Friday, 3 June 2016

మంచి నీళ్ళ కోసం బిందలతో నిరసన


మంచి నీళ్ళ కోసం బిందలతో నిరసన

 (రెబ్బెన వుదయం ప్రతినిధి)
 మంచినీటి పంపులలో ద్వార త్రాగనిరు రావడం లేదని రెబ్బెన మండలం లోని సబ్ స్టేషన్ రోడ్ ఇంద్ర కాలని వాసులు శుక్రవారం నాడు రోడ్ ఫై బిందలతో నిరసన చేసారు అనంతరం కాలని వాసులు మాట్లాడుతు ఈ వేసవి కాలం త్రాగ డానికి నీరు కుళాయి ల ద్వారా రావడం లేదని సర్పంచ్ లకు వార్డ్ మెంబర్లకు ఎన్ని సార్లు చెప్పిన వారు పటించు కోవడం లేదని తెలంగాణా ప్రబుత్వం ఇంటింటికి వాటర్ గ్రిడ్ పథకం ద్వారా నీరు అందిస్తామని ఎన్ని ప్రకటనలు చేసిన మావూరి కాలని పరిస్తితి ఇలావుంది అని కాలని వాసులు వాపోతునారు. అధికారులు ప్రజప్రతినిదులు నిర్లక్షంచే ఇలాంటి పరిస్తితి ఎదురవుతుంది అట్టున్నరు.ఉన్నతాదికారులు చొరవతిసుకొని ఇలాంటి పరిస్తితి మల్లి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కాలని వాసులు కోరుతునారు.  

Wednesday, 1 June 2016

ఆటోని డీకొన్న బోలోరో ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

  ఆటోని  డీకొన్న  బోలోరో  ఇద్దరు మృతి, పలువురికి గాయాలు 


(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని వంకులం గ్రామానికి చెందిన వృద్ధులు పెన్షన్, ఉపాది కూలి డబ్బులు తీసుకోవడానికి రెబ్బెనకు వస్తుండగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ముందు జాతీయ రహదారి పైన ఆటోని దాని వెనకాల వస్తున్న బోలోరా అతివేగముగా డి కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న  పిప్రే లక్ష్మన్ (75), తులసి బాయి (72) మరణిచినట్లు రెబ్బెన ఎస్ ఐ టి రావు తెలిపారు. ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం వంకులం నుంచి ఆటోలో వస్తుండగా పిప్రే లక్ష్మన్, తులసి భాయి, రేణుక, పేంటు, పోషం, సుమన్ రెబ్బెనకు వస్తుండగా పెన్షన్ ఉపాది కూలి డబ్బులకు వస్తుండగా వెనకలే అతివేగముగా వచ్చిన రెబ్బెన కు చెందినా బోలోరా ఆటోని వేగంగా డీకొనడంతో పిప్రే లక్ష్మన్, తులసి  తీవ్ర గాయాలు కాగా  పిప్రే లక్ష్మన్ ని 108లో తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించినట్లు, తులసి బాయి చికిత్స పొందుతూ మరణించినట్లు  తెలిపారు. 

క్రీడ మైదానం ఏర్పాటు చేయాలనీ తహసిల్దార్ కి వినతి

క్రీడ మైదానం ఏర్పాటు చేయాలనీ తహసిల్దార్ కి  వినతి 


 (రెబ్బెన వుదయం ప్రతినిధి); క్రీడ మైదానం ఏర్పాటు చేయాలనీ రెబ్బెన  యువకులు బుదవారం రెబ్బెన  తహసిల్దార్  రమేష్ గౌడ్ కి  వినతి పత్రం అందచేసారు అనంతరం ఎన్ ఐ ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం బరద్వాజ్ మాట్లాడుతూ రెబ్బెన లో క్రీడ మైదానం లేక యువకులు అన్ని రంగాలలో వెనుక పడి పోతున్నారని,తప్పకుండ రెబ్బెన లో క్రీడ మైదానం ఏర్పాటు చేయాలనీ అన్నారు యువతి యువకులు ఫీట్ నెస్ కోసం క్రీడ మైదానం లేక జాతీయ రహదారి వెంట నడవాల్సిన దుస్తుతి ఏర్పడిందని, గతంలో రహదారి వెంట ఉదయం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు గుర్తు తెలియని వాహనం డీకొని ఒక వృద్దుడు చనిపోవడం జరిగిందని అని అన్నారు. ఇలాంటి దుస్థితి ఏర్పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తహసిల్దార్ స్పందించి  క్రీడ మైదానం కొరకు రెబ్బెన పరిది లో సర్వే చేయించి ప్రభుత్వ భూమిని కేటాయించేలా అర్.ఐ అశోక్ చౌవాన్, వి,అర్,ఓ హుమ్లాల్ కు ఆదేశాలను జారి చేశారు ఈ కార్యక్రమంలో పాపయ్య, వినయ్, శ్రీనివాస్, కార్తీక్, కీర్తి మహేందర్ జమీర్ అన్వర్ సంతోష్ తదితరులు వున్నారు 

ఫర్టిలైజర్ల షాప్ లపై అకస్మాత్తుగా తనికీలు

 ఫర్టిలైజర్ల షాప్ లపై అకస్మాత్తుగా తనికీలు 

    (రెబ్బెన వుదయం ప్రతినిధి);    రెబ్బెన లో గల  ఫర్టిలైజర్ లను అర్ ఐ అశోక్ చవాన్ ఎ ఓ మంజులఎస్ ఐ టి రావు లు బుదవారం రోజునా ఆకస్మికముగా తనికి చేసారు   లైసెన్స్ రికార్డ్లను తనికి చేసారు  నకిలీ విత్తనాలు అమ్మవద్దని రైతులకు న్యాయం జరిగేల చూడాలని  సకాలంలో మందులు అందచేయాలని అన్నారు 



ఉపాది కులిల డబ్బులు వసూలు చేస్తున్న బి పి ఎం లు

ఉపాది కులిల డబ్బులు వసూలు చేస్తున్న బి పి ఎం లు 






(రెబ్బెన వుదయం ప్రతినిధి); కూలీల దగ్గరి నుండి బ్రాంచ్ పోస్ట్ మెన్ [ బి పి ఎమ్]  ఉపాది హామీ కులిలకు వేతనాలు చేల్లిన్చేటప్పుడు  10 రూపాయలనుండి 50 రూపాయల వరకు అదనంగా వసులు చేస్తున్నారని  తపాలా కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి పోస్ట్ మాస్టర్ ఎస్ స్వామి కి   వినపతి పత్రం అందించి అనతరం కూలీలు మాట్లాడుతూ వారం వారం వేతనాలు చేల్లిన్చేటప్పుడు  బ్రాంచ్ పోస్ట్ మెన్ [ బి పి ఎమ్] లు కూలిల దగ్గరి నుండి పైన మిగిలిన చిల్లర 10 నుండి 50 వరకు రూపాయలు తీసుకుంటున్నారు మరియు  గ్రామంలో వున్నా కూలీలకు వారి గ్రామాలలో ఇవ్వాల్సి వుండగా  మండల కేంద్రంలో వారి ఇంటి వద్ద ఇస్తున్నారు వేతనం తీసుకోవడానికి కూలీలు వారి రోజువారి వేతనం పోగొట్టుకొని మండుటెండలో మండల కేంద్రం లోని వారి ఇంటి వద్దకు వచ్చి  తీసుకోవలసి వస్తుందని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేసారు . ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఇలాంటి దుస్తితి పురనవ్రుతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ కూలీలు గ్రామపంచయితికి వెళ్లి  వారి బాధను మొరపెట్టుకోగా సర్పంచ్  పెసరి వెంకటమ్మ ,సింగిల్ విండో డైరెక్టార్  మదునయ్య లు వెళ్లి తపాలా అధికారులతో మాట్లాడారు   ఈ కార్యక్రమంలో లవుడ్య రమేష్ , బోడిగేల నీరజ, నగేష్ ,శారద, నిత,లలిత ,అమృత , శంకరమ్మ , బాగ్య ,సునిత ,మల్లేష్ ,గీసుకొండ రమేష్ ,లక్ష్మి ,సావిత్రి  రాజేశ్వరి, తదితర కూలీలు పాల్గొన్నారు 

93 శాతం బొగ్గు ఉత్పత్తి సాదించిన బెల్లంపల్లి ఏరియా

93 శాతం బొగ్గు ఉత్పత్తి  సాదించిన బెల్లంపల్లి ఏరియా 


(రెబ్బెన వుదయం ప్రతినిధి) మే  మాసానికి 93 శాతం గాను బొగ్గు ఉత్పత్తి సదించడం జరిగిందని బెల్లంపల్లి ఏరియా  ఇంచార్జ్ జి  ఎమ్  కొండయ్య అన్నారు రెబ్బెన మండలంలోని గోలేటి  జి  ఎమ్ కార్యాలయం లో బుదవారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు  మే మాసానికి  548000 టన్నుల బొగ్గు లక్షం కాగా  519631 ఉత్పత్తి సాదించమని  కైరుగూడ ఓపెన్ కాస్ట్ లో 260000 టన్నుల బొగ్గు లక్షం కాగా 256628 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాదించమని    డోర్లి -1  ఓపెన్ కాస్ట్ లో 158000 టన్నుల బొగ్గు లక్షం కాగా 232380 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాదించమని డోర్లి -2 80000  టన్నుల బొగ్గు ఉత్పత్తి  లక్షం కాగా 30623  టన్నుల బొగ్గు ఉత్పత్తి సాదించమని రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి పున్జుకున్తున్దన్నారు బొగ్గు ఉత్పత్తితో పటు కార్మికుల సంక్షేమానికి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు  గోలేటి కాలనీ లో అర్ ఓ అర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీటిని అందచేయడం జరుగుతుందన్నారు గోలేటి లో సెంట్రల్ లైటింగ్ పూర్తీ జరిగిందన్నారు గోలేటి 1 లో విదులు నిర్వహిస్తున్న బదిలీ కొరకు పెట్టుకున్న వారికీ వారి ఇష్టమున్న చోటికి బదిలిచేయడం జరుగుతుందన్నారు బెల్లంపల్లి ఏరియా కు ఆర్దిక సంవస్తరం తర్వాత ఏప్రిల్ మే నెలలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం  1036000 టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా 961767 బొగ్గు ఉత్పత్తి 93 శాతం లో వచ్చింది అని మిగత నెలలో 100 శాతం  బొగ్గు ఉత్పత్తి అధిగమించడానికి అభివృద్ధి చర్యలు  చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డి జి ఎం చిత్రంజన్ కుమార్  ఐ ఇ డి  యోహాన  డి వై పి ఎం . రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు 

Tuesday, 31 May 2016

పదవి విరమణ పొందిన ప్రధానోపాధ్యాయురాలు

పదవి విరమణ పొందిన  ప్రధానోపాధ్యాయురాలు

రెబ్బెన మండలం  గోలేటిలో సింగరేణి హై స్కూల్ లో ప్రధానోపాధ్యాయురాలు మంగళవారం రోజున  సుగుణ కుమారి  పదవి విరమణ పొందినారు  ఈ సందర్బముగా చిత్తరంజన్, డి జి ఎం మేనేజర్ పాతశాలకు  విచ్చేసి పదవి విరమణ   కృతఙ్ఞతలు తెలిపారు వారు మాట్లాడుతూ కొత్తగా వెంకటేశ్వర్లు ని ప్రధానోపాధ్యాయుడిగా నియమించా అన్నారు అదే విధముగా చిత్తరంజన్ మాట్లాడుతూ పతశాలకు కావాల్సిన సదుపాయాలు అందిస్తా మన్నారు విద్యార్థులకు క్రమశిక్షణ మరియు విద్య బోదన పెంచి మంచి ఫలితాలు తేవాలి అని అన్నారు అనంతరం సుగుణ కుమారి మాట్లాడుతూ 34 సం రాలుగా సింగరేణి పాటశాలలో పనిచేసి 4సం రాలుగా ప్రధానోపాధ్యాయురాలుగా అవకాశం కల్పించిందుకు కృతఙ్ఞతలు తెలిపారు అదేవిధముగా కొత్తగా వచ్చిన ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ ఈ అవకాశం తో తన వంతు కృషి చేస్తా అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రావు ఈ హన్మంతు కె బాస్కర్ పి ఇ టి యశ్వంత్ పాండురంగం  అన్వర్ సుమన్ కనకయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ఉరివేసుకొని యువతి మృతి

ఉరివేసుకొని యువతి మృతి 

(రెబ్బెన వుదయం ప్రతినిధి);    రెబ్బెన మండలంలో నారాయణపూర్ లో వాసాల హరిప్రియ 23  తల్లి దండ్రుల పక్కన పడుకొని సోమవారం అర్ధ రాత్రి  హరిప్రియ  లేసి వంట గది లో దూలానికి  ఉరి వేసుకొని చనిపోయింది మృతురాలు  కరీంనగర్ లో చదువుకునేటప్పుడు బిల్డింగ్ పైన నుంచి పడి తల కి దెబ్బ తగిలి మతి స్తిమితం సరిగ్గా లేదని కుటుంబికిలు తెలిపిన వివరాల ప్రకారం ఇంచార్జ్ ఎస్ ఐ టి వి రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తం  అన్నారు 

అక్రమంగా కలప పటి వెత

అక్రమంగా కలప పటి వెత 


(రెబ్బెన వుదయం ప్రతినిధి); గోలేటి  నుంచి  మంచిర్యాల వెళ్తున్న ఆటో  నంబర్  ఎ పీ 1యు 4843 గల వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను. ఎఫ్ అర్  వో వినయ్ కుమార్ బాబు  అందించిన సమాచారముతో మంగళ  వారం రేపల్లవాడ వద్ద  డిప్యూటి ఆర్ వో శ్రీనివాస్ పకడ్బందిగా ఉపాయముతో 4  టేకు  దుంగలు పట్టు కున్నానట్లు  వాటి విలువ 9234 రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు.  బీట్ అధికారులు ఎం డి అతరోద్దిన్, మహ్మాద్, రవి, మధు  సిబ్బంది ఉన్నారు .

Monday, 30 May 2016

ట్రాక్టర్ బైక్ డీ ఒక్కరు మృతి

ట్రాక్టర్  బైక్ డీ ఒక్కరు మృతి 
(రెబ్బెన వుదయం ప్రతినిధి);  
రెబ్బెన మండలములో ని బెల్లపు ఒర్రె సమీపములో రెబ్బెన వైపు బైక్ పై వస్తున్నా సి ఎహ్ మల్లేష్  ను ఎదురుగా వస్తున్నా ట్రాక్టర్ దీకొనదముథొ మల్లేష్ మృతి చెందాడు . మృతుడు మల్లేష్ తన కు కొండపల్లి లో గల పొలాలను చూసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్తానికులు తెలిపారు . 108 ఆమ్బులన్సుకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చిన 45 నిమిషాల వరకు రాకపోవడం తో మల్లేష్ కొస ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి . రెబ్బెనలో 108 అంబులెన్సు లేక పోవడమే దీనికి కారణమని మండల వాసులు అంటున్నారు . 










మండల స్థాయి క్రికెట్ పోటీలు ఏర్పాటు

మండల స్థాయి  క్రికెట్ పోటీలు ఏర్పాటు 

(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన  మండలం వంకులం గ్రామా పంచాయితీ లో  రాల్లపేట గ్రామంలో సోమవారం రోజున  మండల స్తాయి క్రికెట్ పోటీలు తెలంగాణా ఆవిర్బావ దినోత్సవ సందర్బముగా యువకులకు క్రికెట్ పోటీలు ఏర్పాటు చేసారు ఈ పోటీలను రెబ్బెన ఎమ్ పి పి సంజీవ్ కుమార్ జడ్ పి టి సి  బాబు రావు ప్రారంబించారు అనంతరం వారు మాట్లాడుతూ క్రీడ నైపుణ్యంతో రావాలని క్రీడలు మానసిక ఉల్లాసంతో పటు దేహ  దరుడ్య తకు ఉపయోగపడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో  తెరస  మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి,వంకులం సర్పంచ్ కమలాబాయి, మాజీ సర్పంచ్   టి డి పి మండల వైస్ ప్రెసిడెంట్  ప్రేం దాస్ మరియు తదితరులు  పాల్గొన్నారు.

సింగరేణి ఏరియాలో ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ పరిశీలన

 సింగరేణి  ఏరియాలో  ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ పరిశీలన 
(మంచిర్యాల్  వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని గోలేటి లో సింగరేణి ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ మనోహర్ రావు బెల్లంపల్లి ఏరియాలో  సోమవారం  పర్యటించారు ఏరియా లోని ఓపెన్ కాస్ట్ గనులు,  గోలేటి ఎక్ష్స్ రోడ్ లో  సి  ఎచ్ పి ని పర్శిలించారు   అనంతరం జి ఎమ్ కార్యలయంలో ఉన్నంత అధికారులతో సమీక్షా  నిర్బహించి   అయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాకు సమస్త నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి ఉత్పక  లక్ష్యాలను అదిగా మించడానికి అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు బొగ్గు ఉత్పత్తి తో పాటు అబివృద్దిని, కార్మికుల  సంక్షేమం మరియు లక్ష్యాలతో ముందుకు సాగాలన్నారు  ఓ సి పి లలో బొగ్గు ఉత్పత్తి సాదన కోసం సరైన ప్రణాళిక ఏర్పాటు చేయాలనీ,   కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా  అన్ని జాగ్రతలు చూడాలన్నారు ఈ  సమావేశంలో యాక్టివ్ జి ఎమ్  కొండయ్య, ప్రాజెక్ట్ అధికారి సంజీవ రెడ్డి , మోహన్ రెడ్డి, ఏరియా ఇంజనీర్ రామారావు, జి ఎమ్ చిత్త రంజన్  డి వై ఎమ్ రాజేశ్వర్ తదితరులు పాల్గొనారు 

Sunday, 29 May 2016

వడ దెబ్బ తో ఒకరి మృతి

వడ దెబ్బ తో ఒకరి మృతి 

(రెబ్బెన వుదయం ప్రతినిధి); వడ దెబ్బతో రెబ్బెన మదలం లోని పున్జుమెర గూడెం కు చెందినా గుర్లె బోరు మేర (65) ఆదివారం ఉదయం మృతి చెందారు. మృతుడు బురుమెర  శని వారము  పులాజి బాబా గుడి వద్ద పని కి వెళ్లి వచ్చాడని , అస్వస్థకు గురయ్యాడని శనివారం ఉదయం వంతులు విరోచనాలు చేసు కొని అక్కడే మరణించినట్లు భందువులు పేర్కొన్నారు.