రెబ్బెన : సమస్యల పరిష్కారానికి పల్లెనిద్ర కార్యక్రమాలు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రెబ్బెన ఎంపీపీ జుమ్మి డి సౌందర్య ఆనంద్, జెడ్ పి టి సి వేముర్ల సంతోష్ లు అన్నారు. గురువారం రాజారాం గ్రామంలో పల్లె నిద్ర చేశారా శుక్రవారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపుల చెత్త వేయరాదు డంపింగ్ యార్డు లో మాత్రమే వేయాలన్నారు,నర్సరీ సందర్శించి మొక్కలు సందర్శించారు. అనంతరం చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించాలని అవగాహనకల్పించారు. సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి తెలుకెళి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లేష్,ఎంపీటీసీ సంగం శ్రీనివాస్,ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్,mpo అంజడ్ పాషా,apo కల్పన, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment