రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం గోలేటి సింగరేణి ఆధ్వర్యంలో గురువారం రోజున జి యం కార్యాలయంలో ఎస్ ఐ మరియు కాన్స్టేబుల్ పరీక్ష కు ఎంపికయిన నిరుద్యోగ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ బెల్లంపల్లి ఏరియా జి యం కే రవిశంకర్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో కార్మిక పిల్లలకు గతంలో చాల విధాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు . విద్యార్థుల భావి భవిషత్తు కు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో భోదన పుస్తకాలను.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Thursday, 4 August 2016
ఎస్ ఐ మరిము కానిస్టేబుల్ పరీక్షలకు ఎంపికైన వారికి పుస్తకాల పంపిణి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం గోలేటి సింగరేణి ఆధ్వర్యంలో గురువారం రోజున జి యం కార్యాలయంలో ఎస్ ఐ మరియు కాన్స్టేబుల్ పరీక్ష కు ఎంపికయిన నిరుద్యోగ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ బెల్లంపల్లి ఏరియా జి యం కే రవిశంకర్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో కార్మిక పిల్లలకు గతంలో చాల విధాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు . విద్యార్థుల భావి భవిషత్తు కు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో భోదన పుస్తకాలను.
ఎ బి విపి లో కళాశాల యువకులు చేరిక
ఎ బి విపి లో కళాశాల యువకులు చేరిక
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని ఆర్ట్స్ &సైన్స్ కళాశాలలో గురువారం ఎబివిపి లో కళాశాల యువకులు సభ్యత్వం పొందారు నాయకులు ఎబివిపి మండల నాయకులు ఆడి పు నరేష్ ఆధ్వర్యంలో కళాశాల యువతీ యువకులను విద్యార్ధి సంఘాలలో చెరిపించడం జరిగిందన్నారు. విద్య సమష్యల పై నిరంతరం ఎబివిపి వెన్నంటే ఉంటూ విద్య సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులూ జుమీడి అణున్ , మధుకర్ , హజాహార్ లు పాల్గొన్నారు.
పంచాయితిలో హరితహారం
పంచాయితిలో హరితహారం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన గ్రామపంచాయతి ఆవరణంలో గురువారం సర్పంచ్ పెసరు వెంకటమ్మ మరియు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మలు మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతు మనరాష్ట్ర ముఖ్యమంత్రి కలలుకన్న బంగారు తెలంగాణ హరిత వర్ణం కావాలంటే ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ కార్యకలాపాలు చూసుకోవాలన్నారు అలానే మండలంలోని ఉత్తమ గ్రామపంచాయితిగా పేరుపొందాలని హరిత హారంలో భాగంగా మొక్కలు నాటుతూ వాటి ఆలనా పాలన చూసుకుంటున్నామన్నారు . ఈ కార్యక్రమంలో కార్యదర్శి మురళీధర్ , సింగిల్ విండో డైరక్టర్ మధునయ్య , రాజేశ్వరి , అంగనివాడి కార్యకర్తలు బాలమ్మ , సువర్ణ , భూదేవి , సంబాలక్ష్మి , పద్మ , తిరుపతమ్మ , శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు .
ముర్రు పాలు వ్యాధి నిరోధక శక్తి ని ఇస్తాయి -సర్పంచ్ వెంకటమ్మ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); బిడ్డకు కన్నా తల్లి ముర్రు పాలే చాలా శ్రేయస్కరమని, అవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని రెబ్బెన సర్పంచ్ వేంకటమ్మ అన్నారు . గురు వారం రెబ్బెన గ్రామ పంచాయత్ లో ఏర్పాటు చేసి న అవగాహన సదస్సులో మాట్లాడారు . . తల్లి ముర్రు పాలు బిడ్డకు ఆరోగ్యం తో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని ఆమె అన్నారు అదే విదంగా మహిళలు స్థానికంగా ఉన్నా అంగన్వాడీ కేంద్రాలను సంప్రదించి పౌష్టికాహారం తీసికొంటే పుట్ట బోయే బిడ్డ ఆరోగ్యాంగా ఉంటుందని తెలిపారు . ఈ కార్య ఏ ఎం సి వై ఛైర్మెన్ కుందారం శంకరమ్మ ., సూపర్విజర్లు లక్ష్మి , భాగ్యలష్మి లతో పాటు కార్యకర్తలు బాలమ్మ , చంద్రకళ , ప్రమీల లు పాల్గొన్నారు.
దేశవ్యాప్త సమ్మె ను విజయవంతం చేయండి - వాసిరెడ్డి సీతారామయ్య
దేశవ్యాప్త సమ్మె ను విజయవంతం చేయండి - వాసిరెడ్డి సీతారామయ్య
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); కార్మికుల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 2వ తేదీన జరిగే టోకెన్ సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య కోరారు. గురువారం గోలేటిలోని కె ఎల్ మహీంద్రా భావన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మెకు జాతీయ సంఘాలు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయన్నారు. బొగ్గు గనుల జాతీయకరణ చట్టాన్ని మార్పుచేయాలని చూస్తోందన్నారు. పర్మినెంట్ కార్మికులకు టర్మినల్ బెనిఫిట్ ఉండబోవన్నారు. పెట్టుబడి దారులకు కొమ్ముకాసే విధంగా మోదీ ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయన్నారు. టోకెన్ సమ్మెకు బీజేపీ అనుబంధ బీఎంఎస్‌తో పాటు జాతీయ కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చాయన్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేవారిని గుర్తించి యూనియన్‌లో తొలగించేందుకు జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయన్నారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల వైఫల్యం వల్లే సింగరే ణిలో సమస్యలు జఠిలంగా మారాయన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సంస్థ సీఅండ్ఎండీని కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశామన్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలవనున్నట్లు పేర్కొన్నారు.సమ్మె కాలపు వేతనాలు సమానంగా అందరికి ఇవ్వాలని తెలిపారు . వారసత్వ ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి డిమాండ్ చేశారు . విలేకరుల సమావేశంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ , సెంట్రల్ కార్యదర్శి మస్కా సమ్మయ్య బ్రాఞ్చ కార్యదర్శి ఎస్ తిరుపతి , నాయకులుచిప్ప నర్సయ్య , శోకాలు రశీనివాస్ , ఎహ్ రమేష్ , లష్మినారాయనా బాపన్న , ప్రకాష్ లు ఉన్నారు.
Wednesday, 3 August 2016
తల్లి పాలే బిడ్డకు శ్రేయష్కరం - సి డి పి ఓ మమతా
తల్లి పాలే బిడ్డకు శ్రేయష్కరం - సి డి పి ఓ మమతా
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); బిడ్డకు కన్నా తల్లి పాలే చాలా శ్రేయస్కరమని తాండూర్ సిడిపి ఓ మమతా అన్నారు . బుధవారం రెబ్బెన లో కార్యకర్తలతో రోడ్ల వెంట ర్యాలీ నిర్వహించి మాట్లాడారు . తల్లి ముర్రు పాలు బిడ్డకు ఆరోగ్యం తో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని ఆమె అన్నారు అదే విదంగా మహిళలు స్థానికంగా ఉన్నా అంగన్వాడీ కేంద్రాలను సంప్రదించి పౌష్టికాహారం తీసికొంటే పుట్ట బోయే బిడ్డ ఆరోగ్యాంగా ఉంటుందని తెలిపారు . ఈ కార్య క్రమములో సర్పంచ్ వెంకటమ్మ , ఏ ఎం సి వై ఛైర్మెన్ కుందారం శంకరమ్మ ., సూపర్విజర్లు లక్ష్మి , భాగ్యలష్మి లతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ కాళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి- టి వి వి
ప్రభుత్వ కాళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి- టి వి వి
మంత్రులను వెంటనే భర్తరఫ్ చేయాలి-- ఏ బి వి పి
మంత్రులను వెంటనే భర్తరఫ్ చేయాలి-- ఏ బి వి పి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఎం సెట్ -2 లీకేజికి భాద్యులైన మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలనీ ఏ బి వీ పీ జిల్లా కన్వీనర్ కృష్ణ దేవరాయలు అన్నారు . బుధవారం రెబ్బెన లోని డిగ్రీ కాలేజీలో విలేకర్ల సమావేశములో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వాళ్ళ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు , విద్యారంగా సమస్యలు పరిష్కరించుటలో ప్రభురాహ్వము పూర్తిగా విఫలమైందని తెలిపారు , 100 కోట్ల కుంభ కోణం జరిగిన సంభందిత మంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం ఏంటని ప్రశ్నించారు , హాస్టల్ విద్యార్థులకు బాలికకు 500 . బాలురకు 300 రూపాయలు కాస్మొటిక్ చార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు , రెబ్బెన మండల నాయకులు జుమీది అరుణ్ కుమార్ . ఎల్ మధుకర్ , వేణుగోపాల్ , ఆడెపు నరేష్ , రాజేష్ లు ఉన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన గోడ ప్రతుల ఆవిష్కారన
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన గోడ ప్రతుల ఆవిష్కారన
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని అతిధి గృహంలో స్థానిక బి జె పి నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన గోడ ప్రతులను బి జె పి పార్టీ అసంబ్లీ కన్వీనర్ జె బి పౌడెల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ అధిక సంఖ్యలో మహా సమ్మేళనకు హాజరు కావాలని కోరారు . తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం మొట్ట మొదటి సరిగా మనరాష్ట్రానికి వస్తున్నట్లు తెలిపారు.
పునరావాస వారికి సదుపాయాలు కలిపిస్తాం
పునరావాస వారికి సదుపాయాలు కలిపిస్తాం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);బెల్లంపల్లి ఏరియాలోని కైరుగూడ ఓసిపి కి ముంపుకు గురైన ఉల్లిపిట్ట గ్రామస్థులకు పునరావాస ఏర్పాట్లు కలిపిస్తామని ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ అన్నారు. రెబ్బెన మండలం గోలేటి సి ఆర్ క్లబ్ నందు ఎరుపాటుచేసిన ఉల్లిపిట్ట ముప్పు గ్రామస్తుల సమావేశంలో జిల్లా ఎం ఎల్ సి పురాణం సతీష్ స్థానిక ఎం ఎల్ ఏ కోవలక్ష్మి మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలోని కైరుగూడ ఓసిపి వాళ్ళ ముంపుకు గురైన ఉల్లిపిట్ట గ్రామస్థులకు ఇప్పటి వరకు ఎటువంటి సౌకర్యలు కలిపించాక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారాని .2001 నుండి ఎప్పడివరకు వారు ఓపెన్ కాస్ట్ దుమ్ము దూళి డంప్ఇసుకతో పంట పొలాలన్నీ నాశనం అవుతున్నాయని అధికారులతో ఎన్ని సార్లు తెలిపిన పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. మరియు వారి మిగులు భూములు తీసుకోవాలని, డబ్బులు చెల్లించాలని గ్రామస్తులు ఏర్పాటు సమావేశంలో ఎం ఎల్ ఎ కోవ లక్ష్మి ఉళ్లిపీట గ్రామంలో పునరావాస వారికి నీరు , విద్యుత్ , రోడ్లు , పాఠశాల భవనం మరియు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించి సదుపాయాలు కల్పించాలని సింగరేణి యాజమాన్యం జియం రవి శంకర్ కు సూచించారు . అదేవిధంగా మా స్వంత నిదుల నుండి కొంతమేరకు కేటాయించి పునరావాస సదుపాయాకై కృషి చేస్తామన్నారు . ఈ కార్యక్రమంలో రెబ్బెన మడలం యం పిపి కార్నాధం సంజీవ్ కుమార్ , జడ్ పిటిసి బాబురావు , తిరియాని మండలం యం పిపి లక్ష్మి , జడ్ పిటిసి కమల , అడ్వికేట్ పి గోపి , అసిపాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ కుందారపు శంకరమ్మ, తహసీల్దార్ రమేష్ గౌడ్ సర్పంచులు తోట లక్ష్మణ్ , కోవ పార్వతి , స్థానిక యం పిటిసి వనజ , సింగరేణి అధికారులు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి ఏరియాలో వర్షా పాతంతో బోగ్గు ఉత్పత్తికి ఆటకం
బెల్లంపల్లి ఏరియాలో వర్షా పాతంతో బోగ్గు ఉత్పత్తికి ఆటకం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి బెల్లంపల్లి ఏరియా లోని కైరుగూడ,డోర్లి 1 అండ్ 2 ఉపరితలగనుల్లో వర్షాల ప్రభావంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం జరిగిందని బెల్లంపల్లి ఏరియా జి యం రవిశంకర్ అన్నారు. సోమవారం రెబ్బెన మండలంలో గోలేటి జి ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జి ఎం రవిశంకర్ మాట్లాడుతూ అధిక వర్ష పాతం నమోదు అవడం వల్ల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరు కోలేదన్నారు. జులై నెలాఖరుకల్లా 4.86. 000 వేల టన్నులకు గాను 3. 21. 688 టన్నుల ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జి యం అన్నారు. గత సంవత్సరానితో పోల్చుకుంటే ఈ ఏడాది వర్ష భావం పెరిగినట్లు అందువల్లే ఉత్పత్తి తాగిందని రానున్న రోజుల్లో మరింత మెరుగయినా ఉత్పత్తి సాధిస్తామని తెలిపారు. హరిత హారంలో భాగంగా మొత్తం సింగరేణి ఏరియా లోనే అగ్ర స్థానంలో బెల్లంపల్లి ఏరియా నిలిచిందని 13 లక్షా మొక్కలకు గాను 4 లక్షల 50 వేల మొక్కలు నాటడం జరిగిందని ఈ సందర్బంగా తెలిపారు.
Tuesday, 2 August 2016
గ్రామాల్లో హరిత హారం
గ్రామాల్లో హరిత హారం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం నంబాల గ్రామపంచాయత్ పరిధిలోని హనుమాన్ బస్తి లో రెండవ విడత హరిత హారంలో భాగంగా ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారం శంకరమ్మతో పటు కాలనీ వాసులు పురవిధుల్లో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మొక్కల పెంపకంతో మానవాళికి అనేక రకాలుగా ఉపకరిస్తాయని మొక్కల పెంచడం వల్ల రైతాంగానికి మేలు కలుగుతుందని నదులు ,చెరువులు,నీటి మట్టం పెరిగి అధిక పంటలు పండుతాయని అన్నారు .ఈ కార్యక్రమంలో కుందారపు మల్లయ్య ,దరిశెట్టి శారద,గంగమ్మ,రమేష్ ,లక్ష్మితో పటు తదితరులు పాల్గున్నారు .
Saturday, 30 July 2016
యూ పిఎస్ స్కూల్ లో విద్య కమిటీ ఎన్నిక
యూ పిఎస్ స్కూల్ లో విద్య కమిటీ ఎన్నిక
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం లోని పాఠశాలలో శనివారం విద్యాకమిటీ ఎన్నికలు జరిగాయి . ఈ ఎన్నికలలో కమిటీ చైర్మన్ గా షైక్ నిజామొద్దీన్ ఎన్ని కయ్యారు .ఉప చైర్మన్ గా కొండగుర్ల భావన ,కో ఆప్షన్ మెంబెర్ గ శ్రీ బొమ్మినేని శ్రీధర్ ,సత్రపు సత్తయ్య గా ఎన్నుకొన్నారు . ఈ సందర్బంగా ఈ ఎన్నికలో సమావేశం లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమశేఖర్ , విద్యార్థులు తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు
Subscribe to:
Posts (Atom)









