Tuesday, 18 December 2018

నిరుద్యోగ యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 18 ; తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని విద్యావంతులైన నిరుద్యోగ యువతకు వివిధ శిక్షణ సంస్థలు ద్వారా నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉద్యోగ ఉపాధి కల్పించును ఎస్సీ కార్పొరేషన్ నేర్పాటు చేయబోతుందని ఏరియా డీజీఎం పర్సనల్ జె కిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ కోర్సులలో శిక్షణ పొందా గలరు వారు పద్ధెనిమిది సంవత్సరాల నుండి ముప్పయి సంవత్సరాల లోపు వయస్సు ఉండవలెను శిక్షణా సంస్థలు జాతీయ నిర్మాణ రంగ సంస్థ హైదరాబాద్ జాతీయ ఏర్పాటు మరియు అపోలో మెడ్ స్కిల్స్ కెల్ట్రాన్ ఇన్స్టిట్యూట్ ఇన్సిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నిమ్స్ జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ టీఎంఐ ఈ టూ ఈ క్రింద శిక్షణ సంస్థల్లో పలు కోర్సులలో పూర్తి ఉచిత వసతి భోజన సదుపాయాలతో శిక్షణ కార్యక్రమాల ఈ అకాడమీ ఆప్టిమల్ స్కిల్స్ నాలుగు ట్యూషన్స్ షెడ్యూల్ ఇన్సిట్యూట్ ఆఫ్ పర్ఫెక్ట్ స్టేట్ ఫోర్ నీకు పూర్తి వివరములకు గోరేటి జిమ్ ఆఫీసులోని పర్సనల్ డిపార్టుమెంట్లో  సంప్రదించలన్నారు.

Sunday, 16 December 2018

చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి ; ఎస్పీ మల్లారెడ్డి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 16 ; చట్ట వ్యతిరేక  కార్యక్రమాలకు  ప్రజలు దూరంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని, వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను నివారించలని   ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. ఆదివారం  రెబ్బెన మండలం లోని సింగిల్ గూడ గ్రామంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించరూ. ఈ సందర్బంగా  ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడుతూ గుడుంబా ప్రభావిత గ్రామాల్లో,నాటు సార నిషేధిత, గుట్కా,తంబాక్, వినియోగించడంతో మానవాళి ఆరోగ్య సమస్యలతో కుటుంబాలు చిన్నబిన్నమౌతున్నాయని వారికి తెలిపారు.  మరియు బడి ఈడు పిల్లల్ని బడిలో చేర్పించి విద్య బుద్దులకు అలవాటు చేయాలని అన్నారు,బాల్య వివాహాలు చేయరాదని గ్రామంలోని ప్రజలకు సూచించారు. కార్టన్ సెర్చ్ లో 5 లీటర్ల గుడుంబా మరియు సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు అలాగే మద్యం తాగి వాహనాలు నడిపేవారికి తగిన చట్టరీత్య చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి మండల,గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించి ప్రజలకు భద్రతను,భరోసాను కల్పించనున్నట్లు ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు.డీఎస్పీ సత్యనారాయణ,సిఐ రమణమూర్తి,ఆరుగురు ఎస్ ఐ లు, డికొండ రమేష్. 56 మంది పోలీస్ సిబ్బంది తో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

Saturday, 15 December 2018

పాఠశాల మేనేజ్ మేంట్ కమిటీ సమావేశం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 15 ; రెబ్బెన మండలం ఇందిరా నగర్ గ్రామంలోని ప్రాధమిక పాఠశాల మేనేజ్ మేంట్   కమిటీ సమావేశం కన్వీనర్ దొడ్డిపట్ల రవికుమార్ అధ్యక్షతన  శనివారం నిర్వహించారు. ఈ  సమావేశంలో పాఠశాల మౌలిక వసతులు , మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ , విద్యార్థుల హాజరు శాతం,  చదువులో వెనుక బడిన విద్యార్థుల ప్రగతి కై తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎం సి సభ్యులు అనిత,అమ్మక్క , తార, ఇందిరా, లక్ష్మి, సరోజ, రజిత , సుజాత, సునీతా, రాందాస్, శంకర్, వెంకటేష్, సి అర్  పి  దేవేందర్, అంగన్వాడీ టీచర్ తిరుపతమ్మ, ఉపాధ్యాయులు కవిత, అశోక్ తదితరులు పాల్గొన్నారు. 

ఓపెన్ 10 వ తరగతి పరీక్షలకు అవకాశం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 15 ;   తెలంగాణా ప్రభుత్వం 2018 -19 సంవత్సరానికి గాను   ఓపెన్ 10 వ తరగతి పరీక్షలకు అవకాశం కల్పించిందని ఆసక్తి గలవారు   ఈ నెల 15 నుండి 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రెబ్బెన మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

బ్యాంకింగ్ వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 15 ;  బ్యాంకింగ్ రంగంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని  డెక్కన్ గ్రామీణ బ్యాంకు  ఫీల్డ్ ఆఫీసర్ రవికుమార్ అన్నారు. శనివారం మండల  కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు బ్యాంకింగ్ రంగంపై అవగాహన సదస్సును రెబ్బెన మండల కేంద్రంలోని  డెక్కన్ గ్రామీణ బ్యాంకులో    నిర్వహించారు.  బ్యాంకు లో ప్రతి నిత్యం జరిగే లావాదేవీలపై అవగాహన కల్పించారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్ , ఫిక్సడ్  డిపాజిట్, సేవింగ్స్, ఆర్ టి జి ఎస్, నిఫ్ట్  మరియు  ఫోన్ ద్వారా సేవింగ్స్ బ్యాంకు బాలన్స్ తెలుసుకొనుట,  తదితర అంశాలపై వివరించారు. బ్యాంకు ఖాతా దారులు తమ  ఖాతాలలో ఉన్న జమ వివరాలను కేవలం ఒక మిస్సెద్  కాల్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ఫోన్ నెంబర్ 092780 31313 కు డయల్ చేసిన వెంటనే మెసేజ్ రూపంలో తెలియచేయబడతాయని వివరించారు.   ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు శ్రీకాంత్, ప్రభాకర్, శ్రీదేవి, గోపాల్, పు ష్పలత, చంద్రశేఖర్, తుకారాం, శ్రీలత , బ్యాంకు సిబ్బంది , శంకర్, వెంకటేశ్వర్ రెడ్డి, హుస్సేన్, గీత, ఆనందరావు తదితరులు  పాల్గొన్నారు. 

Friday, 14 December 2018

కేటీర్ పదోన్నతిపై తెరాస శ్రేణుల సంబరాలు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 14  ; కల్వకుంట్ల తారక రామా రావు  తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని చేపట్టిన   సందర్బంగా రెబ్బెన మండలం  గోలేటి లో  టి ఆర్ ఎస్ వి  కొమురంభీం  జిల్లా అధ్యక్షులు మస్కు రమేష్   ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పదవికి కేటీర్  ను ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తెరాస పార్టీ కేటీర్  నాయకత్వంలో మరింత ప్రజాదరణ పొందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో  పార్వతి అశోక్, సోంశెట్టి శశి, లాక్సేటి రవీందర్, పోతురాజుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్ సీ వర్గీకరణ బిల్లు ప్రెవేశ పెట్టాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 14  ;  వచ్చే శీతాకాల  పార్లమెంట్ సమావేశాలలో ఎస్ సీ  వర్గీకరణ బిల్లు ప్రెవేశ పెట్టాలని కొమురంభీం జిల్లా మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు వేమునూరి భాస్కర్ మాదిగ  అన్నారు. గత 25 సంవత్సరాలుగా ఎస్ సీ  ల అబీహుయున్నతి కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తున్న మందకృష్ణ మాదిగను విమర్శించడం తగదని అన్నారు.మాదిగ జాతి అభ్యున్నతి కోసం పాటు పడుతున్న మహనీయుడు మందకృష్ణ మాదిగ అని అన్నారు. 

గుడుంబా స్థావరాలపై దాడులు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 14  ; రెబ్బెన మండలం దేవులగుడ    గ్రామంలోని పత్తి  చేలలో శుక్రవారం  ఖచితమైన సమాచారం మేరకు  ఎస్సై విజయలక్ష్మి ఆధ్వర్యంలో  మద్యపాన నిషేధ శాఖ అధికారులు దాడి చేసి  గుడుంబా తయారీ  స్థావరాలను ధ్వంసం చేసినట్లు  ఆబ్కారీ   ఎస్సై   విజయలక్ష్మి  తెలిపారు.   తయారీ కంద్రాలలో 50  లీటర్ల బెల్లం పానకం, 5 లీటర్ల గుడుంబా  నుస్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.   ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి నిషేదిత మద్యాలను తయారీ చేయకూడదని అన్నారు. చట్టాన్ని అధిగమించిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. నిషేదిత మద్యం తరిపై సమాచారం ఇవ్వదలచినవారు 08735 277017 నెంబర్ పై సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం గా ఉంచబబడతాయని తెలిపారు.  ఈ దాడులలో  కానిస్టేబుల్   తిరుపతి, సురేష్, తిరుమల,మమత,  తదితర సిబ్బంది ఉన్నారు.

సబ్సిడీ పై గడ్డి విత్తనాలు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 14  ; రెబ్బెన మండలంలో సబ్సిడీ పై గడ్డి విత్తనాలను సరఫరా చేయనున్నట్లు స్థానిక పశు  వైద్యాధికారి సాగర్ శుక్రవారంతెలిపారు. మండలం లోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడ్డి విత్తనాలు 75 శాతం సబ్సిడీ పై అందచేయనున్నట్లు తెలిపారు. 5 కిలోల విత్తనాల బాగ్ 50 ధర రూపాయలని  రైతులు తమ పట్టా పాసు పుస్తకాల నకళ్ళతో రెబ్బెన పశు వైద్యశాలలో సంప్రదించాలని కోరారు.

Wednesday, 5 December 2018

గుడుంబా స్థావరాలపై దాడులు

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 5  ; రెబ్బెన మండలం దేవులగుడ పరిసర ప్రాంతాలలో   గ్రామంలోబుధవారం ఖచితమైన సమాచారం మేరకు  జిల్లా  ఆబ్కారీ అధికారి రాజ్యలక్ష్మి ఆదేశానుసారం మొహిసిన్ అలీ ఆధ్వర్యంలో  మద్యపాన నిషేధ శాఖ అధికారులు దాడి చేసి  గుడుంబా తయారీ  స్థావరాలను ధ్వంసం చేసినట్లు  ఆబ్కారీ   ఎస్సై   విజయలక్ష్మి  తెలిపారు.  గ్రామంలో  నాగు వెంబడి ఉన్న తయారీ కంద్రాలలో 50  లీటర్ల బెల్లం పానకం, 25 లీటర్ల గుడుంబా  నుస్వాధీనపరచుకున్నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి నిషేదిత మద్యాలను తయారీ చేయకూడదని అన్నారు. చట్టాన్ని అధిగమించిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. నిషేదిత మద్యం తరిపై సమాచారం ఇవ్వదలచినవారు 08735 277017 నెంబర్ పై సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం గా ఉంచబబడతాయని తెలిపారు.  ఈ దాడులలో  కానిస్టేబుల్   తిరుపతి, సురేష్, తిరుమల,మమత,  తదితర సిబ్బంది ఉన్నారు.

Monday, 3 December 2018

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ; జీఎం కే రవిశంకర్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, ; అంగవైకల్యం ఉందని కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని   జీఎం  కే రవిశంకర్  అన్నారు. ప్రపంచ దివ్యంగా దినోత్సవాన్ని పురస్కరించుకొని  బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్ షిప్లోని సింగరేణి పాఠశాల మైదానంలో సోమవారం  దివ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనురాధ రవి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం  డిసెంబర్ మూడున దివ్యాంగుల దినోత్సవాన్ని సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తుందని  దివ్యాంగులు అంగవైకల్యం ఉందని కుంగిపోకుండా పట్టుదలతో కృషి చేసి ఆయా రంగాల్లో ఉన్నత స్థాయిల్లో వున్నారని అన్నారు ఈ సందర్భంగా దివ్యాంగులకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. అందరికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న వారికి పాటలు పాడి డ్యాన్సులు చేసిన వారికి బహుమతులను ప్రదానం చేశారు.   ఈ కార్యక్రమంలో ఇంచార్జి  డిజిఎం పర్సనల్ సుదర్శనం, డిజి డివైపిఎం ఎల్ రామశాస్త్రి డబ్ల్యూపీఎస్ స్పోర్ట్స్ సూపర్ వైజర్   రమేష్ ,  చంద్రకుమార్,   భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, 1 December 2018

ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, ; రెబ్బెన మండలం నారాయణ పూర్ గ్రామంలో పతంజలి యోగ పీఠం హరిద్వార్ వారి ఆధ్వర్యంలో శనివారం ఐదురోజుల ఉచిత యోగా శిక్షణ  శిబిరాన్ని   కొమరం భీమ్ జిల్లా ప్రచారక్ దాసరి వినోద్ గౌడ్ ప్రారంభించారు, ఈ సందర్భంగా   మాట్లాడుతూ యోగాను రోజు చేయాలని చేసినట్లయితే వ్యాధులు దరిచేరవని ఆయన తెలిపారు.  తదనంతరం నారాయణపూర్ ప్రభుత్వ పాఠశాలలో యోగ పైన అవగాహన కల్పించారు మరియు గ్రామంలో యోగ, స్వచ్ఛత, పచ్చదనం, గోమాత గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ వాసులు మరియు పాఠశాల   ప్రధానోపాధ్యాయిని మరియు ఉపాధ్యాయుని లు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. 

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం

 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, ; ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమని పి  అర్  టి యు  కొమురం భీమ్ జిల్లా అధ్యక్షులు ఎటుకురి. శ్రీనివాస్ అన్నారు. శనివారం రెబ్బెన మండలం  తక్కలపల్లి గ్రామంలోని  ఉన్నత పాఠశాలలోపనిచేస్తున్న ఉపాధ్యాయురాలు  శ్రీమతి హనుమాండ్ల విజయ లక్మి  పదవి విరమణ సన్మాన సభకి ముఖ్య అతిధి గా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ  ఆమె పాఠశాలలో చేసిన సేవలను కొనియాడుతూ   శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని అన్నారు . పదవి విరమణ చేసిన ఉపాధ్యాయురాలును  పి  అర్  టి యు టి ఎస్    రెబ్బెన మండల శాఖ పక్షాన ఘనబగా సన్మానించడం జరిగింది.   ఈ కార్యక్రమంలోమండల విద్యాధి కారి వెంకటేశ్వర స్వామి,  జిల్లా మాజీ అధ్యక్షులు డి.నారాయణ రావు,జిల్లా ఉపాధ్యక్షులు సదానందం,ఖాదర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్వల శంకర్,మండల అధ్యక్షులు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి యస్.అనిల్ కుమార్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.