Wednesday, 7 September 2016

గణేష్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి

గణేష్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి); గణేష్ ఉత్సవాలను అందరూ కులమతాలకు అతీతంగా ఐక్యమత్యంతో సోదరభావంతో 11రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని తాండూర్ సీఐ కరుణాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం రెబ్బెన అతిధి గృహావరణలో  పోలీసులు  గణేష్ ఉత్సవ కమిటి సభ్యులకు  అవగాహన సమావేశం నిర్వహించారు.ఈసందర్బంగా సీఐ కరుణాకర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 11రోజుల పాటు భక్తి శ్రద్దలతో సాంప్రదాయ బద్దంగా నిర్వహించాలని గణేష్ మండళ్ల నిర్వహకులకు సూచించారు. ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే మైకులు వాడాలని ఆతర్వాత ఎట్టి పరిస్థితుల్లో మైక్‌ వాడరాదని రెండు స్పీకర్లు మాత్రమే వాడాలని డిజె సౌండ్‌ సిస్టమ్‌ వాడటానికి అనుమతిలేదని  సూచించారు. గణేష్ మండలి వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా కమిటీ సభ్యులే భాద్యత వహించి చివరి నిమర్జనం రోజున  ఎలాంటి అవకతవకలు జరగకుండా నవరాత్రి ఉత్సవాలను ముగించాలని కోరారు.   ఈ సమావేశంలో రెబ్బన ఎస్సై దారం సురేష్ , ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్  , జడ్పిటిసి బాబురావు, నార్లాపూర్ సర్పంచ్ భీమేష్ రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ,సింగిల్ విండో డైరెక్టర్ మదనయ్య, సుదర్శన్ గౌడ్ ,దుర్గం సోమయ్య తదితర   గణేష్ ఉత్సవకమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వైభవంగా వినాయక చవితి వేడుకలు

వైభవంగా వినాయక చవితి వేడుకలు 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); వినాయకచవితి ఉత్సవాలు రెబ్బెన మండల వ్యాప్తంగా వైభవంగా కొనసాగాయి.గ్రామాలలో వీధివీధిన గణనాథులను మంటపాలలో ప్రతిష్టించారు. వెరైటి గణనాథులు ప్రజలకు కనువిందు చేశాయి.భక్తి శ్రద్ధలతో వినాయకునికి దూపదీప నైవేద్యాలతో పూజలు చేశారు. బొజ్జగణపయ్యకు మారేడు దళాలు, మాచీ, బదరీ, చూత, తులసీ ,కరవీర తదితర పత్రాలతో విఘ్నేశ్వరుణ్ణి పూజించడంలో భక్తి ప్రపత్తులతో ఇష్టమైన వంటకాలను, ఫలాలను సమర్పిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ రోడ్, దేవులగూడ, ఇంద్రానగర్, నక్కలగూడ, గంగాపూర్, గోలేటి లలో ప్రతిష్టించారు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వినాయక ఉత్సవాల సందర్భంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఐకేపీ విఓఏ ల మండల నూతన కార్యవర్గం ఎన్నిక

 ఐకేపీ విఓఏ ల మండల నూతన కార్యవర్గం ఎన్నిక  

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఐకేపీ విఓఏ ఉద్యోగుల సంఘం సమావేశం రెబ్బెన  గెస్టుహౌస్ లోమంగళవారం  నిర్వహించి నూతనకార్యవర్గం ఎన్నుకున్నారు. ఈ  సమావేశానికి డివిజన్ ఉపాధ్యక్షులు ఫైమా ముఖ్య అతిధి గా  హాజరురై మాట్లాడారు  విఓఏ ల సమస్యల గురించి మాట్లాడుతూ 40 నెలల బకాయి వేతనాలు ఇవ్వకుండా ,ప్రభుత్వం ఇచ్చిన 5000/- వేతనం హామీ నెరవేర్చకుండా విఓఏ లను పట్టించుకోకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు  . 10వ తేదీన తూర్పుజిల్లా మంచిర్యాల ఉద్యోగుల సర్వసభ్య సమావేశం బెల్లంపల్లి లో నిర్వహించడం జరుగుతుందని ఆ సమావేశానికి అందరు విఓఏ లు అధిక సంఖ్య లో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరరు. అదేవిదంగా  రెబ్బెన మండల కమిటీ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు అధ్యక్షులుగా గజ్జెల్లి భీమేష్ ,ఉపాధ్యక్షులుగా నల్లగొండ వెంకటేష్ ,ప్రధానకార్యదర్శిగా మొర్లే తిరుపతి ,సహాయకార్యదర్శిగా మైలారం శ్రీనివాస్ ,కోశాధికారిగా డోంగ్రి తిరుపతి లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ సమావేశం లొ  కమిటీ సభ్యులుగా కృష్ణ ,రవికుమార్ ,శంకర్ ,శ్రీకాంత్ ,పరమేష్ ,ప్రకాష్ ,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, 3 September 2016

జ్వరముతో తల్లి కొడుకు మృతి

జ్వరముతో తల్లి కొడుకు మృతి

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తీవ్ర జ్వరముతో మండలములో తల్లి కొడుకు లు శుక్ర వారము రాత్రి మృతి చెందడముతో మండలము లోని రాళ్లపేట లో  విషాద ఛాయలు అలుముకున్నాయి  . వివరాలలోకి వెళితే సంచార జాతికి చెందిన  రాథోడ్ అనిత , సంపత్ దంపతులు సంవత్తరము క్రితం రాళ్లపేటకు వలస వచించారు . కూలి పనులు చేసుకొంటూ జీవనం కొనసాగిస్తున్నారు వీరికి ఇద్దరు సంతానం ఉండగా వారిలో పెద్దవాడైన చిరుత  (10 ) , తల్లి సునిత గత జ్వరము రావడముతో ఆసుపత్రికి తీసుకెళ్లారు . సునీత ,  చిరుత లు   తీవ్రమైన విష జ్వరముతో శుక్రవారం రాత్రి  మృతి  చెందారు.

మట్టి వినాయకుల పంపిణి

మట్టి వినాయకుల పంపిణి    
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  సింగరేణి ఆధ్వర్యములో శనివారం జి ఎం కె రవిశంకర్ , సేవ సమితి అధ్యక్షురాలు అనురాధ చేతుల మీదుగా పంపిణి  చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మట్టి విగ్రహాలతో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించ వచ్చ్చని తెలిపారు . రంగు పూసిన విగ్రహాలను వాడితే నిమజ్జనం చేసినప్పుడు నీళ్లు మొత్తం కలుషిత అవుతాయని వారు తెలిపారు . ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను భక్తి శ్రద్దలతో  పూజించి వాతావరణ కాలుష్యాన్ని కాపాడాలని అన్నారు . ఈ కార్య క్రమములో నాయకులూ ఎస్ తిరుపతి , ఎం శ్రేణివాస రెడ్డి , కుండఁదరపు శంకరమ్మ ,డి వై  జి ఎం చిట్టా రంజాన్ , డి వై ఫై ఎం సుదర్శన్ , రాజేశ్వరరావు లు ఉన్నారు.

అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే తొలగించిన అంగన్వాడీలను వెంటనే విధుల్లోకి తీసుకోని ,ఏ ఐ టి యు, ఎన్  రాయిలా నర్సయ్య , అంగన్వాడీ కార్యకర్తలు  శనివారం రెబ్బన తసీల్ధార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందచేశారు అనంతరం వాలు మాట్లాడుతూ కనీస వేతనం 18000/- రూపాయలు ఇవ్వాలని పేర్కొన్నారు ,జి ఓ నె0. 4 ను సవరించి అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు ,పి ఎఫ్ మరియు ఇ ఎస్ ఏ ,బోనస్ చట్టాలను విధిగా అమలుచేయాలని అందరి పెన్షన్ గారంటీ ఇవ్వాలని మరియు కార్యకర్తలకు సూపెర్వైసేర్ ఎక్సమ్ పెట్టి తీసుకోవాలని ఈ కార్య క్రమములో చంద్రకళ,ప్రమీల, బాలమ్మా ,  రాజేశ్వరి , సుజాత , సుశీల  లతో పాటు  , తదితర అంగన్వాడీ కార్య కర్తలు  ఉన్నారు. 

సునందిని పశువుల దూడల దాణా పంపిణి

సునందిని  పశువుల దూడల దాణా పంపిణి

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన పశు వైద్య శాలలో స్స్నిశనివారం  సునందిని  పశువుల దూడల దాణా పంపిణి చేసారు. పశు వైద్యాధికారి  డా . ఎస్ .సాగర్ మాట్లాడుతూ     మొత్తం 39 రైతులకు  120 కేజీల చొప్పున మొత్తం 4680కేజీల దాణాను పంపిణి చేయడం జరిగింది .  ఈ పథకంలో ఎస్ సి  మరియు ఎస్ టి   రైతులకు 75% సబ్సిడీపైన  మరియు బి సి   మరియు ఓ సి   రైతులకు 50% సబ్సిడీపైన  దాణ ను పంపిణి చేయడం జరిగింది.  ఈ కార్యక్రమము లో జడ్పీటీసీ - బాబురావు,ఎంపీపీ  - సంజీవ్ కుమార్, సర్పంచ్ - పెసారు   వెంకటమ్మ,ఉప సర్పంచ్  - బి. శ్రీధర్,పి ఏ సి ఎస్  డైరెక్టర్ -పెసారు మధునయ్య,ఆసిఫాబాద్ మార్కెట్  కమిటీ వైస్ ఛైర్మెన్ - కుందారపు  శంకరమ్మ,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ  డైరెక్టర్ - పల్లె రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు .

Friday, 2 September 2016

తొలగించిన అంగన్ వాడి లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

తొలగించిన అంగన్ వాడి లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి   


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);తొలగించిన అంగన్వాడీలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సి ఐ టి యు ,ఏ ఐ టి యు, ఎన్ ఎస్ యు ఐ ,  ఐ కె పి నాయకులూ రమేష్ , రాయిలా నర్సయ్య , భరద్వాజ్ , డి తిరుపతి లు అన్నారు. శుక్రవారం రెబ్బన ప్రధాన రహదారి ఫై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు . వారు మాట్లాడుతూ మధ్యాహన భోజన కార్మికులను , ఆశ వర్కర్లను , ఐ కె పి  సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు . కాంట్రాక్ట్ కార్మికులందరికి కనీస వేతనం 18000/- రూపాయలు ఇవ్వాలని పేర్కొన్నారు . అదే విదంగా కార్మిక చట్టాల సవరణను ఆపాలని , పి  ఎఫ్ , ఏ ఎస్ ఐ సౌకర్యా కల్పించాలని తెలిపారు . ఈ కార్య క్రమములో నాయకులు ఆర్ శంకర్ , రామ , సరస్వతి , బాలమ్మ , చంద్రకళ రాజేశ్వరి , సుజాత , సుశీల , శ్రీనివాస్ లతో పాటు ఆశ వర్కర్లు , అంగన్వాడీ కార్య కర్తలు ఐ కె పి  సిబ్బంది ఉన్నారు.

కాంట్రాక్ట్ లెక్చలర్లను పర్మినెంట్ చేయాలి

కాంట్రాక్ట్ లెక్చలర్లను పర్మినెంట్ చేయాలి


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); కాంట్రాక్టు లెక్చలర్లను పర్మినెంట్ చేయాలని కాంట్రాక్టు లెక్చలర్ల సంఘం గంగాధర్ అన్నారు. శుక్రవారం వాల్ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పదవ పీఆర్సీ ప్రకారం నెలకు 37100 ఇవ్వాలని అన్నారు. కాంట్రాక్టు లెక్చలర్ల క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలని అన్నారు. అదేవిధంగా మహిళా లెక్చలర్లకు ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు.  కాంట్రాక్టు లెక్చలర్ల అందరికి హెల్త్ కార్డులతో పాటు గ్రూప్ ఇన్సూరెన్సు ఇవ్వాలని అన్నారు. తీవ్ర జబ్బులతో బాధపడే వారిని కోరుకున్న ఉద్యోగంలో చేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ప్రవీణ్, ప్రకాష్, అమరేందర్, వెంకటేశ్వర్లు, నిర్మల, సుమలత, రామారావు, వరలష్మి, జాన్సీ, మల్లీశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

ఏ ఐ టి యూ సి, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం

ఏ ఐ టి యూ సి, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం

  రెబ్బెన: (వుదయం ప్రతినిధి);దేశ వ్యాప్తిత సమ్మెలో భాగంగా సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ మరియు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను గోలేటిలో దహనం చేశారు. ఈ సందర్బంగా ఏ ఐ టి యూ సి  బ్రాంచ్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ మాట్లాడుతూ కార్మికులకు కనీసవేతనం 18వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఔట్  సోర్సింగ్ లను రద్దు చేసి రెగ్యులర్  చేయాలనీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ స్కిం లలో  పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలని అన్నారు. కార్మిక చట్టాల సవరణను నిలిపివేయరన్నారు. ప్రభుత్వ కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వాటాల అమ్మకాన్ని ఆపాలన్నారు. 45రోజుల్లో కార్మికుల సంఘాల రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ఆరెపల్లి రామస్వామి, సహాయ కార్యదర్శులు రాం కుమార్, నాయకులు శంకర్, రాజ శేఖర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, పూదరి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

అక్రముగా నిల్వ వుంచిన రేషన్ బియ్యం పట్టివేత

అక్రముగా నిల్వ వుంచిన  రేషన్ బియ్యం పట్టివేత 
జాయింట్ కలెక్టర్  ఆదేశాల మేరకు సరఫరా  శాఖ వారు గురువారం తనిఖీ చేస్తుండగా రెబ్బెన మండలంలో     ప్రకాష్ దగ్గర  7. 50  క్వింటాల  బియ్యం 2. 50    క్వింటాల గోధుమలు    పట్టుకున్నారు ఎం డి జమీర్ ఆసిఫాబాద్ డి టి , ఏ ఎస్ ఓ జితేందర్ రెడ్డి ఆసిఫాబాద్,  ఏ ఎస్ ఎఫ్ రియాజ్ డి టి కాగజనగర్,మోనిల్ డి టి తాండూర్ ,ప్రకాష్ డి టి కౌటాల   ఎం ఏ అలీ  రెబ్బెన తహసీల్దార్ సిబ్బంది సర్వర్ పాల్గొన్నారు ఇలాంటి అక్రమ రవాణా  జరిగితే   వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

భూనిర్వాసితులకు న్యాయం చేయండి - కోదండరాం

భూనిర్వాసితులకు న్యాయం చేయండి - కోదండరాం 
వట్టి వాగును పరిశీలిస్తున్న కోదండరాం

హవానం పలుకుతున్న గిరిజనులు 

సభలో మాట్లాడుతున్న కోదండరాం   
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);వట్టి వాగు క్రింద భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని జె ఏ సి కోదండ రామ్ అన్నారు . బుధవారం వట్టి వాగును పరిశీలించి మాట్లాడారు .  ప్రత్యేక  తెలంగాణ  సాధించుకున్న అన్నివర్గాల  అభివృద్ధి కొరకు జయశంకర్ ఆశయాలను నెరవేరుద్దామని ప్రొపెసర్ కోదండరాం అన్నారు. గిరిజనులు  సంప్రదాయాల ప్రకారం హవానించారు వారితో  కాసేపు ముచ్చ్చటించి కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాటికి వాగు కాలువలో ఓ సి పి  మట్టి కొట్టుకొని వఛ్చి కాలువలు ముసుకు పోతున్నాయని మరమత్తులు చేపట్టాలని అన్నారు . తెలంగాణ మూడు తరాల ఉద్యమానికి ముందు నడిచి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ,నిధులు,నియామకాలలో జరిగిన అన్యాయాలను ఎదురించి పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రo సాదించుకున్నాము. సింగరేణిలో ఓపెన్ కాస్ట్ విధానాన్ని తొలగించి నిరోద్యుగులకు ఉపాధి కల్పించేలా భూ అంతర గనులను ప్రోత్సహించి నిర్వహించాలి . అలాగే సింగరేణి యాజమాన్యం పరిసర ప్రాంత గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో  ఇ.చంద్రశేఖర్, టి.వి.వి. ఎల్ రమేష్ , మిట్ట దేవేందర్  , ఉపాధ్యాయులు, విద్యార్ధి సంఘల నాయకులూ, మేధావులు తదితరులు పాల్గొన్నారు.

అత్యాచార నిందితుడు అరెస్టు

అత్యాచార నిందితుడు అరెస్టు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో గత 27న  మేనకోడలి పై అమానుషంగా అత్యాచారం కు పాలుపడిన నిందితుడుని  నిన్న సాయంత్రం తన ఇంటివద్దనే పట్టుకొని అరెస్టు చేసినట్లు డిఎస్పీ  రమణ రెడ్డి తెలిపారు. గురువారం నాడు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ గత 27న కిష్టాపూర్ గ్రామం ఇంట్లో ఎవరులేని సమయంలో  ఇంటి పక్కనున్న తన మేనకోడలు పై బలవంతంగా అత్యాచారం చేసిన నిందితుడు మేనమామ పై యువతి తల్లిదండ్రులు  పిర్యాదు మేరకు  పొలుసులు  పూర్వాపరాలను పరిశీలించి నిందితున్ని కస్టడీలోకి తీసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రమణ రెడ్డి , సిఐ కరుణాకర్ , ఎస్ ఐ సురేష్ ఉన్నారు