రెబ్బెన ; నేటి యువత డాక్టర్ బాబు జగ్జిమం రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పి ఆర్ టి యు టి ఎస్ కొమురం భీం జిల్లా అధ్యక్షులు ఏటుకూరి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం నక్కల గూడా ప్రాథమిక పాఠశాలలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి 112వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ పటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక దళిత కుటుంబంలో పుట్టి తన సేవలతో పోరాటాలతో దళితుల అభివృద్ధికి పాటుపడడం తో పాటు భారత దేశ ఉప ప్రధానిగా పనిచేసిన గొప్పవారని పొగిడారు. పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు తోట వినోద్ కుమార్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఒక దళిత నాయకుడే కాక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవానికి నాంది పలికారని, రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు 1971 వ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో పాకిస్తాను ఓడించారని తెలియజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయమని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు తోట వినోద్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఖాదర్, సదానందం, జిల్లా కార్యదర్శి తిరుపతయ్య మండల ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, సోమశేఖర్, శ్రీధర్, రవి, లింగయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Friday, 5 April 2019
Monday, 11 March 2019
బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలి
రెబ్బెన : బిజెపి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం సాయంత్రం 4. గంటలకు గోలేటి సెయింట్ ఆగ్నెస్ స్కూల్ నిర్వహించబడునని సోమవారం ఓ ప్రకటనలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ జిల్లా ఇన్చార్జి చాడా శ్రీనివాసరెడ్డి హాజరవుతారు ఈ సమావేశానికి జిల్లా పది అధికారులు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరు హాజరు కాగలరలని కోరారు.
నూతన పట్టాధార్ పాస్ పుస్తకాలను అందించాలని జిల్లా పాలానాధికారికి రైతుల వినతి.
రెబ్బెన : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సమగ్ర సర్వే తర్వాత కొత్త పట్టాధార్ పాస్ పుస్తకాలు చాల మంది రైతులకు అందలేదని రెబ్బన మండలంలోని గంగాపూర్ గ్రామా రైతులు సోమవారం జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హన్మంతుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ పట్టా పుస్తకాలు అందక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన రైతు బంధు, ప్రధాన మంత్రి కిసాన్ నిధి పథకాలు కోల్పోయామని అన్నారు. కొత్త పాస్ పుస్తకాలను రైతులకు అందజేసి ప్రభుత్వాల నుండి వచ్చే పెట్టుబడి పథకాలను అందించాలని రైతులు కోరారు. నిత్యం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి కాలయాపన జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు వొలువోజు వెంకటేశం, శ్యామ్రావు, గందె సంతోష్, లావుడ్య బిక్కు, కిషన్, రమేష్, లక్ష్మిభాయ్,తార భాయ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పాతూరి సుధాకర్ రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించాలి
రెబ్బెన : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాతూరి సుధాకర్ రెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఒప్పంద అధ్యాపకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాయిని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించడంలో పాతూరి సుధాకరరెడ్డి పాత్ర మరువలేనిది అని అన్నారు. అధ్యాపకుల వేతనాలు పెరగడంతో పాటు, 12 నెలలు వేతనం రావడం లాంటి అనేక సమస్యలు పరిష్కరించబడినవి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జెడి సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఒప్పంద అధ్యాపకులు ప్రవీణ్, రామారావు, వెంకటేశ్వర్, ప్రకాష్, మహేష్, అమరేందర్, మంజుల, పద్మ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 6 March 2019
విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఉన్నత శ్రేణులకు ఎదగాలి ; జిల్లా ఎస్పీ మల్లారెడ్డి
రెబ్బెన ; విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని మహనీయుల జీవిత చరిత్రలు చదివి ఉన్నత శ్రేణులకు ఎదగాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. బుధవారం రెబ్బెన మండలంలోని రెబ్బెన ఆర్ట్ & సైన్స్ కళాశాలలోబుధవారం ఏర్పాటు చేసిన ఎనిమిదవ వార్సకోశావ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు డిగ్రీ కళాశాలకు వచ్చాక ఒక గోల్ ఏర్పాటు చేసుకుని ఆసక్తి గల రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థులు యువకులు చెడు వ్యసనాలు పట్టకుండా సెల్ఫోన్లతో కాలయాపన చేయకుండా విద్యపై ఆసక్తి చూపించి పై రంగాల్లో రాణించాలన్నారు విద్యార్థులు కళాశాలలో పాఠాలు చెప్పేటప్పుడు ముఖ్యమైన సందేశాలను నోటు పుస్తకంపై రాసుకుని చదువుకోవాలన్నారు. మహనీయుల జీవిత చరిత్ర పుస్తకాలతో జ్ఞానం పెంపొందుతుందని ఆసక్తిగల రంగాల్లో విద్యార్థులు ముందుకు వెళ్లి మంచి స్థానాల్లో ఉండాలన్నారు ప్రతి రోజూ వచ్చే వార్తా పత్రికలోని ఎడిటోరియల్ కాలమ్స్ చదవాలని సూచించారు అలాగే సమాజం మనకు చాలా నేర్పుతుంది దాని ముందు మంచిని స్వీకరించి కాలానికి అనుగుణంగా మారుతూ ప్రత్యేక స్థానాన్ని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ అహల్యాదేవి, ఎంపీపీ సంజీవ్ కుమార్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, కళాశాల కరస్పా టీ శ్రీనివాస్ రాజు, ప్రిన్సిపాల్ జాకీర్ ఉస్మాని, విమ్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్రెడ్డి, ఎస్డీ రమేష్, డైరెక్టర్లు దేవేందర్రావు శ్రీధర్రావు మరియు కళాశాల సిబ్బంది వాచర్లు పాల్గొన్నారు
Monday, 4 March 2019
శివనామ స్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు


రెబ్బెన ; మహా శివరాత్రి సందర్భంగా బుధవారం శైవ క్షేత్రాలలో శివ నామ స్మరణ మరు మ్రోగాయి. రెబ్బెన మండలము లోని నంబాల గ్రామము లో గల ప్రసన్న పరమేశ్వర ఆలయ జాతర రంగ రంగ వైభవంగా సాగింది. ఉదయము పూట నుండే భక్తులు తండోప తండాలుగా మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఎడ్ల బండ్లపై, , మోటారు సైకిళ్లపై తరలి వచ్చారు భక్తులు . కోరిన కోరికలను తీర్చాలని మొక్కుకున్నారు. ముందుగా శివ పార్వతుల కళ్యాణం ఆలయ కమిటి ఆధ్వర్యములో నిర్వహించారు. కళ్యాణం ఎంతో కనుల పండుగగా సాగింది .ఈ కళ్యాణములో భక్తులు కుంకుమ పూజలు భక్తి శ్రద్దలతో చేశారు. ఈ పూజలలో దంపతులు స్వామి వారి కళ్యాణం లో పాల్గొన్నారు. . స్వామివారికి ప్రత్యక పూజలు నిర్వహించారు. ఈ జాతర లో వచ్చిన భక్తులకు కొంతమంది దాతలు అన్నప్రసాద వితరణ గావించారు. . భక్తుల కు ఎలాంటి అసౌ కర్యాలు కలగకుండా ఆలయ కమిటి అన్ని చర్యలు చేపట్టారు . అర్ టి సి సంస్థ భక్తుల రవాణా కొరకు ప్రత్యక బస్సులు నడిపారు .ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగ కుండ పోలీసుశాఖవారు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కన్నుల పండుగగా రధోత్సవం ;-
రెబ్బెన ; శివ పర్వతుల రధోత్సవం ఎంతో కనుల పండగగా జరిగింది . ఈ కార్యక్రమంలో లో భక్తులు తండోప తండాలుగా పాల్గొన్నారు . ఆలయము చుట్టూ స్వామి వారి రథాన్ని భక్తులు శంభో శంకర అంటూ రధోత్సవం లో పాల్గొన్నారు. శివాలయ ప్రాంగణము శివ నాదము తో మరు మ్రోగింది. అనతరము భక్తులు శివ పార్వతుల కు నైవేద్యము సమర్పించారు. సాయంత్రము శివాలయము లో భక్తులు భజనలు , కీర్తనలు పాడుతూ భక్తి పారవశ్యములో మునిగారు. రాత్రి ఏర్పాటు చేసిన స్వామి వారి దీపాలంకరణ భక్తులను మంత్ర ముగ్దులను చేసింది. అనంతరము భక్తులు శివాలయం వద్ద జాగారణ చేస్తూ శివ స్మరణతో జాగరం చేస్తూ గడిపారు.
Thursday, 28 February 2019
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 28 ; రెబ్బెన మండలం నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెబ్బెన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ స్వర్ణ లత హాజరయ్యారు. ముందుగా సర్ సి వి రామన్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుండే ప్రకృతిని పరిశీలించడం తెలుసుకోవడం చేయాలని తద్వారానే జ్ఞానం పెరుగుతుందని తెలియజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్ మాట్లాడుతూ సర్ సి వి రామన్ గారి జీవితం ఎంతో మంది విద్యార్థులకు ప్రేరణ ఇస్తుందని తెలియజేశారు. 1928లో రామన్ ఎఫెక్ట్ అనబడే కాంతి కిరణాల గురించి పరిశోధనలో విజయం సాధించి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు గాను ఆయనకు 1930లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నోబెల్ బహుమతి లభించిందన్నారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా రెబ్బెన హైస్కూల్ జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు శ్రీదేవి, ఆంగ్ల ఉపాధ్యాయులు అనీస్ అహ్మద్ హాజరయ్యారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర మహాసభలను విజయవంతం చేయలి ; బోగే ఉపేందర్
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 28 ; సింగరేణి కాంట్రాక్టు కార్మికుల కేంద్ర 2వ మహాసభలు కొత్తగూడెంలోని మార్చి 3వ తేదీ రుద్రంపూర్ లో జరుగుతాయని ఏరియా లోని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని scwu గోలేటి బ్రాంచి అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు.గురువారం రోజున గోలేటి లోని కె ఎల్ మహేంద్ర భవన్ కార్మికుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి లో 25వేల మంది కాంట్రాక్టు కార్మికులు చాలి చాలని వేతనాలు తీసుకుంటూ,సంస్థ లాభలోకి రావడానికి,అభివృద్ధి చెందడానికి కార్మికుల కీలక పాత్ర పోసిస్తున్నారని,అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం కార్మికులను శ్రమదోపిడికి గురిచేస్తూ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు,01.01.2013 నుంచి హై పవర్ కమిటీ వేతనాలు చెలించాలని ఉన్నా యాజమాన్యం చెలించడం లేదని,కోల్ ఇండియా లో చేసిన ఒప్పందాలను అమలు చేయాలని అన్నారు,కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు,కార్మికులకు లాభాల వాటా చెలించాలని, కాంట్రాక్టర్ మరీనా కార్మికులను మార్చదని డిమాండ్ చేశారు,కార్మికుల CMPF వివరాలు తప్పుల ఉన్నాయని,అ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం చేయడంలో విఫలం అయ్యారని అన్నారు,అలాగే కార్మికుల కుటుంబాలకు వైద్య సదుపాయం కల్పించాలనిఅన్నారు,ప్రతి నెల 10 తేదీ లోపు వేతనాలు ఇవ్వాలని,అలాగే కార్మికులకు జీతం చిట్టీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు,సి.హెచ్.పి ,బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు స్కిల్ల్డ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు,కార్మికులు ఎదుర్కొంటున్నా సమస్యలను కేంద్ర మహాసభ లో చర్చించి తీర్మానాలు చేయడం జరిగుతున్నదని అన్నారు. కావున ఏరియా లోని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.. ఈ సమావేశంలో గోలేటి బ్రాంచ్ కార్యదర్శి చల్లురి అశోక్,సహాయ కార్యదర్శి సాగర్,నాయకులు ఆశలు,తిరుపతి, శంకర్,నాగేశ్వర్ రావులతో పాటు తదితరులు ఉన్నారు.
జాతీయ సైన్స్ దినోత్సవా వేడుకలు
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 28 ; జాతీయ సైన్స్ దినోత్సవాన్ని రెబ్బెన మండలం నారాయణపూర్ ప్రాథమికొన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నారాయణపూర్ గ్రామ సర్పంచ్ వేమునూరి అమృత హాజరయ్యారు. విద్యార్థులు తాయారు చేసిన ప్రయోగాలని,బోదనోపకరణాలని తిలికించారు ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననటి నుండే ప్రకృతిని పరిశీలించడం తెలుసుకోవడం చేయాలని తద్వారానే జ్ఞానం పెరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పల్లె శ్రీనివాస్ ,సుగుణకార్,కిరణ్ ,జగదీశ్, తిరుపతి,పాఠశాల ఉపాధ్యాయులు శారద, కవిత రాణి, సరోజ, సిఆర్పీ యం.రాజేష్, యువకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Wednesday, 27 February 2019
పిచ్చికుక్కల స్వైరవిహారం ; పలువురికి తీవ్ర గాయలు
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 27 ; రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గత కొద్దిరోజులుగా పిచ్చికుక్కలు గ్రామంలో విచ్చల విడిగా తిరిగితున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. . బుధ వారం గంగాపూర్ గ్రామంలో వాడే లక్ష్మి 4 సం పాపను, లక్ష్మీపూర్ గ్రామంలో మరొకరిని పెప్రి వెంకటేష్ 5 సం బాబు , పాసిగం గ్రామంలో దాగం మల్లయ్య 60 సం, తాళ్లపల్లి జ్యోతి 35 సంవత్సరాలు ఇద్దరి ని గాయపరచడంతో పాటు మూడు మేకలపై దాడిచేసి తీవ్రంగా గాయపరచినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా సంభందిత అధికారులు స్పందించి పిచ్చికుక్కలను అరికట్టాలని కోరుతున్నారు. లేనిపక్షంలో చిన్నపిల్లలు గాని వృద్దులు గాని ఆయా గ్రామాలలో ఇండ్లనుండి బయటకు వెళ్లే పరిస్థితి లేదన్నారు.
స్వాతంత్ర పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ కు ఘన నివాళి
చంద్రశేఖర్ ఆజాద్ కు ఘన నివాళి
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 27 ; ప్రముఖ స్వాతంత్ర పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతిని పురస్కరించుకొని రెబ్బెన మండలం నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ స్వతంత్రం కోసం పోరాడిన మన నాయకులను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత రంగంలో స్థిరపడాలనే తెలియజేశారు 25 సంవత్సరాల చిరు ప్రాయంలోనే భారతదేశ స్వతంత్రం కోసం పోరాడుతూ తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని అన్నారు . 1919 లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం చంద్రశేఖర్ ఆజాద్ మనసును బాగా కలచివేయడంతో 19 28 సెప్టెంబర్ లో భగత్ సింగ్ సుఖదేవ్ లతో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారన్నారు. భారతదేశానికి ఏ విధంగానైనా స్వాతంత్రం తీసుకురావాలనేది చంద్రశేఖర్ ఆజాద్ దృఢ సంకల్పం స్వాతంత్ర ఉద్యమ కారులను అణగదొక్కే బ్రిటిష్ అధికారుల పై చంద్రశేఖర్ ఆజాద్ తన సహచరులతో కలిసి దాడి చేసేవారన్నారు. ఫిబ్రవరి 27 1931వ సంవత్సరంలో బ్రిటిష్ వారు బందీగా పట్టుకోవడంతో బ్రిటీష్ అధికారుల చేతుల్లో చావకూడదు అన్న ఆలోచనతో తనను తాను కాల్చుకుని మరణించాడన్నారు. ఈ కార్యక్రమానికి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు రాజకమలాకర్ రెడ్డి , చైతన్య, దుర్గం శ్రీనివాస్, లకావత్ శంకర్, దురిశెట్టిరాజశేఖర్, కుమార్, నాగరాజు మరియు వార్డు మెంబర్ శ్యామ్ రావు విద్యా కమిటీ చైర్మన్ మీసాల పోష మల్లు ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్ విద్యార్థులు పాల్గొన్నారు.
Saturday, 23 February 2019
కోల్ ఇండియా లెవెల్ షటిల్ బ్యాట్మెంటిన్ టోర్నమెంట్
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 23 ; జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచి ఖేల్ గావ్ సిసిఎల్ ఠాగూర్ విశ్వనాథ్ ఇండోర్ స్టేడియంలో 23 నుండి 26 వరకు కోల్ ఇండియా లెవెల్ షటిల్ బ్యాట్మెంటిన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని బెల్లంపల్లి ఏరియా ఇంచార్జ్ డిజియం పర్సనల్ బి సుదర్శన్ శనివారం తెలిపారు. ఈ కోల్ ఇండియా పోటీలలో సింగరేణి జట్టు పాల్గొననున్నదని ఈ జట్టుకు మేనేజర్ గ ఏ రాజేశ్వర్ పర్సనల్ మేనేజర్, జట్టు కోచ్ గా హెచ్ రమేష్ స్పోర్ట్స్ సూపర్వైజర్ లు వ్యవహరిస్తారని అన్నారు. జట్టు క్రీడాకారులు ఆర్జీ గ్రూప్ నుండి డి విజయ్ కుమార్, కుసుమ, స్వరూప, భూపాలపల్లి గ్రూప్ నుండి సారంగపాణి, శంకరయ్య ఎన్ సురేష్, హెడ్ ఆఫీస్ నుండి పి వివేక్, వర్ధన్, కార్పొరేట్ నుండి కె శైలజ, బెల్లంపల్లి ఏరియా నుండిఎస్ కే అంకుష్ పాల్గొంటున్నట్లు తెలిపారు. ఓటర్లు ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొవాలి
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 23 ; ఓటర్లు ఎన్నికలలో ఉపయోగించే ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొని ఓటు హక్కు ను వినియోగించుకోవాలని రెబ్బెన మండల రెవిన్యూ ఇనస్పెక్టర్ ఊర్మిళ అన్నారు. శనివారం రెబ్బెన మండలం వం కులం గ్రామం పోలింగ్ స్టేషన్ 269 లో ప్రజలకు ఎన్నికలలో ఉపయోగించే ఈవిఎం , వి వి ఫాట్ యంత్రాల వినియోగ విధానం పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)





















