కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి 12: టీడీపీ నేత రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు ప్రతాప రెడ్డి అక్రమ అరెస్టును కొమురంభీం జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షులు గుళ్ళపల్లి ఆనంద్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం రెబ్బెన విశ్రాంతి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలోని తెరాస పార్టీ రాష్ట్రంలో టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి బెదిరింపులకు దిగుతున్నదన్నారు. రెండునెలల క్రితం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ కు చెందిన విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య సందర్భంగా పరామర్శకు వెళ్లిన టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు ప్రతాప రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసారని, రాష్ట్ర డి ఐ జి ని కలిసిన తరువాత విడుదల చేసారని మరల రెండు రోజుల క్రితం అకారణంగా,అనైతికంగా అక్రమంగా అరెస్ట్ చేసారని, అతనిని బేషరతుగా విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. ఈ కార్య క్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి జిల్లా ఎస్ సి సెల్ అధ్యక్షులు దుర్గం మాధవ్,నాయకులు విజయ్, నాందేవ్, మనోహర్, రాము,రమ, ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Friday, 12 January 2018
సాంప్లింగ్ మజ్దూర్ పదోన్నతి పరీక్షల నిర్వహణ
కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి 12: సింగరేణి బెల్లంపల్లి ఏరియా లో శాంప్లింగ్ మజ్దూర్ ఖాళీలను భర్తీచేయడానికి శుక్రవారం గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయ ఆవరణలో రాత పరీక్ష నిర్వహించారు. ఏరియాలో ఉన్న 9 పోస్టులకు గాను 26 మంది హాజరయ్యారని జనరల్ మేనేజర్ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. పదోన్నతులకై నిర్వహించిన ఈ పరీక్ష కు మౌఖిక పరీక్షా లేకుండా పూర్తి పారదర్శకతతో నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షా నిర్వహణలో ఎస్ ఓ టూ జి ఎం ఎం ,శ్రీనివాస్,డి జి ఎం పర్సనల్ కిరణ్, అధికారులు సుదర్శనం, రాయమల్లు, యూహన్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్ వి ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ లో ముగ్గుల పోటీలు
సాయి విద్యాలయం విరాళం
కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి 12: రెబ్బెన లోని సాయి విద్యాలయం (ఎస్ వి )ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు హైదెరాబాద్ లోని బోడుప్పల్ అనాథ ఆశ్రమానికి 1030/- రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ శంకరమ్మ, స్థానిక ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుండి విద్యార్థులు సామాజిక సేవను అలవర్చుకొవాలని అన్నారు . అదే విదంగా క్రమశిక్షణతో ఉన్నత చదువులో రాణించి సమాజంలో పేరు తెచ్చుకోవాలని తెలిపారు. సాయి విద్యాలయం విద్యార్థులు ఆట పాటలే కాకుండా అన్ని రంగాలలో ముందున్నారని , చాలా సంతోషకరమని పేర్కొన్నారు . ఈ కార్య క్రమము లో ఎపిఓ కల్పనా, ఎఇఓ అర్చన , టిఎ జయ , వార్డ్ మెంబర్లు , ఉబేదుల్లా , ఉపాధ్యాయులు విజయ లక్ష్మి, విద్యాసాగర్ , లీల , ఉదయ , సుజాత , రాజ్‌కుమార్ , మంగమ్మ , రేష్మ లతో పాటు పాఠశాల కరెస్పాండెట్ ఢీకొండ సంజీవ్ కుమార్ లు ఉన్నారు.
Friday, 5 January 2018
గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 5 ; పశువులకు గాలికుంటూ వ్యాధుల నివారణ కొరకు టీకాలు తప్పని వేయించాలని పశువైద్యాధికారి డాక్టర్ సాగర్ అన్నారు. రెబ్బెన మండలంలోని ఎడవల్లి మరియు ఖైర్గం గ్రామాలలో శు క్రవారం వేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తు చర్యలుగా వ్యాధిని గుర్తించి టీకాలు వేయడం వల్ల గాలికుంట వ్యాధులను నివారించవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 285 పశువులకు టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం పి టి సీ కర్నాధం సంజీవ్, ఖైర్గం గ్రామా సర్పంచ్ కర్నాధం సులోచన పశు వైద్య సిబ్బంది తదితరలున్నారు.
కందుల కొనుగోలు కేంద్రాల ఈ నెల 17 న ఏర్పాటు
కందుల కొనుగోలు కేంద్రాల ఈ నెల 17 న ఏర్పాటు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 5 ; రైతుల సౌకర్యం కోసం కొమురంభీం జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలను ఈ నెల 17న ఏర్పాటు చేయనున్నట్లు సంయుక్త పాలనాధికారి అశోక్ కుమార్ గురువారంనాడు తన కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో తెలిపారు. రైతుల సౌకర్యం కోసం జిల్లాలోని ఆసిఫాబాద్, కగజనగర్, సిర్పూర్((ఎం) జైనూర్, లలో ఈ నెల 17, 18 తేదీలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతులకు మద్దతు ధర 5450 గ నిర్ణయించినట్లు, రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి కందులను కేంద్రాలల్కు తీసుకొనిరావాలన్నారు. రైతులు వస్తున్నప్పుడు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఏ ఈ ఓ ,ఎం ఈ ఓ ధ్రువీకరణ పత్రాల నాకళ్ళను తీసుకోని అన్నారు. ఈ సమావేశంలో మార్కెఫెడ్ డి ఎం గౌరీ శంకర్, జిల్లా పౌర సరఫరాశాఖ మేనేజర్ గోపాల్, జిల్లా సహకార సంస్థ అధికారి మద్దిలేటి , డి పి ఓ ర్బాని, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పాఠశాల విద్యార్థులకు ఉన్నిదుస్తుల పంపిణి
పాఠశాల విద్యార్థులకు ఉన్నిదుస్తుల పంపిణి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 5 ; రెబ్బెన మండలం ధర్మారం ప్రాధమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉన్ని దుస్తులను బోయపల్లికి చెందిన ఎం వసుందర్ వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ వెంకటేశ్వర స్వామి, ఉపాధ్యాయులు రజిత, సంపత్, సి ఆర్ పి రాజేష్, దేవేందర్,విద్యార్థుల తల్లితండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
Thursday, 4 January 2018
నూతన పంచాయతీ ఏర్పాటుకై వినతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 4 ; రెబ్బన మండలంలోని తుంగేడ పంచాయతీలోని మాధవాయిగూడ గ్రామ ప్రజలు గురువారం ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవాలక్ష్మి ని కలిసి తమ గ్రామాన్ని పంచాయితిగా ఏర్పాటు చేయాలనీ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వివిధపానులకై ప్రస్తుత పంచాయితీ తుంగేడ కు వెళ్ళడానికి గ్రామస్తులు ఇబంది పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అల్గామ్ రామయ్య, చౌదరి తిరుపతి, శ్రీనివాస్, శ్రీను, మహేష్, జూపాక సత్తెన్న, వెంకటేష్, కిషన్, అల్గామ్ సంతోష్, రమేష్, ఎం రాజులపాల్గొన్నారు.
మధ్యాన్న భోజన కార్మికుల ఒక రోజు సమ్మె నోటీసు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 4 ; మధ్యాన్న భోజన కార్మికులు ఈ నెల 17న జరుప తలపెట్టిన ఒకరోజు సమ్మె నోటీసు ను రెబ్బెన మండల ఎం ఈ ఓ కు గురువారం అందచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వివిధ పథ కాలలో పనిచేస్తున్న కార్మికులకు 45 వ ఇండియన్ లేబర్ సిఫార్సులను అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర సంఘాలు ఒక రోజు సమ్మె తలపెట్టిన నేఫధ్యంలో ఈ నోటిస్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం తెలంగాణ మధ్యాన్నం భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా సెక్రటరీ పగిది మాయ మాట్లాడుతూ తమను కార్మికులుగా గుర్తించాలని , కార్మికుల జీతాలు కనీసం 18,000 కు పెంచాలని, పని ప్రదేశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సమ్మె చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సెక్రటరీ పగిది మాయ ,మండల సెక్రటరీ విజయ, శాంతాబాయి, రాజేశ్వరి, రాజాబాయి, శాంతా, తనుబాయి, పొశుబాయి, చిన్నుబాయి , తారాబాయి తదితరులు పాల్గొన్నారు.
గాలికుంట వ్యాధులపై నివారణ టీకాలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 4 ; రెబ్బెన మండలంలోని గోలేటిలో గాలికుంటు వ్యాధుల నివారణకు టీకాలు వేయటం జరిగిందని రెబ్బెన మండల పశువైద్యాధికారి డాక్టర్ సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తు చర్యలుగా వ్యాధిని గుర్తించి టీకాలు వేయడం వల్ల గాలికుంట వ్యాధులను నివారించవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 253 పశువులకు టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. జెడ్ పి టి సి అజమీర బాపూరావు, ఎం పి టి సి మురళీబాయి, పశు వైద్య సిబ్బంది తదితరలున్నారు.
లంబాడాలకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాల జారీని నిలిపివేయాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 4 ; లంబాడాలకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాల జారీని నిలిపివేయాలని రెబ్బెన మండలం ఆదివాసీ కొలవార్ సేవా సంఘం అధ్యక్షుడు ఎం మైలారపు శ్రీనివాస్ రెబ్బెన తహశీల్దార్ డి విష్ణుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ లంబాడాలు భారత రాజ్యాంగం 1950 ఆర్టికల్ 342 (క్లాజ్ -1) ప్రకారం ఎస్టీ జాబితాలో నమోదు కాకుండానే 1976 లో దొడ్డిదారిన వచ్చి ఎస్టీ కుల ద్రువీకరణ మరియు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు పొందుతూ విద్య వైద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ ఆర్థిక రంగాల్లో ఆదివాసీల రిజర్వేషన్ల ఫలాలను కొల్లగొట్టుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, సెక్రటరీ పోచమల్లు ,ఈ గోపాల్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
వట్టివాగు నీరు 8న విడుదల
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 4 ; వట్టివాగు ప్రాజెక్టు కుడి ఎడమ కాలువ నీటిని ఆసిఫాబాద్ మండలంలో ఈ నెల 8 న సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బద్రినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు రబీ సాగుకు సిద్ధంగా ఉండి ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలన్నారు. ప్రధాన కాల్వలు పిల్ల కాల్వల పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో నీటివృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. డి5 డిస్ట్రిబ్యూటరీ చివరి ఆయకట్టు దారులు అప్రమత్తంగా ఉండి నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.కిందిస్థాయి ఇరిగేషన్ శాఖ అధికారులు పంట కాలంలో జాయింట్ అజమాయిషీ చేసే సమయంలో సహకరించాలని కోరారు.
సావిత్రి బాయి ఫూలేని ఆదర్శంగా తీసుకొవాలి ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 4 ; సావిత్రి బాయి ఫూలే జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. బుధవారం రోజున సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా రెబ్బెనలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ మహిళలకు విద్యను దూరం చేసి వారిని వంటింటికి పరిమితం చేసిన రోజులల్లో మహిళలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో 1848లో పూణెలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. అగ్రవర్ణ బ్రహ్మణుల నుండి అవమానాలు, దాడులు ఎదుర్కొని బాలికలకు విద్యను అందించి పురుషులకు సమానంగా మహిళలకు హక్కులు కల్పించాలని మహిళల పక్షాన పోరాటం చేసిందని గుర్తు చేశారు. ఈరోజు మహిళలు అనేక హక్కులను పొందుతున్నరంటే సావిత్రి బాయి ఫూలే పోరాట ఫలితామే అని అన్నారు. ఇప్పటికి దేశంలో మహిళలపై, విద్యార్థినిలపై అనేక విధాలుగా దాడులు జరుగుతున్నయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాళితులపైన పెరిగాయని అన్నారు. మహిళల రక్షణ కొరకు మరిన్ని చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి, మండల కార్యదర్శి పర్వతి సాయి, స్వప్న ,అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)








