Friday, 9 November 2018

ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ జండాను ఎగురవేయాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 9 : తెలంగాణా  ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ  అభివృద్ధి బాటలో పయనింప చేసింది కాంగ్రెస్ పార్టీ ని ఎన్నికలలో ఓటు అనే ఆయుధంతో రాష్ట్రంలో కాంగ్రెస్ జండాను ఎగురవేయాలని ఆసిఫాబాద్ మాజీ ఎం ఎల్ ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా  డి సి సి ప్రధాన కార్యదర్శి  కే విశ్వ ప్రసాద్ లు అన్నారు. శుక్రవారం  రెబ్బెన మండలం   గోలేటిలో  పార్టీ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎక్స్రోడ్ నుండి నూతన పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెబ్బెన మండలంలో కాంగ్రెస్ హయం లోనే పలు అభివృద్ధి పనులు జరిగాయని, సింగరేణి సంస్థ దాతృత్వంతో ఇచ్చిన నిధులను  తెరాస పార్టీ కార్యకర్తల అభివృద్ధికి వాడి మండల ప్రజలను మోసం చేశారన్నారు గత .ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలైన దళితులకు 3 ఎకరాల భూమి, చదువుకున్నా నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కే జి టూ  పి  జి ఉచిత నిర్బంధ విద్య వంటి హామీలను తుంగలో తొక్కి, ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు అభివృద్ధికై ప్రశ్నించిన వారిని తప్పుడు కేసు లు బనాయించి ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. తెలంగాణా కోసం అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడ్డారని అన్నారు.  కార్యకర్తలందరు సైనికులు గా పనిచేసి మహాకూటమి అధికారం లోకి రావడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను ప్రతి కార్యకర్త సామాన్య ప్రజలకు చేరువ చేయాలని  అన్నారు.  తెలంగాణా సెంటిమెంట్ తో అధికారం లోకి వచ్చిన తెరాస గత నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. మద్దతు ధరకై రోడెక్కిన రైతులను దమన నీతితో  అరెస్ట్ చేయించారన్నారు.  విభజన జరిగినప్పుడు మిగులు బడ్జెట్ తో ఉన్న  రాష్ట్రం  ఇపుడు అప్పుల ఊబిలో కురుకున్నాదన్నారు. ప్రజలు ఎంతో  ఆశతో బంగారు తెలంగాణా  అవుతుందని భావించి అధికారం కట్టబెడితే  ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు మాత్రం మంత్రులుగా, ఎం పి లు గా ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకొని నిరుద్యోగులను మోసం చేశాడన్నారు. రాష్ట్ర పరిపాలన అంతా  తన కుటుంబ సభ్యుల చేతిలో కేంద్రీకృతం చేసి మంత్రులను కీలుబొమ్మ లుగా మార్చాడని, పాలన చేతగాక నాలుగు సంవత్సరాలకే తోకముడిచి  ప్రజలను మరల మోసం చేయడానికి వస్తున్నాడని అన్నారు. ముఖ్యంగా ఎన్నికలలలో మహాకూటమిని అత్యధిక మెజారిటీ తో గెలిపించి ప్రజాస్వామ్యాన్ని  కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ   పిసిసి ఉపాధ్యక్షుడు సెల్  పల్లె ప్రకాశ్  రావు, మండల పార్టీ అధ్యక్షుడు  ముంజం రవీందర్, ఎంపిటిసి కోవూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు దుర్గం రాజేష్, దుర్గం దేవాజి, గాజుల రవి,  వివి వెంకన్న చారి, సొగల వమాన్, పూదరి హరీష్ ,సురేందర్ రాజు, కేసరి కిషన్ గౌడ్, సంగం బానయ్య, పల్లస్, మల్రెడ్డి, నల్గొండ సదశివచారి   తదితరులు పాల్గొన్నారు.

చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ప్రజలు దూరంగా ఉండాలి ; డి ఎస్ పి సత్యనారాయణ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 9 :  చట్ట వ్యతిరేక  కార్యక్రమాలకు  ప్రజలు దూరంగా ఉండాలని ఆసిఫాబాద్ డి ఎస్ పి  సత్యనారాయణ అన్నారు. రెబ్బెన మండలం లోని గోలేటి  గ్రామం లో   జిల్లా ఎస్ పి  ఆదేశాలమేరకు శుక్రవారం  డి ఎస్ పి  సత్యనారాయణ  ఆధ్వర్యంలో  రెబ్బెన  సర్కిల్ ఇన్సపెక్టర్ రమణమూర్తి  నేతృత్వంలో ఎస్సై దీకొండ  రమేష్  సిబ్బందితో   కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఎస్ పి   మాట్లాడుతూ గ్రామాలలో నిషేదిత గుట్కాలు, గుడుంబా  అమ్మరాదన్నారు. బెల్ట్ షాపులు నిర్వహించరాదని అన్నారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను నివారించాలన్నారు. గ్రామంలోని  దుకాణాలలో    నిషేదిత  గుట్కా, పొగాకు ఉత్పత్తులు లభ్యమయ్యాయని, నిషేదిత వస్తువులు అమ్ముతున్నబ వారి మిద కేసు నమోదుచేసినట్లు తెలిపారు. సరైన  ధ్రువ పత్రాలులేనిమోటారు సైకిల్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారికి జరిమానాలు విధించినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ప్రజలు పోలీసులకు సహకరించాలని అన్నారు.

Thursday, 8 November 2018

జిల్లా కేంద్రంలో నేడు బీజేపీ బహిరంగ సభ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 8 ; అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా కేంద్ర మైన  ఆసిఫాబాద్లో నేడు  భారీ బహిరంగ జరపనున్నట్లు బీజేపీ  జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అజమీర ఆత్మారాం ఆధ్వర్యంలో స్థానిక ప్రేమల గార్డెన్ లో ఈ సభకు ఏర్పాట్లు చేశామని, ఈ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు , బీజేపీ జిల్లా అధ్యక్షులు జ్ బి పౌడెల్ తదితర జిల్లా నాయకులూ   హాజరు కానున్నట్లు తెలిపారు.   కావున  ఆసిఫాబాద్ నియోజక వర్గం నుంచి ప్రజలు. బీజేపీ నేతలు,కార్యకర్తలు, మండల అధ్యక్షులు, ఎబివిపి నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరూ సభకి వేలా దిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని  కోరారు

కాంగ్రెస్ పార్టీ ని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ; ఆత్రం సక్కు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 8 ;   ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ఆఅసిఫాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు.  గురువారం రెబ్బెన మండలం కిష్టాపూర్  తెరాస పార్టీ కి చెందిన కార్యకర్తలను , యువకులకు వారందరికీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వ హయం లోనే అభివృద్ధి జరిగిందని, తెరాస నాలుగేళ్ళ పాలనలో  గ్రామాలలో అభివృద్ధి కుంటూ పడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలపై నమ్మకముంచి పార్టీ లో చేరిక కోసం ముందుకు వచ్చిన యువకులందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. అలాగే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని ఆదరించి ఎన్నికలలో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ  డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్  పల్లె ప్రకాష్ రావ్, పాక్స్  వైస్ ఛైర్మన్ వెంకటేశం చారి, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, అల్లే గణేష్ , మల్లయ్య,  వెంకట్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 8 ;   రెబ్బెన మండలం  నంబాల గ్రామానికి చెందిన మిట్ట లింగయ్య(65)  గురువారం రాత్రి పురుగుల మందు సేవించి మృతి చెందినట్టు రెబ్బెన ఏ  ఎస్సై  దేవరాజ్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడు మిట్ట లింగయ్యకు చిన్నతనం లోనే తల్లిదండ్రులు చని పోవటం తో  అక్క  పూదరి లస్మక్క   తమ్ముడు మిట్ట లింగయ్యను చేరదీసి పెంచిపెద్ద చేసింది. తల్లిదండ్రులు చిన్నతనం లోనే మృతి చెందిన కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురావటంతో మతిస్థిమితం సరిగా లేనికారణంగా వివాహం కూడా కాలేదు దాంతో నంబాల లోని అక్క వద్దే జీవిస్తున్నాడు. ఈక్రమం లో గత వారం రోజుల నుంచి కడుపు నొప్పి వస్తుందని దగ్గరున్న ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్లి పెయిన్   కిల్లర్లు వేసుకున్నా కూడా   ఉపశమనం రాక పోవ డంతో కుటుంబ సభ్యులు  పెద్దాసుపత్రికి తీసుకు వెల్దామనుకున్నారు. ఈలోగా కుటుంబ సభ్యులు  గురువారం రాత్రి దీపావళి నోముల హడావిడిలో ఉండగా భోజనం చేసి బయటకు వెళ్లిన లింగయ్య  పత్తి   పంటకు  చల్లే పురుగు మందును  సేవించి అస్వస్థతకు  గురికావడంతో  నంబాల గ్రామంలోని ఆర్ ఎం పి   వైదుడి వద్దకు అక్కడనుంచి బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా  చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. మేనల్లుడు పూదరి భీం రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Monday, 5 November 2018

రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 5 ; రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని రెబ్బెన గ్రామస్తులు మాజీ ఉప  సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ఆధ్వర్యంలో  సోమవారం  మండల తహసీల్దార్ సయ్యద్ ఇంతియాజ్ అహ్మద్ కు వినతిపత్రం అందచేశారు. అనంతరం మాట్లాడుతూ ఆసిఫాబాద్ రైల్వేస్టేషన్ నుండి రొజుకు 5 కోట్ల విలువగల బొగ్గు నిత్యం రవాణా   అవుతున్నదని గూడ్స్ రైళ్లు నిత్యం స్టేషన్ లో నిలిపి ఉంచడంతో ఆసిఫాబాద్ నుండి మంచిర్యాల, హైదేరాబద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయాణికులు రైల్వే ట్రాక్ దాటడానికి నానా ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా వయసు మళ్ళిన వారు, స్త్రీల కు బాగాఇబ్బందిగా ఉందన్నారు. సింగరేణి బొగ్గును దేశంలోని అన్ని ప్రాంతాలకు రవాణా చేస్తూ రైల్వే శాఖా తమ రెవెన్యూ పెంచుకుంటూ ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదన్నారు. ఈ స్టేషన్ నుంచి ప్రతి నిత్యం ఆసిఫాబాద్ వంటి దూర ప్రాంతాలనుంచి తెల్లవారుజయమున  అర్  టి సి ఏర్పాటుచేసిన ప్రేత్యేక బస్సు సదుపాయంతో వందలమంది ప్రయాణికులు హైద్రాబాద్ కు వెళ్తుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్ది శ్రీనివాస్ గౌడ్, దుర్గం భరద్వాజ్, జహూర్ భాయ్, రామడుగుల శంకర్, మహేందర్, పాపయ్య, విలాస్, తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. 

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 5 ; ఎన్నికలలో కాంగ్రెస్  గెలుపు ఖాయం అని ఆసిఫాబాద్ అసెంబ్లీ  అభ్యర్థి    ఆత్రంసక్కు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా  డి సి సి ఉపాధ్యక్షులు  కే విశ్వ ప్రసాద్ లు అన్నారు. సోమవారం  రెబ్బెన గ్రామ మహిళలు  పుంజుమేర గూడ గ్రామస్తులు  జిల్లా ఉపాధ్యక్షులు పల్లె ప్రకాష్ రావ్, పార్టీ మండల అధ్యక్షులు ముంజం రవీందర్ ఆధ్వర్యంలో టి.పి.సి.సి ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు,  ఉమ్మడి ఆదిలాబాద్ డి సి సి ప్రధాన కార్యదర్శి  విశ్వ ప్రసాద్ రావ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. అభివృద్ధికై ప్రశ్నించిన వారిని తప్పుడు కేసు లు బనాయించి ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. దేశాన్న్ని అభివృద్ధి బాటలో పయనింప చేసింది కాంగ్రస్ అని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరు సైనికులు గా పనిచేసి మహాకూటమి అధికారం లోకి రావడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను ప్రతి కార్యకర్త సామాన్య ప్రజలకు చేరువ చేయాలని  అన్నారు.  తెలంగాణా సెంటిమెంట్ తో అధికారం లోకి వచ్చిన తెరాస గత నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కోవూరు శ్రీ నివాస్, రెబ్బెన టౌన్ అధ్యక్షులు మురళి, మండల ఉపాధ్యక్షులు రాజేష్ , ఎస్ టి నాయకులు రమేష్,అనిశెట్టి వెంకన్న, గోపి,కాంతారావు ,పద్మ తదితరులు పాల్గొన్నారు.

Sunday, 4 November 2018

సంక్షేమ పథకాల అమలు తెరాస తోనే సాధ్యం


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 4 ;  శాసనసభ ఎన్నికల్లో అసిఫాబాద్ నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మిను  గెలిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ అన్నారు.  ఆదివారం రెబ్బెన మండలంలోని  కైరిగాం, ఎడవెల్లి, కొండపల్లి, గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన అనంతరం వంకులంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ లో మాట్లాడారు. గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్  ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టిందన్నారు.   గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు.  ముఖ్యంగా  మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో పాటు రైతు బందు,  కళ్యాణ లక్ష్మీ,  షాదీ ముబారక్,  గొర్రెల పంపిణీ,   చేప పిల్లల పంపిణీ,  వృద్ధులకు వికలాంగులకు, ఒంటరి మహిళల పెన్షన్లు పెంచి ఇవ్వడం జరుగుతోందని రానున్న ఎన్నికల్లో తెరాస ను గెలిపిస్తే పెన్షన్లు డబుల్ చేయడం జరుతుందన్నారు. లక్ష రూపాయల వరకు   రైతుల రుణాన్ని  మాఫీ చేస్తామన్నారు.  నిరుద్యోగ భృతి కల్పిస్తామని రైతు బందు సహాయాన్ని పెంచుతామని హామీ  ఇచ్చారు.  టిఆర్ఎస్ ను  ఓడించాలనే ఉద్దేశ్యంతో నాలుగు పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో ఎన్నికలకు  వస్తున్నాయన్నారు.  అది  మహాకూటమి కాదని మాయా కూటమి అని వారిని గెలిపిస్తే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు.  అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి కోవ  లక్ష్మి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు . ముఖ్యంగా కొమరంభీం జిల్లాలో జిల్లా ను  సాధించి  ప్రజల వద్దకే పాలన తీసుకురావటం జరిగిందని అన్నారు.  గ్రామాల్లో  సిసి రోడ్లు నిర్మించామన్నారు.  ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిపి సంజీవకుమార్ , టీఆర్ఎస్ మండల  అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి , మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు శంకరమ్మ,తెరాస నాయకులూ  సోమశేఖర్, సుదర్శన్ గౌడ్, అజ్మీరా రమేష్, బొమ్మినేని శ్రీధర్, మద్ది శ్రీనివాస్, మాణిక్య రావు, వినోద్ జైస్వాల్ ,తదితరులు ఉన్నారు.

Saturday, 3 November 2018

దూరవిద్యా కోర్సుల ప్రేవేసానికి గడువు పెంపు

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 3 : రెబ్బెన  మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్స్ అండ్  సైన్స్ డిగ్రీ కళాశాల కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంలో పీజీ కోర్సులలో  ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువును నవంబర్ 6 వరకు పెంచుతూ కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ జి వీరన్న ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రిన్సిపాల్ జాకీర్ ,  కోఆర్డనేటర్ పూదారి మల్లేష్ తెలిపారు ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్స్  సైన్స్ డిగ్రీ కళాశాల కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రంలో నిర్వహిస్తున్న కోర్సులను ప్రవేశానికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అంగన్వాడి కార్యకర్తలు యువతి యువకులు అర్హులను ఈ   అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

పోలీస్ ఉద్యోగార్థులకు రాతపరీక్షలో ఉత్తీర్ణులైనవారికీ ఉచిత శిక్షణ

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 3 : రాతపరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సై, కాన్స్టేబుల్   అభ్యర్థులకు సింగరేణి సంస్థ ఇచ్చే  ఉచిత శిక్షణ  కార్యక్రమాన్ని   శనివారం  రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్  భీమన స్టేడియంలో జీఎం  కే రవిశంకర్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ  రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దేహ ధారుడ్య పరీక్షా నిమిత్తం వివిధ ఈవెంట్లలో సుశిక్షితులైన శిక్షకులచే శిక్షణ  ఇప్పించడానికి ఏర్పాట్లు చేశామన్నారు.   అభ్యర్థులకు ఉదయం గుడ్లు, పాలు అందించనున్నట్లు తెలిపారు.   శిక్షణ  ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుందన్నరు. అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిజిఎం  పర్సనల్ జ్ కిరణ్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస్ రావు,స్పోర్ట్స్ సూపర్ వైజర్  రమేష్, కమ్యూనికేషన్ సెల్ కో ఆర్డినేటర్ కుమారా స్వామి తదితరులు ఉన్నారు 

అప్పు తీర్చమని వేధించడంతో తనువు చాలించిన యువకుడు

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 3 : 5 వేలు అప్పుతీర్చమని  యువకుడి ని వేధించడంతో అవసరం కోసం తీసుకున్న అప్పు యువకుడ్ని తనువు చాలించే లా చేసింది.  అప్పుగా ఇచ్చిన వ్యక్తి వెంటపడి వేధింపులకు గురి చేయడంతో సకాలంలోచేతికి డబ్బులు అందక  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి తనువూ చాలించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.  శనివారం వెలుగులోకి రాగా వచ్చింది. రెబ్బెమ ఎసై   దీకొండ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం రెబ్బెన  మండల కేంద్రానికి చెందిన బొడ్డు కిరణ్ బాబు వయస్సు ఇరవై స్థానికంగా ఉన్న జిరాక్ సెంటర్లో పనిచేస్తుండే వాడు అవసరం నిమిత్తం అత్యవసరంగా ఐదువేల రూపాయలు కావాల్సి రావడంతో మండల కేంద్రంలోని చెందిన ఫైనాన్స్ వ్యాపారి మారిన రవితేజ వద్ద  అప్పు తీసుకున్నాడు అయితే తీసుకున్న అప్పును తిరిగి సకాలంలో చెల్లించడంలో కిరణ్ బాబు విఫలం కావడంతో అప్పుగా ఇచ్చిన డబ్బుల కోసం రవితేజ వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు ఈ క్రమంలో గత ముప్పై వ తేది మోటార్ సైకిల్ పై వస్తున్న కిరణ్ బాబుని అడ్డగించిన రవితేజ మోటార్  సైకిల్  లాక్కొడం తో కిరణ్ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు మోటార్ సైకిళ్ల లాక్కోవడంతో పాటు  ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ముందే దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడు దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన కిరణ్ క్రిమి సంహారక  మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు గమనించిన కుటుంబ కుటుంబ సభ్యులు హుటాహుటిన బెల్లంపెల్లి  ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడి నుండిమంచిర్యాల లోని ఒక ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతున్న కిరణ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడంతోహైదేరాబద్ కు  తరలించగా శుక్రవారం మృతి చెందాడు దాంతో మృతుడి నానమ్మ వెంకట వెంకటనరసమ్మ శనివారం రెబ్బెన పోలీస్ స్టేషన్ లో చేసిన   ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి   దర్యాపు చేస్తున్నట్టు తెలిపారు.

Friday, 2 November 2018

ఎన్నికలలో కాంగ్రెస్ జండా ను ఎగురవేయాలి ; ఆత్రంసక్కు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 2 :   రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న దోపిడీ దొంగల భరతం పట్టే   రోజు దగ్గర పడిందని  ఎన్నికలలో ఓటు అనే ఆయుధంతో వారిని తరిమి కొట్టి కాంగ్రెస్ జండాను ఎగురవేయాలని ఆసిఫాబాద్ మాజీ ఎం ఎల్ ఏ, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రంసక్కు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా  డి సి సి ఉపాధ్యక్షులు  కే విశ్వ ప్రసాద్ లు అన్నారు. శుక్రవారం  రెబ్బెన మండల కేంద్రంలో పార్టీ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ   సందర్భంగా మాట్లాడుతూ రెబ్బెన మండలంలో కాంగ్రెస్ హయం లోనే పలు అభివృద్ధి పనులు జరిగాయని, సింగరేణి సంస్థ దాతృత్వంతో ఇచ్చిన నిధులను అభివృద్ధికి వాడి మండల ప్రజలను మోసం చేశారన్నారు. అభివృద్ధికై ప్రశ్నించిన వారిని తప్పుడు కేసు లు బనాయించి ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు భద్రత కల్పించే పోలీసులే అధికారంలో ఉన్న పార్టీ కి ప్రైవేట్ సైన్యం లా పనిచేస్తున్నారన్నారు. తెలంగాణా కోసం అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడ్డారని అన్నారు. తెలంగాణా  ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, దేశాన్న్ని అభివృద్ధి బాటలో పయనింప చేసింది కాంగ్రస్ అని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరు సైనికులు గా పనిచేసి మహాకూటమి అధికారం లోకి రావడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను ప్రతి కార్యకర్త సామాన్య ప్రజలకు చేరువ చేయాలని  అన్నారు.  తెలంగాణా సెంటిమెంట్ తో అధికారం లోకి వచ్చిన తెరాస గత నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలైన దళితులకు 3 ఎకరాల భూమి, చదువుకున్నా నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కే జి త్వో పి  జి ఉచిత నిర్బంధ విద్య వంటి హామీలను తుంగలో తొక్కి, ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. మద్దతు ధరకై రోడెక్కిన రైతులను దమన నీతితో  అరెస్ట్ చేయించారన్నారు.  విభజన జరిగినప్పుడు మిగులు బడ్జెట్ తో ఉన్న  రాష్ట్రం  ఇపుడు అప్పుల ఊబిలో కురుకున్నాద న్నారు. ప్రజలు ఎంతో  ఆశతో బంగారు తెలంగాణా  అవుతుందని భావించి అధికారం కట్టబెడితే  ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు మాత్రం మంత్రులుగా, ఎం పి  లు గా ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకొని నిరుద్యోగులను  మోసం చేశాడన్నారు.  రాష్ట్ర పరిపాలన అంతా  తన కుటుంబ సభ్యుల చేతిలో కేంద్రీకృతం చేసి మంత్రులను కీలుబొమ్మ లుగా మార్చాడని, పాలన చేతగాక నాలుగు సంవత్సరాలకే తోకముడిచి  ప్రజలను మరల మోసం చేయడానికి వస్తున్నాడని అన్నారు. ముఖ్యంగా తెలంగాణా ప్రజలు బానిసత్వం పై పోరాడారని మరల ఆ  దొరల పాలన కోరుకొవడం లేదని, కావున ప్రజలు రాబోయే ఎన్నికలలలో మహాకూటమిని అత్యధిక మెజారిటీ తో గెలిపించి ప్రజాస్వామ్యాన్ని  కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులూ పల్లె ప్రకాశం రావు, మండల పార్టీ అధ్యక్షుడు  ముంజం రవీందర్, ఎంపిటిసి కోవూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు దుర్గం రాజేష్, గాజుల రవి,  వివి వెంకన్న చారి,  యూత్ కాంగ్రెస్ నాయకులు దేవరకొండ సంతోష్, సొగల వమాన్, పూదరి హరీష్ ,సురేందర్ రాజు, కేసరి కిషన్ గౌడ్, సంగం బానయ్య, పల్లస్  తదితరులు పాల్గొన్నారు. 

గుడుంబా తయారీ స్థావరాల ధ్వంసం


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 2 :   రెబ్బెన మండలం ఖైర్గుడా   గ్రామంలో  శుక్రవారం మద్యపాన నిషేధ శాఖ అధికారులు దాడి చేసి  గుడుంబా తయారీ  స్థావరాలను ధ్వంసం చేసినట్లు  ఆబ్కారీ   ఎస్సై   టి నరసింహా చారి  తెలిపారు. జిల్లా ఆబ్కారీ అధికారి రాజ్యలక్ష్మి ఆదేశానుసారం ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామంలో  నాగు వెంబడి ఉన్న తయారీ కంద్రాలలో 600 లీటర్ల బెల్లం పానకం ను నేలమట్టం చేశామని తెలిపారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి నిషేదిత మద్యాలను తయారీ చేయకూడదని అన్నారు. చట్టాన్ని అధిగమించిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. నిషేదిత మద్యం తరిపై సమాచారం ఇవ్వదలచినవారు 08735 277017 నెంబర్ పై సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం గా ఉంచబబడతాయని తెలిపారు.  ఈ దాడులలో కమలాకర్, మమత,  సురేష్, తిరుపతి, నాగరాజు తదితర సిబ్బంది ఉన్నారు.