల్సివస్తుందని  .  ముందుగానే చికిత్స మొదలుపెడితే  అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చని  అన్నారు.ఈ విషయంపై సర్పంచులు ఆశా సిబ్బంది, మండలంలోని ప్రజలకు అవగాహనా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగమణి, సూపర్ వైజర్లు పావని, సంతోష్, లెప్రసి కోఆర్డినేటర్ రామకృష్ణ రెడ్డి , కమల్ , తదితరులు పాల్గొన్నారు. 

పదోన్నతి బాద్యతను మరింత పెంచుతుంది - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

 పదోన్నతి బాద్యతను  మరింత పెంచుతుంది   - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 07 :   విధి నిర్వహణ లో పదోన్నతి మరింత బాద్యతలను పెంచుతుందని  జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ అన్నారు, పదోన్నతి ఇచ్చిన ఆత్మ విశ్వాసం, నూతన ఉత్తేజం ను ఉపయోగించుకొని పోలీసులు అన్నిటా ఆదర్శం గా ,మార్గనిర్దేశకులు గా ఉండేలా వారి  పనితనం వుండాలని జిల్లా ఎస్పి నూతనము గా పదోన్నతి పొందిన ఎస్సై లకు సూచించారు, సోమవారం జిల్లా లోని స్థానిక ఎస్పి క్యాంపు కార్యాలయం లో ఆర్డర్టు టు  సర్వ్ పై వచ్చి ఏఎస్సై నుంచి ఎస్సై గా పదోన్నతి పొందిన  ఏఎస్సై లు డి.ప్రభాకర్ , షైఖ్  ఖమ్రోద్దిన్ లను జిల్లా ఎస్పి  గౌరవపదోన్నతి  చిహ్నం అలంకరించి అబినందిచారు. .ఇక పైన కూడా రెట్టింపు విశ్వాసం తో శాంతి భద్రతలను కాపాడాలని తెలిపారు ఈ కార్యక్రమము లో ఎస్పి సీసీ దుర్గం శ్రీనివాస్ , ఎస్బి సీ ఐ సుధాకర్, ఎస్బి ఎసై లు శివకుమార్ , ఎన్.ఐ.బి ఎస్సై శ్యాం సుందర్, డి సి ఆర్ బి ఎస్సై రానా ప్రతాప్ , పోలీస్ ఉన్నత శ్రేణి సహాయకుడు కేదార సూర్యకాంత్,  కిరణ్ కుమార్ లు   పి.ఆర్.ఓ మనోహర్  లు పాల్గొన్నారు.  

Sunday, 5 November 2017

చలో ఢిల్లీ గోడప్రతుల విడుదల


చలో ఢిల్లీ గోడప్రతుల విడుదల 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 05 :  అధికధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించాలని ఏ  ఐ టి యు సీ  సింగరేణి వర్కర్స్ యూనియన్ గోలేటి బ్రాంచ్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ అన్నారు. ఆదివారం రెబ్బెన మండలం గోలేటిలో  ఈ నెల 9,10,11 తేదీల్లో పార్లమెంట్ వద్ద తలపెట్టిన మహాధర్న కార్యక్రమానికి సంబంధించిన చలో ఢిల్లీ గోడ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత మూడున్నరేళ్ళగా ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ,ఫార్మా ఇన్సూరెన్సు  , రక్షణ ,  రంగాలలో విదేశీ  పెట్టుబడులను ఆహ్వానిస్తూ వాటిని విధ్వంసం  చేస్తున్నాదని , 44 కార్మిక చట్టాలను 4 కోడలుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాదని  అన్నారు. అచ్చేదిన్ మాక్ ఇన్ ఇండియా అంటూ 33 శాతం ఓట్లతో  అధికారాలోకివచ్చి  పెద్దనిఓట్లరద్దుఅని సామాన్య ప్రాణాలను ఇబ్బందులలోకి నెట్టివేసిందని అన్నారు. రాష్ట్ర విషయానికివస్తే  కెసిఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం మాయ మాటలతో గారడీ చేస్తున్నాడని అన్నారు. ఈ విషయంపై ఢిల్లీ లో జరిగే మహాధర్నాను విజయవంతం  కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చెల్లూరి అశోక్, మండల కార్యదర్శి రాయల నర్సయ్య, తిరుపతి, దుర్గం తిరుపతి, నాయకలు బి తిరుపతి, సికందర్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

స్వేరో ఒలింపిక్స్ సన్నాహక 2 కే రన్

 స్వేరో ఒలింపిక్స్ సన్నాహక  2 కే  రన్



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 04 : హైద్రాబబులో నవంబర్ 6 నుండి 9 వరకు లాల్ టెఖీఢీ యందు జరగనున్న 3వ స్వేరో ఒలింపిక్స్ ను పురస్కరించుకునిఆసిఫాబాద్ యందు స్వేరో జిల్లా శాఖ ఆద్వర్యం లో  2 కే  రన్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి  ముఖ్య అతిథి గా హాజరు ఐన స్వేరో రాష్ట్ర అధ్యక్షులు కాంపెల్లి ఊశన్నా స్వేరో జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ స్వేరో సంస్కృతి లో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఉందని, ఆరోగ్యం గా ఉన్న వారు    అధిక జ్ఞానమును సంపాదించుకోగలరాని , తద్వారా జ్ఞాన సమాజ నిర్మాణంలో ఎక్కువగా పాల్గొనగలడని తెలిపారు ఈ కార్యక్రమం లో స్వేరో జిల్లా అధ్యక్షులు హేమంత్ షిండే, కోశాధికారి చైతన్య, ఉపాధ్యక్షులు ఆత్మ రావ్, ఆసిఫాబాద్ మండల స్వేరో బాధ్యులు వెంకటేష్, మారుతి, శిరీష్, చంద్ర శేఖర్,  గిరిజన సంక్షేమ గురుకులా ల డి సి ఓ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ డా. కె .రాజారాం ,ఉప్పలఁయ్య మరియు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గిరిజన సంక్షేమ గురుకులాల జూనియర్ స్వేరోలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు.

Friday, 3 November 2017

బాలిక అదృశ్యం కేసు నమోదు

బాలిక అదృశ్యం కేసు నమోదు 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 03 :  రెబ్బెన మండలం కొమురవెల్లి గ్రామానికి చెందిన నాయిని భాగ్యలక్ష్మి   (17) అనే యువతి గత నెల  29  వ తేదీ రాత్రి నుంచి కనిపించకుండా పోయినట్లు  అమ్మాయి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రెబ్బెన ఎస్సై  తెలిపారు. 

ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకొవాలి ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకొవాలి ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 03 :  కౌటాల కెజిబివి పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని యమ్.పావణ్యను చితకబాదిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకొవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున డిఈవొ కార్యాలయంలో స్ట్రెక్టర్ ఆఫీసర్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ విద్యాబుద్ధులు నెర్పించాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులను కొట్టడం సరికాదని అన్నారు. కౌటాల కెజిబివి పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న శిరీష విద్యార్థినిని చితకబాదడం వల్ల విద్యార్థినిని అస్వస్థతకు గురి కావడం జరిగిందని అన్నారు. గత సంవత్సరం నుండి కౌటాల కెజిబివి పాఠశాలలో ఏదో ఒక విధంగా గందరగోళం పాఠశాలలో నెలకొంటుందని అన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వలన జిల్లాలోని విద్యాసంస్థలల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నరాని అన్నారు. జిల్లాలోని కెజిబివి పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన రాకపోవడం సిగ్గుచేటన్నరు. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాల్సిన అధికారులు నిమ్మకు నిరెత్తినట్టుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నరు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకొకుండ వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కౌటాల కెజిబివి పాఠశాలలో జరిగిన విషయంలో సమగ్ర విచారణ జరిపి బధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేశారు. లేని పక్షంలోఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి, మండల కార్యదర్శి పర్వతి సాయి పాల్గొన్నారు..

పి అర్ టి యు టి ఎస్ జిల్లా ప్రధమ కార్యవర్గ సమావేశం

పి అర్ టి యు  టి ఎస్ జిల్లా ప్రధమ కార్యవర్గ సమావేశం 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 03 :   పి అర్ టి యు  టి ఎస్ కొమురం భీం జి ల్లా ప్రధమ కార్యనిర్వాహక వర్గ సమావేశం ఈ నెల 5 వ తేదీన ఆసిఫాబాద్ లోని  పి అర్ టి యు భవన్లో   ఉదయం 10 గంటలకు జరుగుతుందని పి అర్ టి యు  టి ఎస్ రెబ్బెన  మండల అధ్యక్ష్య,ప్రధానకార్యదర్సులు ఆర్ సత్తెన్న, ఎస్ అనిల్ కుమారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు పూల సర్వోత్తమ రెడ్డి ప్రధాన కార్యదర్శి , ప్రధానకార్యదర్శి గుర్రం చెన్న కేశవ రెడ్డి లు పాల్గొంటారు. కావున రెబ్బెన మండలంలోని ప్రాధమిక సభ్యులు, సీనియర్ కార్యకర్తలు మరియు మండల జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విధిగా సకాలంలో సమావేశానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు. 

Thursday, 2 November 2017

రేషన్ షాప్ డీలర్ల లిఫ్టింగ్ బంద్

   రేషన్  షాప్ డీలర్ల లిఫ్టింగ్ బంద్  
    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) నవంబర్ 02 : రేషన్ షాప్  డీలర్ల  ఆందోళనలో భాగంగా రేషన్ షాప్ డీలర్లు లిఫ్టింగ్ బంద్ పాటిస్తున్నారు.. ఆసిఫాబాద్ కొమురం భీం జిల్ల కాగజ్ నగర్లోని గోదాం దగ్గర జరిగిన కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా దుకాణాల సంఘం అధ్యక్షులు రేగుంట కేశవరావు మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధనకై ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు .  ప్రభుత్వం  రేషన్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు కమిషన్ పెంచకుండా, ఉద్యోగభద్రత కల్పించకుండ,పేదప్రజలకు అండగా  ఉన్న వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేదిశగా నగదు బదిలీ వైపు అడుగులు వేస్తున్న ప్రభుత్వ నిర్ణయానికి  వ్యతిరేకంగా ఈ బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కోనేరు శేషగిరి రావు, ఉపాధ్యక్షులు అసెంబీన్ పాటి ,పైడి పురుషోత్తం, తణుకు తిరుపతి, శంకరయ్య, రామయ్య, శంకర్లల్ జైస్వాల్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

కార్తీకమాసం సందర్భాంగ వనమహోత్సవం

కార్తీకమాసం సందర్భాంగ వనమహోత్సవం 


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) నవంబర్ 02 :   కార్తీకమాసం సందర్భాంగ వనమహోత్సవం  కార్యక్రమన్ని   గురువారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక నర్సరీలో నిర్వహచరు. జిల్లాపాలనాధికారి జిల్లా ఉన్నతాధికారులతో కలసి జిల్లా పాలనాధికారి పూజాది కార్యక్రమాలు నిర్వహించి, కార్యక్రమాన్ని  ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలసి వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, జిల్లా ప్రణాళికాధికారి క్రిష్నయ్య, రెవిన్యూ డివిషనల్ ఆఫీసర్ రమేష్ బాబు, మరియు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. .  



ఆసుపత్రిలో ఇంజక్షన్ గది ఏర్పాటు చెయాలి

ఆసుపత్రిలో ఇంజక్షన్ గది   ఏర్పాటు చెయాలి   

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) నవంబర్ 02 :     స్థానిక ప్రభుత్వాసుపత్రి లో ఇంజక్షన్ గది  ఏర్పాటుచేయాలని బీజేపీ మండల అధ్యక్షులు ఖాంద్రే విశాల్ డిమాండ్  చేసారు. గురువారంనాడు బీజేపీ మండల కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ స్థానిక  ప్రభుత్వాసుపత్రిలో ఇంజెక్షన్ గది  లేకపోవడంతో మహిళా రోగులులకు అందరి యెదుటనే ఇంజెక్షన్లు ఇస్తున్నారని ఇది మహిళలకు  ఇబ్బందికర పరిస్థితి అన్నారు.  ఈ విషయంమై గతంలో ఎన్నోసార్లు ఆందోళనలు చేసిన కూడా పఃలితంలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల, లక్సమం, విలాస్, పవన్ సింగ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.