Tuesday, 3 March 2020

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

రెబ్బెన :  కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలనిఏ ఐ టి యు సి గోలేటి  బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి అన్నారు మంగళవారం బెల్లంపల్లి ఏరియా లోని  ఖైర్ గూడా  ఓపెన్ కాస్ట్ , బి పి ఏ ఓ సి టు ఏరియా వర్క్ షాప్ లొ వినతి పత్రాలు అందజేశారు.  అనంతరం మాట్లాడుతూ టీబీజీకేఎస్ గెలిచిన అప్పటినుండి కార్మికులపై పనిభారం పెరిగిందని కార్మిక హక్కులను కాపాడడంలో గుర్తింపు సంఘంగా విఫలమైందని కేవలం సంఘం గా మారిందని యాజమాన్య తో కుమ్మకై కార్మికుల పైన ఒత్తిడి పెంచుతున్నారు ఈ కార్యక్రమంలో గోలేటి బ్రాంచ్ ఇంచార్జ్ చిప్ప నరసయ్య బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి ఆర్గనైజింగ్ కార్యదర్శులు బి జగ్గయ్య శేషు వై సారయ్య చంద్రశేఖర్ మారం శ్రీనివాస్ ఫిట్ కార్యదర్శులు జూపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment