Tuesday, 9 February 2016

జి యం కార్యాలయం ముందు కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా

జి యం  కార్యాలయం ముందు కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం  గోలేటిలో బెల్లంపెల్లి ఏరియా జి యం  కార్యాలయం ముందు మంగళవారం రోజున కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించటం  ఈ సందర్భం గా ఏ ఐ టి సి గోలేటి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి మట్లడుతూ   కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేసారు హైపవర్ కమిటీ  వేతనాలను చెల్లించాలని, సియంపియఫ్  స్లిప్పులను , ఆసుపత్రి బుక్కులను ఇవ్వాలని కోరారు   కాంట్రాక్టర్లు మారినా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారదన్నారు. ఈ కార్యక్రమం లో కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఏరియా గోలేటి బ్రాంచ్  అద్యక్షుడు బోగే ఉపేందర్‌ గోలేటి బ్రాంచి కార్యదర్శి చల్లూరి అశోక్ ఉపాధ్యక్షుడు లేకురి సుధాకర్, నాయకులూ సాగర్ గౌడ్, రామ స్వామి తఃదితరులు పాల్గొన్నారు. 

భూగర్బ జలాలను పెంపుకై ఇంకుడు గుంతల ఏర్పాటు

భూగర్బ జలాలను పెంపుకై  ఇంకుడు గుంతల ఏర్పాటు

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) పరిశుబ్రతే లక్ష్యంగా, భూగర్బ జలాలను పెంచుకునే విధంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని  మంగళవారం  రెబ్బెన మండల ఎంపీడీవో ఎంఎ అలీం మాట్లాడారు. ఈ పనులలో భాగంగా మండలం లోని అన్ని గ్రామాలలో ఇంకుడు గుంతలు నిర్మించుకొని పరిశుబ్రతను పాటించాలని అన్నారు   వాడల్లో మురికి నీరు  పారుతుండటం వాళ్ళ ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని  ఈ విధంగా ఇంకుడు గుంతలు  నిర్మించుకోవటం వల్ల మురికి నీరు వాడల్లో చేరకుండా ఉంటుందని, భూగర్బ జలాలను పెంచుకునే విధంగా కూడా ఉపయోగపడుతుందని, మండలం లోని అన్ని గ్రామాల ప్రజలు సహకరించి ప్రతి ఒక్కరు తమతమ ఇళ్లలో ఇంకుడు గుంతలునిర్మించుకోవాలని, పొలాల్లో నీటి నిలువకోసం  వారు  కోరారు.  

Sunday, 7 February 2016

కైర్గం లో కౌలు రైతులకు అవగాహనా సదస్సు

 కైర్గం లో కౌలు రైతులకు అవగాహనా సదస్సు 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం లోని కైరగామ  గ్రామా  పంచయతిలో శుక్రవారం రెబ్బెన తహసిల్దార్ మరియు వారి సిబ్బంది గ్రామా కౌవులు రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు . రైతులకు పట్టా పాస్ పుస్తకాలూ ఉన్న రైతుల వద్ద నుండి కౌలు పత్రం రాసుకొని సమీపం లోని మీ సేవ కార్యాలయం లో ధరకాస్తు చేసుకోవాలని  అన్నారు. అలాగే రైతుల యెక్క సమస్యల పిర్యాదులను స్వికరిచారు . ఈ సదస్సు లో ఎం .పి .పి . సంజీవ్ కుమార్ ,గ్రామా సర్పంచ్ , వి. ర్ .ఒ  చంద్రమౌళి మరియు కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

జాతరకు అంగడి దుకాణాల వేలం

 జాతరకు అంగడి దుకాణాల వేలం      

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ఈ నెల 22 తేదిన రెబ్బెన మండలం లోని గంగాపూర్ లో శ్రీ బాలాజీ వ్వెంకటేశ్వర స్వామిజాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వస్తువుల విక్రయాలు  ,అంగడి దుకాణాల ,టెంకాయల ,వాహనాల పార్కింగ్ స్థలాల వేలం పాటను శనివారం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈ .ఒ  బాపురెడ్డి  ప్రకటనలో తెలిపారు . ఈ వేలం పాటకు ముందుగా 20,000/- చెల్లించి టెండరింగ్ లో పాల్గొనాలని ఈ  ఓ తెలిపారు                                     



Friday, 5 February 2016

దశల వారి పోరాటాలకు కార్మికులు అందరు పాల్గొనాలి

దశల వారి పోరాటాలకు కార్మికులు అందరు పాల్గొనాలి  

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) దేశ వ్యాప్తంగా సింగరేణి బొగ్గు గని కార్మికుల హక్కుల సౌకర్యలకై  (ఏఐటీయూసీ) చేపట్టిన దశల వారి పోరాటాలకు కార్మికులతో పటు అన్ని సంఘాలు కలిసి రావాలని (ఏఐటీయూసీ) నేత శేషయ్య గురువారం రెబ్బెన మండలం లోని గోలేటి భీమన్న స్టేడియం లో ఏర్పాటు చేసిన కార్మికుల సదస్సు లో మాట్లాడారు మోడీ ప్రబుత్వం 7వ పై కమి షన్ అమలుచేయడం వాళ్ళ వంద శతం ధరలు పెరుగుతయన్నారు ఇందుకు గాను 10వ వెజి బోర్డు కమిటి ని త్వరితగతి న నియమించి పరిష్కరించాలని  డిమాండ్ చేసారు 29న మరోసారి ఇజయమ్ కార్యలయలతో పటు అన్ని గనుల విభాగాలలో ధర్నాలు మార్చి 7 నుండి 10 వరకు వర్క్ తో టూల్ మార్చి 29 న ఒక రోజు దేశ వ్యాప్త టోకెన్ సమ్మె కు అన్ని సంగాల నేతలు కలిసిరవలన్నారు ఈ సదస్సు లో ఎ ఐ టి యు సి గోలేటి బ్రాంచ్ కార్య దర్శి ఎస్ తిరుపతి,రాజేష్ నర్సింగరావు  ,శేషు తదితరులు పాల్గొన్నారు 



అంగన్వాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

అంగన్వాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి) అంగన్ వాడి కార్యకర్తలను జిల్లా లో 150నుండి 200 వరకు తొలగిస్తామని ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జాయింట్ కలెక్టర్ గార్లు ప్రయత్నిస్తున్న రని  రెబ్బెన మండలమ లో గురువరం రోడ్ మీద నినాదాలు చేస్తూ ర్యాలి నిర్వహించి అనంతరం రెబ్బెన తహసిల్దార్ కార్యాలయంలోజూనియర్ అసిస్టెంట్ ఊర్మిళ  కు వినతిపత్రాన్ని అన్దజెశారు. అనంతరం సి ఐ టి యు జిల్లా ఊపాదక్షులు అల్లురి లోకేష్ మాటాడుతూ అంగన్  వాడి కార్యకర్తలు గత 20 30 సంవస్తరాల నుండి పనిచేస్తున్నారని చాలిచాలని వేతనాలతో కలం వెల్లడిస్తూ నెలల తరబడి జీతాలు పెండింగ్ లో ఉన్న సెంత్రేస్ లో కనీస వసతులు లేకున్నా అన్నింటిని సర్దుకుని పనిచేస్తున్నారని ఆరోగ్య లక్ష్మి సెంటర్ కిరయిలు టి ఎ డి ఎ లు సంవస్తరాల తరబడి పెండింగ్ లో ఉన్న నోరుమెదపకుండ పనిచేస్తున్నారాణి 14జి ఓ ను రద్దు చేయాలనీ అంగన్వాడి కార్యకర్తలు నినాదాలు చేసారు ఈ కార్యక్రమం లో టి .ప్రమీల కే .చంద్రకళ బాలమ్మసంధ్య  స్వర్ణలత సుశీలమల్లీశ్వరి రాజేశ్వరి లక్ష్మి శ్యామల తిరుపతమ్మ సమ్బలక్ష్మి జయప్రద పాల్గొన్నారు  

రొహిత్ ఆత్మహత్యకు నిరసనగా కేంద్ర ప్రబుత్వ దిష్టి బొమ్మ దహనం

రొహిత్ ఆత్మహత్యకు నిరసనగా  కేంద్ర  ప్రబుత్వ దిష్టి బొమ్మ దహనం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన లో ప్రాదాన రహదారి మీద  గురువారం ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ ఎఫ్‌ సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఈ సందర్బంగా ఏ.ఐ.వై.ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఉపేందర్‌, ఏఐఎస్‌ఫ్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దుర్గం రవీందర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్య కు కారకులైన బందరు దత్తాత్రేయను , కేంద్రమంత్రి స్మృతి ఇరాని ని వెంటనే ఎస్సి ఎస్టి అట్రాసిటి కేసులు పెట్టి వారిని మంత్రి పదవి నుండి తిలగించాలని వారు డిమాండ్ చేశారు .ఉన్నత విద్యారంగంలో బి జె పి  ,అర్ ఎస్ ఎస్ ,ఎ బి వి ఫై ,కులమతాల మద్య చిచ్చు పెడుతూ మద్య గొడవలు సృష్టి స్తున్నారని ఆత్మహత్యలకు కరనమావ్తున్న బి జె పి  ,అర్ ఎస్ ఎస్ విధానాలు విద్యార్తులు తిప్పి కొట్టాలని సెంట్రల్ యునివర్సిటీ లలో జరుగుతున్నా సంగాటనలకు కేంద్ర ప్రభుత్వం బాద్యత వహించాలని అన్నారు లేని పక్షంలో దేశ వ్యాప్తంగా విద్యర్తులు తలపెట్టే ఆందోళనలకు కేంద్ర ప్రబుత్వం బాద్యత వహించాల్సి వస్తుదని అన్నారు   ఈ కార్యక్రమంలో  పొన్న శంకర్‌, ఏఐఎస్‌ఫ్‌  మండల అధ్యక్షులు సాయికిరణ్‌, జిల్లా నాయకులు కస్తూరి రవికుమార్‌, విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు

Wednesday, 3 February 2016

వార్షిక పరిక్షలకు విద్యార్తులకు ఆవగాహన సదస్సు

వార్షిక పరిక్షలకు  విద్యార్తులకు ఆవగాహన సదస్సు   
                                                                   
                
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామం లోని జిల్లా పరిషత్ సెకండరీ ప ఠా శాలలోని విద్యార్తులకు  మరియు కస్తుర్భ  వసతి గృహం విద్యార్తులకు వార్షిక పరిక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో ఒత్తిడిని ఎలా అధికమించాలో అని అభినవ సేవ సమస్త తాండూర్ అద్వర్యం లో ఆదిలాబాద్ సామజిక సమస్య  సౌ జాన్యం తో ఆవగాహన కార్యక్రమం ఏ ర్పాటు చేసారు  ఈ కార్యక్రమానికి ముక్య అతిధి ప్రముఖ వ్యకిత్వ డాక్టర్ కవిత అజయ్ గారు హాజరై విద్యార్తులకు అవగాహనా కల్పించారు జ్ఞాపక శక్తి పెరగటానికి యోగ చేయాలనీ  పరిక్షల ముందు ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదివి ఆ తదుపరి సమాధానాలు రాయాలని   ఈ కార్యక్రమంలో అభినవ సంస్థ అద్యక్షులు సంతోష్ కుమార్ జెడ్ పి ఎస్ ఎస్ ప్రధాన నో పాధ్య యుడు వామనమూర్తి  కస్తుర్భ ప్రిన్సిపాల్ సుమలత  ఆ సంస్థ సభ్యులు గోపాలకృష్ణ లక్ష్మణ  చారి క్రిష్ణ స్రావాన్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు  

సింగరేణి ఓ. బి కార్మికుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి

సింగరేణి ఓ. బి కార్మికుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి ఓ బి  కార్మికుల రాష్ట్ర సదస్సు ఈ నెల 7న శ్రీరాంపూర్ లో జరుగుతుంది దిన్ని విజయవంతం చేయాలనీ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల రీజియన్ ప్రధాన కార్యదర్శి బత్తుల వెంకటేష్ పిలుపునిచ్చారు గోలేటి లో బుధవారం రోజున రాష్ట్ర సదస్సు కు సంబందించిన వాల్ పోస్టర్ విడుదలచేసారుఅనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి ఓ బి  కార్మికుల రాష్ట్ర సదస్సు ఈ నెల 7న శ్రీరాంపూర్ లో జరుగుసభను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు  ఈ కార్యక్రమంలో బండారి తిరుపతి గోడిశేల నారాయణ విప్లవ కుమార్ బాపు శ్యామల దేవి తదితరులు పాల్గొన్నారు 

రైతులకు కూరగాయల విత్తనాల కిట్ పంపిణి

రైతులకు కూరగాయల విత్తనాల కిట్ పంపిణి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బందికి సుస్థిర వ్యవసాయ విభాగంలో కమ్యూనిటీ కో ఆర్డి నే ట ర్ మరియు క్లస్టర్  ఆధికారులు  ఇందిరానగర్  గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో ఉన్న స్వయం సహాయక మహిళలతో సమావేశం నిర్వహించి ప్రస్తుతం వ్యవసాయ విధానంలో సాగు పద్దతులు12 రకాల కూరగాయల విత్తనాల రై తులకు సరఫరా చేసారు తెలం గా ణ పల్లె ప్రగతి రెబ్బెన క్లస్టర్ ఎ పి మం  రాజ్ కుమార్ ,ఎ పి యం వెంకటరమణ మాట్లాడుతూ తెలంగాణ పల్లె  ప్రగతి అమల్లొ భాగంగా రు ణా లు లబ్యత పంట దిగుబడులు మరియు వాటి మార్కెటింగ్ వంటి అంశాలలో ప్రస్తుతం ఆచరిస్తున్న పద్దతులు గూర్చి తెలుసుకుని విశ్లేషణ చేయడం జరిగింది దీని ద్వార విలువ గొల్పు  విశ్లేషణ కూరగాయలు సాగు కందుల పంట సాగులో దశలను విశ్లేషించడమైనది ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ రెబ్బెన మరియు సిబ్బంది సి.సి లు కాశయ్య, హన్ముంతు రావు,తూకరం,తిరుపతి,శంకర్ పరమేష్ మరియు రాజ్ మొహమద్ కాంతారావు పాల్గొన్నారు 

Monday, 1 February 2016

పేదరిక నిర్మూలనకై వ్యవసాయ శిక్షణ

పేదరిక నిర్మూలనకై వ్యవసాయ శిక్షణ 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తెలంగాణ పల్లె  ప్రగతి అమల్లొ భాగంగా రెబ్బెన మండలంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బందికి సుస్థిర వ్యవసాయ విభాగంలో కమ్యూనిటీ కో ఆర్డి నే ట ర్ మరియు క్లస్టర్ కార్యకలాపాలు ఒక రోజు శిక్షణ ఇవ్వడం జరిగింది ఆ తదుపరి గ్రామా సందర్భాలలో భాగంగా పుంజు మేర గూడెం గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో ఉన్న స్వయం సహాయక మహిళలతో సమావేశం నిర్వహించి ప్రస్తుతం వ్యవసాయ విధానంలో సాగు పద్దతులు ఏరువులు విత్తనాల సరఫరా రు ణా లు లబ్యత పంట దిగుబడులు మరియు వాటి మార్కెటింగ్ వంటి అంశాలలో ప్రస్తుతం ఆచరిస్తున్న పద్దతులు గూర్చి తెలుసుకుని విశ్లేషణ చేయడం జరిగింది దీని ద్వార విలువ గొల్పు  విశ్లేషణ కూరగాయలు సాగు కందుల పంట సాగులో దశలను విశ్లేషించడమైనది ఈ కార్యక్రమంలో తెలం గా ణ పల్లె ప్రగతి రెబ్బెన క్లస్టర్ ఎ పి మం  రాజ్ కుమార్ మరియు వెంకటరమణ ఎ పి యం కో ఆర్డినేటర్ రెబ్బెన మరియు సిబ్బంది సి సి లు కాశయ్య హన్ముంతు రావు తూకరం తిరుపతి  శంకర్ పరమేష్ మరియు రాజ్ మొహమద్ కాంతారావు పాల్గొన్నారు 

విద్యాసంస్థలు బంద్ విజయవంతం

విద్యాసంస్థలు బంద్ విజయవంతం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లోనె గిరిజన  యునివరిసిటి ఏర్పాటు చేస్తామని  హమీచ్చారని కానీ ఇప్పుడు గిరిజన యునివరిసిటి వరంగల్ జిల్లాకు తరలించేందుకు ఏర్పాటుచేస్తున్నారని ఐక్య విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌ పిలుపు రెబ్బెనలో విజయవంతమైంది. బంద్‌ను పురస్కరించుకుని ఐక్య సంఘాల విద్యార్థి నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు. ఈ బంద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పాలుపంచుకున్నాయి ఈ  కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ ఎ ఐ ఎస్ ఎఫ్ మండల కార్యదర్శి పుధారి సాయికిరణ్ కిశోర్ కుమార్ విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు 

తహశిల్దార్ కార్యాలయంలో వి.ఆర్.ఓ ల సమావేశం

  తహశిల్దార్ కార్యాలయంలో వి.ఆర్.ఓ ల సమావేశం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన తహశిల్దార్ కార్యాలయంలో సోమవారం తహశిల్దార్ రమేష్ గౌడ్ వి ఆర్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విఆర్ఓలు తమ గ్రామాకార్యాలయంలోరైతులకు అందుబాటులో ఉండాలని ఈ సంవత్సరం నడుస్తున్న పహనిలు 1బి  లు రైతులకు సకాలంలో అందించాలని ఏ గ్రామా వి ఆర్ ఓలు ఆ గ్రామా రైతుల పిర్యాదులు స్వీకరించి నెంబరింగ్ చేసి అందచేయాలని వి ఆర్ ఓల గ్రామకార్యలయంను విడిచివెళ్ళే టప్పుడు క్లస్టర్ రిజిస్టర్ లో నమోదు చేయాలనీ అన్నారు ఏ గ్రామా రికార్డులు ఆ గ్రామా అద్వర్యంలో పొందుపరచాలని  ఈనెల 3 నుండి ప్రతిగ్రామంలో కల్టివేటర్ ఋణ అర్హత కార్డులు మంజూరు అవుతాయని దీనిని కౌలుదారులు రైతు వద్ద కౌలు పత్రం వ్రాసుకొని  వి ఆర్ ఓల వద్ద వ్రాయించి మీ సేవ లో అందజేయాలని అర్హతగల రైతులకు ఋణ గ్రహీత పత్రాలు అందజేస్తామని తెలిపారు ఈ సమావేశంలో ఉప తహసిల్దార్ రామ్మోహన్ రావు, ఆర్ ఐ అశోక్, వి ఆర్ ఓలు ఈమ్లాల్ ,మల్లేష్ ,ధోని బాపు ,చంద్ర మొగిలి ,లక్ష్మి ,శ్రీను తదితరులు పాల్గొన్నారు