Saturday, 4 February 2017

విద్యార్థులకు చట్టాలపై అవగాహన

విద్యార్థులకు చట్టాలపై అవగాహన

  కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 4  ;  కోంరంభీం ఆసీఫాబాద్ జిల్లా కేంద్రంలో ని మాత్రుశ్రీ కళాశాలలో శనివారం చట్టాలపై ఆర్.టిఐ కంపెజెనెర్ ట్రైనర్   ఎం.డి సాధిక్ హుసేన్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎం.డి సాధిక్ హుసేన్ మాట్లాడుతూ  సమాచార హక్కు చట్టం తో పాటు వివిధ చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండలని అయన అన్నారు. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని దానిని అందరు వినియోగించుకోవాలని అదే సమాచార హక్కు చట్టమని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరి వినియోగించుకోవచ్చని సూచించారు.  విద్యార్థులకు మౌలిక చట్టాలపై అవగాహన ఉంటె ఫై చదువులకు దోహద పడుతుందని పేర్కొన్నారు. ఇలా చట్టాలపై అవగానే కల్పిస్తే విద్యార్థులు పెడదారిన పడకుండా  సన్మార్గంలో నడుచుకుంటూ ఫై స్థాయిలకు చేరుకుంటారని అన్నారు. అందుచే అవగాహన కార్యక్రమాలను చేపడుతూ విద్యార్థులలో మేద స్థాయిని పెంపొందిస్తున్నామని  తెలిపారు .  ఈ సమావేశం లో ఉపాధ్యాయుల బృందం , విద్యార్థులు తదితరులుఉన్నారు.

శ్రీ సీత రమాఅంజనేయ 5 వర్సికోత్సవ ఉత్సవాన్ని విజయవంతం చేయండి


శ్రీ సీత రమాఅంజనేయ 5 వర్సికోత్సవ ఉత్సవాన్ని విజయవంతం చేయండి 

  కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 4  ;  రెబ్బెన మండలం లోని శ్రీ సీత రామాంజనేయస్వామి  5వ వార్షికోత్సవాన్ని ఆదివారం జరపనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ ఉత్జ్సావా సంబరాలలో అన్న ప్రసాదాన కార్యక్రమము మరియు స్వామి వారికీ ప్రత్యేక పూజ కార్క్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో  పాల్గొని స్వామి వారి నైవేద్యాలు సేకరించాలని కోరారు. 

మెరుగైన వేతన ఒప్పందాన్ని సాధిస్తాం

మెరుగైన వేతన ఒప్పందాన్ని సాధిస్తాం
                              - ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి 

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 4  ; వారసత్వ ఉద్యోగంలో షరతులవలన వారసత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే కార్మికులు తీవ్ర ఇబ్బంధులు ఎదురుకుంటున్నారని,వారసత్వ ఉద్యోగాలకు షరతులను ఆంక్షలను ఎత్తివేయాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి డిమాండ్ చేశారు.శనివారం రోజున గోలేటిలోని కేఎల్ మహేంద్ర భవన్ లో ఏర్పాటు  చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ షరతులు లేని ఉద్యోగాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన తెరాస,టిబిజికెఎస్ నాయకులూ కార్మికులను మోసం చేసారని అన్నారు.గత నాలుగు సంవత్సరాలు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం అయిన టిబిజికెఎస్ పూర్తిగా విఫలం అయిందని అన్నారు.కార్మిక క్షేత్రంలో కార్మికుల చేత తిరస్కరించబడిన కెంగర్ల మల్లయ్య ఏఐటీయూసీ ని విమర్శించడం అర్ధరహితం అని అన్నారు.కార్మికులను భయాందోళనలకు గురిచేస్తూ బలవంతపు  చేరికలు  చేపడుతున్నారని,దీనికి తగిన సమయంలో కార్మికులు బుద్ధి చెప్తారని అన్నారు.అంతర్గత కుమ్ములాటలతో రెండు వర్గాలు గ విడిపోయి జైళ్ల పాలయ్యి,కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసి కార్మికుల హక్కులను తాకట్టు పెట్టారని అన్నారు.రెండు వర్గాలుగా విడిపోయింది చాలక మూడోవ వర్గంగ వెంకట్రాప్ వర్గం చేరిందని దీనితో కార్మికులకు జరిగిన న్యాయం ఏమిలేదని వీరు కార్మికుల హక్కులను రక్షించలేరని,సాధించలేరని అన్నారు.గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వారు ఎన్ని సాధించారో కార్మిక వర్గానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు.కార్మికుల పోరాటాల వల్లనే,ఏఐయూటీసీ నిర్వహించిన పోరుయాత్రలకు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం,యజమాన్యం దిగివచ్చి వారసత్వ ఉద్యోగాలను ప్రకటించాయి తప్ప  టిబిజికెఎస్ చేసింది ఏమిలేదని  అన్నారు. కార్మికుల హక్కులు సాధించడంలో,కాపాడడంలో ఏఐటీయూసీ  నిరన్తరాహారం పోరాటాలు చేస్తుందని,రాబోయే పదవ వేజు బోర్డు సమావేశాలలో  కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందాన్ని సాధించి తీరుతామని ఆయన అన్నారు.ఈ సమావేశంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు బయ్యా మొగిలి,ఆర్గనైజింగ్ కార్యదర్శి జగ్గయ్య,నాయకులూ జూపాక రాజేష్,సురేష్ కోరి,మారాం శ్రీనివాస్,బంటు దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు.  

కార్మికుల ఆకాంక్ష నెరవేర్చింది టీ బి జి కే ఎస్

కార్మికుల ఆకాంక్ష నెరవేర్చింది టీ బి జి కే ఎస్

ద్వారా సమావేశంలో ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య
  కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 4  ; సింగరేణి  కార్మికుల ఆకాంక్షన వారసత్వ ఉద్యోగాలను కేసీఆర్ హామీ తోని నెరవేరిందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘమేనని టిబిజికె ఎస్ ప్రధాన కార్యదర్శి  కెంగర్ల మల్లయ్య అన్నారు. శనివారం  రెబ్బెన మండలంలోని గోలేటి డోర్లి ఓసిపిలో ద్వారా సమావేశం నిర్వ హించి టిబిజికె ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.  18స లుగా నోచుకోని వారసత్వ ఉద్యోగాలు అమలులో పెట్టడం టిబిజికె ఎస్ ఘనతే అని అన్నారు. జాతీయ సంఘాలు అనేక రకాల సాకులతో అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నయి అని జాతీయ సంఘాల వికారిని తీర్పుగా ఖండించారు కేసీఆర్ గొప్ప మనసుతో వారసత్వఉద్యోగాలు ప్రకటించడమే కాదు సర్వీస్ కి నిబంధనలను సవరిస్తూ 35నుండి 40సం  వయసు కు పెంచడం జరిగింది అన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు ఎం,శ్రీనివాస్ రావు ,బీపీఎల్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ సదాశివ్,ఏఎంసీ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మ , నాయకులూ రాంబాబు, శంకర్ తదితరులు ఉన్నారు.  

ఎస్సి వర్గీకరణ చేపట్టాలని రాస్తరోకో

   ఎస్సి వర్గీకరణ చేపట్టాలని  రాస్తరోకో

వాంకిడి, ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 4   ; ఎస్ సి వర్గీకరణ కొరకు బహుజనులు వాంకిడి మండల కేంద్రంలో శనివారం రోజున రాస్తారోకో చేశారు.ఈ సందర్బంగ  కె విలాస్ , ఎం.అశోక్ లు మాట్లాడుతు గతంలో ప్రభుత్వం వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ నేరవేర్చలేదన్నారు.ఇప్పటికైనా ఎస్ సి వర్గీకరణ చేపట్టలని డిమాండ్ చేసారు.ప్రభుత్వం సమస్యను పరిష్కరించని యడల ఆందోళనలను ఉద్రిక్తంగ   చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులూ జాడి వెంకటేష్, రాజు శ్రీనువాస్  తదితరులు పాల్గొన్నారు.

Friday, 3 February 2017

గంగాపూర్ జాతర ఏర్పాట్ల పై సమీక్షా సమావేశం

 గంగాపూర్ జాతర ఏర్పాట్ల పై సమీక్షా సమావేశం

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 3   ;  రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో  9 తేదీనుండి  11 తేది వరకు  నిర్వ హించే  జాతర నిర్వహణలో  అధికారులు అప్రమత్తంగ ఉండాలని  కలెక్టర్ ఎం.చంపాలాల్,ఎం ఎల్ సి పురాణం సతీష్  కుమార్,ఎమ్మెల్యే కోవా లక్ష్మిలు  సూచించారు.శుక్రవారము రోజున స్థానిక  ఎం పి డి ఓ కార్యాలలయంలోని  సమావేశ  మందిరంలోఎంపిపి కార్నాథం సంజీవ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో  మండల  అన్ని శాఖల  అధికారులతో రివ్యు  నిర్వహించారు జాతర విజయవంతానికి,పర్యవేక్షణకు రెవెన్యూ డివిజన్ అధికారి పాండురంగారావును ప్రత్యేక  అధికారిగా నియమించారు.అనంతరం కలెక్టర్ ,ఎమ్మెల్సీ ,ఏమ్మెల్యే  మాట్లాడుతూ వైద్యసదుపాయం,త్రాగునీరు,ఆ ర్. టి . సి .బస్సు సౌకర్యం,విద్యుత్ సౌకర్యం పారిశుధ్యం, ట్రాఫిక్ కంట్రోల్, ఎన్ఎస్ఎస్ సేవల  అంశాలపై నిరంతరం పర్యవేక్షించాలని  ఆదేశించారు.భక్తులకు ఇబ్బంది  కలగకుండా చర్యలు   చేపట్టాలన్నారు.అదే విధంగా త్రాగునీరు నిరంతరం అందించాలని గ్రామీణ నీటి పారుదల శాఖను ఆదేశించారు.జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ వారు  అప్రమత్తంగా  ఉండాలని సూచించారు.అన్ని శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు,ప్రజలు జాతర విజయవంతానికి సహకరించాలని కోరారు,.అదే విధంగా సింగరేణి బెల్లంపల్లి  ఏరియా జిఎం రవిశంకర్ మాట్లాడుతూ   సీసీ కెమెరాలు,విద్యుత్తు సౌకర్యాలు తమ సంస్థ ద్వారా  కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలోఆసిఫాబాద్ డిఎస్పీ భాస్కర్, రెబ్బెన సిఐ మదన్ లాల్, తహసీల్ధార్ రమేష్ గౌడ్, జడ్పిటిసి  బాబురావు, ఎంపిడిఓ సత్యనారాయణసింగ్, రెబ్బెన ఎస్.ఐ దారం సురేష్,ప్రభుత్వ వైద్యాధికారి సంతోష్ సింగ్, గంగాపూర్ సర్పంచ్ రవీందర్, ఆలయ కమిటీ అధ్యక్షులు గంటు మేర, పీడీ శంకర్, ఆర్టీసీ ఆసిఫాబాద్ డియం శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు నాయకులూ పాల్గొన్నారు.

నష్టపోయిన గిరిజన రైతులను ఆదుకోవాలి


నష్టపోయిన గిరిజన రైతులను ఆదుకోవాలి 
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 3; కెరమెరి మండలం కొఠారి గ్రామా పంచాయతీ పరిధిలోని కళ్ళెగాం చెరువు నిర్మాణంలో భూములు కోల్పోయిన గిరిజన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం,అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారంరోజున కలెక్టర్ కార్యాలయంలోని ఏవో రమేష్ బాబుకు వినతిపత్రం అందజేశరు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వినర్ బోయిరే ప్రకాష్,ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆత్మకూరి ప్రశాంత్,రైతులు,సిపిఐ నాయకులు పాల్గొన్నారు. 

Thursday, 2 February 2017

రెబ్బెన కు కలెక్టర్ రాక

రెబ్బెన కు కలెక్టర్ రాక 



కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 2  రెబ్బెన ; రెబ్బెన మండల కేంద్రానికి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్ శుక్రవారం వస్తున్నట్లు డి పీఆర్వో సంపత్ కుమార్  తెలిపారు. మండలములోని గంగాపూర్ జాతర సందర్బంగా రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ఈ మీటింగ్ ఎంపిడిఓ కార్యాలయములో మధ్యాహ్నం 1 గంటకు నిర్వహిస్తున్నట్లు , అధికారులు అందరు సకాలములో హాజరు కావాలని అన్నారు.

టి యూ డబ్ల్యూ జె డైరీ ఆవిష్కరణ ; డైరీని ఆవిష్కరిస్తున్న కలెక్టర్

టి యూ డబ్ల్యూ జె  డైరీ ఆవిష్కరణ ; 
డైరీని ఆవిష్కరిస్తున్న కలెక్టర్ 




కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 2   ; టీయూడబ్ల్యూజే మీడియా డైరీ 2017 ని  కుమురo భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్ గురువారమ్ ఆవిష్కరించారు .  అనంతరం డిపిఆర్ ఓ వై సంపత్ కుమార్  డైరీ అందజేశారు. ఈ కార్యక్రమం లో టీయూడబ్ల్యూజే కొమురం భీం  జిల్లా కన్వీనర్ అబ్దుల్ రాహేమాన్ ,అక్రిడేషన్  కమీటీ మెంబర్ ఈ ప్రకాష్ గౌడ్ ,ఆంధ్రజ్యోతి ప్రతినిథి సదానంద్ ,జిల్లా నాయకులు వేణుగోపాల్ ,రావుల శంకర్ ,రమేష్,హరికృష్ణ పలువురు పాల్గొన్నారు.

కుష్ఠు నివారణ పై అవగాహన సదస్సు

కుష్ఠు నివారణ పై అవగాహన సదస్సు 

కుష్ఠు వ్యాధి పై అవగానే కల్పిస్తున్న అధికారులు 
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 2   ; కుష్ఠు వ్యాధి నివారణ పై రెబ్బెన లోని కొండపలి గ్రామములో సర్పంచ్  మాంతు మేర అధ్యక్షతన గురువారం కుష్ఠు వ్యాధి పై అవగానే కల్పిచ్చారు. ఈ సందర్బంగా డాక్టర్ శివరామ కృష్ణ పాఠశాలల విద్యార్థులకు , గ్రామస్తులకు కుష్ఠు వ్యాధి , బోదకాలు వ్యాధి గురించి క్లుప్తంగా వివరించారు . ఈ కార్యక్రమములో  ఉపసర్పంచ్ జి చారీ , వార్డు మెంబర్లు ఎం తిరుపతి , మొండయ్య  ప్రజలు ,ఉన్నారు.

Wednesday, 1 February 2017

చేతి పంపుల మరమ్మతులు చేపట్టాలి

చేతి పంపుల మరమ్మతులు చేపట్టాలి 

కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) ఫిబ్రవరి 01 ;ఆసిఫాబాద్ గాంధీ చౌక్ వద్ద గల చేతి పంపులు మరమ్మతులు చేపట్టాలని బుధవారం జిల్లా కలెక్టర్ చంపా లాల్ కు బీజేపీ పట్టాన అధ్యక్షులు ఖoడ్రే  విశాల్ మరియు గ్రామస్తులు వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా  విశాల్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ పట్టణానికి పరిషారా ప్రాంత ప్రజలు రాకపోకలు సాగిస్తుండటం తో తాగునీటికి చేతి పంపులపైనే అదరపాటుంటారాణి అన్నారు రెండు సంవత్సరాలుగా చేతి పంపులకు మరమ్మతులు చేయించక పోవడం తో  తగు నీటికి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నామన్నారు రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యగా చేతి పంపులకు మరమ్మతులను చేయించి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చాలన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి గుండా శంకర్ ,నాయకులు రాధికా ,నిర్మల ,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.        

ఐకేపీ విఓఏ ల సమస్యలను త్వరగా పరిష్కరించాలి ; డోంగ్రి తిరుపతి


ఐకేపీ విఓఏ ల సమస్యలను త్వరగా పరిష్కరించాలి ; డోంగ్రి  తిరుపతి 
                 

కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) ఫిబ్రవరి 01 ;ఐ కె పి లో  విఓఏ లు గా  గత 15 సవత్సరాల నుండి  పనిచేస్తున్న ప్రభుత్వ రంగ  సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించకుండా సమస్యలు వలయం లో నెట్టేస్తున్నారని   ఐ కే పి విఓఏ  జిల్లా ఉపాధ్యక్షుడు డోంగ్రి తిరుపతి అన్నారు.  రెబ్బన లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశం లో  మాట్లాడారు  గత 15 సంవత్సరాలుగా   మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం చేయడంలో విఓఏ లు ప్రధాన పాత్రా పోశిస్తున్న ప్రభుత్వం తమ సమస్యలను  గుర్తుంచడం లేదన్నారు ఎన్నికల సమయం లో సి ఎం కెసిఆర్ విఓఏ లకు కనీస వేతనంగా నెలకు 5000 రూపాయిలు అందజేస్తామ ని  హామీ ఇచ్చారని అన్నారు .  సంవత్సరాలు  గడుస్తున్నా సి ఎం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు పేర్కొన్నారు.  43 నెలలు గా బకాయి  వేతనాలు రాక ఆర్థికంగా ఇబ్బందులకు ఎదురుకుంటున్నామన్నారు  ప్రభుత్వం తమను పట్టించుకోక పోవడం తో సమస్యలు తీవ్రం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.  గతనెల 25 న ఐకేపీ విఓఏ ల జిల్లా  సమావేశానికి ఎం ఎల్ సి పురాణం సతీష్ , ఎం ఎల్ ఎ  కోవా లక్ష్మి ముఖ్య అతిథిలుగా విచ్చేసి ఐ కే పి విఓఏ ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను  పరిష్కరిస్తామని  హామీ ఇచ్చారని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం గుర్తించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.  ఈ సమావేశంలో మండల కార్యదర్శి శ్రీకాంత్ తదితర విఓఏ లు పాల్గొన్నారు. 

ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్న విజయకు ఆర్ధిక సహాయం

ఆరోగ్య   సమస్యను ఎదుర్కొంటున్న విజయకు ఆర్ధిక సహాయం 

కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) ఫిబ్రవరి 01 ; రెబ్బన మండలం లోని గ్రీన్ హెల్త్  ఫౌండేషన్ వారు కాలేయ సమస్యతో బాధపడుతున్న  పి విజయకు రెండు వేళా రూపాయిలు ఆర్ధిక సహాయం చేసినట్లు బుధవారం తెలిపారు ఈ సందర్బంగా గ్రీన్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అజ్మీర వస్త్రం నాయక్ మాట్లాడుతూ పి  విజయ గత సవంత్సరం రెబ్బన కళాశాలలో స్లీపరుగా పనిచేస్తుండేది  కొన్ని రోజుల నుండి కాలేయ వ్యాధి తో ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటుందని, నీరు పేదలు కావటం వలన స్థోమత లేక  చికిత్స కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించి గ్రీన్ హెల్త్ ఫౌండేషన్ నుంచి ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు  ఈ కార్యక్రమం లో గ్రీన్ హెల్త్  ఫౌండేషన్ సభ్యులు రాజు కుమార్, మహేందర్, మధుకర్, తదితరులు పాల్గొన్నారు.