Wednesday, 4 January 2017

సులబ్ కాంప్లెక్స్ నిర్మించండి

సులబ్ కాంప్లెక్స్  నిర్మించండి 

వినతి పత్రం ఇస్తున్న సీనియర్ సేవ సభ్యులు శంకరమ్మ 
కుమురం బీమ్  ( వుదయం ప్రతినిధి) జనవరి 04 :  రెబ్బెన మండల కేంద్రములోని బస్  స్టేషన్ లో సులబ్ కాంప్లెక్ ను నిర్మించాలని బెల్లంపల్లి జి ఎం రవి శంకర్ కు సేవ సమితి సీనియర్ సభ్యులు కుందారపు శంకరమ్మ బుధవారం వినతి పత్రాన్ని ఇచ్చ్చారు . ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు . అనంతరం ఆమె మాట్లాడుతూ గోలేటి నుండి ఎక్కడికి వెళ్ళాలన్న రెబ్బెనకు వెళ్లాల్సిందే అని రెబ్బెన బస్  స్టేషన్ లో గంటల తరబడి వేచి ఉండాల్సి  వస్తుందని ,  మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు . అదే విదంగా రెబ్బెనలో ఒక్క కుట్టు మిషన్ కేంద్రాన్ని మంజూరు చేయాలని ఆమె జి ఎం తో తెలిపారు . జి ఎం రవి శంకర్ సానుకూలంగా స్పందించారు . తప్పకుండ సులబ్ కాంప్లెక్ నిర్మిస్తామని హామీ ఇఛ్చినట్లు తెలిపారు . ఈమె తో పాటు సభ్యులు దేవక్క , బోణీ శంకరమ్మ , ఆడే పెంటక్కా లు ఉన్నారు . 

పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి 
సూపెర్వైజర్ లక్ష్మి 
కుమురం బీమ్  ( వుదయం ప్రతినిధి) జనవరి 04;  అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్ఛే పౌష్టికాహారాన్ని పిల్ల తల్లులు సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడీ సూపర్ వైజర్  భాగ్య లక్ష్మి అన్నారు . బుధవారం రెబ్బెన లోని అంగన్వాడీ   కేంద్రాలలో 0 - 5 సంవత్సరాల పిల్లల పెరుగుదల పర్యవేక్షణ పై ఐ సి డి ఎస్ ఆధ్వర్యములో అవగాహన కల్పించారు . ఈ సందర్బంగా ప్రతి నెల పోషణ ఆరోగ్య దినం 1,2  ఏర్పాటు చేసి పిల్లల బరువులు తుకన   వేసి తీవ్ర లోపము ఉన్న పిల్లలను గుర్తించి వారిపై ప్రత్యక శ్రద్ధ వహిస్తామని అదేవిదంగా ఈకువ బియ్యం ఇవ్వడము జరుగుతుందని పేర్కొన్నారు . ఈ కార్యక్రమములో సర్పంచ్ తోట లక్ష్మణ్, ఎంపీటీసీ మొరిలీబాయి, గంగాపూర్ కార్యకర్త ప్రేమల , గోలేటి కార్య కర్తలు  స్వర్ణలత, సంధ్య రాణి  లు ఉన్నారు .  

మహిళలను రక్షించడమే షీటీంల లక్ష్యం : సీఐ మదన్ లాల్

మహిళలను రక్షించడమే  షీటీంల లక్ష్యం :సీఐ మదన్ లాల్


కుమురం బీమ్  ( వుదయం ప్రతినిధి) జనవరి 04; మహిళలను రక్షించడమే  షీటీంల లక్ష్యమని రెబ్బేన సర్కిల్ ఇన్స్పెక్టర్  మదన్ లాల్  అన్నారు.  రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల విధ్యార్ధులకు బుధవారం  రెబ్బెన పోలీస్ సర్కిల్  అద్వర్యం లో షీ టీం ల పై అవగాహనా కల్పించారు.ఈ సందర్బంగా ఆయన    మాట్లాడుతు  అమ్మాయిలను, స్త్రీ లను రక్షించడమే షీ టీంల పని అని అన్నారు. స్త్రీల  పట్ల అసభ్యంగా ప్రవర్తించిన,దుర్బాషలాడిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ అభ్యున్నతి,స్వేచ్ఛ గ రోడ్ల పై తిరిగే రోజులు కల్పించే దిశగా కృషి చేస్తుందని అందుకు ప్రతి ఒక్కరు దీనికి సహకరించగలరని కోరారు.మహిళా పై నిత్యం జరుగుతున్న దాడులు,అఘాయిత్యాలను అరికట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా షీ  టీంలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.అమ్మాయిలను, మహిళలను కించపరిచే ఆకతాయిలను పట్టుకునేందుకు డివిజన్ స్థాయిలో ఒక షీ టీం మఫ్టీ  లో  నిరంతరం పర్యవేక్షణలో ఉంటారని అన్నారు.మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్న,వేధింపులకు గురిఅవుతున్న పోలీస్ జిల్లా శాఖ చరవాణి నెంబర్ 7995800776, 100 కి కాల్ చేస్తే  వెంటనే సంబంధిత సిబ్బంది స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారని అన్నారు.  జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలఅనుసారం అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరిణని  చైతన్యవంతులను చేస్తున్నామని అన్నారు. యువత పెడదారిని వదిలి బంగారు భవిష్యత్తుకు కళాశాల సమయంలోనే పునాదులు వేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన తహసీల్ధార్ బండారి రమేష్ గౌడ్,కళాశాల ప్రిన్సిపల్ కర్ల వెంకటేశ్వర్,షీ టీం బృందం వాని శ్రీ, కోమల,పొలిసు సిబ్బంది సి ఎహ్ రవీందర్ , ఉమేష్, అధ్యాపకులు అథియాఖనామ్, శాంతకుమారి,వనమాల,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.     

Tuesday, 3 January 2017

మాలి సంఘం అద్వర్యం సావిత్రి భాయ్ కి నివాళి

మాలి సంఘం అద్వర్యం సావిత్రి భాయ్ కి నివాళి

కొమురం బీమ్ ఆసిఫాబాద్  (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామం లో ని మాలి కులస్థులు మంగళవారం సావిత్రి భాయ్ పూలే 186 జయాంతి సందర్బంగా గగ్రామం లోని చిన్న పిల్లలకి అక్షర అభ్యాసం చెసి సావిత్రి భాయ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి  ఘనంగా నివాళ్లు అర్పింకివచ్చారు. ఈ సందర్బంగా ఆమె చేసిన మహిళలకు చదువు కావాలని గొప్ప ఉద్యమం చేసిన మహిళా నాయకురాలని దేశం లో నే మొట్ట మొదటి  మఃహిళ ఉపాధ్యాయురాలు అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో మాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్.గంటుమేర,గ్రామా అధ్యక్షురాలు ఎల్.తానుభాయ్,వాడై పోచు భాయ్, లెందుగురే సోమయ్య,వాసకా విత్తు,వాడయి విత్తు,లెందుగురే మల్లయ్య, కులస్తులు పాల్గొన్నారు.

విద్యార్థినిలు సావిత్రి బాయి పూలెను ఆదర్శంగా తీసుకోవాలి:పూదరి సాయికిరణ్

విద్యార్థినిలు సావిత్రి బాయి పూలెను ఆదర్శంగా తీసుకోవాలి:పూదరి సాయికిరణ్  


కొమురం బీమ్ (ఆసిఫాబాద్) ,వాంకిడి ;   (వుదయం ప్రతినిధి) సావిత్రి బాయి పూలె స్వేచ్ఛకు గుర్తని, ఒక సేవకు ప్రతి రూపం అని, ఆత్మవిశ్వసపు సంచలనమని సావిత్రి బాయి పూలేను ప్రతి ఒక్క విద్యార్థిని,  స్త్రీ లు ఆమెను   ఆదర్శంగా తీసుకోవాలని    ఏ ఐ ఎస్ ఏఫ్  డివిజన్ ప్రధాన కార్యదర్శి పూదరి సాయికిరణ్,అధ్యక్షులు బావునే వికాస్,అన్నారు. తరతరాల అవమానాలు, వెనకకు నెట్టిన కులాలు, చదువుకు దూరం చేసి, మూఢ నమ్మకాలలో నిండాముంచి, స్త్రీని ఆటవస్తువుగా చుసిన నా దేశములో, స్త్రీని మనిషిగా చూసేలా తీర్చిదిద్దిన మూఢత్వమే రాజ్యముగా  ఉన్న దేశంలో వెలుతురు చుపే దారిగా వచ్చిన ఉపాధ్యాయురాలిని సావిత్రి బాయి పూలె అని అన్నారు. సావిత్రి బాయి పూలె 186వ జయంతి సందర్బంగా వాంకిడి మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం లో ఆమె చిత్రపటానికి   పూలమాల వేసి నివలులు అర్పించారు. విద్యతోనే అసమానతలు తోలిగి పోతాయని, విద్యతోనే విప్లవాత్మక మార్పులు వస్తాయని, విద్యావ్యాప్తికి కృషి చేస్తూ అగ్ర వర్ణాల అధిపత్యాని, సాంఘిక దురాచారాలను నిరసించి ఉద్ద్యమాన్ని చేసి మహిళలకు విద్యను బోధించింది సావిత్రి బాయి  పూలె అని అన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతు వివాహల ప్రోత్సాహం, అనాధ బాలాలదత్తాత వంటి సామజిక కార్యక్రమాలను ప్రోత్సహించి అనేక మందిలో చైతన్యం కలిగించింది సావిత్రి బాయి పూలె అని అన్నారు. అడా పిల్లలను వంటింటికే పరిమితం చేసే విధానాలను వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఎన్నో అవమానాలను సైతం ఎదుర్కున్న గొప్ప ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలె అని అన్నారు. పూలెని  ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్  నాయకులూ  జాడి సాయి, కేజీబీవీ ఎస్వో దీపికా,ఉపాధ్యాయినులు,విద్యార్థినిలు  తదితరులు పాల్గొన్నారు.

సావిత్రి బాయి పూలె జయంతిని అధికారికంగా జరపాలి ; ఏ ఐ ఎస్ ఎఫ్

సావిత్రి బాయి పూలె జయంతిని అధికారికంగా జరపాలి ;  ఏ ఐ ఎస్ ఎఫ్  

కొమురం బీమ్  (రెబ్బెన వుదయం ప్రతినిధి) సావిత్రి బాయి పూలె స్వేచ్ఛకు గుర్తని, ఒక సేవకు ప్రతి రూపం అని, ఆత్మవిశ్వసపు సంచలనామ్ అని ఏ ఐ ఎస్ ఏఫ్  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం  రవీందర్ అన్నారు. తరతరాల అవమానాలు, వెనకకు నెట్టిన కులాలు, చదువుకు దూరం చేసి, మూఢ నమ్మకాలలో నిండాముంచి, స్త్రీని ఆటవస్తువుగా చుసిన నా దేశములో, స్త్రీని మనిషిగా చూసేలా తీర్చిదిద్దిన మూఢత్వమే రాజ్యముగా  ఉన్న దేశంలో వెలుతురు చుపే దారిగా వచ్చిన ఉపాధ్యాయురాలిని సావిత్రి బాయి పూలె అని అన్నారు. సావిత్రి బాయి పూలె 186వ జయంతి సందర్బంగా రెబ్బెన మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూలమాల వేసి నివలులు అర్పించారు. విద్యతోనే అసమానతలు తోలిగి పోతాయని, విద్యతోనే విప్లవాత్మక మార్పులు వస్తాయని, విద్యావ్యాప్తికి కృషి చేస్తూ అగ్ర వర్ణాల అధిపత్యాని, సాంఘిక దురాచారాలను నిరసించి ఉద్ద్యమాన్ని చేసి మహిళలకు విద్యను బోధించింది సావిత్రి బాయి  పూలె అని అన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతు వివాహల ప్రోత్సాహం, అనాధ బాలాలదత్తాత వంటి సామజిక కార్యక్రమాలను ప్రోత్సహించి అనేక మందిలో చైతన్యం కలిగించింది సావిత్రి బాయి పూలె అని అన్నారు. అడా పిల్లలను వంటింటికే పరిమితం చేసే విధానాలను వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఎన్నో అవమానాలను సైతం ఎదుర్కున్న గొప్ప ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలె అని అన్నారు. సావిత్రి బాయి  పూలెని విద్యార్థులు ఆదర్శనంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్  నాయకులూ పార్వతి సాయి, కార్తీక్,మనీషా,సౌమ్య తదితరులు పాల్గొన్నారు. 

కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ట్రస్మా సభ్యులు

కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ట్రస్మా సభ్యులు 


కొమురం భీం ఆసిఫాబాద్  (వుదయం ప్రతినిధి) ; జిల్లా కలెక్టర్ చంపాలాల్ కు ఆసిఫాబాద్ జిల్లా ప్రైవేటు పాఠశాలల సంఘం ట్రస్మా సభ్యులు మంగళ వారము  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు . ఈసందర్బంగా కలెక్టర్ చంపాలాల్ కు పుష్ప గుచ్ఛం  ఇచ్చ్చారు. ప్రతి ఒక్క సభ్యుడు శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమములో ఉమ్మడి జిల్లాల ట్రస్మా ప్రధాన కార్యదర్శి వొడ్నాల శ్రీనివాస్ , ఆసిఫాబాద్ డివిజన్ ట్రస్మా ప్రధాన కార్యదర్శి పి  దేవభూషణం ,  డివిజన్  ఉపాధ్యాక్షుడు రాధా కృష్ణ చారి,  సభ్యులు దీకొండ  సంజీవ్ కుమార్ , మహేష్ ,,కోటేశ్వర్ రావు ,రవి కుమార్,  రాజ్ కుమార్ , నరేందర్ , సుజాత్  ఆలీ ,మీరాద్  హుస్సేన్  లు ఉన్నారు.  

Monday, 2 January 2017

ఎస్ వి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ లో నూతన సంవత్సర సంబురాలు

ఎస్ వి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ లో నూతన సంవత్సర సంబురాలు 

 కొమురంభీం( ఆసిఫాబాద్ ) వుదయం : రెబ్బెన మండల కేంద్రములో సాయి విద్యాలయము (ఎస్ వి ) ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో నూతన సంవత్సర సంబురాలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు . ఈ సందర్బంగా విద్యార్థులు , ఉపాధ్యాయులు కేకు కట్ చేసి , మిఠాయిలు పంచారు . అనంతరము విద్యార్థులతో ఆటలు , పాటలు , డ్యాన్సులు చేయించారు . డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి . విద్యార్థులు ఉపాధ్యాయులు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు . ఈ కార్యక్రమములో పాఠశాల కరస్పాండెంట్ దీకొండ  విజయ కుమారి హెడ్మాస్టారు డి సంజీవ్ కుమార్ , ఉపాధ్యాయులు జె ఉష , రాజన్న , రేష్మ , ఆశ , సుజాత , విద్యాసాగర్ , తిరుపతి ,  ప్రశాంత్ , మధుకర్ తో పాటు విద్యార్థులు ఉన్నారు.

పదవి విరమణ పొందిన కార్మికులకు సన్మానం

పదవి విరమణ పొందిన కార్మికులకు సన్మానం 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్  లో పని చేసి సోమవారం నాడు పదవి విరమణ పొందిన కార్మికులను గని  ఉన్నత అధికారులు శాలువలు కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమం లో ప్రాజెక్ట్ అధికారి మోహన్ రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజనీర్ రాజ్మహమ్మెద్,రక్షణ అధికారి వెంకటేశ్వర్లు,ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి,ఏఐటీయూసీ సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య,ఫిట్ కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి, పాల్గొన్నారు  

వి ఓ ఏ లను కించపరిచిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దహనం

 వి ఓ ఏ లను కించపరిచిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దహనం
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) ఐకేపీ వి ఓ ఏ ల  సమస్యల ఫై చలో హైదరాబాద్ వెళ్లిన వి ఓ ఏ లను కించపరుస్తు మాట్లాడి అవమాన పరిచిన రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు  దిష్టి బొమ్మను సీఐటీయూ అద్వర్యం లో సోమవారం నాడు రెబ్బేన మండల కంద్రం లోని బస్టాండ్ వద్ద దహనం చేసారు. ఈ సందర్బంగ సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్,వి ఓ ఏ  ల మండల అధ్యక్షుడు గజెల్లి భీమేష్ మాట్లాడుతు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఐకేపీ  వి ఓ ఏ లకు 5500 వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత 40 నెలలుగా వేతనాలు పెండ్డింగ్ లో ఉన్నా ఎలాంటి స్పందన లేదని  అన్నారు.ఈ సమస్యలు పరిష్కరించకపోగ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ఐకేపీ వి ఓ ఏ లు సంభందిత మంత్రి దృష్టి కి తీసుకెళ్తే సంభంధం లేకుండా ఏమి పట్టనట్టు వ్యవహరించి అసలు ఐకేపీ వి ఓ ఏ లు ఎవరని వారికి ప్రభుత్వానికి ఏమి సంబందం అని అనడం ఎంతవరకు సమంజసం అని,సెర్ఫ్ ద్వారా వేతనాలు ఇవ్వాల్సిన అవసరం లేదని బాధ్యత రాహిత్యంగా మాట్లాడిన మాటలను  జూపల్లి కృష్ణారావు  వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఐకేపీ వి ఓ ఏ ద్వారానే ప్రభుత్వ పధకాలు,డ్వాక్రా రూణాలు,ఇతర సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరవేయాలని ఫై అధికారులు ఒత్తిడి చెసి వి ఓ ఏ ల ద్వారానే అనేక పనులు చెయించుకుంటున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఐకేపీ వి ఓ ఏ లకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమం లో మండల వి ఓ ఏ లు డి.శంకర్,ఎం.శ్రీనివాస్, ఎల్.పరమేష్, సిహెచ్.తిరుపతి,ఆర్.కృష్ణ,లింగన్న,చంద్రశేఖర్,తదితరులు పాల్గొన్నారు 

Sunday, 1 January 2017

త్రాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు

త్రాగు నీరు లేక  తీవ్ర ఇబ్బందులు 

                                                 ఖాళి బిందెలతో రాష్ట్రీయ రహదారిపై రాస్తా రోకో
కొమురం భీం ఆసిఫాబాద్, రెబ్బెన : రాష్ట్ర ప్రభుత్వం త్రాగు నీటి కోసం ఎన్నోలక్షలు ఖర్చు పెడుతుండగా గ్రామాలలో మాత్రం త్రాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . రెబ్బెన మండలములోని  కొండపల్లి గ్రామ పంచాయతీ లోని నేర్పల్లి గ్రామ ప్రజలు తగు నీటి కోసము ఆదివారము రాష్ట్రీయ రాహదారిపై ఖాళి బిందెలతో రాస్తా రోకో నిర్వహించారు . పురుషులు ఎడ్ల బండ్లతో రోడ్డు పైకి ఎక్కారు . దీంతో రాక పోకలకు తీవ్ర అంతరాయం కలిగింది . లారీలు బస్సులు ఎక్కడివి అక్కడ నిలిచి పోయాయి . ఈ విషయం తెలుకొన్న ఎం పిపి కార్నాథం సంజీవ్ కుమార్ , రెబ్బన సి ఐ మదన్ లాల్  ప్రజలకు నచ్చ్చజెప్పారు . కానీ ససేమిరా ఆ ఊరి ప్రజలు మాట వినక పోవడముతో ఎం పిపి సంజీవ్ కుమార్ ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ కు  , ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి లకు ఫోన్ ద్వారా సమాచారం ఇఛ్చి మాట్లాడారు . 20 రోజుల్లో గ్రామములో విద్యుత్ కొరత లేకుండా చూస్తామని , త్రాగు నీటి కొరతను కూడా తీరుస్తామని హామీ ఇచ్చ్చారు  . అంతవరకు ప్రతి రోజు 2 ట్యాంకర్ల  తో నీటి సరఫరా చేస్తానని హామీ ఇవ్వగా సి ఐ మదన్లాల్ కూడా ఒకా ట్యాంకు త్రాగు నీరు ఇస్తానని హామీ ఇచ్చ్చారు .దీనితో  ఆ గ్రామ ప్రజలు రాష్ట్ర రోకోను విరమించారు .గత కొన్ని రోజులుగా ఆ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న త్రాగు నీటి సమస్య ఇప్పటికైనా నెరవేరుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.

కలెక్టర్ కు టి యు డబ్ల్యు జె నాయకుల శుభాకాంక్షలు

కలెక్టర్ కు  టి యు డబ్ల్యు జె నాయకుల శుభాకాంక్షలు 
 

కొమురం భీం ఆసిఫాబాద్ :  జిల్లా కలెక్టర్ చంపాలాల్ కు కలెక్టర్  క్యాంపు కార్యాలయంలో టి  యు డబ్ల్యు జె నాయకులూ  వివిధ పత్రికల జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు ,యూనియన్  నాయకులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమములో డి పి ఆర్ ఓ సంపత్ కుమార్, టి  యు డబ్ల్యు జె  జిల్లా కన్వీనర్ అబ్దుల్ రాహేమాన్, అక్రిడేషన్ కమిటీ సభ్యుడు  ప్రకాష్ గౌడ్ , స్టాఫ్ రిపోర్టర్ లు గిరీష్ ,శంకర్, సునీల్ కుమార్ ,  హన్మాండ్లు , శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ కార్యాలయములో రెవిన్యూ క్యాలెండర్ ఆవిష్కరణ

కలెక్టర్ కార్యాలయములో రెవిన్యూ క్యాలెండర్ ఆవిష్కరణ


                                          కలెక్టర్ కు కేకు తినిపిస్తున్న తహశీల్ధార్ రమేష్ గౌడ్ 
కొమురం భీం ఆసిఫాబాద్: జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవిన్యూ అధికారుల సంఘం అద్వర్యం లో నూతన సంవత్సరవేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా కలెక్టర్ చంపాలాల్ కు జిల్లా తహశీల్ధార్ ల సంఘం అధ్యక్షుడు బండారి రమేష్ గౌడ్   శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరము  కేక్ కట్ చేసి , కలెక్టర్ కు తినిపించారు . 2017 క్యాలెండరును  అవిష్కరించారు. ఆలింగనము చేసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు , ఈ కార్య క్రమములో  ఆసిఫాబాద్ ఇంచార్జ్ ఆర్ డి ఓ మోహన్ రావ్ ,ఎం ఆర్ ఓల సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్ ,ఏ ఓ రమేష్ బాబు ,జిల్లా లోని ఏం ఆర్ ఓ లు అమృత్ సాగర్ ,సురేష్ ,రఫతుల్లా పలువురు ,తదితరులు పాల్గొన్నారు.