Friday, 7 October 2016

ఎస్ ఎస్ ఏ ఆధ్వర్యములో కె సి ఆర్ కు పాలాభి షేకం

ఎస్ ఎస్ ఏ ఆధ్వర్యములో కె  సి  ఆర్ కు పాలాభి షేకం



రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఎస్ ఎస్ ఏ  బెల్లంపల్లి ఆధ్వర్యములో ముఖ్యమంత్రి కె సి ఆర్ కు  గోలేటి లో నాయకులూ పాలాభి షేకం చేశారు . ఎస్ ఎస్ ఏ అధ్యక్షుడు మోర్లే నరేందర్ మాట్లాడుతూ సింగరేణీయులకు వారసత్వ ఉద్యోగాలు జామున హక్కని ఆయన అన్నారు . రాష్ట్ర ముఖ్య మంత్రి కె సి ఆర్ ప్రజల సంక్షేమమే కాకుండ  సింగరేణి కార్మికుల అభివృద్ధి కోసం పాటు  పేర్కొన్నారు . ఈ కార్య క్రమములో  ఇంచార్జి గజ్జెల మల్లికార్జున్ , నాయకులూ మాస్కు రమేష్ పార్వ మాస్కు రమేష్తి అశోక్  గజ్జలా తిరుపతి అల్లాడి తిరుపతి చదువుల తిరుపతి అడే తిరుపతి దెబ్బటే వెంకటేష్ లు పాల్గొన్నారు.

Thursday, 6 October 2016

ప్రారంభమైన పీరీల ఉత్సవాలు

ప్రారంభమైన పీరీల ఉత్సవాలు

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రములో  పీరీల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.పుంజుమ్మెరా గూడా లో కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం లు  పీరీల (సవారీలు ) పండగను గురు వారం భక్తులు భక్తి శ్రద్ధలలతో పూజలు చేశారు .మొహరం పండగా సోమా వారం నుండి ప్రారంభమైనది . అప్పటి నుండి భక్తులు హజ్రత్ హీమాన్ భీ ఫాతియా బంగ్లాలో  పీరీలను ఉదయం సాయంత్రం భక్తి శ్రద్దలతో పూజలు చేస్తున్నారు . యువతీ యువకులు గుండం చుట్టూ డ్యాన్సులు చేస్తూ భక్తి పారవశ్యములో మునిగారు . ఈ పండగ ఈ నెల 12 న ఉండడముతో బంగ్లాను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు . అదే విధంగా గోలేటి విలేజి లో పీర్ల ను భక్తులు భక్తి శ్రద్దలతో పూజలు చేస్తున్నారు.  

రెబ్బెన లో ఘనంగా దేవి నవ రాత్రులు

రెబ్బెన లో ఘనంగా దేవి నవ రాత్రులు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రములో దేవి నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి . ఇందిరా నగర్ లో ప్రతిష్టాపించిన దుర్గా దేవి గురు వారం లలిత దేవి రూపం లో భక్తులకు దర్శనం ఇచ్చింది . భక్తులు భక్తి  శ్రద్దలతో  లలితా దేవిని దూప , దీప నైవేద్యాలతో పూజించారు. కుంకుమ పూజలు చేశారు . అదే విధంగా ఖైరి గూడా ఓపెన్ కాస్ట్ గనిలో దుర్గా దేవి వద్ద కుంకుమ ప్రత్యక   పూజలు జెనెరల్ మేనేజర్ కె రవి శంకర్ నిర్వహించారు. అనంతరం అన్నదానం వఛ్చిన భక్తులందరికీ చేశారు.  

Wednesday, 5 October 2016

దీపావళి బోనస్ ఘనత ఏ ఐ టి యు సి దే -తిరుపతి

దీపావళి బోనస్  ఘనత ఏ ఐ టి యు సి దే  -తిరుపతి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి)సింగరేణి కార్మికుకులకు దీపావళి బోనస్ 54000/-రూపాయలు  సింగరేణి యాజమాన్యం ఇవ్వడం ఇది కార్మికుల విజయమని , ఏ ఐ టి యు సి పోరాట ఫలితమే నిదర్శనమని ఏ ఐ టి యు సి కార్యదర్శి ఎస్ తిరుపతి అన్నారు . బుధ వారం అయన మాట్లాడుతూ  గత సంవత్సరం 48000 రూపాయలు యాజమాన్యం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు . ఏ ఐ టి యు సి కార్మిక సంగము  ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన పోరాడుతూ హక్కుల ను  కాపాడుతూ వస్తుందని అన్నారు . జె బి బి సి సమావేశములో ఏ ఐ టి యు సి ప్రధాన కార్య దర్శి వాసి రెడ్డి సీతా రామయ్య పాల్గొన్నారని తెలిపారు . కార్మికులు ఐఖ్యత గ ఉంటె ఏదైనా సాదించ వచ్చ్చని పేర్కొన్నారు . కార్మికుల హక్కులను కాపాడటంలో గుర్తింపు సంగం టి బి జి  కె ఎస్  పూర్తిగా విఫలమైందని అన్నారు . ఈ కార్య క్రమములో  ఏ ఐ టి యు సి  బ్రాంచ్ ఉపాధ్యాక్షుడు బయ్యా  మొగిలి నాయకులు సంపత్ రావు  తో పాటు తదితరులు ఉన్నారు.

రెబ్బెన లో వృధాగా పోతున్న త్రాగు నీళ్లు ....... .?

రెబ్బెన లో వృధాగా పోతున్న త్రాగు నీళ్లు ....... .? 

రెబ్బెన లో వృధాగా పోతున్న త్రాగు నీళ్లు ....... .? 

రెబ్బెనలో కోతుల బీభత్సం -తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్


రెబ్బెనలో కోతుల బీభత్సం -తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రములో కోతుల బెడద ఎక్కువైంది . దుకాణం యజమానులు కూరగాయలు అముకొనే వారు కోతులతో  ఎన్నో అవస్థలు పడుతున్నారు . మంగళ వారం రెబ్బెన బస్టాన్ద్  లో ఆటోలో నిద్రిస్తున్న కొత్వాల శ్రీనివాస్ ను మాకుమ్మడిగా కోతుల గుంపు  ఏకధాటిగా దాడి చేసితల , వెన్ను పై తీవ్ర గాయాలు చేశాయి . అదే విదంగా గంగాపూర్ నివాసి శేఖర్ పై , ఓ కూరగాయల తాత పై బుధవారం కోతులు   దాడి చేశాయి .కోతుల బెడదతో తట్టుకోలేక పోతున్నామని మండల ప్రజలు ఆవేదన చెందుతున్నారు . సంభందిత అధికారులు ఈ కోతుల బెడద నుండి కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు . 

ఘనంగా దేవి పూజలు

 ఘనంగా దేవి పూజలు

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రములో ని గ్రంధా లయము వద్ద నెల కొల్పిన దుర్గా మాతకు ప్రతి రోజు ఘనంగా పూజలు కోన సాగుతున్నాయి. విగ్రహ ప్రతిష్టాపన చేసిన యువకులు  బుధ వారం రోజున  ప్రత్యక పూజలు చేశారు . ఇదే రోజు మహిళలు దేవికి కుంకుమార్చనలు  చేశారు . భక్తి శ్రద్దలతో దేవి కి ఒక్కొక్క అవతారానికి   ప్రత్య కంగా పూజలు నిర్వహిస్తూ భజనలు చేస్తూ ఉదయం సాయంత్రం దూపం , దీప నైవేద్యాలు సమర్పిస్తున్నాట్లు   విగ్రహ ప్రతిష్టాపన చేసిన యువకులు వెంకటేష్, కార్తీక్, ప్రదీప్, వినోద్, శేఖర్, చంటి,నరేష్, నాగరాజ్ లు తీలిపారు.

Tuesday, 4 October 2016

ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుకు కృషి ఎమ్ ఎల్ ఏ కు సన్మానం

ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుకు కృషి ఎమ్ ఎల్ ఏ కు సన్మానం 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలో ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుకు కృషి చేసినందుకు  ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ ,ఎం ఎల్ ఏ కోవ లక్ష్మికి  సన్మానం  చేసి ధన్యవాదాలు తెలియచేస్తూ  చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు.అసిఫాబాద్ జిల్లా ప్రకటించిన సందర్భంగా మిఠాయిలు పంచుకొని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు పండుగ వాతావరణం చోటుచేసుకొంది నాయకులందరూ కలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకొన్నారు    అదే విధముగా  ఎం పి డి ఓ కార్యాలయంలో  పలువురు నాయకులూ ఏర్పాటు చేసిన సమావేసంలో  మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా కావడానికి వీరు ఎంతగానో కృషి చేసారు అని అన్నారు. ఈ కార్య క్రమములో ఎం పి  పి  సంజీవ్ కుమార్ , జెడ్ పి  టి సి బాబురావు , వైస్ ఎం పి పి  రేణుక , సర్పంచ్ పేసరి  వెంకటమ్మ ,   ఉప  సర్పంచ్ శ్రీధర్ , ఆసిఫాబాద్ మార్కెట్ చైర్ మెన్ శంకరమ్మ , టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్ , నాయకు లు  , చిరంజీవి గౌడ్ , నవీన్ జైస్వాల్ , శ్రీనివాస్ గౌడ్ ,మదునయ్య ,సోమా శేఖర్ ,సుదర్శన్ గౌడ్ , జాకిర్ ఉస్మాని,వెంకటేశ్వర గౌడ్ , సోమయ్య , రాపర్తి ఆశోక్ , రాజ్ కుమార్ , వెంకట రమణ లు ఉన్నారు .

ఆసిఫాబాద్ జిల్లా ప్రకటించండంతో మిన్నంటిన సంబరాలు

ఆసిఫాబాద్ జిల్లా ప్రకటించండంతో  మిన్నంటిన  సంబరాలు 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు అయినందుకు జాతీయ రహదారి పైన  స్వీట్స్ పంచి టపాకాయలు పేల్చి తెలంగాణ సాధన సమితి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు అదేవిధముగా కొమురం భీం పేరు మీదుగా నామకరణం చేయాలనీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సాధన సమితి మండల అధ్యక్షుడు కడ్తల మల్లయ్య ,ఉప అధ్యక్షుడు బోగే ఉపేందర్  జిల్లా నాయకులూ కేసరి ఆంజనేయులు టి వి వి అధ్యక్షుడు కడ్తల సాయి ,పల్లె ప్రకాష్ రావు ,బరత్వాజ్ ప్రదీప్ హన్మంతు ,సెల్వరాజ్ ,మరియు పలువురు నాయకులూ పాల్గొన్నారు.  

అక్రమంగా రవాణా అవుతున్న టేకు కలప పట్టివేత

అక్రమంగా రవాణా అవుతున్న టేకు కలప పట్టివేత 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  అక్రముగా తరలిస్తున్న టేకు కలపను రెబ్బెన మండలంలో  సోమవారం రాత్రి  గోలేటి నుంచి మంచిరియాల్ వైపు  వెళ్తున్న ఐచర్ వ్యాన్ ఏ పి 15 యూ 5410 నెంబర్  గల  వాహనంలో 50 దుంగల కలపను స్వాధీనం చేసుకున్నట్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు.   వీటి విలువ ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల నాలుగు రూపాయలు ఉంటుంది అని అన్నారు. వారికీ వచ్చిన సమాచారం మేరకు నిఘా పెట్టి పట్టుకున్నామన్నారు. అక్రమమముగా కలప రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు అని,అక్రమ రవాణా పూర్తిగా అరికాడుదామని అన్నారు  వీరితో పాటు బీట్ అధికారి ఎమ్ డి షరీఫ్ మరియు ప్రైవేట్ సిబ్బంది వున్నారు.  

ఆసిఫాబాద్ జిల్లా ప్రకటించడం సంతోషం- తెలంగాణ విద్యార్థి వేదిక

 ఆసిఫాబాద్ జిల్లా ప్రకటించడం  సంతోషం- తెలంగాణ విద్యార్థి వేదిక   

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనముగా ఆసిఫాబాద్ కేంద్రముగా జిల్లాను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం అని తెలంగాణ విద్యార్థి వేదిక జిల్లా అధ్యక్షుడు కడ్తల సాయి అన్నారు రెబ్బెన అతిధి గృహంలో మంగళ వారం రోజున ఏర్పాటు  చేసినా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా కోసం ఏకైక విద్యార్థి సంఘము టి వి వి ముందు ఉండి పోరాడింది అని అన్నారు జిల్లా కేంద్రముగా ఆసిఫాబాద్ కావడం వల్ల చుట్టూ ప్రక్కల వున్నా గిరిజన గుడాలు అభివృద్ధి చెందుతూ పరిపాలన వ్యవస్థ మెరుగు పడుతుంది అని అన్నారు అలాగే  ఆసిఫాబాద్ జిల్లా కోసం  తోడ్పడిన నాయకులందరికీ ఉద్యమాభివందనాలు తెలియచేశారు ఈ సమావేశంలో ప్రదీప్ ,కార్తీక్, ప్రకాష్ ప్రణయ్, దుర్గం కుమార్ ,సంజీవ్, శ్రీనివాస్ తదితరులు వున్నారు 

గాంధీజీ అడుగు జాడల్లో నడవాలి- విజయకుమారి

 గాంధీజీ అడుగు జాడల్లో నడవాలి-  విజయకుమారి

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);గాంధీజీ  అడుగు జాడల్లో నడవాలని సాయి విద్యాలయం ఇంగ్లిష్ మీడియం స్కూల్ కరస్పాండెట్ ఢీకొండ విజయ కుమారి అన్నారు . ఆదివారం ఎస్ వి ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో గాంధీజీ జయంతి ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా గాంధీ  పటానికి పూలమాలలు వేసారూ . అహింస మార్గమే దేశానికి రక్షా అని ఆమె అన్నారు . ఈ నాటి యువత క్రమశిక్షణతో చదివి సమాజ సేవలో ముందుండాలని , అప్పుడే పేరు ప్రతిష్టలు వస్తాయని అన్నారు . అదే విదంగా స్థానిక తహశీల్ధార్ , ఎం ఫై డి ఓ,  గ్రామ పంచాయతీ  కార్యాలయముల లో గాంధీ పటానికి పూల  మాలలు  వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఏ  కార్య  క్రమములో తహశీల్ధార్ బి రమేష్ గౌడ్ , సత్యనారాయణ సింగ్ , స్థానిక సర్పంచ్ పెసర వెంకటమ్మ , ఉప సర్పంచ్ శ్రీధర్ , సాయి విద్యాలయం ప్రధానోపాధ్యాయుడు దీకొండ  సంజీవకుమార్ , ఫీల్డ్ అసిస్టెంట్ తుకారాం , తల్లి తండ్రులు విద్యార్థులు ఉన్నారు.

అహింస మార్గమే దేశానికి రక్షా - రమెశ్ గౌడ్

అహింస మార్గమే దేశానికి రక్షా - రమెశ్ గౌడ్

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); అహింస మార్గమే మన దేశానికి రక్షా అని రెబ్బెన తహశీల్ధార్ బి రమేష్ గౌడ్ అన్నారు . ఆదివారం స్థానిక రెబ్బన తహశీల్ధార్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు . గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు . ఆయన మాట్లాడుతూ ఈనాటి యువత తోనే రాబోయే కాలమున్నీ  సన్మార్గములో ఉంచుతుందని ఆయన అన్నారు . నవ సమాజములో యువత ఏ ముఖ్యమని , క్రమశిక్షణతో చదవాలని , సమాజ సేవ చేయాలని తెలిపారు . ఈ కార్య క్రమములో డిప్యూటీ తహసీల్దార్ రామ్ మోహన్ రావు , నాయకులు పల్లె రాజేశ్వర్ రావు , జాకీర్ ఉస్మాని తడి తరులు ఉన్నారు .